మాడపాటి సత్యవతి

మాడపాటి సత్యవతి గారు:
—————————————
ఆకాశవాణి, హైదరాబాద కేంద్రం లో తొలిసారి వార్తలు చదివిన మహిళ.

ఈవిడ 2017 లో తెలంగాణ ప్రభుత్వం నుండి తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం అందుకున్నారు.

జీవిత విశేషాలు:
————————
హైదరాబాద్ నగర మొదటి మేయర్ మాడపాటి హనుమంతరావు గారి మనువరాలైన సత్యవతి గారు బ్రాహ్మణ కుటుంబంలో హైదరాబాద్ లో జన్మించారు. వారి సొంత వూరు ఖమ్మం జిల్లాలోని ఎర్పుపాలెం. వారి తాతగారు మాడపాటి హనుమంతరావు గారి అన్న కొడుకు మాడపాటి రామచందర్‌రావు గారు. ఆయన సత్యవతి గారి తండ్రి గారు. హనుమంతరావు గారికి కొడుకులు లేకపోవడంవల్ల వారి నాన్నని, సత్యవతి గారిని ఆయనే పెంచారు.

నిజాం పాలన చరమాంకంలో తెలంగాణలో ఊళ్లకూళ్లు రక్తంతో తడిశాయి. రజాకార్ల దురాగతాలకు పల్లెలు తల్లడిల్లాయి. ఆడపడుచులు, అమ్మలు, ముసలవ్వలు.. ఇలా ఆడవాళ్లందరూ మానప్రాణాల కోసం సొంతూళ్లను వదిలి వలస వెళ్లారు. బతుకు జీవుడా అంటూ ఊరు కాని ఊరు వెళ్లి తలదాచుకున్నారు.

అప్పుడు ఆమెకు 15 ఏళ్లుంటాయి. ఒకరోజు ఉదయం ఎవరో అబ్బాయొచ్చి ఊరిని రజాకార్లు చుట్టుముట్టారనే వార్త చెప్పాడు. ఆ మాట వినేసరికి ఒళ్లంతా వణికిపోయింది. రజాకార్ల దారుణకాండ ఊరికి ఎరుకే. వారిని ఎదిరించిన ఇద్దరు యువకులను కొట్టి చంపారు. ఆ దృశ్యాలు కనుమరుగు కాకముందే మళ్లీ ఊరు మీదికొచ్చిపడ్డారని తెలిసింది. ఇంట్లో అమ్మ, నానమ్మ, సత్యవతి గారు ఉన్నారు. నిజాం సంస్థానానికి వ్యతిరేకంగా పోరాడే క్రమంలో అప్పటికే ఆమె నాన్న అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. రజాకార్లు వారి ఇంటి దగ్గరికి వస్తున్నారన్న విషయం తెలిసిన ఓ కాంగ్రెస్ లీడర్ తుపాకీతో వారి ఇంటికొచ్చి ఆమేను, వారి అమ్మను దొడ్డి దారిన ఊరు దాటించాడు. నానమ్మ రాలేదు. ఎడ్ల బండిపై ఊరు దాటి రైల్వేస్టేషన్‌కి వెళ్లి అక్కడ రైలు ఎక్కి విజయవాడలో దిగారు.

విజయవాడలో తెలిసిన వాళ్లింట్లో మకాం. ఊళ్లోనే ఉన్న నానమ్మకు వారి నాన్న ఓ కబురు పంపాడు. ఆమె విజయవాడకు వెళ్లకపోతే నిజాం ప్రభుత్వానికి లొంగిపోతానని నాన్న హెచ్చరించాడు. కొడుకు చేసే ఉద్యమానికి భంగం కలగకూడదని ఆమె నానమ్మ కూడా వాళ్ళ దగ్గరికి వచ్చేసింది. 11 నెలలు ముగ్గురు నానా పాట్లు పడ్డారు. వారే కాదు రజాకార్ల దాడులకు భయపడి కొన్నాళ్లపాటు తలదాచుకోవడానికి వందల సంఖ్యలో ఆడవాళ్లు ఇతర ప్రాంతాలకు వెళ్లారు. వీరిలో గర్భవతులున్నారు, పసిపిల్లల తల్లులు, రకరకాల జబ్బులతో ఇబ్బంది పడుతున్నవారు ఉన్నారు. ఇలా వెళ్లిన వారిని పొరుగువారన్నట్టే చూశారు కానీ, సరైన ఆదరణ చూపలేదు. రజాకార్ల దురాగతాలకు అడ్డుకట్ట పడి, భారతదేశంలో హైదరాబాద్ విలీనమైన తర్వాత తిరిగి వారి ఊరికి వెళ్లారు

తిరిగి ఊరెళ్లి చూసుకుంటే ఏముంది. తాతలు కట్టిన అందమైన ఇల్లు పైకప్పు కూలి పూర్తిగా శిథిలమైపోయింది. మొండి గోడలు, ఎండిపోయిన చెట్లు, ఇంటి ఆవరణ మొత్తం జంతువుల కళేబరాలతో నిండిపోయింది. చాలా ఇళ్లది ఇదే పరిస్థితి. ఊళ్లలో మునుపటి పరిస్థితులు ఏర్పడటానికి కొన్నేళ్లు పట్టింది. ఇక్కడి పరిస్థితి తెలిసిన కొందరు ఊరికి తిరిగిరాకుండా వెళ్లిన చోటే స్థిరపడిన వారూ ఉన్నారు.

ఓ.. తెలంగి..:
——————–
నిజాం నిరంకుశ పాలనలో తెలుగు నేర్చుకోవడం నేరం. ఓ నలుగురు తెలుగు మగవాళ్లు మాట్లాడుకోవాలంటే ఉర్దూలోనే మాట్లాడాలి. ఎవరైనా తెలుగు మాట్లాడితే.. మన తెలుగోళ్లే నవ్వుతూ.. ‘ఓ తెలంగి’ అని హేళన చేసేవారు. అలాంటి రోజుల్లో వారి తాతయ్య మాడపాటి హనుమంతరావు గారు ఓ తెలుగు పాఠశాల స్థాపించారు. దానికి అనుమతివ్వమని నిజాం ప్రభుత్వం హెచ్చరించినా పాఠశాల తెరిచారు. ఆయన పాఠశాలలో మొదటి విద్యార్థి ఆయన భార్య.. వీరి నాయనమ్మ మాడపాటి మాణిక్యమ్మ, రెండో విద్యార్థి బూర్గుల రామకృష్ణారావు గారి భార్య అనంతలక్ష్మి గారు. నారాయణగూడలో తెలుగు బాలికల ఉన్నత పాఠశాల పేరుతో ఆయన స్థాపించిన స్కూల్లో విద్యార్థులకు పదో తరగతి పరీక్ష రాసే అవకాశాన్ని నిజాం ప్రభుత్వం కల్పించకపోయేసరికి ఆంధ్రా యూనివర్శిటీ ద్వారా ఇక్కడ పదో తరగతి చదువుతున్న విద్యార్థినుల్ని విజయవాడ పంపించి పరీక్ష రాయించారు. అలా పరీక్ష రాసిన చివరి బ్యాచ్ విద్యార్థిని సత్యవతి గారు.

ఆకాశవాణిలో :
——————–
ఆలిండియా రేడియోలో న్యూస్ రీడర్‌గా పనిచేసారు. రేడియోలో సుదీర్ఘకాలం న్యూస్ ఎడిటర్‌గా పనిచేసిన సత్యవతి గారు వార్తావాహిని పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు

మాడపాటి సత్యవతి గారు ఎంతో క్లుప్తంగా మాట్లాడుతారు. మాటలు తూచినట్టే వచ్చేవి ఆవిడ గారి నోటి నుంచి. అంతటి మితభాషి. మరి పది నిమిషాలు విడవకుండా ఏకబిగిన వార్తలు యెలా చదివేవారో అనిపించేది. కానీ ఆవిడ స్వరం భగవంతుడు కేవలం రేడియో కోసమే తయారుచేసాడేమో అనిపిస్తుంది. ఒక రకమైన మార్ధవంతో, సంగీతం వినిపిస్తున్నట్టుగా మాడపాటి సత్యవతిగారు వార్తలు చదువుతుంటే మరీ మరీ వినాలనిపిస్తుందని చెప్పేవాళ్ళు బోలెడు మంది.

ఒకరు అనువాదం చేసిన వార్తలు చదవడం కన్నా తాను సొంతంగా అనువదించి చదవడానికి ఆవిడ ఇష్టపడేవారు. నిజానికి ఆవిడ న్యూస్ రీడర్ కాదు. న్యూస్ ఎడిటర్. కానీ వారంలో కొన్ని రోజులు విధిగా వార్తలు చదివేవారు. వీటికి తోడు వారానికి ఒకమారో రెండు సార్లో వీలునుబట్టి ‘వార్తావాహిని’ కార్యక్రమాన్ని రూపొందించి సమర్పించేవారు.

పురస్కారాలు :
——————–
తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం ను తెలంగాణ ప్రభుత్వం, మార్చి 8, 2017 న ఆమె కు ప్రదానం చేశారు.

ఆమె హైదరాబాద్ పద్మారావునగర్‌ లో నివాసం ఉంటున్నారని సమాచారం.

జాబ్ పోతే నిరాశ పడకండి

ఈ రోజు పేపర్ లో ఒక అమ్మాయి తన సాఫ్ట్వేర్ ఉద్యోగం పోయింది అని ఆత్మహత్య చేసుకున్నది అని చదివిన తరువాత రాయాలి అనిపించింది.

కొత్తగా ఐ టి కంపెనీలో చేరారా?
1. ఇంతవరకు అమ్మ నాన్నలు ఇచ్చే డబ్బు మీద ఆధారపడి వుంటారు. ఇప్పుడు మీరు సంపాదించిన డబ్బు కాబట్టి మీకు ఖర్చుపెట్టే దైర్యం వచ్చినట్టు అనిపిస్తుంది.
2. మీ ఖర్చు పెరగటానికి ఇది ఒక కారణం.
3. మీ కుటుంబం ఆదాయం చాల బాగా ఉండి మీ తల్లి తండ్రులు మీ డబ్బు గురించి అడగకుండా ఉండి అవసరం అయితే మీకు డబ్బు ఇచ్చే పరిస్థితి ఉంటే మీ సంపాదన గురించి మీ ఇష్టం
4. అలా కాకుండా మధ్య తరగతి దిగువ మధ్య తరగతి అయి ఉండి ఉద్యోగం జీతం మీకు ముఖ్యం అయితే మీరు కొన్ని విషయాల పట్ల జాగ్రత్తగ ఉండాలి.
5. ఉద్యోగం ఎక్కిన వెంటనే చాలామంది తాము ఎక్కడి నుండి వచ్చింది మరచిపోయి తాహతుకు మించిన జీవితం గడిపే ప్రయత్నం చేస్తారు.
6. నిన్నటి వరకు 15 వేల రూపాయల ఫోన్ వాడి జాబ్ వచ్చిన వెంటనే ఇన్స్టాల్మెంట్ లో 50 వేల ఐ ఫోన్ కొంటారు.
7. అవసరం లేకున్నా ఫ్రెండ్స్ చెప్పారు అనో గర్ల్ ఫ్రెండ్ ను ఇంప్రెస్స్ చేయటానికో అడిగింది అనో కారు/ఖరీదు అయిన బైక్ కొనకండి.
8. కొంచెం ఎక్కువ జీతం ఉంటే వెంటనే ఇన్కమ్ టాక్స్ సేవ్ చేద్దాం అని ఫ్లాట్ కొనడం చేస్తుంటారు అదీ చేయకండి. ఓ రెండు మూడేళ్లు ప్రభుత్వానికి టాక్స్ కట్టడం వలన వచ్చే నష్టం ఏమి లేదు.
9. ఓ రెండేళ్లు జాబ్ చేసిన తరువాత కొనే వాటిని ప్రయారిటీ ప్రకారం కొనండి. అది బైక్/కారు/ఇల్లు ఏదైనా సరే.
10. రేపు సడన్ గా ఉద్యోగం పొతే కనీసం 6 నెలలు ఎవరి మీద ఆధారపడకుండా కొత్త కోర్సులు చేయటానికి కావలసినంత డబ్బును కచ్చితంగా సేవ్ చేసుకోండి.
11. ఉద్యోగం పోంతుంది అనో పోయిన తరువాత ఎలాంటి భయపడవలసిన అవసరం లేదు, ఎందుకంటే మార్కెట్ లో ఎన్నో ఎన్నో జాబ్స్ ఉన్నాయి, ఒక రోజు ఆలస్యం కావొచ్చు కానీ జాబ్ దొరకదు అనే సమస్యే లేదు.
12. ఉద్యోగం పొతే భయపడటానికి కారణాలు జీతం ఆధారంగా కట్టే ఈ ఏం ఐ లు, తల్లి తండ్రులు బంధువులు ఏమనుకుంటారో అని డబ్బులు లేకపోతె ఎలా అనే భయం. ఇవేవి ఉండకూడదు అంటే పైన అనుకున్నట్లు చేస్తే అసలు భయమే ఉండదు.
అన్నిటికన్నా ఈ ప్రపంచం లో విలువైనది మీరు బతికుండడం దాని ముందు అన్ని చిన్నవే అనే విషయం గుర్తుంచుకోవడం. credits గొంంంంంం కవీంధర్ రెడ్డి   FB post

రాజకీయంలో కావల్సినది మెజారిటీ మాత్రమే. సమ న్యాయం కాదు 😒

కొంచెం భయం.. కొంచెం భక్తి!
వామపక్ష మేధావులు, సుప్రసిద్ధ లాయర్లు, మేధావులు నేతలుగా ఉన్న పార్టీలు చేయలేనివి, ఒక చాయ్‌వాలా ఎలా చేయగలిగాడు? ఐదున్నర అడుగుల వ్యక్తికి 56 అంగుళాల ఛాతీ ఎలా సాధ్యమైంది? ఆయన వెనక బలం ఏమిటి?

భారతదేశంలో చేసే పని లేక, మానసిక ప్రశాంతత దక్కక, బ్రహ్మచారి రాహుల్‌గాంధీ, ధ్యానం కోసం తరచూ రహస్యంగా విదేశాలకు వెళుతున్నారు. సిమ్లాలో కట్టుకున్న డ్రీమ్‌ గెస్ట్‌హౌస్‌ కన్నా, ఢిల్లీలో ఉంటేనే వాద్రా కోర్టుకైనా, జైలుకైనా వెళ్లడం సౌకర్యంగా ఉంటుందని ప్రియాంక తుది నిర్ణయానికి వచ్చేశారు. దేశం సురక్షితంగా ఉన్నందున, ఇక ఎస్పీజీ భద్రత అక్కర్లేదని సోనియా… అశ్రువులో, ఆనంద బాష్పాలో తెలియని కన్నీటితో జవాన్లకు వీడ్కోలు పలికారు. బీజేపీ ఆర్థిక విధానాలపై ఏకాంత అధ్యయనానికి అనుకూలంగా ఉందని, పనిలో పనిగా బరువు తగ్గి ఆరోగ్యం కూడా పెంచుకోవచ్చని చిదంబరం జైల్లోనే సెటిలై పోయారు.

బీజేపీని గిల్లడం తగ్గించి, కమల్‌నాథ్‌ తన మేనల్లుడి విముక్తి కోసం ఢిల్లీలో ఇల్లిల్లూ తిరుగుతున్నారు. కారాగృహ జ్ఞానోదయంతో వ్యూహకర్త శివకుమార్‌ కమలనాథులతో కొత్త పరిచయాలకు పరితపిస్తున్నారు. ఆమాంబాపతు కాంగ్రెస్‌ కురువృద్ధులంతా రామకోటి రాస్తూ, మోదీ కంట పడడానికి కష్టిస్తున్నారు. మోదీ కన్ను తమపై పడకూడదని మరికొందరు దాగుడుమూతలు ఆడుతున్నారు. దేశ సమగ్రతకు చిహ్నమైన 370 నిర్వీర్యాన్ని సమర్థించడం ద్వారా మాయావతి, ఈ దేశ మూలవాసులం తామేనని పునరుద్ఘాటిస్తున్నారు. మంచం కింది ట్రంకుపెట్టెను తెరిచి, బ్రాహ్మణీయత అనే మడి చీర దుమ్ముదులిపి, మమతాబెనర్జీ, దుర్గా పూజల్లో దక్షిణలు సమర్పించుకుంటున్నారు. శబరిమల అయ్యప్ప దర్శనానికి వచ్చే మహిళలకు ఈసారి తాము రక్షణ కల్పించలేమని చెప్పి సీపీఎం మంత్రులు లెంపలేసుకుంటున్నారు.

చిన్నవాడైన కేజ్రీవాల్‌ ‘తన ఢిల్లీ– తన లొల్లి’ చిన్నదని గుర్తించి పెద్దపెద్ద మాటలు ఆపేశారు. అవినీతి కేసుల్లో ఉన్న ముఖ్యమంత్రులు అమిత్‌షా అపాయింట్‌మెంట్‌ కోసం, ఆయన పుట్టిన రోజెప్పుడని ఆరా తీస్తున్నారు. ‘మోదీ జీ… మా వాడిని మీ చేతుల్లో పెడుతున్నా. మీ చల్లని చూపు వాడిపై ఉండాలి. ఇక మీ దయ’ అంటూ ములాయం తదితర బాధ్యతగల ప్రాంతీయ తండ్రులు అప్పగింతలు చేసేస్తున్నారు. ‘చేయూతనిచ్చినాసరే, చేర్చుకున్నా సరే’ అని తెలుగుదేశం నేతలు కాకులతో బీజేపీకి కబురు పంపుతున్నారు. కశ్మీర్లో అగ్గి రాజేస్తామన్న ఒమర్‌, ఫరూక్‌ వంటి వారంతా, చెడు తిరుగుళ్లు, మతి చెడే ఆలోచనలు మానేసి, ఇంటి పట్టునే ఉంటూ తమవాళ్ల మంచిచెడ్డలు చూసుకుంటున్నారు.

జమ్మూకశ్మీరు సంగతి తర్వాత, తన హయాంలో పీవోకే చేజారి పోకుంటే అదే పదివేలు అని ఇమ్రాన్‌ఖాన్‌ వేడుకుంటున్నారు. మోదీ పాపులారిటీలో తనకొచ్చే ఓట్లెన్నో లెక్కేసుకుంటూ ట్రంప్‌గారు ఎన్నారైల వెంట తిరుగుతున్నారు. ‘మనిద్దరి సంబంధాలు మహాపురాతనం.. అందుకు మహాబలిపురమే పరమ నిదర్శనం’ అంటూ చైనా అధ్యక్షులవారు కొత్త చుట్టరికాలు కలుపుతున్నారు. విదేశాల్లో భారతీయులు ‘వుయ్‌ ఆర్‌ ఫ్రం ఇండియా’ అని కాలరెగరేసి తిరుగుతున్నారు. స్వదేశంలోని భారతీయులు కుల, మత, ప్రాంత, వర్గ, విభేదాలు, విద్వేషాలు పక్కనబెట్టి ఎవరిపని వారు చేసుకుంటున్నారు. కొంచెం భక్తితో… కొంచెం భయంతో!

పనికిమాలిన చర్చల కన్నా, ‘ప్లాస్టిక్‌ ఏరే సముద్ర మోదీ’ విజువలే ఎఫెక్టివ్‌ అని, న్యూస్‌ చానెళ్లు కొత్త టీఆర్‌పీ రేటింగ్‌ స్ట్రాటెజీ కనుక్కున్నాయి. సంఘ్‌ పరివార్‌లోని విస్ఫోట స్వరాలన్నీ తపోముద్రలోకి వెళ్లిపోయాయి. 370 తీసేసినా, అయోధ్యపై తీర్పిచ్చినా మైనారిటీలు ఎందుకు మౌనం దాల్చారు చెప్మా? అంటూ వామపక్ష మేధావులు బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. హిందుస్థాన్‌ ముర్దాబాద్‌ అంటూ పెనం మీది పేలాల్లా ఎగిరి పడిన విద్వేష గొంతులన్నీ వెనక్కితగ్గాయి. దావూద్‌ హవాలా నిధులు పారిన బాలీవుడ్‌లో, ఖాన్స్‌ మార్కెట్‌కు కాసులు కురవడం ఆగి, 60 ఏళ్ల అక్షయ్‌కుమార్‌ సూపర్‌ హీరోలా అవతరించారు.

గుండె గదుల్లో దాచుకున్న కంగనా రనౌత్‌ జాతీయవాదం సరికొత్తగా ఖంగుమని మోగింది. ఇంతకాలం మాట్లాడలేని తనికెళ్ల, గరికపాటి, చినజీయర్‌, సామవేదం, చాగంటలన్నీ ఇప్పుడు దేశానికి ఏది మంచిదో, ఏది కాదో ఘంటాపథంగా చాట గలుగుతున్నాయి. స్వచ్ఛంద సేవ ముసుగులో మత మార్పిడి సేవ చేసే సంస్థల దుకాణాలు మూతపడ్డాయి. మార్కెట్‌లో కుటుంబ కంపెనీలు కూలిపోయాయి. దళారీదందాలు, స్కాముల బంధాలు కనిపించడం లేదు. అర్ధాంతరంగా ఉద్యోగాలు పీకేసినా నోరెత్తకుండా, కోర్టులు– కేసులు అనకుండా, అవినీతి ఉన్నతాధికారులు తిన్నగా ఇంటికి పోయి గుట్టుగా కాపురాలు చేసుకుంటున్నారు. కొంచెం భక్తితో.. కొంచెం భయంతో!

రెండోసారి అధికారంలోకి వచ్చి నిండా వంద రోజులు నిండలేదు. తక్షణ తలాక్‌ నేరమైంది. 370 అధికరణం తెరమరుగైంది. అయోధ్యలో ఆలయానికి మార్గం సుగమమైంది. ఇంకా ఎన్ని కీలక నిర్ణయాలో! జన్మభూమిలో రాముడికొక మందిరాన్ని తమ జీవిత కాలంలో చూడగలమా? అనుకున్న తరం, కల సాకారమవుతుండడంతో రోమాంచితమైంది. అయినా ఎక్కడా చిన్న అలజడి లేదు. నిరసనల అలికిడి లేదు. మంత్రించినట్టు, మాయేంద్రజాలం చేసినట్టు అంతటా ఒకటే మాట! కాదని మనసులో ఉన్నవాడు కూడా… ‘కాని కాలమిది. కాస్త ఆగుదాం’ అని సర్దుకుపోతున్న సమయమిది!

దేశమేదో మారిపోయినట్టు మనసుకు వినిపిస్తున్నది. ప్రపంచం మనల్ని చూసే చూపే మారిపోయినట్టు కనిపిస్తున్నది. అది చేస్తే ఏం మూడుతుందో, ఇది చేస్తే ఏమవుతుందో అని ఇంతకాలం భయపడుతూ బతికేవాళ్లం. ఆ అనుమానాల వ్యథలోంచి, ఏదైనా చేయగలమనే ఆత్మవిశ్వాసపు కథలోకి దేశం సగర్వంగా సాగినట్టు అనిపిస్తున్నది. స్వేచ్ఛాస్వాతంత్ర్యాల పేరుతో విచ్చలవిడితనం, అరాచకం రాజ్యమేలే భారతదేశాన్ని బాగు చేయడానికి, ‘నియంతలాంటి పాలకుడు’ ఒకరు అవసరమని మామూలు మధ్యతరగతి జనాంతికంగా, మనలో మాటగా, మనసులో మాటగా మధనపడేవారు. తథాస్తు దేవతలు అది విని నిజం చేసినట్టుంది. చేసేది తప్పని తెలిసీ చేసిన వారు, అంతరాత్మ హెచ్చరికలను వింటూ కూడా అక్రమాలకు పాల్పడినవారు… ఇప్పుడు పైవాడెవడో, పైనుంచి ఎవడో నిరంతరం, నిశితంగా తమనే చూస్తున్న అనుభూతికి లోనవుతున్నారు. కొన్ని కళ్లేవో తమనే తీక్షణంగా గమనిస్తున్నట్టు గ్రహిస్తున్నారు. దీన్ని ప్రజాస్వామిక నియంతృత్వం అందామా? నియత ప్రజాస్వామ్యం అందామా?

ఒక్కసారిగా ఇంత క్రమశిక్షణ ఎలా వచ్చింది? దేశవాసుల్లో ఇంత సహనమెలా సాధ్యమైంది? వామపక్ష మేధావులు, సుప్రసిద్ధ లాయర్లు, మేధావులు నేతలుగా ఉన్న పార్టీలు చేయలేనివి, ఒక చాయ్‌వాలా ఎలా చేయగలిగాడు? ఐదున్నర అడుగుల వ్యక్తికి 56 అంగుళాల ఛాతీ ఎలా సాధ్యమైంది? ఆయన వెనక బలం ఏమిటి? మోదీది శారీరక బలం కాదు. వంద కోట్ల మంది మనో బలం. తన హయాంలో ఈ దేశానికి, ఈ దేశ బలా

బలాలను పునః పరిచయం చేసిపోవాలన్న సంకల్ప బలం.

ఇంతకాలం మనం మన కళ్లతో చూడలేదు. మన చెవులతో మనం విన్లేదు. 1947లో మనకు భౌగోళిక స్వాతంత్య్రం వచ్చిందే తప్ప, మానసిక స్వాతంత్య్రం రాలేదు. తాము నమ్మిన సిద్ధాంతాలనే అందరూ ఆచరించాలనీ, కాదన్నవారు ప్రగతిశీలురే కాదనే మూర్ఖపు యుగంలో బతికాం మనం! మార్పును కోరుకోకుండా, సహించకుండా, అంగీకరించకుండా మడిగట్టుకుని ఉన్నవాడు ప్రగతిశీలా? మార్పును కోరుకునేవాడా? మత ఛాందసవాదికి, సిద్ధాంత ఛాందసవాదికి.. ఇద్దరికీ ఉన్నది మౌఢ్యమే. ఆ మౌఢ్య వాదులిద్దరూ కలసిపోయి, మనల్నీ బలవంతంగా కలిపేసుకున్నారు.

‘ఆరెస్సెస్‌ ఇట్లా… బీజేపీ అట్లా.. మోదీ ఇట్లా.. అమిత్‌ షా అట్లా’ అని వారు ప్రచారం చేస్తే నమ్మి, ప్రజాస్వామిక దేశంలో, దశాబ్దాలపాటు కుటుంబ రాచరికాన్ని సేవించుకుని భంగపడ్డాం. మన సంస్కృతిని, మన సంప్రదాయాలను మనమే ద్వేషించుకున్నాం. మన పూర్వీకుల్ని విస్మరించాం. మన జాతీయ ప్రతీకలను మనమే ధ్వంసం చేసుకున్నాం. మరొకడిలా ఎదగాలనే ఆత్మన్యూనతాపూర్వక అనుకరణే తప్ప, ఈ దేశానికి తనదైన ఒరిజినాలిటీ ఉందని మరిచిపోయాం. అది బానిసత్వమా? భావ దారిద్య్రమా?

ఇన్నాళ్లకు మన కళ్లతో మనం చూసే తరుణం వచ్చింది. మనకూ ఘనచరిత్ర ఉందన్న వాస్తవం తెలిసి వచ్చింది. బీజేపీ, ఆరెస్సెస్‌లు…. వామపక్షవాదులు చెప్పినంత ప్రమాదకరమేమీ కావన్న సత్యం బయటపడింది. సోకాల్డ్‌ వామపక్ష లౌకికవాదం కంటే ముందే మన సమాజంలో అంతర్‌ నిర్మితంగా లౌకికవాదం ఉంది. అది లెఫ్ట్‌ సెక్యులరిజం కంటే ఉన్నతమైంది. విదేశాల్లో చర్చిలాగా, భారతంలో మతం ఎన్నడూ రాజ్యాన్ని శాసించింది లేదు. రాజ్యంలో జోక్యం చేసుకుంది లేదు. అది కేవలం పరిపాలనకు తాత్విక భూమికను మాత్రమే అందించింది. రాజు తాను అనుసరించే మతంలో తనకు నచ్చినదాన్ని ప్రజలకు పంచడమే మన లౌకికవాదం. జనం మతావేశాలకు అతీతంగా ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించడమే మన లౌకికవాదం.

ఇప్పుడున్నది ఆ లౌకికవాదమే! అందుకే ఎంత పెద్ద నిర్ణయం తీసుకున్నా, మత కల్లోలాలు జరగడం లేదు. ప్రజా బాహుళ్యం కోరిక మేరకు నడుస్తూ, వారి ఆకాంక్షలను గమనిస్తూ, వాటిని తీర్చే దిశగా ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటూ, ప్రతి నిర్ణయాన్నీ ఎన్నికల తరాజులో కొలవకుండా, దేశం కోణంలో ఆలోచించే నిబద్ధతే మోదీ– షా బలం! తన కుటుంబమే తరాల తరబడి ఏలాలనే తపన ఆయనకు లేదు. వారసుల కోసం ఆస్తులు కూడగట్టాలనే యావ అంతకంటే లేదు. తానేమీ పట్టుకుపోయేది లేదు. ‘ఉన్నన్ని రోజులు మంచి అనిపించింది చేస్తా. గెలిస్తే గెలుస్తా. ఓడితే ఓడుతా’ అన్నది అతడి సిద్ధాంతం. ఓడిపోతే రాహుల్‌లా విదేశాల్లో కాకుండా, హిమాలయాల్లోనే తపస్సు చేసుకోగల ధైర్యం అతని సొంతం. అందుకే జనానికి అతనంటే కొంచెం భక్తి.. కొంచెం భయం!

కొసమెరుపు: మరి మోదీ– షా ద్వయం తప్పులే చేయడం లేదా? ‘రాజ్య నిర్వహణ యుద్ధంలాంటిది. పాలకుడు అతి మృదు స్వభావము, అతి క్రూరత్వమూ రెండూ చూపకుండా, దయ– దండనను సమపాళ్లలో రంగరించాలి. రాజ్యానికి, ప్రభుత్వానికి అపకారము తలపెట్టిన వారిపట్ల కఠినంగా ఉండాలి. వారిని వెంటనే శిక్షించి వదిలించుకోవాలి’ అని దేవ గురువు బృహస్పతి మరుత్తునితో చెప్పాడు. యుద్ధంలో గెలుపే అంతిమం తప్ప, నియమాలు కావు. రాజ్యానికి, ప్రజలకు మంచి చేయడం కోసం కొన్ని తప్పులు చేసినా పర్వాలేదు. అది రాజధర్మం! అయినా, చరిత్రలో పొరపాట్లు చేయని రాజెవ్వడు?

(సేకరణ ఆంధ్రజ్యోతి ఎడిటోరియల్)

AI and HR

The Augmented AI The role of HR in a workforce that is augmented by artificial intelligence cannot be underestimated, ultie role of HR in a workforce that is augmented by artificial intelligence cannot be underestimated, ultimately HR teams will be leaderships foot soldiers in driving a successful, motivated and innovative augmented workforce. However, HR teams themselves are going to look extremely different in this augmented workforce and will have a much more strategic role to play in the future.

HR’s retooling imperative

In order for HR to become more strategic however, it needs to retool and augment itself via AI. This will allow HR to automate away many of its departments more rote tasks and free up time for HR professionals to focus on strategic initiatives that will drive an organization’s workforce to its augmented future.

Rote tasks such as leave calculation and benefits admin will be eroded away and more emphasis will be placed on purely human tasks such as recruiting and strategic workforce planning. In addition, certain strategic HR tasks will be augmented, including learning & development and recruiting.

Rehire: the new faces of HR

The augmented organization will not just require a new augmented HR department however, the future of HR in an augmented organization will require entirely new responsibilities and employees. These new tasks include:

  • Man & machine management. This will involve developing an interaction system through which humans and machines can mutually communicate their capabilities, goals and intentions, and devising a task planning system for human-machine collaboration. The end goal is to create augmented hybrid teams that generate better business outcomes through human-machine collaboration.
  • Workplace planning & collaboration planning. Digital technologies, including AI, are profoundly recalibrating the way we need to work. To enable co-creation and collaboration, and harness the productive energy these approaches generate, organizations of the future will need to reimagine the interplay between workspace, performance and culture.
  • Vision Planning and execution. This will entail assisting in the creation and vision with members of leadership and then executing on delivering these organizational visions to the workforce. This will be done through consistent messaging, workshops, teaming leadership in BU’s and been an interface and sounding board for new initiatives to ascertain whether or not they meet corporate vision.

HR’s move from transaction to strategy

As can be seen, the tasks required of HR will become significantly leaner and therefore HR will be required to become more strategic in an augmented organization. A recent Economist Intelligence Unit study highlights the fact that HR needs to increasingly partner with the c-suite to drive these strategic aims. In addition, over half of the respondents of this study stated that HR in its current guise was not adequately strategic and therefore needs to retool and adapt.