ఇవి వార్తలా !

చిన్నపిల్ల ల పై అత్యాచారాలు,ముసలి వాడిను బూటు కాలితో నిర్దాక్షణం గా తన్నే పోలీసు ,సున్నితమయి న భావాలను రెచ్చకోట్టే విదముగా కదానికలు విచక్షణ కోల్పోయి మాట్లాడే వాళ్ళ మీద స్పెషల్ ఫోకస్,విది వంచితులను వినోదం గా చూపే రిపోర్టులు,కాలిన కుళ్ళిన గాయపడిన,తెగిపడిన శరీరావయవాలను  జుగుస్పాకరంగా చూపటంలో ఔనత్యం ఏమిటో వీరికే తెలియాలి , ఒక్క దూరదర్శన్ తప్పితే మిగిలిన న్యూస్ చానల్ అందరిదీ ఒకటే బాట !,ఇక దూరదర్శన్ విషయాంకి వస్తే   ఖర్మ కాలి ఇది రోజు రోజుకూ వెనుకకు పోతోంది కళాకారులు తన నటను ,ప్రదర్శనను చిరకాలం చూడాలంటె మన సప్తగిరి లో ఒక ప్రదర్శన ఇవ్వాలి , ఈ DD కళాకారులు నిఝంగా చిరంజీవులు. Telugu News Channels చూస్తుంటే  కడుపులో దెవేసినట్లు అవుతోంది .ఒక భక్తి పేజీ,ఒక చిన్నపిల్ల పేజీ వేసి మిగిలిన  పేజీ లన్నీ రక్తి తో నింపే స్వాతి  పత్రిక లాగ వీటి లోకూడ మంచి కార్యక్రమాలు వున్నాయి.   నా చుట్టూ  కూడ ఇలాంటి విపరీత మార్పు లు వస్తా(వచ్చా)యేమో అని భయమేస్తోది,ఇప్పటికే అపరిచితులు కు లిప్ట్ ఇవ్వాలంటె ఒక రక మయిన భయమమేస్తోది,ఇదవరకులా చిన్నపిల్లలితో చనువుగా ఉండలేక పోతున్నా 😦 .సమాజం మీద అసయ్యం ,మానవ సంబందాల మీద జుగుప్స కలుగుతోంది ,ఎప్పుడో ఓకసారి టివీ చూశే నాకే ఇలా అనిపిస్తుoటే ,రోజూ చూసే వారికి ఎలావుంటుందో, బహుశా వారి కి ఇవి అలవాటై వుండవచ్చు :-మనిషికి సాటి వారి మీద తన చుట్టూ సమజంమీద నమ్మకం ,ప్రేమ బాద్యతను  పెంచవలసిన వీరే ఇలా  అయిపోతే ఇంకెవరు ఉద్దరిస్తారు  ?

దీనిని ఎలా ముగించాలో తెలియక రాయుటకు మాటలు లేక పోవుట చే ఇంతటితో ముగిస్తునాను .                  

సరిఅయిన చర్యలు ఎమిటో తెలుసుకోవాలని ఉంది !

బాంబుదాడి తీవ్రవాదుల పనే అని స్పస్టంగా తెలిసినా కూడా శనివారం బందుకు పిలుపు నివ్వటం మరీ విడ్డూరం-“నో రీజనింగ్‌ ఇన్‌ పాలిటిక్స్‌”

మానవతా విలువలు మటుమాయమై మతం అన్నపదానికే
పెడార్ధాలు వర్ణిస్తూ మతకలహాల అగ్నిజ్వాలలు రేపుతున్న
ఈ సమాజం, ఇదేనా మనసమాజం!        
అనుకోని ఆపద వచ్చినపుడు బాధితులను ఆదుకోవలసిందిపోయి, నిరసన తెలుపడం కోసం బంద్‌కు పిలుపునివ్వడం సమంజసంగా లేదు.దానికి తోడు మీడియాలో పదే పదే ప్రసారాలు భవంతి మీద దాడి జరిగిందన్నప్పుడు ప్రజల సైకాలజీ వేరే వుంటుంది, ప్రార్దనా మందిరం మీద దాడి జరిగిందన్నప్పుడు వారి సైకాలజీ వేరే వుంటుంది.జనాలను రెచ్చగోట్టి పబ్బంగడుపు కోవటంలో వీరిని మించిన వారు లేరు.మెరుగయిన సమజం కోరకు పాటు పడుతున్నామంటూ వున్న సమాజాన్ని రెచ్చగోట్టే చానల్ వాడికి దాసులవటం మన ఖర్మ ( ఎదో సంస్కౄతి చానల్ పెడుతున్నారట..బలే పబ్లిసిటి!). 
అసలు ఈ ప్రజలే  ఎందుకు అంతగా ఎగబడుతారు?..పోలీసులు తంతామన్నా సరే.ఎందుకంత రిస్క్‌ తీసుకుంటారు ,
మత ఛాందస శక్తులు మత భావాలను రెచ్చగొట్టే విధంగా ?
చాలాసార్లు హింసాత్మక ప్రదర్శనలు బాబ్రీమసీదు కూల్చివేత, ఆఫ్గనిస్తాన్‌, ఇరాక్‌లపై అమెరికా దాడులు, అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్‌ హైదరాబాద్‌ రాక వంటి సందర్భాల్లో ఈ మక్కా మసీదు ప్రాంతం నుంచి ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించేవారు. అప్పుడు పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య ఘర్షణలు జరిగేవి.ఈరోజు జరిగినయి ఎందువలన ?”పరిస్థితిని అదుపులోకి తేవడానికి పోలీసులు కాల్పులు జరపడం సరైనచర్య కాదట – మరి సరిఅయిన చర్యలు ఎమిటో ?