చూసారా …దీపము నుండి వచ్చే వెలుగుని

ప్రేమికులదినం 14th Feb 2006 – See if you can change your thinking!!! అటూ అంతర్జాలము లోకి అడుగుపెట్టి,పిండి వంటల రుచిని Hyderabad Masti కి రుచి చూపించి అటు పిమ్మట బ్లాగా వరణము లోనికి పవేశించి ఇంతితై .. నేడు  వలబోజు జ్యోతిగారు  ఏక కాలంలో ఐదు బ్లాగులు  అదీ  1000 పైచిలుకు టపాలు! .Hyderabad Masti  గూగుల్ గుంపు లోవున్న 10460 మందికి మన గుంపులో 811 మందిలో ఒక ప్రత్యేక మయిన విశిష్టతను సంపాదించుకున్నారు.

Date:26/6/06

 TJ

కంప్యూటర్ ఎరా పత్రికలో వచ్చిన వ్యాసం చదివిన తరువాత అని పించినది తెలుసుకోవాలన్న ఆసక్తి దాని తగిన  కృషి చాలు విజయానికి ,ఇలా వివిధ అంశాలపై అమితమైన ఆసక్తిని చూపే జ్యోతిగారు  అనేక మంది కి స్పూర్తి దాయకం  ,కృషి కొనసాగాలని కోరుకొంటూ అభినందనలు తెలియజేస్తూ

ఒకసారి మననం చేసుకోందాం

ఉపయోగించకపోతే
కత్తి తుప్పు పడుతుంది!
వినియోగించకపోతే
మేధ తప్పుల పడుతుంది!!
గమనం ఉంటేనే కద –
గమ్యం అందేది!
పఠనం చేస్తేనే కద –
ప్రతిభను పొందేది!!
వట్టిగా ఉంటే
మట్టిలో చెదవవుతావు!
గట్టి కృషి ఉంటే
చేవ గల ప్రగతివవుతావు!!
 

కృషి కొనసాగాలని కోరుకొంటూ అభినందనలు తెలియజేస్తూ

స్వతంత్ర భారతం అరవై ఎళ్ళు నిండిన వేళ తోటి భారతీయులందరికీ శుభాకాంక్షలు

                              ఏ దేసమేగిన, ఎందుకాలిడిన

యే పీఠ మెక్కినా, యెవ్వరెదురైన
పొగడరా, నీ తల్లి భూమి భారతిని
నిలుపరా, నీ జాతి నిండు గర్వమ్ము
లేదురా ఇటువంటి భూదేవి యెందు
లేరురా మనవంటి పౌరు లింకెందు-

యే పూర్వపుణ్యమో, యే
యోగబలమొ,
జనీంచినాడ వీస్వర్గలోకమున
యే మంచిపూవులన్
బ్రేమించినావొ
నిను మోచె, నీ తల్లి
కనకగర్భమున
సూర్యుని వెలుతురు
సోకునందాక
ఓడలజెండాలు ఆడునందాక
నరుడు ప్రాణాలతో నడచునందాక
అందాక గల ఈ యనంతభూతలిని
మనభూమి వంటి కమ్మని
భూమిలేదు-

తమ తపస్సులు ౠషుల్
ధారబోయంగ
చండవీర్యము
శూరచంద్రులర్పింప,
రాగదుగ్ధము భక్తరాజు లీయంగ
భావసూత్రము కవిభంధవు లల్ల,
దిక్కుల కెగదన్ను తేజంబు వెలుగ
జగముల నూగించు మగతనంబెగయ,
రాలు పూవులు సేయు రాగాలు
సాగ సౌందర్య మెగబోయు సాహిత్య
మొప్ప-

వెలిగిన దీ దివ్య విశ్వంబు పుత్ర
దీపించె నీ పుణ్యదేశంబు పుత్ర;
అవమాన మేలరా, అనుమాన మేల
భరతపుత్రుడ నంచు భక్తితో బలుక-