ఎంసెట్ EAMCET 2012 ఫలితాల గణాంకాలు విశ్లేషణ

ఈ మద్య కులాల సంఘాలు  తమ కులంలో ప్రతిభా వంతులను సన్మానించటం పెరిగి పోయినది అది ఒకఅందుకు మంచిదే ఆయా వర్గ విద్యార్ధులకు మంచి స్పూర్తి నిస్తుంది ,   నేను అనుకొంటూ ఉండేవాడిని   అందరికి సమాన మయిన శక్తి సామర్ద్యాలు వుంటాయి సమాన అవకాశాలు కనిపిస్తే ప్రతిభ అందరి సొత్తు  ఒక విద్యార్ధి ప్రతిభకు స్త్రీ , పురుష , సామజిక కులం  అడ్డువస్తుందా రిజర్వేషన్ వలన ప్రయోజనం ఎంతవరకు    రిజర్వేషన్లన్నవి కుల ప్రాతిపదికిన కాకుండా ఆర్థిక పరిస్థితి ఆధారంగా వున్నప్పుడు అందరికీ న్యాయం జరుగుతుందని నా అభిప్రాయం.   ఈ గణాంకాలు చూడండి కొన్ని వర్గాలవారు  ఎందుకు వెనుక బడినారు ? వారికి  ఈ పోటీ పరీక్షల లో అందరూ సమానం గా ప్రతిభ చూపారా   అసలు  రిజర్వేషన్ల ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి? నిర్లక్ష్యానికి గురయిన వారి జీవన ప్రమాణాలు పెంపొందించటం.. కానీ రిజర్వేషన్లు వెనుకబడిన వర్గాలవారిని  ఎక్కువ నష్టం కలిగిస్తున్న విషయం  గ్రహించాలి  , ఎలా చదివినా ఇంజనీరింగ్ సీటు వస్తుందన్న నమ్మకం వుండ కూడదు కదా,  అలాగే ప్రజల్లో చదువు పట్ల  స్పృహను పెంచి కులం పైన ఆధార పడటం తగ్గాలి .అనేక  సంవత్సరాలుగా మనం ఈ  పధకాలూ, వాటిని అమలుపరుస్తున్న పద్ధతులకు  అలవాటు పడి ఒక్క సారిగా  ఏ ప్రవేటు కంపెనీలో చేరి ప్రతిభలో వుద్యోగం లో విజయం సాధించే అవకాశం దూరమవు తోంది కదా !    ఫలితాలు  ఇవ్వనప్పుడు మరి లోపం ఎక్కడ వుందో పునరాలోచన చేసి అవసరమైతే పద్ధతులని మార్చాల్సిన అవసరం లేదా?  వెనుకబడిన వారికి గరిష్ఠ లాభం కలగాలంటే ఏం చెయ్యాలి? ప్రతిభను పెంపొందిచుకునే అవకాశాలను కల్పించాలి అవి వారికి వారే కల్పిచుకోవాలి  …  ఫలితాలు ఇలా వుంటే  ప్రతిభ ఆధారంగా సీటు దొరికే కాలేజీలలో  వర్గ తారతమ్యాలు ఏర్పడవా ? 

Image