సత్యాగ్రహము పుట్టిన రోజు : 11 September 1906

జాతిపిత మహాత్మా గాంధీ సత్యాగ్రహము ను మానవాళికి ఒసగిన సుదిన మిది , సత్యము, అహింసలు గాంధీగారు కొలిచిన దేవతలు. సహాయ నిరాకరణ, సత్యాగ్రహము ఆయన పూజాసామగ్రి. 20వ శతాబ్దిలోని రాజకీయనాయకులలో అత్యంతముగా మానవాళిని ప్రభావితము చేసిన రాజకీయ నాయకునిగా ఆయనను CNN జరిపిన సర్వేలో ప్రజలు గుర్తించారు. కొల్లాయి గట్టి, చేత కర్రబట్టి, నూలు వడకి, మురుగువాడలు శుభ్రము చేసి, అన్ని మతాలూ, కులాలూ ఒకటే అని చాటి ఆ మహాత్ముడు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించాడు. సత్యాగ్రహమూ, అహింసా పాటించడానికి ఎంతో ధైర్యము కావాలని బోధించాడు. మహాత్ముడనీ, జాతిపిత ఆనీ పేరెన్నిక గన్న ఆయన ఆంగ్లేయుల పాలననుండి భారతదేశానికి స్వాతంత్ర్యము సాధించిన వేలాది నాయకులలో అగ్రగణ్యులు.

1894లోభారతీయుల ఓటు హక్కులను కాలరాచే ఒక బిల్లును ఆయన తీవ్రముగా వ్యతిరేకించారు. బిల్లు ఆగలేదుగానీ, ఆయన బాగా జనాదరణ సంపాదించారు. “ఇండియన్ ఒపీనియన్” అనే పత్రికను ఆయన ప్రచురించారు. “సత్యాగ్రహము” అనే పోరాట విధానాన్ని ఈ కాలంలోనే ఆయన అమలు చేశారు. ఇది ఆయనకు కేవలం పని సాధించుకొనే ఆయుధం కాదు. నిజాయితీ, అహింస, సౌభ్రాత్వుత్వము అనే సుగుణాలతో జీవితం సాగించడంలో ఇద ఒక పరిపూర్ణ భాగము. గనులలోని భారతీయ కార్మికులకు జరుగుతున్న అన్యాయాలను ప్రతిఘటించడానికి ఆయన మొదలుపెట్టిన సత్యాగ్రహము 7 సంవత్సరాలు సాగింది. 1913 లో వేలాది కార్మికులు చెరసాలలకు వెళ్ళారు, కష్ట నష్టాలకు తట్టుకొని నిలచారు.

వందేమాతరం పూర్తి గీతముwritten by Bankim Chandra Chatterjee in 1876, on September 7

మిత్రులారా ,

వందేమాతరం పూర్తి గీతము  ,రచించి వంద సంవత్సరాలు అయిన సందర్బముగా  అందరూ 7 వ తారీఖున మీ కార్యాల యములలో పాడగలరని మనవి చేయుచున్నాను .
మీ శ్రేయోబిలాషి
కశ్యప్

వందేమాతరం  వందేమాతరం

సుజలాం సుఫలాం మలయజ-శీతలాం
సస్య-శ్యామలాం మాతరం ||

శుభ్ర-జ్యోథ్స్నా-పులకిత-యామినీం
ఫుల్ల-కుసుమిత-ద్రుమదళ-శోభినీం
సుహాసినీం సుమధుర-భాషిణీం
సుఖదాం వరదాం మాతరం ||

షష్ఠీకోటి-కణ్ఠ-కల-కల-నినాద-కరాలే
ద్విషష్ఠికోటి-భుజై ధ్రుత-ఖరకరవాలే
అబలా కైనో మా ఐతో బోలే
బహుబల-ధరిణీం నమామి తారిణీం
రిపుదల-వారిణీం మాతరం ||

తుమి విద్యా తుమి ధర్మ్
తుమి హ్రుది తుమి మర్మ్ త్వం _హి_ ప్రాణాహ్ శరీరే ||

బాహుతే తుమి మా శక్తి
హ్రుదయే తుమి మా భక్తి
తోమారయి ప్రతిమా జడి మందిరే ||

త్వం _హి_ దుర్గా దశప్రహరణ-ధరిణీం
కమలా కమల-దళ-విహారిణీం
వాణీ విద్యాదాయినీ నమామి త్వాం
నమామి కమలాం అమలాం అతులాం
సుజలాం సుఫలాం మాతరం
వందే మాతరం |

శ్యామలాం సరళాం సుస్మితాం భూషితాం
ధరణీం భరణీం మాతరం ||