సమయం : ఉదయం 7:30
(ఇంకా మగత నిద్రగావున్నది)
ట్రింగ్గ్ ట్రింగ్గ్! ట్రింగ్గ్ ట్రింగ్గ్ !!
1: హలో కశ్యప్ గారేనా,
2:హా, చెప్పండి
1:నమస్కారమండి మీకు పెళ్ళి అయినదా
2:లేదండీ , ఎందుకు ?, ఏవరు మీరు ??
1: సార్ నేను ఫలానా క్లబ్బ్ నుండి మాట్లాడుతున్నాను మీకు లక్కి డ్రాలో బహుమతి వచ్చి నాది ,కాని దీనిని తీసుకోవటానికి కి కపుల్స్ మాత్రమే రావాలి ….
మీ అమ్మనాన్న ,అన్నవదినా లేదా మీరు ఎవరితో నన్నా వచ్చినా పరవా లేదు .
— చివరికి వెళ్ళితే అక్కడ చాలా మంది బాదితులు రెండు గంటలపాటు వాడు చెప్పినది విని చివరికి ఒక చిన్న ప్లాస్టీకు పాత్ర తో వెను తిరిగాను .. పాపం నా తోపాటు వచ్చిన నా సహోద్యోగిని 😦
సమయం : ఉదయం 9:30
(అమీరుపేటలో ఘోరమయిన ట్రాఫిక్క్ నిస్సహాయ స్తితి లో )
ట్రింగ్గ్ ట్రింగ్గ్! ట్రింగ్గ్ ట్రింగ్గ్ !!
1:Haloo is this Kasyap?
2: ya this is kasyap tell me
1: you are selected as preferable user of City Cards ,congratulations
2: oh thanks its means what?
1:now you are eligible for cash Loan Rs:1,00,000
2:oh that’s nice
1:do you want DD or check deposited in your account
2: no sir, at the moment I am not looking for Loan thanks for your call byebye
వీళ్ళకి మన DOB ,personal details చెప్పి మూడు సార్లు “ఊ !” కొడితేచాలు అ డబ్బులు తిరిగి చెల్లించలేక నానా అవస్తలు పడాలి , చిన్నప్పు విన్న గడ్డీ,బెల్లము,మెరపకాయ ,గాడిద కదలో వరసగా “ఊ” కోట్టే దాని కన్నా చాలా ప్రమాదము ….
మొన్న ఒక హిందీ సినిమలో విలన్న్ కు పదే పదే కాల్స్ వస్తూవుంటాయి (వాడు పోలీసులకి కూడాతెలవని మొబైలు నంబరు వీళ్ళకు ఎలాతెలునునన్ని తెగ హాచ్చర్య పడతాడు , any way he took his action in his own style ), కానీ ఒక సమయము సందర్బము లేకుండా ఇలాంటి కాల్స్ రోజూ బోలేడు వస్తుంటాయి ఒక్కొసారి నిగ్రహం కోల్పోయి మాట్లాడుతుంటాను … అయినా తప్పుదు కాల్స్ వస్తునే ఉంటాయి నా మోబైలు నెంబరు మార్చ కుండా దీనిని అడ్డుకోను మార్గము లేదా , ఆ సినిమా లో విలన్న్ లా నాకు అంగబలము, అర్ద బలము రెండూ లేవు, నా చెవులు ఇలా ర్మింగు మని మారుమోగవలసినదేనా.. 😦