నాకు పేపర్లో టిఫిన్ పెట్టిర్ను !

Janmabhoomi

Janmabhoomi

కళాశాల లో చదువు తున్నప్పుడు జన్మభూమి కార్యక్రమం క్రింద NSS వాలంటీరు లందరు ఒక్కో గ్రామానికి వెళ్ళి వారం రోజులు ఉండి గ్రామాభివృద్ది కార్యక్రమాలు చేపట్టాలి. ఇందులో భాగంగా మాకు సత్తుపల్లి మండలంలోని ఒక గ్రామానికి క్యాంపు పై వెళ్ళ వలసి వచ్హింది. అది నుమారు 1700 జనభా కల గ్రామం ముందుగా ప్రభుత్వం(రెవన్యూ ) వారు మారాక తెలియపరచని కారణంగా అక్కడ ఎలాంటి ముందస్తు ఎర్పాట్లు చేయలేదు. ఇక నాతో పాటు వచ్హిన వారికి కూడా ఆ వూరి వారెవ్వరూ తెలియదు ఇక నేనే పంచాయితీ దగ్గరకు వెళ్ళి వివరించాను  సమయానికి  VAO కూడా అందుబాటులో లేరు అప్పుడు గ్రామపెద్దలందరూ కలసి మా 15 మందికి ఇంటికి ఇద్దరు చప్పున వసతి కల్పించారు అలా నాకు ఒక అగ్రకులస్తుల ఇంట్లో వుండే అవకాశం వచ్హింది. ఆ ఇంటావిడ నా పేరు (కృపాల్) తెలుసుకోన్నపటి నుండి నా కస్టాలు మెదలయ్యాయి నా బ్యాగు,దుప్ప ట్లు అన్నీ బయట చావిడి లో పెట్టారు,ఒక కుండ లో నీళ్ళు పెట్టి వాటినే వాడుకోమ్మన్నారు సరిగా మాట్లాడే వాళ్ళు కాదు  వాళ్ళ ప్రవర్తన నాకు చాలా విచిత్రంగా / ఇబ్బదిగా అనిపించేది  కానీ  మనం వచ్హ్హిన పని వేరు కదా  అనుకోని జన్మభూమి కార్యక్రమాలమో నిమగ్నం అయ్యేవా డిని కానీ రాత్రకే ఇంటి బయట పడక,అవసరాలకు నా కుండ లో నీళ్ళు   ,పోద్దున్నే పేపరు లో టిఫిను నాతో పాటు వచ్హిన వాడు రెండవ రోజుకే వీరి అతిధి మరియాదలకు జంప్. Group leader గా నేను ఉండక తప్పదు నాతో వచ్హినమిగిలిన వారు తెగ ఎంజాయ్ చేస్తున్నారు అందరికీ చక్కగా తెలుగుదేశం నాయకు ల ఇళ్ళలో బస దోరికింది,నాకు ఇంత  అదృస్టం లేదు . నేను  కాలేజీ కి వెళ్ళ కుండా ఇలా జన్మభూమంటూ తిరగటం ఇతనికి అస్సలు ఇస్టంలేనట్లు వున్నది. ఇలానే ఒక వారం రోజులు గడిచాయి ఒక రోజు ఆ గ్రామ VAO నేను ఉంటున్నఇంట్లో భోజనాని వచ్హాడు ఇక తనతో పాటు నన్ను కూడా ఇంట్లోకి  భోజనానికి పిలిచి చక్కగా కోడి కూర వడ్డించారు నేను తినని చెప్పాను,ఆ VAO మా నాన్నగారి పేరు (సీతారామారావు),వృత్తి ( రెవిన్యూ ఇస్పేక్టర్ )అడిగారు మా నాన్న గారు ఆ VAO కి భాగా తెలుసునట . ఇక నేను వున్నఇంట్లో వాళ్ళ ప్రవర్తన పూర్తిగా మారినది ఎంత మారినది అంటే నేను వాళ్ళ టేబులు మీద భోజనంచేసిన తరువాత ఆ ఇంటాడ ఒక స్టీలు పాత్ర పట్టుకోని నుంచోని ఇందులో చేతులు కడుక్కోమ్మని చెప్పేదాక .ఈ సంఘటన నాలో చెరగని ముద్రవేసింది దళితులు బడుగు వర్గాల వారు సమానత్వం , సాంఘీక అసమానతల  గురించి ఎందుకు పోరాడతారో భాగా అర్దంఅయినది!ఏదైనా అనుభవిస్తేగాని అవగాహనకు రాదు
మీ
కృపాల్ కశ్యప్

8 responses to “నాకు పేపర్లో టిఫిన్ పెట్టిర్ను !

  1. అవునా?గొప్ప జీవిత,అనుభవసత్యం చెప్పారు..అభినందనలు

  2. అవును. గ్రామాల్లోనే కాదు. పట్టాణాల్లోనూ నగరాల్లోనూ ఇటువంటి అనుభవాలు విడ్డూరం కాదు. కానీ గ్రామాల్లో కాంట్రాస్టు విపరీతంగా తెలుస్తుంది.

    నాకు కొన్ని సందేహాలు.
    కృపాల్ అనే పేరుని ఆ ఇంటావిడ ఫలానా కులం పేరని ఎలా అనుకున్నారు?
    గ్రూప్ లీడారుగా ఉన్న మీరు ఈ దిక్కుమాలిన ఆతిథ్యానికి బలికావడమేం? మిగిలిన మెంబర్లు తెలుగుదేశం నాయకుల ఇళ్ళల్లో కులకడమేం?
    “నేను కాలేజీ కి వెళ్ళ కుండా ఇలా జన్మభూమంటూ తిరగటం ఇతనికి అస్సలు ఇస్టంలేనట్లు వున్నది” -ఈ వాక్యంలో “ఇతను” ఎవరు?
    VAO మీ ఇంటి వివరాలు కనుక్కున్న తరవాత ఆ ఇంటి వారికి మీ కులాన్ని గురించిన సందేహం నివృత్తి అయి ఆతిథ్యం నాలుగు మెట్లు పైకెక్కిందా, లేక మీ నాన్నగారి హోదా తెలిసి కుల ప్రసక్తి లేకుండా పైకెక్కిందా?

    దయచేసి మీకభ్యంతరం లేకపోతే ఈ సందేహాలు తీర్చ గలరు.

    అన్నట్టు, ఈ సంఘటనకి రివర్సు కేసు లాంటి ఒక దృశ్యం, దాని మీద నా వ్యాఖ్యానం ఇక్కడ చదవొచ్చు.

  3. 1) అదేనాకూ అర్దం కాలేదు కానీ నేను నా డిగ్రీ స్నేహితులు మోదట నన్ను క్రైస్తవుడనే అనుకోన్నారు ( బహుసా కృపాకర్, కృపానందం లాటి పేరుల వలన కావచ్హు, నా కు తెలిసి ఇప్పటి వరకు కృపాల్ అనే పేరు గల సిక్కు / క్రీస్తు మతస్తులకే వుండటం చూశాను.

    2)అ గ్రామం తుమ్మల నాగేశ్వరరావు (తెలుగు దేశం) ప్రాంతం, కావున ఇది వూరి పరువు పార్టీ ల ప్రతిస్ట
    3)అది దిక్కుమాలిన ఆతిథ్యామని తరువాతేగా తెలిసింది ( ఊరి పెద్దలంతా కలిసి ఊరికి వచ్హిన మా బస ఏర్పాట్లు చూడాలి కదా )

    4)
    ఇతను అంటే నాకు ఆతిద్యంఇచ్హిన వ్యక్తి
    5) కోడికూర తినక పోవటానికి కారణం గా కుల ప్రశక్తి తెవలసి వచ్హింది
    అయిన కూడా మిగిలిన సందేహమును మా నాన్న గారు తెలవటం వలన (That Village Development officer reports to my father when he was working at TallaDa మరియు మా నాన్న గారు రెవిన్యూ అదికారి కావటంవలన ఇంకా నాకు అతిద్యం ఇచ్హిన వ్యక్తి ఒక రేషను షాపు డీలరు కావటం వలన )
    6)

    ఇంకా అతను నన్ను మెదలు దళిత క్రైస్తవుడి గా అనుకోన్నానని చెప్పాడు

  4. ఇక నేను ఇప్పుడు ఈ టపా రాయటానికి కారణం నేను ఆ ఆంద్రజ్యోతి లోని కధ కూడా ప్రేరణ

  5. ఇంకో మాట చెప్పాలి అతను రెషను షాపు డీలరు అని తెలిసిన తరువాత నేను మా నాన్న గారి వివరాలు తెలియ పరచుదోకోలేదు కానీ VAO ద్వారా తెలిసినది , నా పేరు మా నాన్న గారికి ఎదో డిటక్టవ్ నవలో తారస పడింది 🙂

  6. Yes ! unfortunately we live in such Community.
    Where the heirarchy never changes
    “Ecnomically sound > Higher Caste > BCs > Lower Caste > Women”

    unfortunately this doesn’t stop at being ‘Lower Caste’ but has to go beyond that to supress Women.
    please read http://bhumika.org/archives/518

    🙂 bagundi ‘నా పేరు మా నాన్న గారికి ఎదో డిటక్టవ్ నవలో తారస పడింది’

    It’s also very unfortunate that we need a strong proof or a first hand experience to know that discrimination exists in present world.

    Let me present another contrasting scenario, kripal stayed back inspite of the discrimination because he had passion to what he was doing. Imagine the Ration Dealer was a BC & there was another person-X in place of kripal (say from a Higher caste, but lower economic background) do you think ‘X’ would have stayed back?

    PS: sorry my i couldn’t type in telugu from the PC i’m using.

  7. నరేంద్ర భాస్కర్
    కృపాళ్ గారూ!
    పల్లెటూర్లో సాధారణంగా అందరి కులాలూ తెలిసిపొతాయి, మన సమాజంలో, పేరూ ఊరూ తెలీని ఆతిధ్యం ఒక పూటని మించి ఉండేది కాదు, ఇప్పుడు ఇలాంటి కొత్త సాంప్రదాయలు (గెస్టు సాంప్రదాయం) వచ్చినప్పుడు, చదువుకుని వచ్చిన వాళ్ళను డైరెక్టుగా కులం అడగడానికి మొహమాట పడి అర్ధమైనంతవరకూ గ్రహించడానికి చెసే ప్రయత్నమే ఈ పేరుతొ కులాన్ని లింకు చేసుకోడం అనుకుంటాను, మంచి గా రాసారు కానీ మీరు దళితులు కారని చెప్పుకోడం మీ ఉద్దేశమా? లేక దళితులకు జరుగున్న అవమానం తెలుసుకుని భాధ వ్యక్తం చెయడం మీ ఉద్దేశమా?

  8. Pingback: పొద్దు » Blog Archive » జూలైలో తెలుగు బ్లాగుల విశేషాలు

Leave a comment