కబుర్లు with కశ్యప్

Simple record of my amazingly interesting life. ^-^. ఇందులో కోన్ని నాకు నచ్చిన రచనలు నా సోంతమైనవి కావు

HR Manager Skill 😉

Wife – Lets go for a dinner tonight.

Husband (HR Manager) – Ok.

Husband – Should we go to a cheaper restaurant ?

Wife – No. Let’s go to Royal Palace hotel.

Husband – (silence for a minute) – Ok, See you at 7.O ‘Clock.

On the way, around 6.30 pm…

Husband – Once upon a time, I had pani puri competition with my sister and she ate 30 pani-puris and defeated me.

Wife – What’s so difficult in it?

Husband – Defeating me in Pani-puri eating competition is so difficult.

Wife – I can easily beat you.

Husband – Please leave it. It’s not your cup of tea.

Wife – Let us have that competition right now.

Husband – So you want to see yourself defeated?

Wife – Let’s see.

They both stop at a Pani-puri stall and start eating…

After about 30 Pani-puris the husband gave up.

The wife was also full, but to defeat her husband, she ate one more and shouted, *”You lose.”*

The bill was Rs 50/- and wife was back home and happy as she won the bet.

Moral of the Story…

*Main aim of a HR Manager is to satisfy employee with minimum investments.

EPFO ప్రధాన మంత్రి రోజ్గార్ యోజన

 కొత్త ఉద్యోగాల కల్పన కోసం కంపెనీ యాజమాన్యాలను ప్రోత్సహించడం కోసం ప్రధానమంత్రి రోజ్‌గార్ ప్రోత్సాహన్ యోజన (పి ఎం ఆర్ పి వై) ప్లాన్ పథకం రూపొందించబడింది. ఈ పథకం కింద ప్రభుత్వం కొత్త ఉద్యోగాల కోసం కంపెనీ యాజమాన్యం చెల్లించాల్సిన 8.33శాతం ఇపిఎస్ వాటాను భారత ప్రభుత్వం చెల్లిస్తుంది. ఈ పథకం వల్ల ద్వంద్వ ప్రయోజనం కలుగుతుంది. అంటే ఒకవైపు సంస్థలో కార్మికుల ఉద్యోగ పునాదిని పెంచుకున్నందుకు గాను కంపెనీ యాజమాన్యానికి ప్రోత్సాహం అందడంతో పాటు మరోవైపు అలాంటి సంస్థల ద్వారా పెద్ద సంఖ్యలో కార్మికులు ఉద్యోగావకాశాలను పొందుతారు. ఇందువల్ల కలిగే ప్రత్యక్ష లాభమేమిటంటే, ఈ కార్మికులు వ్యవస్థీకృత రంగం సాంఘిక భద్రత ప్రయోజనాలను పొందే వీలు ఏర్పణడుతుంది. 

స్కీం అర్హత

1. ఎంప్లాయీజ్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్‌ (EPFO)తో నమోదు చేసుకున్న అన్నీ సంస్థలు దిగువ నిబంధనల ప్రకారంగా స్కీం క్రింద ప్రయోజనాలను పొందేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు:

(a) ఎంప్లాయీజ్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్‌ (EPFO)తో నమోదు చేసుకున్న సంస్థలు శ్రమ్‌సువిధ పోర్టల్ (https://shramsuvidha.gov.in) క్రింద లేబర్ ఐడెంటిఫికేషన్ నెంబరు (LIN)ను కూడా పొంది ఉండాలి. PMRPY స్కీం క్రింద జరిగే అన్నీ కమ్యూనికేషన్లకు LIN అనేది ప్రాథమిక రెఫరెన్స్ నెంబర్‌.

(b) అర్హుడైన ఎంప్లాయరు ఆగస్టు, 2016 నుండి ఈ స్కీం క్రింద ప్రయోజనాలను పొందేందుకు, కార్మికుల రెఫరెన్స్ బేస్‌కు కొత్త ఉద్యోగులను చేర్చి ఉండాలి. మార్చి 2016కు నెలవారీ ECR నుండి నిశ్చయించిన / రూఢీచేయబడిన విధంగా, 31 మార్చి 2016 నాటికి EPFOతో 12% (3.67% EPF + 8.33% EPS) ను ఎంతమంది ఉద్యోగులకైతే ఎంప్లాయర్ జమ చేసారో, ఆ ఉద్యోగుల సంఖ్య ద్వారా కార్మికుల రెఫరెన్స్ బేస్‌ నిర్ధారించబడుతుంది. ఉదాహరణకు, M/s ఎబిసి లిమిటెడ్‌ అనే సంస్థ, మార్చి 2016లో 45 మంది ఉద్యోగులు/కార్మికుల కొరకు ఎంప్లాయర్స్ కంట్రిబ్యూషన్ కొరకు ఒక ECRను ఫైల్ చేసింది. ఏప్రిల్ 2016లో 15 మంది కొత్త కార్మికులను సంస్థ చేర్చుకుంది అనుకుందాం, ఇప్పుడు మొత్తం ఉద్యోగుల సంఖ్య 60కి చేరుకుంది, ఈ 15 మంది ఉద్యోగుల కొరకు PMRPY స్కీం ప్రయోజనాల కొరకు దరఖాస్తు చేసుకునేందుకు ఎంప్లాయర్ అర్హుడు. రాబోయే ఏ నెలలోనైనా రెఫరెన్స్ బేస్‌తో పోల్చి చూస్తే కొత్త పనేదీ లేనప్పుడు PMRPY ప్రయోజనాలను పొందేందుకు ఎంప్లాయర్‌ అర్హులు కాబోరు. పైన పేరా5(e) లో పేర్కొన్నట్లుగా, కొత్త ఉద్యోగి అంటే, గతంలో అనగా, 01 ఏప్రిల్ 2016కు ముందు, EPFO నమోదిత సంస్థలు వేటిలో పని చేయని లేదా యూనివర్సల్ అకౌంట్ నెంబరును కలిగి ఉన్న వ్యక్తి.

(c) 01 ఏప్రిల్, 2016 తరువాత వెలుగులోకి రానున్న/EPFOతో నమోదు చేసుకుంటున్న కొత్త సంస్థలలో ఉద్యోగుల సంఖ్య సున్నా/శూన్యంగా రెఫరెన్స్ బేస్ పరిగణించబడుతుంది. అందువలన, కొత్తగా అర్హులైన ఉద్యోగులందరి కొరకు PMRPY ప్రయోజనాలను ఎంప్లాయర్ పొందవచ్చు.

(d) నెలకు రూ.15,000/- కన్నా తక్కువ సంపాదిస్తున్న ఉద్యోగుల కొరకు PMRPY స్కీం ఉద్దేశించబడినది. అందువలన, నెలకు రూ.15,000/- కన్నా ఎక్కువ జీతం సంపాదిస్తున్న కొత్త ఉద్యోగులు అర్హులు కారు. కొత్త ఉద్యోగి అంటే, 01 ఏప్రిల్ 2016కు ముందు రెగ్యులర్ బేసిస్ క్రింద పనిచేసే EPFO నమోదిత సంస్థలలో పని చేయని ఉద్యోగి, 01.04.2016 నాటికి లేదా తదుపరి న్యూ ఆధార్ సీడెడ్ యూనివర్సల్ అకౌంట్ నెంబరు (UAN) కేటాయింపు ద్వారా అది నిర్ధారించబడుతుంది. ఒక కొత్త ఉద్యోగి వద్ద కొత్త UAN లేని పక్షంలో, EPFO పోర్టల్ ద్వారా ఎంప్లాయర్ దానిని అందిస్తారు.

(e) తదుపరి ౩ సంవత్సరాలకు ఈ అర్హులైన కొత్త ఉద్యోగుల కొరకు ప్రభుత్వం ద్వారా చెల్లించబడే 8.33% కంట్రిబ్యూషన్‌ను ఉద్యోగులు పొందుతూనే ఉంటారు, ఇది కేవలం ఒకే ఎంప్లాయర్‌తో ఉద్యోగాన్ని వారు కొనసాగించిన పక్షంలోనే సాధ్యమవుతుంది. ఈ క్రొత్త ఉద్యోగులకు ప్రతి నెలా 3.67% EPF కంట్రిబ్యూషన్‌ను ఎంప్లాయర్ రెమిట్ చేసిన తరువాతనే, భారతదేశ ప్రభుత్వం చేత 8.33% కంట్రిబ్యూషన్ చెల్లించబడుతుంది. EPF/EPS కంట్రిబ్యూషన్‌ మీద ఎటువంటి జరిమానాలు లేకుండా నివారించేందుకు, సాధ్యమైనంత త్వరగా, ముఖ్యంగా రాబోయే నెలలో 10వ తేదీ లోపల PMRPY ఆన్‌లైన్ పత్రాన్ని సమర్పించవలసిందిగా ఎంప్లాయర్‌కు సూచించడమైనది.

(f) తాము అప్‌లోడ్ చేసే సమాచారానికి, స్కీం కొరకు దరఖాస్తు చేసుకుంటున్న ఎంప్లాయర్లు/సంస్థలు, పూర్తిగా బాధ్యులు. ఏ సమయంలోనైనా, సమర్పించిన సమాచారం తప్పు లేదా బూటకమైనదని తెలిస్తే, సదరు ఉద్యోగులకు EPS (మరియు టెక్స్టైల్ రంగం కొరకు EPF) చెల్లించబడదని భావించబడుతుంది. ఆపై ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ స్కీం, 1952లోని సంబంధిత నిబంధనల క్రింద పేర్కొన్న విధంగా బకాయిలు మరియు జరిమానాలకు ఎంప్లాయర్ బాధ్యులు.

2. 3 సంవత్సరాల పాటూ స్కీం అమలులో ఉంటుంది, తదుపరి 3 సంవత్సరాల కొరకు ఎంప్లాయర్ చెల్లించవలసిన 8.33% EPS కంట్రిబ్యూషన్‌ను భారతదేశ ప్రభుత్వం చెల్లిస్తుంది. అంటే, 2019-20 దాకా కొత్త ఉద్యోగులందరూ PMRPY స్కీం క్రిందకు వస్తారు.

మౌర్య చక్రవర్తి అశోకు చరిత్ర

క్రీ.పూ.321-క్రీ.పూ.297
మౌర్య
వంశస్ధాపకుడు చంద్రగుప్తుడు. మగధ చివరిరాజు దననందుడిని ఓడించడం ద్వారా
నందవంశాన్ని అంతచేసి, క్రీ.పూ.321లో మౌర్యసామ్రాజ్యాన్నిస్ధాపించాడు.
చాణక్యుడు
నంద చక్రవర్తితో అవమానించబడి, నందవంశాన్ని అంతచేయడానికి చంద్రగుప్తునికి
సాయంచేశాడు. చంద్రగుప్తుడు నందసామ్రాజ్యాన్ని అంతచేయడానికి గ్రీకు చక్రవర్తి అలెగ్జాండర్ సాయం కోరాడని ప్లూటార్క్ పేర్కొన్నాడు.
చంద్రగుప్తుడు మొదట పంజాబ్ ప్రాంతంలోని తెగల సాయంతో సైన్యాన్ని
ఏర్పాటుచేసుకున్నాడు. చాణక్యుడు గొప్ప రాజనీతిజ్ఞుడు. కౌటిల్యుడు అర్ధశాస్త్రం అనే గ్రంధాన్ని రచించాడు.
చాణక్యుని ఇతర పేర్లు విష్ణుశర్మ, కౌటిల్యుడు.
చంద్రగుప్తుడు క్షత్రియుడు కాదని, ముర అనే స్త్రీకి నందరాజు వల్ల కలిగిన
సంతానమే చంద్రగుప్తుడు అనే ఒక అభిప్రాయం ఉంది.
గ్రీక్ చరిత్రకారుడు జస్టిన్ చంద్రగుప్తుడు సామాన్య కుటుంబానికి చెందినవాడని వ్రాసాడు.
వృషలుడు – చాందసుడు కానివాడు.
మహావంశం
అనే భౌధ్ధగ్రంధం ప్రకారం చంద్రగుప్తుడు క్షత్రియుడు. ఆయన మొరియ అనే
క్షత్రియ శాఖకు చెందినవాడని మహావంశం తెలుపుతుంది. మొరియ అనే శభ్ధం నుండే
మౌర్య అనే పదం వచ్చిందని ఒక సిధ్దాంతం.
వాయువ్య భారతదేశాన్ని గ్రీకులనుండి స్వాధీనం చేసుకున్నాడు.
భారదేశ దండయాత్ర అనంతరం స్వదేశానికి తిరిగి వెళ్తున్న అలెగ్జాండర్
క్రీ.పూ.323
లో బాబిలోన్ నగరంలో మరణించాడు. అలెగ్జాండర్ సేనాని సెల్యుకస్. భారతదేశంలో
అలెగ్జాండర్ గెలిచిన ప్రాంతాలకు రాజయ్యాడు. క్రీ.పూ. 305లో సెల్యుకస్
పంజాబ్, సింధు ప్రాంతాలను ఆక్రమించుకునే ప్రయత్నంలో చంద్రగుప్తుని చేతిలో
ఓడిపోయి తన కూతురి చంద్రగుప్తునికి ఇచ్చి వివాహం చేశాడు.
సెల్యుకస్
రాయబారిగా చంద్రగుప్తుడి ఆస్దానంలో ఉన్న మెగస్తనీస్ ‘ఇండికా’ అనే
గ్రంధాన్ని వ్రాసాడు. ఈ గ్రంధం ద్వారా మనకు మౌర్యుల పాలన, ఆనాటి
పరిస్ధితులగూర్చి విషయాలు తెలుస్తున్నాయి.
చంద్రగుప్తుడు 6వక్షల సైన్యంతో భారతదేశం మొత్తాన్ని జయించాడని ప్లూటార్క్ పేర్కొన్నాడు.
జునాగడ్ శాసనాన్ని శకరాజు రుద్రదాముడు వేయించాడు. సౌరాష్ట్ర (గుజరాత్) ని చంద్రగుప్తుడు జయించాడు.
దాదాపు క్రీ.పూ.300 సంవత్సరం ప్రాంతంలో చంద్రగుప్తుడు జైనమతగురువు
భధ్రబాహుతో పాటూ మైసూర్ దగ్గరలోని శ్రావణబెళగొల కు వలస వెళ్లి, జైన
సాంప్రదాయం ప్రకారం సల్లేఖన వ్రతాన్ని ఆచరించి ఉపవాసదీక్షద్వారా తన
దేహాన్ని చాలించాడు. జైన గ్రంధాల వల్ల తెలుస్తుంది.
చంద్రగుప్తుని రాజ్యా దక్షిణ సరిహద్దు తమిళనాడులోని తిరునల్వేలి.
👉 బింధుసారుడు –
క్రీ.పూ.297- క్రీ.పూ.277
బిందుసారుని బిరుదు ‘అమిత్రఘాత’. (శత్రుసంహారకుడు)
బింధుసారుడు చంద్రగుప్తుని కుమారుడు.
బింధుసారుని కాలంలో కూడా చాణక్యుడు కొంతకాలం మహామంత్రిగా వ్యవహరించాడు.
సిరియా నుండి ఎండు అత్తిపండ్లు, మధువు, ఒక వేదాంతిని పంపమని బింధుసారుడు సిరియా రాజు మొదటి ఆంటియోకస్ సోటర్ ని కోరాడు.
పశ్చిమ సముద్రాలమధ్యగల 16నగరాల అధిపతులను బింధుసారుడు ఓడించాడని టిబెట్ చరిత్రకారుడు తారానాద్ ప్రస్తావించాడు.
బింధుసారుని కాలంలో అశోకుడు ఉజ్జయిని రాష్ట్రపాలకుడు గా ఉన్నాడు. తక్షశిల లో జరిగిన తిరుగుబాటును అణచివేసాడు

సిరియా నుండి ఎండు అత్తిపండ్లు, మధువు, ఒక వేదాంతిని పంపమని బింధుసారుడు సిరియా రాజు మొదటి ఆంటియోకస్ సోటర్ ని కోరాడు.
పశ్చిమ సముద్రాలమధ్యగల 16నగరాల అధిపతులను బింధుసారుడు ఓడించాడని టిబెట్ చరిత్రకారుడు తారానాద్ ప్రస్తావించాడు.
బింధుసారుని కాలంలో అశోకుడు ఉజ్జయిని రాష్ట్రపాలకుడు గా ఉన్నాడు. తక్షశిల లో జరిగిన తిరుగుబాటును అణచివేసాడు.
అశోకుడు క్రీ.పూ.273-క్రీ.పూ.232
బింధుసారుడు
క్రీ.పూ.273 లో మరణించినా అశోకుని పట్టాభిషేకం 4 సంవత్సరాలు ఆలస్యం
అవడానికి కారణం సోదరులతో వారసత్వ పోరాటాలే. అశోకుడు తన 99మంది సోదరులను
చంపి సింహాసనాన్ని అధిష్టించాడు.
అశోకుని పట్టాభిషేకం క్రీ.పూ.269లో జరిగింది.
భౌధ్ధ
గ్రంధాలైన దివ్యవదన, మహావంశ, అశోకుని శాసనాలు ఆశోకుని కాల చరిత్రను
తెలుసుకోడానికి ఉపయోగపడుతున్నాయి. ఈ శాసనాలలో అశోకునికి దేవానాం ప్రియ,
ప్రియదర్శి అనే బిరుదులు ఉన్నాయి.
అశోకుని పట్టమహిషి అసంధిమిత్ర. తిస్సరక్క, కారువాకి (చారువాకి), పద్మావతి అశోకుని ఇతర భార్యలు.
సంఘమిత్ర, చారుమతి అశోకుని కుమార్తెలు.
కుణాలుడు, తివార (త్రివర), మహేంద్ర, జలౌకుడు అశోకుని కుమారులు.
రాజ్యానికి వచ్చిన 13వ సంవత్సరంలో (క్రీ.పూ.261లో)కళింగ పై దండెత్తి
ఓడించి, యుద్దహింస వల్ల మనసు చలించి యుద్దాలను విరమించాడు. ఉపగుప్తుడు అనే భౌధ్దమతాచార్యుడు అశోకునికి భౌధ్ధమత ధీక్షనిచ్చాడు.
తమిళనాడు, అస్సాం ప్రాంతాలు తప్ప మిగిలిన భారతదేశమంతా అశోకుని సామ్రాజ్యంలో భాగమయ్యింది.
అశోకుడు న్యాయపాలనలో జాగుని నివారించాడు.
రహదారులు
వేయించి, వాటికిరువైపులా నీడకోసం చెట్లను నాటించాడు. బాటసారులకోసం
సత్రాలు, చలివేంద్రాలను ఏర్పాటుచేశాడు. మనుషులకే కాకుండా జంతువులకోసం కూడా
వైధ్యశాలలను నెలకొల్పాడు.
యుద్దాన్ని పక్కన పెట్టి ధర్మవిజయాన్ని కాంక్షించాడు.
రాకుమారులను పరిపాలనలో పాల్గొనేలా చేసేవారు. వారిని రాష్ట్రపాలకులుగా
నియమించారు.

అశోకుడు క్రీ.పూ.273-క్రీ.పూ.232
బింధుసారుడు
క్రీ.పూ.273 లో మరణించినా అశోకుని పట్టాభిషేకం 4 సంవత్సరాలు ఆలస్యం
అవడానికి కారణం సోదరులతో వారసత్వ పోరాటాలే. అశోకుడు తన 99మంది సోదరులను
చంపి సింహాసనాన్ని అధిష్టించాడు.
అశోకుని పట్టాభిషేకం క్రీ.పూ.269లో జరిగింది.
భౌధ్ధ
గ్రంధాలైన దివ్యవదన, మహావంశ, అశోకుని శాసనాలు ఆశోకుని కాల చరిత్రను
తెలుసుకోడానికి ఉపయోగపడుతున్నాయి. ఈ శాసనాలలో అశోకునికి దేవానాం ప్రియ,
ప్రియదర్శి అనే బిరుదులు ఉన్నాయి.
అశోకుని పట్టమహిషి అసంధిమిత్ర. తిస్సరక్క, కారువాకి (చారువాకి), పద్మావతి అశోకుని ఇతర భార్యలు.
సంఘమిత్ర, చారుమతి అశోకుని కుమార్తెలు.
కుణాలుడు, తివార (త్రివర), మహేంద్ర, జలౌకుడు అశోకుని కుమారులు.
రాజ్యానికి వచ్చిన 13వ సంవత్సరంలో (క్రీ.పూ.261లో)కళింగ పై దండెత్తి
ఓడించి, యుద్దహింస వల్ల మనసు చలించి యుద్దాలను విరమించాడు. ఉపగుప్తుడు అనే భౌధ్దమతాచార్యుడు అశోకునికి భౌధ్ధమత ధీక్షనిచ్చాడు.
తమిళనాడు, అస్సాం ప్రాంతాలు తప్ప మిగిలిన భారతదేశమంతా అశోకుని సామ్రాజ్యంలో భాగమయ్యింది.
అశోకుడు న్యాయపాలనలో జాగుని నివారించాడు.
రహదారులు
వేయించి, వాటికిరువైపులా నీడకోసం చెట్లను నాటించాడు. బాటసారులకోసం
సత్రాలు, చలివేంద్రాలను ఏర్పాటుచేశాడు. మనుషులకే కాకుండా జంతువులకోసం కూడా
వైధ్యశాలలను నెలకొల్పాడు.
యుద్దాన్ని పక్కన పెట్టి ధర్మవిజయాన్ని కాంక్షించాడు.
రాకుమారులను పరిపాలనలో పాల్గొనేలా చేసేవారు. వారిని రాష్ట్రపాలకులుగా
నియమించారు.
👉 అశోకుడు-భౌధ్ధమతం
భౌధ్ధమత
వ్యాప్తికోసం అశోకుడు ధర్మమహామాత్రులు అనే అధికారులను భౌధ్ధధర్మ
ప్రచారనిమిత్తం నియమించాడు. వారు విదేశాలలో కూడా ధర్మాన్ని ప్రచారం చేశారు.
క్రీ.పూ. 250లో అశోకుడు భౌధ్ధ సంఘ సమావేశాన్ని ఏర్పాటుచేశాడు.
అశోకుడు ఏర్పరచిన భౌధ్ధ సంఘసమావేశానికి మొగలిపుత్తతిస్స అధ్యక్షత వహించాడు.
తన కుమార్తె సంఘమిత్ర, కుమారుడు మంహేంద్రలను సింహళానికి (శ్రీలంక) భౌధ్ధమతవ్యాప్తికై పంపాడు.
ప్రాదేశకులు, రజకులు, యుక్తులు అనే ఉధ్యోగులు మూడు లేదా ఐదు
సంవత్సరాలకు ఒకసారి పర్యటన చేసి ధర్మ సందేశాన్ని సామ్రాజ్యం మారుమూలలకు
సైతం వ్యాపింపజేయాలని ఆదేశించారు.
అశోకుడు పరమత సహనం పాటించాడు.
అశోకుని ధర్మవిధానం
భౌధ్ధధర్మం,
అశోకుని ధర్మం ఒకటి కాదు. అశోకుడు తన ఆలోచనలు ఆదర్శాలను తన ధర్మంలో
ప్రతిభింభించాడు. నీతిబధ్ధ జీవనం, అహింస, పెద్దలను గౌరవించడం, ఇతరుల
విశ్వాసాలపట్ల సహనం, బానిసలు సేవకుల పట్ల దయ, దాన గుణం అశోకుని ధర్మంలో
ముఖ్యవిషయాలు.
👉 మౌర్య సామ్రాజ్య పతనం –
క్రీ.పూ.232 లో అశోకుని మరణానంతరం మౌర్యసామ్రాజ్య పతనం ప్రారంభమైంది. పతన కారణాలు…
అశోకుని అనంతరం రాజ్యానికి వచ్చిన కుణాలుడు, జలౌకుడు,దశరధుడు, సంప్రతి, బ్రుహద్రదుడు అసమర్ధ వారసులు.
బ్రుహద్రదుడిని ఓడించి అతని సేనాని పుష్యమిత్రుడు శుంగ వంశాన్ని స్ధాపించాడు.

క్రీ.పూ.232 లో అశోకుని మరణానంతరం మౌర్యసామ్రాజ్య పతనం ప్రారంభమైంది. పతన కారణాలు…
అశోకుని అనంతరం రాజ్యానికి వచ్చిన కుణాలుడు, జలౌకుడు,దశరధుడు, సంప్రతి, బ్రుహద్రదుడు అసమర్ధ వారసులు.
బ్రుహద్రదుడిని ఓడించి అతని సేనాని పుష్యమిత్రుడు శుంగ వంశాన్ని స్ధాపించాడు.
👉 మౌర్యుల పాలన —
భారతదేశంలో నిర్ధిష్టమైన సమర్ధవంతమైన పరిపాలనా వ్యవస్ధను ప్రప్రధమంగా ఏర్పాటు చేసినవారు మౌర్యులు.
పౌరసభ, జనపద సభలు మౌర్యుల కాలంలోని ప్రజాప్రతినిధులతో కూడిన సంస్ధలు.
గోప అనే అధికారి భూమిశిస్తును వసూలు చేసాడు.
సమాహార్త – ఆర్ధికశాఖకు ముఖ్య అధికారి.
ధర్మస్థీయ – సివిల్ న్యాయస్థానం. (భూతగాధాలు, అస్ధి మొదలైనవి.)
కంటకశోధన- క్రిమినల్ కేసుల విచారణ న్యాయస్ధానం.(దొంగతనాలు, హత్యలు)
అశోకుడు వ్యవసాయంలో, పరిశ్రమలలో యుద్దఖైదీలు, బానిసలను ఉపయోగించారు.
మెగస్తనీస్ భారతదేశంలో బానిసత్వం లేదని, ఏడు కులాలవారు ఉన్నారని తన రచనలలో పేర్కొన్నాడు.
వర్తకులు శ్రేణులుగా ఏర్పడ్డారు.
సామ్రాజ్యాన్ని జనపదాలుగా విభజించారు.
గ్రామానికి అధికారి గ్రామికుడు.
కమిటీల ద్వారా సైన్యనిర్వహణ, నగర పాలనను నిర్వహించేవారు.
మౌర్యసామ్రాజ్యంలో స్త్రీ స్వేచ్చ తగ్గింది. సతి సహగమనాన్ని పాటించేవారు. వేశ్యావృత్తికి ప్రభుత్వామోదం లభించింది.
తక్షశిల, వారణాసి ప్రముఖ విధ్యాకేంద్రాలు. ప్రాకృతం విస్త్రృతంగా అభివృద్ది చెందింది. బ్రహ్మి లిపి ప్రాచుర్యంలోకి వచ్చింది.
భౌధ్ధవాఙ్మయం చాలావరకు ప్రాకృత భాషలో తయారైంది.
చారిత్రక యుగానికి చెందిన తొలికట్టడాలు మౌర్యులకాలం నుండి ప్రారంభమైనాయి.
అశోకుని కాలంలో స్తూపాలు, స్తంభాలు, రాజభవనాలు, గుహాలయాలు అనబడే నాలుగు రకాల వాస్తు శిల్పాలు లభ్యం అవుతున్నాయి.
అశోకుడు 84వేల స్తూపాలను నిర్మించాడని భౌధ్ద గ్రంధాలు తెలుపుతున్నాయి. వాటిలో సాంచి, సారనాధ్, బార్హుత్ ప్రసిధమైనవి.
సాంచి స్తూపం భోపాల్ వధ్ద ఉంది.
అశోకుడు నాటించిన ఏకశిలా స్తంబాల ఏత్తు 50అడుగుల వరకు ఉంది.
సారనాద్ స్తంభ సింహకిరీటాన్ని స్వాతంత్ర్యానంతరం భారతప్రభుత్వం జాతీయచిహ్నంగా తీసుకుంది.
———————————————-
భిక్షువు దుస్తులతోనే రాజ్యకార్యాలను నిర్వహించిన రాజు అశోకుడు.

ధ్యానం చేయడం ద్వారా

🌏 *ధ్యానం*🌏

👉 *ధ్యానం: – నీ లోపల, నీ బయట, సర్వత్రా వ్యాపించి వున్న పరమాత్మను దర్శించ టానికి నీ లోనికి, నీ పయనం చేసి ఆత్మదర్శనం పొందడం.*

🔺 *ధ్యానం:- మనల్ని మనం తెలుసుకునే ప్రయత్నంలో మనలోనికి మనం చేసే ప్రయాణం.*

🔺 *ధ్యానం:-ఆత్మ, పరమాత్మల కలయిక కోసం చేసే ప్రయత్నంలో ఓ మార్గం.*

🔺 *ధ్యానం:- వంచించే ఇంద్రియాలు ద్వారా పరమాత్మను గ్రహించగలమన్న అజ్ఞానమును వీడి, బాహ్యవిషయములనెరిగే మనస్సుని, ఎగిసిపడే అహంకారాన్ని అంతమొందించి హృదయంలోని అవ్యక్తమైన కాంతినీ, స్వస్వరూపస్థితిని ఎరుక లోనికి తెచ్చే ప్రక్రియ.*

🔺 *ధ్యానం:- మనస్సు యొక్క నిశ్చలత్వం.*

🔺 *ధ్యానం:- మనల్ని పరమసత్యానికి దగ్గరగా తీసుకెళ్ళే మార్గం.*

🔺 *ధ్యానం:- ఇతర భావాలను విడిచి ఒకే ఒక భావంపై ఏకాగ్రతను కల్గించడం.*

🔺 *ధ్యానం:- అంతరంగ చైతన్యముకు చేరువకావడం.*

🔺 *ధ్యానం:-హృదయాంతర్గత ఆత్మచైతన్యంలో జీవించడం.*

👉 *ఇలాఎందఱో ధ్యానసిద్ధిని పొందినవారు ధ్యానత్వంలో ఉన్న మహిమత్వాన్ని ఇలా ఎన్నోరాకాలుగా నిర్వచించినను ఇది ఎవరికి వారే తెలుసుకోవాల్సిన సత్యం.*

🔺 *ఎవరికి వారే తప్పనిసరిగా చేయాల్సిన అంతర్ముఖ ప్రయాణం.*

🔺 *ఎవరికివారే పొందాల్సిన స్థితి*.

🔺 *ఎవరికి వారే పొందాల్సిన అనిర్వచనీయమైన చైతన్యానుభూతి.*

👉 *ప్రాపంచిక జీవనం, పారమార్ధిక జీవనం సమతుల్యముగా ఉన్నప్పుడే మానవుడిది పరిపూర్ణజీవితమౌతుంది. అది తెలిపేదే ధ్యానం.*

👉 *ప్రాపంచిక, పారమార్ధిక జీవనగమనములో శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత తప్పనిసరి. ఈ రెండూ ధ్యానం వలనే సాధ్యం.*

👉 *పరిపూర్ణజీవనానికి ధ్యానమే మార్గమని శ్రీకృష్ణ పరమాత్మ, పతంజలి, బుద్ధుడు, గురునానక్, మహావీరుడు మొదలు రామకృష్ణ పరమహంస, వివేకానందుడు, నేటి సద్గురువులు వరకు; అలానే ఎందఱో ఆధునిక శాస్త్రీయ పరిశోధకులు, వైద్య నిపుణులు సూచిస్తున్నారు*.

👉 *ధ్యానం మైండ్ ని శుద్ధిచేసే ఓ ప్రక్రియ.*

👉 *జీవితం ఎన్నెన్నో సంఘటనలతో, ఒడిదుడుకులతో, మార్పులూచేర్పులతో, సుఖదుఃఖాలతో కూడుకున్నదే జీవితం*.

🔺 *వీటన్నిటినీ యధాతధంగా స్వీకరించేశక్తి ధ్యానంవలన అలవడుతుంది.*

🔺 *ధ్యానంవలన సాక్షిభావం, తద్వారా భావ సమతుల్యత అలవడుతుంది.*

👉 *గతాన్ని నెమరువేసుకోకుండా, భవిష్యత్తు గురించి ఊహాగానాలు చేయకుండా, దేన్నీ ఆశించకుండా ఏ క్షణంకా క్షణం జాగురుకతతో, ఎరుకతో సంపూర్ణముగా జీవించడం ఎలాగో ధ్యానం ద్వారానే అలవడుతుంది.*

👉 *అంతే కాదు, సంస్కారశుద్ధి, విషయ వాసనలనుండి విముక్తి ధ్యానసాధన ద్వారానే సాధ్యమౌతుంది.*

🔺 *పరమాత్మ మన ఎరుకలోనికి రావాలంటే హృదయం నిర్మలం కావాలి.*

🔺 *హృదయం నిర్మలం కావాలంటే మానసిక అలజడులు, ఆలోచనలు, విషయ వాసనలుండకూడదు
ఇవేవీ ఉండకూడదంటే ధ్యానం ఒక్కటేమార్గం*.

🔺 *ధ్యానం చేస్తున్నప్పుడు ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి*.

🔺 *వాటిని అదిలించి నెట్టివేయలేము. అవి మరల మరల వస్తూనే వుంటాయి. అందుకే పుట్టుకొస్తున్న ప్రతీ ఒక్క ఆలోచనను సాక్షిభావంతో చూడడం, ఆ ఆలోచనలను ఆచరణలో పెట్టకుండా, కొనసాగించకుండా అలా గమనిస్తూ వుంటే కొంతకాలంకు ఆ ఆలోచనలన్నీ ఆగిపోతాయి.*

👉 *ఇదేరీతిలో ధ్యానం చేస్తున్నప్పుడు కొందరు – కృష్ణుడు, బుద్ధుడు, సూర్యుడు, దేవతలు, ప్రకృతి దృశ్యాలు దర్శిస్తూ తాము ధ్యానస్థితిలో ముందుకు పోతున్నామని, మంచి మంచి అనుభవాలు కల్గుతున్నాయని, ఉన్నతమైన ధ్యానస్థితిలో ఉన్నామని అనుకుంటారు.*

👉 *కానీ అది సరికాదు. నిజమైన ధ్యానంలో మనస్సు మహానిశ్చలంగా ఉండిపోతుంది.*

👉 *అలా నిశ్చలమైన మనస్సులో ఎటువంటి చిత్రణలు ఉండవు. ఇవన్నీ ఒకవిధంగా స్వాప్నిక దృశ్యాలే అని గ్రహించాలి*.

👉 *ధ్యానం దైవత్వాన్ని చేరుకోవడానికే తప్ప అనుభవాల కోసం కాదని గ్రహించాలి*.

👉 *ఇది పరిపూర్ణ ధ్యానం కాదని గ్రహించాలి.*

🔺 *ధ్యానమంటే కొన్నిమాటలు పునరుక్తి చేస్తూ, జపం చేస్తూ నియమిత సమయంలో కళ్ళుమూసుకొని కూర్చొని చేసే ప్రక్రియ కాదు.*

🔺 *ఏ పని చేస్తున్ననూ ధ్యానం లా జరుగుతూ ఉండాలి*.

🔺 *అంటే చేస్తున్న ప్రతీపనియందు సాక్షిభావంతో ఉండి పనిచేయగలిగినప్పుడు మాత్రమే అది అర్ధవంతమైన, ధ్యానయుక్తమైన పరిపూర్ణజీవితం అవుతుంది.*

👉 *ధ్యాన సాధన చేస్తున్నమొదట్లో ధ్యానస్థితిలో ధ్యానం చేసే వ్యక్తి, ధ్యానం చేయడానికి ఆలంబనగా తీసుకున్న ధ్యానవస్తువు (నామం, రూపం, దీపం, శ్వాస మొదలగునవి) ఉంటాయి.*

🔺 *ధ్యానంలో కొంత ప్రగతి సాధించాక ధ్యానవస్తువు ఉండదు. ఇంకా ధ్యానం తీవ్రతరం అయ్యేసరికి ధ్యానం చేసే వ్యక్తి అంటే ధ్యాని కూడా ఉండడు.*

🔺 *సమస్తమూ ధ్యానమందు లయమై పోతాయి.*

🔺 *ధ్యానకేంద్రమైన విశ్వాత్మలో అంటే పరమచైతన్యంలో ధ్యాని దేహం, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారం, శ్వాస….అన్నీ అన్నీ సమీకృతమై వీలీనమైపోతాయి.*

🔺👉 *ఇదీ పరిపూర్ణ ధ్యానస్థితి.*

🔺👉 *ఇదే సంపూర్ణ ఆత్మధ్యానం. ఇదే ఆత్మనిష్ట.*

👉ఆత్మనిష్ట కలుగుటకు ధ్యానమే సాధనమని, ఆ సాధన ఎలా చేయాలో కృష్ణ పరమాత్మ ఆరవ అధ్యాయము నందు తెలియజేసెను.

🔺👉 *మహర్షులనుండి ఇంద్రాది దేవతలవరకు; మహాయోగులనుండి ముముక్షువులవరకు; సద్గురువులనుండి సత్ సాధకులవరకు………ప్రతివొక్కరూ ధ్యానం చేసి జ్ఞానం పొంది తరించినవారే.*

🔺 ఆత్మధ్యానం యొక్క మహిమత్వమును శుక మహర్షి ఇలా తెలియజేసెను.
సర్వదా నారాయణ స్వరూపమైన ఆత్మను ధ్యానించుటయే గొప్పదని.

🔺👉 *ధ్యానయోగం యొక్క మహిమత్వాన్ని ఎన్నో శాస్త్రాలు ద్రువీకరిస్తున్నాయి .ఒక ధ్యానయోగంచే, కట్టెలన్ని అగ్నిచే భస్మమగునట్లు మనకర్మలన్నీ ధ్యానం చేత భస్మమగుచున్నవి.*

🔺 *భ్రూమధ్యమందు శ్వాసను నిలిపి మనస్సును ఐక్య పరచి ఎవరు ధ్యానింతురో, వారియొక్క శత జన్మార్జితమైన పాపాలన్నియు నశించి నిర్మలు లగుదురు.*

*(ఉత్తరగీత)*

🔺👉 *నిముషముగానీ, అర్ధనిముషముగానీ ఆత్మధ్యానం చేసిన యెడల మానవులకు కోటి ఆశ్వమేధాది యాగములకంటే ఎక్కువ

🌺ఫలితముంతుంది*🌺

Blue Whale Game Stages

BLUE WHALE , బ్లూ WHALE ?
తల్లి తండ్రులూ! పిల్లలను రక్షించుకోండి !
చాల్లా విచారకరమైన సంఘటన. ఒక కుర్రవాడు ఆత్మహత్య చేసుకొని , దానికి దారితీసిన పరిస్థితులపై రాసిన సూసైడ్ నోట్.
ఎవరైనా 11 – 19 మధ్య వయస్సుగల పిల్లలు మీఇంట్లో ఇంటర్నెట్ ద్వారా పేస్ బుక్ కానీ, వాట్స్ అప్ గాని ఈ బ్లూ వేల్ ఆటకు సంబందించిన లింకు ను తెరవకుండా చూడండి.

ఎందువల్లనంటే ఈ ఆటలో 50 స్థాయిలు ఉంటాయి. ఆఖరి స్థాయి ఆత్మహత్యకు దారితీస్తుంది.

ఆట మొదలు పెట్టి మధ్యలో ఆపేద్దామనుకొంటే వీలు కాదు. 50 స్థాయిలు ఆడవలసిందే. ఒకసారి ఆట మొదలు పెడితే మీ మొబైల్ హకెర్ చేతిలోకి వెళ్ళిపోతుంది . అప్పుడు ఆ హెకర్ మీ కుటంబాన్ని నాశనం చేస్తానని బెదిరిస్తాడుట.

మీరు గ్రూప్ ఓ ఉన్నట్లయితే , లేదా ఒక కాంటాక్టుకి ఫార్వర్డ్ చేసి అందరికి చెయ్యమని తెలుపగల ప్రార్ధన. సమయం తక్కువ.

మనకు తెలియని లింకు ఏమి ఉండదు. మొబైల్ లో మనకి తెలియని లింకులను ఎప్పుడు ఓపెన్ చేయడానికి ప్రయత్నించవద్దు.

అదే విధంగా మీకు డబ్బు, బహుమతులు వస్తాయనే లింకులను కూడా ఎప్పుడు ఓపెన్ చెయ్యవద్దు. పెద్దల పర్యవేక్షణలో తప్ప మొబైల్ ఫోన్ ఎవ్వరికీ ఇవ్వవద్దు.

బ్లూ WHEL ఆటలో ఉండే 50 స్థాయిల ఛాలెంజ్ లు ఈ విధంగా ఉంటాయి.

1 బ్లేడ్ తో మీ చేతిమీద f57 అని చెక్కి దానిని ఫోటో తీసి కురేటర్ కు పంపండి.
2 ఉదయం 4 20 నిద్రలేస్తుంచి క్యూరేటర్ పంపే భయానక, మనసుకు సంబందించిన వీడియోలు చూడండి.
3 మీ చేతిమీద, నరాలను ఎక్కువగా కాకుండా బ్లేడ్ తో 3 గాట్లు పీతి ఆ ఫోటోను క్యూరేటర్ కి పంపండి.
4 కాగితం మీద వేల్ (తిమింగలం) బొమ్మ వేసి ఫోటో తీసి క్యురేటర్ కి పంపండి.
5 మీరు ” WHALE గా మారడానికి ” రెడీ గా ఉంటె కాలి మీద YES అని బ్లేడ్ తో రాయండి.
లేదంటే చాలా సార్లు బ్లేడ్ తో గీసుసుకోండి (మీ అంతటా మీరే శిక్షించుకోండి)
6 CIPHER అనే దానితో పోటీ పదండి.
7 బ్లేడ్ తో మీ చేతిమీద F40 అని గీసుకొని అది ఫోటో తీసి క్యురేటర్ పంపండి.
8 #I _ AM _ WHALE ” అని మీ VKONTAKTE స్టేటస్ LO టైపు చెయ్యండి.
9 మీ భయం నుండి బయటకు రండి.
10 ఉదయం 4 20 గేమ్ లేవండి. మీ ఇంటి పైకి రండి. యెంత ఎత్తులో ఉంటె అంత మంచిది.
11 మీ చేతిమీద బ్లాడితో WHALE (తిమింగలం) బొమ్మ గీసుకుని ఫోటో క్యురేటర్ కు పంపండి.
12 ఆ రోజంతా మీ మనసుకు నచ్చిన, భయానక వీడియోలు చూడండి.
13 మీరు (క్యురేటర్ పంపిన) సంగీతం వినండి.
14 మీ పెదవిని కోసుకోండి.
15 చేతిలో సూదితో అనేకసార్లు పొడుచుకోండి.
16 మీకు బాధ అనిపించే పనిచేసి SICK అయిపోండి.
17 మీకు తెలిసిన ఎత్తైన మేడమీది ROOF మీదకు వెళ్లి దాని అంచు చివర చాలాసేపు నిలబడండి.
18 ఒక BRIDGE వద్దకు వెళ్లి దాని అంచున నిలబడండి.
19 ఒక CRANE మీదకు ఎక్కండి. కనీసం ఎక్కడానికి ప్రయతించండి.
20 మీ క్యూరేటర్ మీరు నమ్మకస్తులా కాదా అని పరీక్షిస్తాడు.
21 SKYPE లో వేరొక ఆటగానితో లేదా క్యురేటర్ తో “TALK WITH ఆ WHALE ” లా మాట్లాడండి.
22 ROOF పైకే ఎక్కి అంచున కాళ్లూపుతూ కూర్చోండి.
23 CIPER తో మరొక పోటీ.
24 రహస్య సంభాషణ.
25 ” WHALE ” తో మీటింగ్ కు రండి.
26 క్యురేటర్ మీరు మరణించే తేదీని సూచిస్తారు. మీరు తప్పక దానిని ఒప్పుకోవాలి.

27 UDAYAM 4 20 కు నిద్ర లేచి రైలు పట్టాల దగ్గరకు రండి.
లేదా రైలు పట్టాలు దగ్గరలో ఎక్కడ ఉన్నాయో వెతుక్కోండి.
28 ఆ రోజు ఎవ్వరితో మాట్లాడకండి.
29 మీరు ” నేను WHALE ని” ప్రతిజ్ఞ తీసుకోండి.

30-49 ప్రతీ రోజు 4 20 నిద్రలేచి క్యురేటర్ పంపే భయానక వీడియోలు చూస్తూ, సంగీతం వింటూ బ్లేడ్ తో BODY మీద
ఒక్కక ఘాటు పెట్టుకొంటూ ” WHALE తో మాట్లాడండి.

50 ఎత్తైన ప్రదేశం నుండి దూకండి. మీ ప్రాణం తీసుకోండి.

ఇది నాకు వాట్స్ అప్ లో వచ్చిన సమాచారం. దీనిని గురించి ఎవరు వివరం గా చెప్పలేదు. ఇంగ్లీష్ లో పంపంచారు. కానీ మన అక్కలకు, చెల్లెళ్లకు తెలియచేయడానికి నేను తెలుగులో తర్జుమా చేసాను. నాకు వివరంగా తెలియదు. ఇది చదివితే తప్ప.

ఏది ఏమైనప్పటికి తల్లితండ్రులు మీ పిల్లలకు సెల్ ఫోన్ ఇచ్చి గొప్ప గా ఫీల అవ్వొద్దు. అనర్ధాలకు మీరే కారణం. వారు ఎప్పుడు నిద్రపోతున్నారా లేదా ఆడుతున్నారా అని గమనించండి. ఒక వేళా ఇంట్లో వీలు కాకపొతే బయట ఏమైనా ఆడుతున్నారు చూడండి. ఈ BLUE WHALE కాకుండా కొత్తకొత్తవి వస్తుంటాయి.
పిల్లలు ఆత్మహత్య చేసుకోవచ్చు లేదా ఎవరినైనా చంపొచ్చు. రోడ్డు మీద శోకాలు పెట్టి జీవితాన్తమ్ బాధ మీదే! జాగ్రత్త.

FORWARDED THIS MESSAGE AS RECEIVED .
SUBJECT UNKNOWN CORRECTIONS IF ఏ. FORWARD TO ALL GROUPS . SAVE KIDS.

ALERT TO HOSTEL WARDENS ABOUT YOUR STUDENTS. YOUR JOB IS RISCKY. WATCH THEM ALWAYS.

Decomposition

Do you know how long it takes for the nature to decompose the stuff we dispose off without a thought??

Paper Towel – 2-4 weeks
Banana / Orange Peel – 3-4 weeks
Paper Bag – 1 month
Newspaper – 1.5 months
Cardboard – 2 months
Cotton Glove – 3 months
Plywood – 1-3 years
Wool Sock – 1-5 years
Milk Cartons – 5 years
Cigarette Butts – 10-12 years
Leather shoes – 25-40 years
Tinned Steel Can – 50 years
Foamed Plastic Cups – 50 years
Rubber-Boot Sole – 50-80 years
Plastic containers – 50-80 years
Aluminum Can – 200-500 years
Plastic Bottles – 450 years
Disposable Diapers – 550 years
Monofilament Fishing Line – 600 years
Plastic Bags – 200-1000 years

We request you, please share this piece of information in your network as much as you can.
This will create awareness amongst people that plastic is one of the major reasons related to the Global Green House Effect.
– Please Support a Green Environment.😊🌳🌿🌱
Have a Green Day

ఉప్మా.

ఉప్మా కనిపెట్టిన వాడ్ని ఉరికే వదలకూడదు 😣😣…ఊరూరా ఊరేగించి ఉప్పు నీళ్ళలో ఊరబెట్టి😎😎..ఊ కొడతారా ఉలిక్కి పడతారా సినిమా ఒక వంద సార్లు చూపించి ఉరితీయ్యాలి😂😂…ఎవరి ఇంటికి పోయినా త్వరగా అయిపోతుందని చేస్తారో🐒🐒కసి తీర కడుపులో మంట చల్లార్చుకోడానికి చేస్తారో తెలీదు 😰😰..కమ్మటి కాఫీ ఇచ్చి పంపిస్తే హాయిగా ఉండదు🐺🐺… వుండండి వుండండి అంటూ😛😛 వంటింట్లో నుంచి ఏ పూరి నో పొంగలో తెస్తారనుకుంటే🙆.ఉట్టిపుణ్యం గా ఊడి పడుతుంది ప్లేట్ లో ఈ ఉప్మా🙇🙇.. ఒక రెండు స్పూన్ ల వరకు బాగానే వుంటుంది👸…తరువాత చూడండి జ్వరమొచ్చినప్పుడు మాత్రలు మింగినట్టు🙅🙅స్పూన్ స్పూన్ కి ఒక గ్లాస్ నీళ్ళు తాగుతున్న మన కష్టాన్ని ఏమాత్రం లెక్కచేయకుండా👶👶..ఇంకాస్త పెట్టమంటారా అంటే😳…. ఆ స్పూన్ తో తల మీద గట్టిగ కొట్టుకొని వెర్రి గా నవ్వాలనిపిస్తుంది💣💣💣…ఈ దరిద్రానికి మళ్లీ రకాలు💥💥..గోధుమ రవ్వ,,బొంబాయి రవ్వ అంటూ👂👂..బొంబాయి ముంబై అయినా..ఈ ఉప్మా ఇంకా బొంబాయి రవ్వగానే చెలామణి అవుతాంది😛😛…జీడిపప్పు వేస్తే జీడిపప్పు ఉప్మా🐇🐇…ఉల్లిపాయలేస్తే ఉల్లిపాయుప్మ🐓🐓..టమాట వేస్తే టమేటా బాత్ 🍅🍅🍅…. ఉప్మా చేయి అంటే చాలు చిటికెలో చేతిలో ఉప్మా ప్లేట్ తో ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ వచ్చేస్తారు🎅🎅….శనివారం అయిందంటే చాలు ఎదో రూపం లో తగులుకుంటుంది🙇🙇..ఈ మంతెన గారు ఊరుకోక గోధుమ రవ ఉప్మా మంచిది అని చెప్పారు💪💪.. ఇక చూడండి👈..వారోత్సవాలు…👈బ్రహ్మోత్సవాలు జరుగుతూంటాయి☝….తప్పు మీది కాదు సర్👐👐.ధైర్యం చేసి ఉదయన్నే నాలుగు గంటలకి మీ ప్రోగ్రాం చూపించామ్ కదా✊✊…చేసిన పాపం ఉరికే పోదు👎👎..ఇది తినడం ఒక ఎత్తు అయితే తిన్నాక లోపల కి వెళ్లి ఇది చేసే హంగామ అంతా ఇంతా కాదు🏃🏃🏃…పడుకుంటే కడుపు లో షేర్ ఆటో లు తిరుగుతునట్టు ఒకటే గోల 🚆🚆🚆….అర స్పూన్ తింటే ,,.అరిగించుకోటానికి ఆరు గంటలు పడుతుంది🎠🎠🎠… ఉప్మా నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే🎭🎭…మా రామ్ దేవ్ బాబా గురూ గారు మహత్తరమైన ఉపాయం చెప్పారు😜😝😜… ఉప్మా కాశి లో వదిలేసాను అని చెప్పమన్నాడు 😛😛…ఎప్పుడైనా ఎవరైనా పెట్టినప్పుడు ఈ మాట చెప్పి తప్పించుకుంటున్నా అని చెప్పాడు 😌😌….నేను అదే చేస్తా లాభం లేదు😫😫…ఇంతకీ ఎంతమంది ఇవాళ ఉప్మా తిన్నారో 😊😊…అదే లే తినాల్సివచ్చిందో చెప్పండి😆😆…ఎదో మనిషి కి మనిషి సహాయం
😜😜…మీకోసం ప్రార్థన చేస్తా..కడుపులో పడిన ఉప్మా త్వరగా కరగాలని…
😃😃జై ఊప్మాఁ..జై జై ఊప్మాఁ..

పురుష లక్షణం

స్త్రీ ఎలా ఉండాలో అనే కాదు…

పురుషుడు ఎలా ఉండాలో కూడా ధర్మ శాస్త్రం

చెప్పింది..కానీ ఎందుచేతో ఈ శ్లోకం జన బాహుళ్యం లో లేదు

కార్యేషు యోగీ, కరణేషు దక్షః

రూపేచ కృష్ణః క్షమయా తు రామః

భోజ్యేషు తృప్తః సుఖదుఃఖ మిత్రం

షట్కర్మయుక్తః ఖలు ధర్మనాథః (కామందక నీతిశాస్త్రం)

–> కార్యేషు యోగీ :
పనులు చెయ్యడంలో ఒక యోగి వలె, ప్రతిఫలాన్ని ఆశించకుండా చెయ్యాలి.
–> కరణేషు దక్షః
కుటుంబాన్ని నడపడంలో, కార్యాలను నిర్వహించడంలో నేర్పుతో, సంయమనంతో వ్యవహరించాలి. సమర్ధుడై ఉండాలి.
–> రూపేచ కృష్ణః
రూపంలో కృష్ణుని వలె ఉండాలి. అంటే ఎల్లప్పుడూ ఉత్సాహంగా,
సంతోషంగా ఉండాలి.

–> క్షమయా తు రామః
ఓర్పులో రామునిలాగా ఉండాలి. పితృవాక్యపరిపాలకుడైన రాముని వలె క్షమించేగుణాన్ని కలిగిఉండాలి.
–> భోజ్యేషు తృప్తః
భార్య/తల్లి వండినదాన్ని (వంకలు పెట్టకుండా) భుజించి, తృప్తి చెందాలి.
–> సుఖదుఃఖ మిత్రం
సుఖదుఃఖాలలో కుటుంబానికి మిత్రుని వలె అండగా ఉండాలి. మంచి చెడ్డలలో పాలు పంచుకోవాలి.
ఈ షట్కర్మలు – ఈ ఆరు పనులు సక్రమంగా చేసే పురుషుడు ఉత్తమ పురుషునిగా , ధర్మనాథునిగా కొనియాడబడతాడు.

మధుమేహం గురించి

What is shugar or diabetes
నీకు షుగర్ తగిలింది .. అని ఆ మాట వినగానే సగం మెత్తబడతాడు , పళ్ళు తినకు , అన్నం తినకు , స్వీట్స్ తినకు , టి కాఫీ లో చెక్కర మానెయ్యాలి అని జాగ్రత్తలు చెపితే ఇంకో 30 శాతం మెత్తబడతాడు , మొత్తానికి ఒక 80 శాతం down అవుతాడు , కొన్ని వారాలు పూర్తిగా దిగులు పట్టుకుంటుంది , చుట్టాలు , ఫ్రెండ్స్ కధలు కధలుగా చెప్తారు , ఎవరు ఎలా పోయారో , ఎవరి ఎన్ని కిడ్నీలు ఫెయిల్ అయ్యయో …. దెబ్బతో ఆ మనిషి నీరసించి , క్రుంగి కృశించి ఓ 5 నుండి పది కిలోలు బరువు తగ్గిపోతాడు …. ఇక జీవితం ఫినిష్ అని డిసైడ్ అవుతాడు ….
.
పైన చెప్పినవి దాదాపుగా చాలా మందికి అనుభవం లోకి వచ్చిన సంఘటనలే …
ముందుగా అసలు మధుమేహం అంటే ఏంటి అనేది మనం పామరుల భాషలో తెలుసుకుందాం …
మధుమేహం లో రెండు రకాలు ఒకటి టైపు 1 అంటే ఇంజక్షన్ ద్వారా insulin తీసుకునేది
రెండోది టైపు 2 దానికి మందులు వాడతారు ….
మనం టైపు 2 గురించి మాట్లాడుకుందాం …
మన తినే ఆహారాన్ని జీర్ణించి దాంట్లో ఎనర్జీ , ప్రోటీన్ , విటమిన్స్ , ఖనిజ లవణాలు అన్నిటిని మన శరీరానికి కావాల్సిన చోటకి సరఫరా చేస్తుంది మన digestive system , అందులో ముఖ్యంగా మన దేహం లో ఉండే కణాలకు శక్తి ని glucose (చక్కర లాంటిది ) రక్తం ద్వారా అందిస్తుంది దానికోసం మన pancreas గ్రంధి insulin తయారు చేస్తుంది …

కొన్ని కారణాల వల్ల అది insulin తయారు చెయ్యడం ఆపేస్తుంది , అప్పుడుఆ సమస్యకు తగిన వైద్యం వైద్యులు మనకు సూచిస్తారు , ఇంజక్షన్ లేదా మందులు …
ఎక్కువగా వివరంగా వెళ్ళకుండా మనకు కావాల్సిన సబ్జెక్టు లోకి వస్తున్నా ..
రోజు మొత్తంలో కనీసం 45 నిముషాలు చెమటలు పట్టేలా పని చెయ్యండి , నడవండి , లేదా మరే ఇతర శరీర శ్రమ అయినా చెయ్యండి
.
ఆహరం కనీసం నాలుగు సార్లు తీసుకోవాలి ..అది కూడా మితంగా ..

.
తక్కువ తక్కువ ఎక్కువ సార్లు తీసుకుంటే రక్తం లో గ్లూకోస్ లెవెల్స్ ఎక్కువగా పెరగవు …
calories తక్కువ తీసుకుంటు ప్రోటీన్ ఇతర మినరల్స్ సమతుల్యత గల ఆహరం తీసుకోవాలి …
rice, చపాతీ , రాగులు , సజ్జలు , కొర్రలు , జొన్నలు అన్ని రోజు ఒక రకం అలా తీసుకుంటే మనకు విసుగు పుట్టదు …
చేప లేదా చికెన్ కనీసం వారానికి రెండు సార్లు , ఆయిల్ ఎక్కువ వెయ్యకుండా కొవ్వు లేకుండా lean meat తింటే బెటర్ , ఎక్కువగా పప్పు dalls , ఆకుకూరలు తీసుకోవాలి , (మనవాళ్ళు NV అంటే నునే లో ఊరబెడతారు అందుకే తినమని చెప్పాలంటే భయం 🙂 )
మందులు మాత్రం క్రమం తప్పకుండా వాడాలి…
మన శరీరానికి కావాల్సిన సరైన డోస్ సెట్ అయ్యేవరకు మొదట్లో నెలలో రెండు సార్లు రక్త పరీక్ష చేయించుకుని కాస్త రద్దీ తక్కువ ఉన్న డాక్టర్ ని సంప్రదించండి ….
కొన్ని సెకండ్స్ , లో ఇలా చూసి అలా next పేషెంట్ ని పిలిచే డాక్టర్ కి ఒక
పెద్ద నమస్కారం పెట్టెయ్యండి … (నేను అదే చేశా 😀 )

ఒక మోతాదులో స్వీట్స్ తీసుకోవచ్చు కాని అప్పుడు కొంత ఆహారాన్ని త్యాగం చెయ్యాలి ఆ పూట 🙂
షుగర్ లెవెల్స్ సరిగ్గా కంట్రోల్ లో లేకపోతె , మనం శరీర శ్రమ / వ్యాయామం చెయ్యకపోతే దాని దాడి .. మన కళ్ళు , కిడ్నీలు , గుండె మీద ఉంటుంది ,

నెల నెల రక్తం లో షుగర్ పరీక్ష ,అలాగే urine టెస్ట్ ప్రతి సంవత్సరానికి ఒక సారి రక్తం లో కొవ్వు శాతం తెలిపే lipid profile పరీక్ష , సంవత్సరానికి ఒక సారి కళ్ళ టెస్టింగ్ తప్పనిసరిగా డాక్టర్ గారి సూచనల ప్రకారం చేయించుకోవాలి …
.
.
మొత్తానికి మధుమేహం లో ఉన్న మధు ని మనం బెస్ట్ ఫ్రెండ్ చేసుకుంటే మాత్రం కనీసం ఒక డెబ్భై ఏళ్ళు హాపీ గా బ్రతకగలం ….
From Naveenkumar

మంచి సందేశం

మంచి సందేశం… AGAIN.. AGAIN

ఒక కుర్రాడు, వాళ్ళ నాన్నతో ఒక గంట సేపటి పాటు కొంచెం డబ్బు పంపటం కోసం బ్యాంకులో వేచి ఉన్నాడు. తను విసిగిపోయి ఆగలేక తన తండ్రిని ఇలా అడిగాడు….

“నాన్నగారు, మీరు internet banking ఎందుకని activate చేసుకోరు?”

“ఎందుకు చేయించుకోవాలి” అని తండ్రి తిరుగు ప్రశ్నించారు.

“ఇలా ఇక్కడ గంట సేపు transfer కోసం ఎదురు చూడనక్కర్లేదు, ఇంకా సామాన్లు కూడా online లో ఇంటికే తెప్పించుకోవచ్చు”.

తండ్రిని internet banking ప్రపంచంలోకి తీసుకురావాలని కొడుకు ప్రయత్నిస్తున్నాడు.

తండ్రి : “అలా చేస్తే నేను ఇంట్లో నుండి బయటకు రావాల్సిన అవసరం లేదు కదా??”

“హ హ, ఆవును అవును”, అని కొడుకు జాబిచ్చాడు. “ఇంకా ఇంటికి కిరాణా సామాన్లు, ఇంటికి కావాల్సిన వస్తువులు ఇలా ఎన్నో తెప్పించుకోవచ్చు, amazon flipkart లాంటి ఎన్నో కంపెనీలు ఎంతో సులువుగా, కచ్చితంగా సామాన్లు ఇంటికి అందజేస్తున్నాయి”, అని వివరించే ప్రయత్నం చేసాడు.

అంతా విన్న తండ్రి ఇచ్చిన సమాధానానికి ఆ కొడుకుకి ఇంక మాటల్లేవ్ !!!

“నేను ఈరోజు బయటకి రావటం వల్ల, నా పాత స్నేహితులని నలుగురిని కలిసాను. ఇక్కడ పని చేసే సిబ్బందితో నాకు మంచి పరిచయాలు ఉన్నాయి. వాళ్ళతో మాట్లాడాను.

నీకు తెలుసు నేను ఒంటరివాడిని. నాకు ఈ సమయంలో కావాల్సిన స్నేహం ఇటువంటిదే. నాకు కావాల్సినంత సమయం ఉంది. నేను ధీమాగా తయారయ్యి ఇలాంటి పరిచయాల్ని పెంచుకుంటాను.

రెండు సంవత్సరాల క్రితం నాకు అనారోగ్యం వచ్చినప్పుడు, నేను ఎప్పుడూ పళ్ళు కొనే కొట్టు వాడు నన్ను చూడటానికి వచ్చి, నాకోసం బాధపడి, కన్నీళ్లు కార్చి, నేను బాగు అవ్వాలని కోరుకున్నాడు.

కొన్ని రోజుల క్రితం…
అమ్మ పొద్దున్నే, మార్నింగ్ వాక్ కి వెళ్ళినప్పుడు కళ్ళు తిరిగి పడిపోయింది. అప్పుడు మనం ఎప్పుడూ సామాన్లు కొనే కిరాణా కొట్టువాడు, తన బండి తీసుకుని అమ్మని ఇంటికి చేర్చాడు.

నువ్వన్నట్టు online లో shopping లు అవి చేస్తే, నాకు ఈ మానవ సంబంధాలు ఉండేవా? పళ్ళ కొట్టువాడు నా బాధను పంచుకునేవాడా? అమ్మని కిరాణా కొట్టువాడు ఇంటికి చేర్చగలిగేవాడా???

ఒక computer లేదా mobile phone తో సావాసం చేసి ఇంటికే అన్ని తెప్పించుకుని నాకు దొరికే స్నేహితుడు ఎవడు, ఒక electronic పరికారమా!!!

నేను ఏదైనా కొనేటప్పుడు వాళ్ళని చూసి వాళ్ళతో మాట్లాడటం ఇష్టం. నాకు ఇవన్నీ నువ్వనే ఆ amazon flipkart లో దొరుకుతాయా, కేవలం నీకు సామాను పంపే seller పేరు తప్ప. మనిషి మనీషి కలిసిన నాడే సత్సంబంధాలు ఏర్పడతాయి, బంధాలు బలమవుతాయి.

టెక్నాలజీ ఉండాలి కానీ…
అది మాత్రమే జీవితం కాకూడదు !

మనుషులతో జీవించండి…..
పరికరాలను వాడుకోండి…..

“ప్రేమించల్సిన మనుషుల్ని వాడుకొని,
వాడుకోవాల్సిన పరికరాలతో జీవించకండి”….

(‘తెగిపోతున్న మానవ సంభందాల’ గురించి ఒక్క సారి అలోచించండి) 🙂🙂🙂🙂