నేను సైతం -బ్లాగుల్లో వన భోజనాలు

బ్లాగ్బొజనాలు తిన్నవారికి, చేసినవారికి అభినందనలు అందరు అన్ని చేశారు. తాంబూలం తినేముందు నా వంతుగా  –

ఫింగర్ బొల్

 

కొంచెం గొరువెచ్హగా ఉన్నాయి , జాగ్రత్త … ఇంకా ఎమన్నా టిప్పులు ఇవ్వదలచుకొంటే మెహమాటపడకండి.  మీ టిప్  మీకు నచ్హిన చెఫ్ తో పంచుకోనే భాద్యత నాది !

ఈ దీపావళి వెలుగులు మీ జీవితంలో సరికొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తూ

చిన్నప్పుడు మతాబులు ,చిచ్చుబుడ్లు ,జువ్వలు సిన్సిద్రిలు ఎంచక్కా తయారు చేసుకొని దీపావళికి కాల్చు కొనేవాళ్ళం .. ఇప్పుడు తయారు చేస్తే పోలీసోళ్ళు పట్టుకు వెళతారేమో :(. నిన్న ఒక కొట్టువాడిని తాటాకు టపాకాయలు అడిగితె ఇప్పుడు జనాలు అంతా ఫ్యాన్సీ ఐటెంలు కాలుస్తున్నారని చెప్పాడు . సిసింద్రిలు, తాటాకు టపాకాయలు చేత్తో కాలిస్తే ఆ మజాయే వేరు .. ఈ ఫ్యాన్సీ ఐటెం లు వందలు పెట్టి కొంటె ఒక నిమిషం కాల్తాయి ! ఏదో గొప్పకోసం కాని కాల్చి న తృప్తిఉండదు .. ఈ మద్య ఏదో కాలుష్యం పేరుమీద జనాలు టపాసులకు దూరంగా ఉంటున్నారు ఇదో చోద్యం !

 

కొన్ని సుద్దులు  Consolidated  –

౧) టపాకాయలను లెసైన్సు ఉన్న షాపుల్లోనే మాత్రమే కొంటే మంచిది.
౨) చిచ్చు బుడ్డి వంటి వాటిని దూరం నుంచి వెలిగించడం కోసం పెద్ద కడ్డీని వాడడం మంచిది
౩) కొత్త మోడళ్లను కొన్నప్పుడు, బాక్స్ మీద ఇచ్చిన సూచనల ప్రకారం కాల్చాలి
౪) పెద్ద శబ్దం వచ్చే బాంబులను కొనకూడదు. అవి పిల్లల చెవులకు హాని చేస్తాయి
౫) రాకెట్ల వంటి వాటిని కొనేటప్పుడుపెట్రోల్ బంకులు, గడ్డివాములును గమనించుకోవాలి
౭) ఇంటికి తెచ్చిన టపాకాయలను స్టవ్, హీటర్ వంటి  వాటికి దగ్గరగా ఉంచకూడదు
౮) మీరు మీ టపాసులను పొడి ప్రదేశంలో పిల్లలకు, జంతువులకు, మంట, వేడిని కలిగించే వస్తువులకు దూరంగా భద్రపరుచుకోవాలి. వాటిని పేల్చేటప్పుడు మాత్రమే బయటికి తీయాలి. వాటిని దారిలోగానీ, మెట్ల దగ్గర గానీ ఉంచొద్దు.
౯) పెంపుడు జంతువులకు పెద్ద శబ్దాలన్నా, మెరుపులన్నా భయం. టపాసులు కాలుస్తుంటే వెలుగులు చూసినా, పెద్ద పెద్ద శబ్దాలు విన్నా అవి బెదురుతాయి. అందుకని టపాసులు కాల్చేటప్పుడు వాటిని ఇంట్లోనే ఉంచి ఆ శబ్దాలు వినపడకుండా అన్ని తలుపులూ, కర్టెన్లూ వేయాలి.
౧౦) ఒకసారి కాల్చినవి పేలకపోతే మళ్లీ వాటిని పేల్చడానికి ప్రయత్నించకండి. చిన్నపిల్లల చేతులకు టపాసులు ఇవ్వకండి. ఎదుటి వారి మీద ఎప్పుడూ టపాసులు వేయొద్దు. అది నేరం కూడా.
౧౧) టపాసులను జేబుల్లో పెట్టుకోవద్దు. గాజు, లోహపు పాత్రల్లో టపాసులను కాల్చవద్దు. సొంతగా దీపావళి బాంబులను తయారు చేయొద్దు.
౧౨) పాకాయలు కాల్చేటప్పుడు వేలాడే, వదులుగా ఉండే దుస్తులు వేసుకోకూడదు. అవి త్వరగా మంటను అందుకుంటాయి. వంటికి అతుక్కుని ఉండే కాటన్‌ బట్టలు వేసుకోవాలి. పొరపాటున మంట అంటుకుంటే భయంతో పరిగెడతాం. కాని అలా చేయకూడదు. అక్కడే ఆగి మంటలు చల్లారిపోవడానికి నేలపై అటు ఇటు డొల్లాలి.
౧౩) కొన్ని టపాసులకు నిప్పు అంటించినప్పుడు పేలదు. అలాగని దానికి ఉన్న నిప్పు చల్లారిందని అనుకోలేం. నిప్పు ఉందో లేదోనని వంగి చూడకూడదు. లేదా చేతితో పట్టుకోవద్దు. అవి అకస్మాత్తుగా పేలే ప్రమాదముంది. చిన్నపిల్లలను అసలు వాటి దగ్గరికి పోనివ్వకూడదు. పొరపాటున కూడా వాటిని మంటల్లోకి విసరకూడదు. అలాంటి వాటి మీద నీళ్లు పోయాలి.

౧౪) . రకరకాల బాంబులు పేలుస్తున్నప్పుడు వాటి మీదున్న జాగ్రత్తలను చదవాలి. రాకెట్‌ను రాకెట్‌ లాంచర్‌నుపయోగించే కాల్చాలి. సీసాలతో కాల్చకూడదు. చేతులకు గ్లౌజులను వేసుకుని, చేతులను దూరంగా ఉంచి కాకరపూలను కాల్చాలి. అవి కాలడం పూర్తయిన వెంటనే ఇనుప చువ్వలను నీళ్లలో ముంచాలి. ఐదు సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు వాటిని చేతికి ఇవ్వొద్దు.

౧౫)  మద్యం సేవించి టపాసులు కాల్చొద్దు. అది తీసుకున్నప్పుడు వాటికి దూరంగా ఉండడం మంచిది.

౧౬) పిల్లలు చేతిలో బాంబులు అసలు పేల్చొద్దు. ఒక్కోసారి కాకరపూలు కూడా పేలే ప్రమాదముంది. కాబట్టి పిల్లలకు ముందుగా ప్రమాదాల గురించి చెప్పాలి.

౧౭) .పెద్దగా గాలి వీస్తున్నప్పుడు టపాసులు పేల్చకపోవడమే క్షేమం. టపాసులు కాలుస్తున్నప్పుడు అనవసరమైన రిస్కులు తీసుకోకపోవడం మంచిది.

౧౮) . త్వరగా అంటుకునే చెక్కలు, గుడ్డలు, పేపర్లు దీపాలకు దూరంగా ఉండేటట్టు జాగ్రత్తపడాలి. ఎలక్ట్రిక్‌ దీపాలను లోహాలతో చేసిన పోల్స్‌పై పెట్టకూడదు. కరెంటు షార్టుసర్క్యూటై పోల్‌ పట్టుకున్న వారికి షాక్‌ ప్రమాదముంది.

౧౯)  బాణా సంచాను ఆరుబయట ఖాళీ ప్రదేశంలోనే కాల్చాలి.

 

౨౦) టపాసులు కాల్చేటప్పుడు చేతులను కళ్లలో, ముక్కులో, నోట్లో పెట్టుకోకూడదు.

౨౧) ఒకే సారి రెండు మూడు టపాసులు పేల్చొద్దు. ఒదాని తరువాత ఒకటి కాల్చాలి.

౨౨)  చూసేవారు సురక్షిత దూరం నుంచి చూడాలి.

౨౩) టపాకాయలు పేల్చేటప్పుడు పొడవాటి కొవ్వొత్తులను ఉపయోగించాలి.

౨౪) మంట వచ్చిన వెంటనే ఆర్పేయడానికి రెండు మూడు బకెట్ల నీరు అందుబాటులో ఉంచుకోండి.

౨౫)  ఎవరికైనా మంట అంటుకుంటే బట్టలు తీసి, శుభ్రమైన దుప్పట్లతో కప్పాలి. వెంటనే నిపుణుడి దగ్గరికి తీసుకెళ్లాలి.

౨౬)ఒక వేళ కళ్లలో నిప్పు రవ్వలు పడితే నీళ్లతో కడుక్కుని ఆసుపత్రికి వెళ్లాలి.

౨౭) తప్పని సరిగా చెప్పులు వేసుకోవాలి.

౨౮)  పిల్లలు టపాసులు కాల్చేటప్పుడు పెద్దలు వెంట ఉండాలి.

౨౯)  మొత్తం టపాసులన్నీ బయటికి తీసుకొచ్చి కాల్చకూడదు. పొరపాటున అందులో నిప్పురవ్వలు పడితే చాలా ప్రమాదం. అందుకే వీటిని ఇంట్లోనే సురక్షిత ప్రదేశంలో పెట్టి ఎప్పటికప్పుడు తెచ్చుకోవాలి.

౩౦)  పండుగ రోజు బయటి దండేల మీద బట్టలు లేకుండా చూసుకోవాలి.

౩౧)  టపాసులు కాల్చడం అయ్యాక సబ్బుతో శుభ్రంగా చేతులు కడుక్కోవాలి. ఆ తర్వాతే భోజనంచేయాలి.

౩౨) టపాకాయలను పేల్చేటప్పుడు వాటికి కనీసం 25 అడుగుల దూరంలో ఉండేలా చూసుకోవాలి. సరిగా పేలని టపాకాయల్ని మళ్లీ మళ్లీ పేల్చేందుకు ప్రయత్నించకూడదు. వీటిని పక్కకి తీసి పారవేసే సమయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి.

౩౩)  ఒకే సమయంలో రెండు లేదా అంతకంటే ఎక్కువ టపాకాయల్ని పేల్చేందుకు ప్రయత్నించరాదు. టపాకాయకు నిప్పు అంటించిన వెంటనే దానికి దూరంగా వెళ్లిపోవాలి. టపాకాయను పేల్చేందుకు వీలుగా కొసను తొలగించేటప్పుడు కూడా అప్రమత్తంగా వ్యవహరించాలి.

౩౪)  ఇంట్లో శంకు, భూచక్రాలను కాల్చేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇవి కొన్ని సందర్భాల్లో పేలిపోతుంటాయి కాబట్టి జాగ్రత్త తీసుకోవాలి. టపాకాయల్ని కాల్చేందుకు పొడవాటి కడ్డీలు (అగర్‌బత్తీలు) ఉపయోగించాలి. కాల్చాల్సిన టపాకాయలను చొక్కా, ఫ్యాంటు జేబుల్లో ఉంచుకోరాదు.

౩౫) పెద్దలు, తల్లిదండ్రులు చిన్నపిల్లలు మాత్రమే కాల్చగలిగే టపాకాయలను మాత్రమే కొనివ్వాలి. అలాగే ధర తక్కువగా ఉండే టపాకాయలను కొనివ్వకపోవటం ఉత్తమం. ఇక కొత్తరకాల బాణసంచాను కాల్చేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలను పిల్లలు తూ.చ. తప్పకుండా పాటించేలా పెద్దలు చేయాలి. పిల్లలు టపాకాయలు కాలుస్తున్నప్పుడు పక్కనే ఓ బక్కెట్ నిండా నీటిని ఉంచటం మరిచిపోకూడదు.

౩౬)  చిన్న పిల్లలు చేతుల్లో టపాకాయలను ఉంచి, వాటికి నిప్పంటించి గాల్లోకి విసిరేందుకు ప్రయత్నించకూడదు. ఒకవేళ వారు అలాంటివి చేస్తున్నది గమనిస్తే పెద్దలు హెచ్చరించి, అలా చేయకుండా చూడాలి. టపాకాయలను పేల్చే పిల్లల్ని జాగ్రత్తగా గమనిస్తుండాలి. ఐదేళ్ళలోపు పిల్లల్ని బాణసంచాకు దూరంగా ఉంచటం మరింత మంచిది.

 

౩౭) ముఖ్యంగా.. మతాబులు, చిచ్చుబుడ్లు, వంటి టపాకాయలు కాల్చేపుడు ఎగిసిపడే నిప్పు రవ్వలు కంటిలో పడకుండా శ్రద్ధ వహించాలి.

౩౮) మతాబులు వెలుగును ఎక్కువసేపు కంటితో చూడటం మంచిది కాదు. అలాంటప్పుడు నళ్ల కళ్లజోళ్లను వాడండి. కానీ బాణా సంచా కాల్చడానికి ముందు నళ్ల కళ్లజోళ్లు వాడటం మంచిది కాదు.

౩౯) పేలని టపాకాయలే కదా ఏంచేస్తాయిలే అని.. చిచ్చుబుడ్లు వంటి వాటిని.. చేతితో కాల్చి ప్రమాదాలు తెచ్చుకోకండి. ఇలాంటివి ఒక్కోసారి పేలే ప్రమాదం ఉంది.

౪౦) ప్రమాద వశాత్తు.. టపాకాయలు పేలి శరీరంపై గాయలయినా.. లేదా రేణువులు కంటిలో పడినా వెంటనే ప్రధమ చికిత్స చేసి దగ్గర్లోని వైద్యునిపుణులను సంప్రదించాలి.

౪౧) బాణాసంచా కాల్చేముందు పాత కాటన్‌ వస్త్రాలను మాత్రమే ధరించండి. సిల్క్ దుస్తులు వంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ ధరించకండి.

౪౨) ఒకవేళ వస్త్రాలకు నిప్పు అంటుకుంటే పరుగుపెట్టకుండా నేలపై దొర్లి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించండి.

౪౩) బాణాసంచా కాల్చేముందు పెద్దలు, యువత మద్యానికి దూరంగా ఉండాలి. మద్యం మత్తులో ప్రమాదాలు ఎక్కుగా జరగడానికి ఆస్కారం ఉంది.

౪౪)టపాకాయాలు కాల్చే ప్రాంతంలో వెంటనే తగులబడే వస్తువులు ఏవైనా ఉంటే వాటిని దూరంగా ఉంచండి. గాలి ఎక్కువగా వీస్తుంటే.. బాణాసంచా కాల్చకండి.

౪౫) ఎక్కువ శబ్దం వచ్చే బాంబులు పేల్చే సమయంలో వచ్చే శబ్దం ఇంట్లోని చిన్న పిల్లలు, వృద్దులపై ప్రభావం చూపుతుంది. కాబట్టి వీలైనంత వరకూ ధ్వని కాలుష్యాన్ని నివారించండి.

౪౬) పేలని టపాకాయలను అలానే వదిలివేయండి. వాటిని ముట్టుకోవడం, విప్పి చూడటం వంటి చేయడం అత్యంత ప్రమాదకరం.

౪౭) చివరగా.. బాణాసంచాలో ఉండే సల్ఫర్ పర్యావరణానికి హాని కలిగిస్తుంది. కాబట్టి ఎక్కువ మోతాదులో టపాకాయలు కాల్చి పర్యవరణానికి హాని తలపెట్టుకండి.

ఈ దీపావళి మీ అందరికీ సిరిసంపదలను తేవాలని, మీ జీవితం ఆనందమయం కావాలని, ఈ దీపావళి వెలుగులు మీ జీవితంలో సరికొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తూ…