ఓహ్ ..నైస్ , యూ ఆర్ డుయింగ్ గ్రేట్ జాబ్ .

తెలుగు నా మాతృభాష

ఓహ్ ..నైస్ , యూ ఆర్ డుయింగ్ గ్రేట్ జాబ్ .
మన తెలుగు బాటలొ కొన్ని గొంతులు
కాని ఈ అదివారము తెల్లవారు ఝామున తొమ్మిది గంటలకు పని ఉన్నది. నేను రాలెను
నాలుగు కిలొమీటరులా .. అమ్మో నేను నడవలేను కవాలంతే బైక్ మీద వస్తా !!
మేము %%%%యునివర్సిటి విద్యార్దులము , ఒక బస్స్ ఎర్పాటు చెయ్యండి !!
తెల్లవారు ఝామున ఎనిమిది గంతలకా .. అంత పొద్దునే లేవటమ్ కస్టం బాసు !!
అది మనుషులలొ మార్పురావాలి . ఈ బాటలు , గీటలు చేస్తే తెలుగు రాదు !!
తెలుగు తల్లి విగ్రహము నుండా… ఎంమ్ తెలంగాణా తల్లి విగ్రహము దగ్గర ఎందుకు పెట్టరు ?
పివి జ్ఞానభూమా .. అదెక్కడ ఉన్నది ?
మీకు గవర్నమెంటు వారు ఎంత ఇస్తరు,, ? మాకేమన్నా వస్తదా ..
అమ్మో .. ఇలాంటి యాత్ర్తలకు గొడవలు అవుతాయి , మా ఇంట్లో ఓప్పుకోరు
మీ కార్యకమం చాలా బాగున్నది ఎవరెవరిని గెస్టులుగా పిలుస్తున్నారు .. నేను సిద్దం కానీ అంత దురమ్ నడవలేను ప్రసంగించి వెళ్ళిపొతా
అసలు మీరెందుకు తెలుగు బాట చెస్తున్నారు .. .

ఎందుకంటే .. నా మాతృభాష తెలుగు కు సేవ చేసుకొనే అవకాశం జీవితములొ కొన్ని సార్లు మాత్రమే

వస్తది / వస్తుంది /వస్తాది !

as Per Police Order / No: HC -1 /5421/2010 , The permission is here b accorded to Sri Kasy………………from 7:00 AM to 10:00 AM in connection with Telugu Bhasha Deenostavam about 1800 people expected to participated programme –
తెలుగు భాష దీనోత్శవం అట 😦 — జై తెలుగు బాట !!

తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తెలుగు కోసం

కంప్యూటర్లు మరియు జాలంలో తెలుగుని, అంతర్జాలంలో తెలుగు వ్యాప్తి కోసం కృషి చేస్తున్న e-తెలుగు, బయటి ప్రపంచంలో (ప్రభుత్వ, ప్రయివేటు వ్యవహారాలలో) తెలుగు వాడకం పెరగాలని ఆశిస్తూ ఈ తెలుగు బాట కార్యక్రమాన్ని చేపట్టింది. తెలుగు వాడకాన్ని గురించి గుర్తు చేయడానికి, ప్రోత్సహించడానికి తెలుగు భాషా దినోత్సవం అయిన ఆగస్టు 29 ని ఎంచుకున్నాము.
ఈ కార్యకమునకు పదిహేను వందల మంది దాకా తెలుగు ఔత్సాహికులు ,తెలుగు సాంకేతిక నిపుణులు , బ్లాగరులు మొదలుగువారు పాల్గోంటారు , మేము నెక్లెస్ రోడ్డు తెలుగుతల్లి విగ్రహము వద్దనుండి పివి జ్ఞానభూమి వరకు వరుసకు నలుగురు చొప్పున తెలుగు వ్యాప్తికి సంభందించిన నినాదాలతో ఒక ప్రదర్శనగా నడవాలి అన్నది మా ప్రణాళిక , మా తెలుగుబాట కార్యక్రమము ఆగష్టు 29 2010 ఆదివారము ఉదయము ఏడుగంటల నుండి పదిగంటల మద్య జరుగును మరిన్నివివరములు లకు http://telugubaata.etelugu.org చూడండి, మీరు ఇక్కడ మీ పేరు సమోదు చెసుకొవచ్హు.

e-తెలుగు అనేది కంప్యూటర్లలో మరియు అంతర్జాలంలో తెలుగును వ్యాపింపజేయాలనే ధ్యేయంతో పనిచేసే లాభాపేక్షలేని సంస్థ. ఇంగ్లీషు రాని సగటు తెలుగువాడు కూడా తన అవసరాలకి కంప్యూటర్లను (ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను) మరియు అంతర్జాలాన్ని వాడుకోవాలి అనే ఉద్దేశ్యము తో
e-తెలుగు సంస్థ కృషి చేస్తోంది. అందుకుగాను అనేక కార్యక్రమాలు చేస్తోంది. ఇటీవల జరిగిన హైదరాబాదు పుస్తక ప్రదర్శనలో ఒక స్టాలుని నెలకొల్పి అంతర్జాలంలో తెలుగు గురించిన ప్రచారం కల్పించడమే కాక, కొన్ని తెలుగు సాఫ్టువేర్లను ఉచితంగా అందించింది. ఈ ప్రచార కార్యక్రమాల్లో భాగంగా సమాజంలోని వివిధ వర్గాల ప్రజలకు ప్రయోజనకరంగా ఉండే వర్కుషాపులను చేపట్టింది. వివిధ అంశాలపై తగు సమాచారం ఇవ్వడమే కాకుండా అనేక సాంకేతిక, సాంకేతికేతర విషయాల్లో తక్షణ సహాయం అందించడం, అనేక తెలుగు సాంకేతిక సదస్సులు, ప్రచారములు గత ఐదు సంవత్సరముల నుండి మేము నిర్వహిస్తున్నాము. e-తెలుగు ఆంధ్రపదేశ్ సంఘము రిజిస్టర్ ల చట్టము 2001 (35) క్రింద నెం 624/2008 తో రిజిస్టర్ అయినది.
తెలుగుబాట కార్యక్రమము లో పాల్గొనుటకు ఎటువంటి రుసుములేదు , తెలుగు భాష మీద అభిమానము, వ్యాప్తికి తెలుగు అభిలాష చాలును!
రండి, మనము అందరము కలసి తెలుగు భాష కు ఆధునిక హోదా తెద్దాం . తెలుగుబాట ను విజయవంతం చేద్దాం !!
ఈకార్యక్రమమునకు కరపత్రములు , స్టేజి , ప్రచార ఉపకరణములకు కొరకు సహాయము కోరుతున్నాము , మాకు సహాయము చెసిన వారి పేరు , చిహ్నము మా ప్రచార ఉపకరణములలొ మరియు మీడియా వారికి ప్రముఖముగా తెలియపరచగలము . దయచేసి తెలుగుబాట కార్యక్రమమునకు సహాయ సహకారములు అందిచగలరు .ధన్యవాదాలు
కశ్యప్
e-తెలుగు సంఘము
9396533666,
secretary@etelugu.org http://www.etelugu.org