నాకు పేపర్లో టిఫిన్ పెట్టిర్ను !

Janmabhoomi

Janmabhoomi

కళాశాల లో చదువు తున్నప్పుడు జన్మభూమి కార్యక్రమం క్రింద NSS వాలంటీరు లందరు ఒక్కో గ్రామానికి వెళ్ళి వారం రోజులు ఉండి గ్రామాభివృద్ది కార్యక్రమాలు చేపట్టాలి. ఇందులో భాగంగా మాకు సత్తుపల్లి మండలంలోని ఒక గ్రామానికి క్యాంపు పై వెళ్ళ వలసి వచ్హింది. అది నుమారు 1700 జనభా కల గ్రామం ముందుగా ప్రభుత్వం(రెవన్యూ ) వారు మారాక తెలియపరచని కారణంగా అక్కడ ఎలాంటి ముందస్తు ఎర్పాట్లు చేయలేదు. ఇక నాతో పాటు వచ్హిన వారికి కూడా ఆ వూరి వారెవ్వరూ తెలియదు ఇక నేనే పంచాయితీ దగ్గరకు వెళ్ళి వివరించాను  సమయానికి  VAO కూడా అందుబాటులో లేరు అప్పుడు గ్రామపెద్దలందరూ కలసి మా 15 మందికి ఇంటికి ఇద్దరు చప్పున వసతి కల్పించారు అలా నాకు ఒక అగ్రకులస్తుల ఇంట్లో వుండే అవకాశం వచ్హింది. ఆ ఇంటావిడ నా పేరు (కృపాల్) తెలుసుకోన్నపటి నుండి నా కస్టాలు మెదలయ్యాయి నా బ్యాగు,దుప్ప ట్లు అన్నీ బయట చావిడి లో పెట్టారు,ఒక కుండ లో నీళ్ళు పెట్టి వాటినే వాడుకోమ్మన్నారు సరిగా మాట్లాడే వాళ్ళు కాదు  వాళ్ళ ప్రవర్తన నాకు చాలా విచిత్రంగా / ఇబ్బదిగా అనిపించేది  కానీ  మనం వచ్హ్హిన పని వేరు కదా  అనుకోని జన్మభూమి కార్యక్రమాలమో నిమగ్నం అయ్యేవా డిని కానీ రాత్రకే ఇంటి బయట పడక,అవసరాలకు నా కుండ లో నీళ్ళు   ,పోద్దున్నే పేపరు లో టిఫిను నాతో పాటు వచ్హిన వాడు రెండవ రోజుకే వీరి అతిధి మరియాదలకు జంప్. Group leader గా నేను ఉండక తప్పదు నాతో వచ్హినమిగిలిన వారు తెగ ఎంజాయ్ చేస్తున్నారు అందరికీ చక్కగా తెలుగుదేశం నాయకు ల ఇళ్ళలో బస దోరికింది,నాకు ఇంత  అదృస్టం లేదు . నేను  కాలేజీ కి వెళ్ళ కుండా ఇలా జన్మభూమంటూ తిరగటం ఇతనికి అస్సలు ఇస్టంలేనట్లు వున్నది. ఇలానే ఒక వారం రోజులు గడిచాయి ఒక రోజు ఆ గ్రామ VAO నేను ఉంటున్నఇంట్లో భోజనాని వచ్హాడు ఇక తనతో పాటు నన్ను కూడా ఇంట్లోకి  భోజనానికి పిలిచి చక్కగా కోడి కూర వడ్డించారు నేను తినని చెప్పాను,ఆ VAO మా నాన్నగారి పేరు (సీతారామారావు),వృత్తి ( రెవిన్యూ ఇస్పేక్టర్ )అడిగారు మా నాన్న గారు ఆ VAO కి భాగా తెలుసునట . ఇక నేను వున్నఇంట్లో వాళ్ళ ప్రవర్తన పూర్తిగా మారినది ఎంత మారినది అంటే నేను వాళ్ళ టేబులు మీద భోజనంచేసిన తరువాత ఆ ఇంటాడ ఒక స్టీలు పాత్ర పట్టుకోని నుంచోని ఇందులో చేతులు కడుక్కోమ్మని చెప్పేదాక .ఈ సంఘటన నాలో చెరగని ముద్రవేసింది దళితులు బడుగు వర్గాల వారు సమానత్వం , సాంఘీక అసమానతల  గురించి ఎందుకు పోరాడతారో భాగా అర్దంఅయినది!ఏదైనా అనుభవిస్తేగాని అవగాహనకు రాదు
మీ
కృపాల్ కశ్యప్

నా జ్ఞాన ప్రధాతలు –

(గురు పౌర్ణమి)

గురు బ్రహ్మ

గురువిష్ణు
గురుర్దేవో మహేశ్వరః
గురు సాక్షాత్‌ పరబ్రహ్మ
తస్మై శ్రీ గురవే నమః
బ్రహ్మానందం పరమ సుఖదం కేవలం జ్ఞాన మూర్తిం
ద్వంద్వాం తీతం గగన సదృశం తత్వ మస్సాది లక్ష్యం
ఏకం నిత్యం విమల మచలం సర్వధీ సాక్షీభూతం
భావాతీతం త్రిగుణ రహితం సద్గురుం త్వం నమామి
ఇప్పటి వరకు  నాకు ప్రియమైన  జ్ఞాన ప్రధాతలు

(అంటే మిగిలిన వారు అప్రియులనో/ విరోధు లో అర్దంచేసుకోకూడదు , వారికి కూడావందనాలు)
మా అమ్మ మీనా కుమారి నాకు అ,ఆలు రాకముందు నుండి ఇప్పటికీ

శివాలయం పంతులు గారు – ఆ, ఆలు (పెద్దబాలశిక్ష  -సుజాతనగర్
విమలా మేడం- 2 వ తరగతి జ్యోతీబాలమందిర్ – అశ్వారావుపేట.
స్టీవెన్ సారు – 3 వ తరగతి లిటిల్ ఫ్లవర్ – భూర్గంపాడు
పద్మమేడం- 3 వ తరగతి లిటిల్ ఫ్లవర్ -భద్రాచలం
Miss స్వర్ణమేడం  – 4 వ తరగతి BPL ట్యూషన్ -భద్రాచలం
అరుణ మేడం,రాము సారు -5 వ తరగతి -బోధిశ్రీ విద్యానికేతన్ – వైరా
జ్ఞాన రత్నం సారు  , రామారావు సారు – 6,7 తరగతి APPSC
వీరబద్రం సారు, మల్లిఖార్జజున రావు సారు – 8,9 తరగతి శ్రీనికేతన్ – వైరా
నాగేశ్వరరావు  సారు – 10 వ తరగతి -కోత్తగూడేం
N.V.S శర్మ సారు – సిద్దార్ధ కళాశాల – కోత్తగూడేం
కోండపల్లి ,యాకూబ్ పాష సారు – న్యూజనరేషన్ – ఖమ్మం
Miss కరుణ మేడం, శ్రీనివాసరావు సారు, పుప్పాల శ్రీను సారు, ప్రదీప్ సారు  B.Sc- సాధన కళాశాల ఖమ్మం
షాజన్,రాధాకృష్ణన్,బలరాం MBA మద్రాసు యూనివర్సిటి
రామచంద్ర అయ్యర్ – Ph.D పాండిచెరి యూనివర్సిటి

ఇంకా నాకు ఉద్యోగ జ్ఞానం ప్రసాదించిన
చతుర్వేది -రిలయన్స ఇన్ఫోకామ్
మోహన దాస్ -హెచ్హార్నేట్
లక్ష్మి -రీచ్ మేనేజ్మెంట్
రామానుజం,మానష్ మందాత – స్టార్ పవర్జ్.