భారత పౌరసత్వం

== భారత పౌరసత్వం పార్ట్ 1 ==

ఇప్పుడు దేశం మొత్తం మీద జరుగుతున్న చర్చ ఒకటే అంశం మీద అదే CAB and NRC.. ఎంతలా అంటే దేశం మొత్తం ప్రజలు, ప్రతిపక్షాలు రెండుగా విడిపోయి ముస్లిం vs హిందూగా మార్చి అల్లకల్లోలం రేపుతున్నారు.. అసలు పౌరసత్వ చట్టానికి సవరణ ఎందుకు తీసుకు రావలసి వచ్చింది అనే తెలుసుకునె ముందు విదేశీయులకు భారత పౌరసత్వం ఎలా ఇస్తారు తెలుసుకోవడం అవసరం..

ప్రపంచంలోని ప్రతిదేశం ఆ దేశ పౌరసత్వం ఎలా ఇవ్వాలి అనే దానిపై చట్టాలు రూపొందించుకుని ఆయా చట్టాల లోని నియమ నిబంధనల ప్రకారమే పౌరసత్వం కల్పిస్తాయి. భారతదేశం మొట్ట మొదటిసారి Indian Citizenship Act, 1955 అని పౌరసత్వ చట్టాన్ని 1955లో ఆమోదించింది.. దీనికి గతంలో 1986, 1992, 2003, 2005, 2015 లో సవరణలు చేశారు ఇప్పుడు తాజాగా 2019లో మరి ఒకసారి Citizenship Amendment Bill, 2019 పేరుతో తాజా సవరణ చేశారు.

భారత పౌరసత్వ చట్టం ప్రకారం నవంబర్ 26, 1949 నాటికి భారతదేశంలో నివాసం ఉంటున్న వ్యక్తి ఆటోమాటిక్ గా భారత పౌరుడు అవుతాడు.

భారత జాతీయతా చట్టం ముఖ్యంగా citizenship by right of birth within the territory బదులుగా citizenship by right of blood ను అనుసరిస్తుంది..

పుట్టుకతో పౌరసత్వం:

జనవరి 26, 1950 నుండి జూలై 1, 1987 మధ్యలో భారతదేశంలో జన్మించిన వ్యక్తులు, తల్లిదండ్రులలో కనీసం ఒకరు భారత పౌరులు అయి ఉండి జూలై 1, 1987 నుండి డిసెంబర్ 3, 2004 మధ్యలో జన్మించిన వ్యక్తులు, డిసెంబర్ 3, 2004 తరువాత భారత్ లో జన్మించిన వ్యక్తుల తల్లిదండ్రులు ఇద్దరు ఖచ్చితంగా భారత పౌరులు అయి ఉన్న వ్యక్తులకు జన్మతః భారత పౌరులు అవుతారు..

భారత సంతతికి పౌరసత్వం:

జనవరి 26, 1950 నుండి డిసెంబర్ 10, 1992 మధ్య కాలంలో భారత దేశానికి వెలుపల జన్మించిన వ్యక్తి యొక్క తండ్రి ఆ కాలంలో భారత పౌరసత్వం కలిగి ఉన్నట్లయితే ఆ జన్మించిన సంతానానికి భారత పౌరసత్వం లభిస్తుంది.. డిసెంబర్ 10, 1992 తర్వాత భారతదేశం వెలుపల జన్మించిన వ్యక్తి తల్లిదండ్రులలో ఎవరో ఒకరు భారత పౌరులు అయి ఉన్నట్లయితే కూడా భారత సంతతి కింద పౌరసత్వం లభిస్తుంది.. కాని డిసెంబర్ 3, 2004 తర్వాత భారత్ వెలుపల జన్మించిన వ్యక్తులు పుట్టిన తేదీ నుండి ఒక సంవత్సరం లోపు భారత దౌత్య కార్యాలయంలో నమోదు చేసుకుంటే తప్ప భారత పౌరసత్వం లభించదు. కొన్ని ప్రత్యేక సందర్భాలలో ఒక సంవత్సరం తర్వాత కూడా భారత దౌత్య కార్యాలయంలో పౌరసత్వ నమోదు చేసుకునే అవకాశం ఉంది కానీ ఆ వ్యక్తి మరే ఇతర దేశానికి చెందిన పాస్పోర్ట్ కలిగి లేడు అని తల్లిదండ్రులు ఇద్దరు అఫిడవిట్ సమర్పించాల్సి ఉంటుంది.

నమోదు ద్వారా పౌరసత్వం:

భారత పౌరసత్వ చట్టం, 1955 లోని సెక్షన్ 5 కింద కేంద్ర ప్రభుత్వం వద్ద భారత పౌరసత్వం కోసం, ఒక వ్యక్తి ఈ క్రింది వర్గాలలో దేనికైనా చెంది ఉంటే నమోదు చేసుకోవచ్చు (అక్రమ వలసదారుడు కాని వారు మాత్రమే)

భారతీయ మూలాలు కలిగి గత ఏడు సంవత్సరాలుగా భారత దేశంలో నివాసం ఉంటున్న వ్యక్తి సెక్షన్ 5(1) ప్రకారం పౌరసత్వ నమోదుకు దరఖాస్తు చేసుకోవచ్చు..(దరఖాస్తుకు ముందు తప్పనిసరిగా 12 నెలల కాలం నిరవధికంగా, గత ఏనిమిది సంవత్సరాల కాలంలో ఆరు సంవత్సరాలు భారతదేశంలో నివాసం ఉండాలి)

భారత సంతతికి చెంది, అవిభక్త భారతదేశం వెలుపల ఏ దేశంలో లేదా ప్రదేశంలో నివసిస్తున్న వ్యక్తి.

భారత పౌరుడిని వివాహం చేసుకుని భారత పౌరసత్వ నమోదు కోసం దరఖాస్తు చేయడానికి ముందు ఏడు సంవత్సరాలు సాధారణంగా భారతదేశంలో నివసిస్తున్న వ్యక్తి

తల్లిదండ్రులలో కనీసం ఒకరు భారత పౌరులు అయి, గతంలో భారత పౌరసత్వం కలిగివుండిన వ్యక్తి గత సంవత్సర కాలంగా భారత దేశంలో నివాసం ఉంటున్న వ్యక్తి.

ఐదేళ్లపాటు భారతదేశపు విదేశీ పౌరుడిగా నమోదు చేసుకుని, భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేయడానికి ముందు ఒక సంవత్సరం భారతదేశంలో నివసిస్తున్న వ్యక్తి. అలాగే భారత పౌరసత్వం కోసం నమోదు చేసుకున్న వారి సంతానం కూడా భారత పౌరసత్వం నమోదు చేసుకోవడం ద్వారా పొందవచ్చు.

సహజత్వం ద్వారా పౌరసత్వం:

గత 12 సంవత్సరాలుగా భారతదేశంలో సాధారణంగా నివసిస్తున్న ఒక విదేశీయుడు సహజత్వం ద్వారా భారత పౌరసత్వం పొందడానికి అర్హుడు అవుతాడు. ఇందులో దరఖాస్తు తేదీకి ముందు 12 నెలల కాలం మరియు ఆ 12 నెలల ముందు 14 సంవత్సరాల వ్యవధిలో 11 సంవత్సరాలు భారతదేశంలో నివాసం ఉండాలి. ఇవన్నీ కూడా భారత పౌరసత్వ చట్టం, 1955 లోని సెక్షన్ 6(1)కు లోబడి ఉంటాయి.

భారత పౌరసత్వం కొరకు పై నిబంధనలు ఇప్పటివరకు ఉన్నవి.. ఇప్పుడు ఈ చట్టంలోని సహజత్వం ద్వారా పౌరసత్వం అనే నిబంధనకు సవరణ కొరకు తీసుకు వచ్చిన బిల్లే CAB ఇంత గొడవకు కారణం.. ఈ బిల్లు ఆల్రెడీ పార్లమెంట్ ఉభయసభల్లో పాసై రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు గనుక ఇక మీదట దీనిని CAA (Citizenship Amendment Act, 2019) గా పిలుద్ధాం.

భారతదేశానికి పొరుగు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ దేశాలలో మైనారిటీలు అనే కారణంతో మతపరమైన దాడులు, హింస ఎదుర్కుని భారతదేశానికి వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు మరియు క్రైస్తవులకు భారత పౌరసత్వం ఇవ్వడానికి ఉద్దేశించి చేసినదే ఈ పౌరసత్వ సవరణ చట్టం, 2019.

పౌరసత్వ సవరణ చట్టం, 2019 ముఖ్యంగా వీరికి రెండు వెసులుబాట్లు ఇచ్చింది. అవేమిటంటే..

1) సరిఅయిన పత్రాలు లేకుండా భారతదేశానికి వచ్చి, నిర్ధారిత సమయం తర్వాత కూడా ఇక్కడే తలదాచుకున్న వారందరినీ పౌరసత్వ చట్టం, 1955 ప్రకారం అక్రమ వలసదారులుగా (illegal immigrants) గా గుర్తించే వారు. ఇప్పుడు వారిని అలా గుర్తించరు..

2) సహజత్వం ద్వారా పౌరసత్వం పొందడానికి ఒక విదేశీయుడు గతంలో 11 సంవత్సరాలు భారతదేశంలో నివాసం ఉండాలి అనే నిబంధనను 5 సంవత్సరాలు ఉంటే సరిపోతుంది అని సడలించింది.
అందుకే డిసెంబర్ 31, 2014 న లేదా అంతకు ముందు భారతదేశం లోకి ప్రవేశించిన వారికి మాత్రమే వర్తిస్తుంది అనే నిబంధన చేర్చడం జరిగింది.
ఆ తేదీ తర్వాత వచ్చిన వారు మతానికి సంబంధం లేకుండా అక్రమ వలసదారులుగానే గుర్తించబడతారు..

మరి ఇలా వచ్చినవారు ఏన్నో లక్షల మంది ఉన్నారు అని భ్రమ పడవద్దు.. ఈ చట్టంలో పేర్కొన్న పాక్, బంగ్లాదేశ్, ఆఫ్గనిస్తాన్ దేశాల నుండి డిసెంబర్ 31, 2014 లోపు భారతదేశానికి వచ్చిన వారి సంఖ్య కేంద్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం 31,313 మంది మాత్రమేనని అంచనా.. ఇందులో హిందువులు 25,447 మంది, సిక్కులు 5807 మంది, క్రైస్తవులు 56 మంది కాగా, బౌద్ధులు, పార్సీ లు ఇద్దరు చొప్పున ఉన్నారు.

ఈ పౌరసత్వ సవరణ చట్టంలో ముస్లింలను చేర్చకపోవడం ఇంత వివాదానికి కారణం. అసలు ఈ సవరణ చట్టం తెచ్చింది ఆ మూడు దేశాలలో మెజారిటీ మతం అయిన ముస్లింల నుండి మత పరమైన వివక్ష, హింస ఎదుర్కొన్న మైనారిటీలను ఆదుకోవడానికి అయితే ముస్లింలకు ఎలా చోటు కల్పిస్తారు? అందువల్ల ఆయా దేశాల ముస్లింలు ఈ చట్టంలో మినహాయించబడ్డారు. ఒకవేళ ముస్లింలను కూడా చేర్చే పక్షంలో ఈ సవరణ చట్టమే అవసరం లేదు.

మరొక ముఖ్య విషయం ఏమిటంటే ఈ సవరణ బిల్లు పౌరసత్వ చట్టం, 1955 లోని సెక్షన్ 6 లో గల సహజత్వం ద్వారా పౌరసత్వంను మాత్రమే సవరించింది.. సెక్షన్ 6A ని కాదు.. ఈ సెక్షన్ 6A జనవరి 1, 1966 నుండి మార్చి 25, 1971 వరకు అస్సాం రాష్ట్రంలో ప్రవేశించిన అక్రమ వలసదారుల ను డీల్ చేస్తుంది.. సరిగ్గా చెప్పాలంటే ఇండో – చైనా యుధ్ధం ముగిసిన సమయం నుండి బంగ్లాదేశ్ విమోచన యుధ్ధం మొదలయ్యే సమయం వరకు.
కనుక అస్సామ్ రాష్ట్రాల ప్రజలు ఈ చట్టం గురించి భయపడటం అనవసరం. ఇది కేవలం అపోహల వల్ల లేదా కొంత మంది కావాలని సృష్టించినది కావచ్చు.

కొందరు మేధావులు ఈ పౌరసత్వ సవరణ చట్టం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం.. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15, 21 లను ఉల్లఘిస్తుంది అని అంటున్నారు..

సరే ఆర్టికల్ 14 ఏమంటుందంటే.. “The State shall not deny to any person equality before the law or the equal protection of the laws within the territory of India.” అంటే ఏ వ్యక్తికైనా చట్టం ముందు సమానత్వం లేదా భారత భూభాగంలో చట్టాల సమాన రక్షణను కల్పించడంలో రాజ్యం యెటువంటి వివక్షా చూపకూడదు.

అయితే ఇక్కడ పౌరసత్వ సవరణ చట్టం మూడు దేశాలలో మతపరమైన హింసను ఎదుర్కొన్న మైనారిటీలకు సహజత్వం ద్వారా పౌరసత్వం ఇవ్వాలని ఉద్దేశించినది.. దీని అర్థం ఇతరులకు ఈ పద్దతి ద్వారా పౌరసత్వం ఇవ్వరు అని కాదు.. ఇతరులు సహజత్వం ద్వారా పౌరసత్వం పొందాలి అనుకుంటే ఆ యొక్క సెక్షన్ నియమాలు అనుసరించి పొందవచ్చు.. అందువల్ల ఇది ఆర్టికల్ 14 ఉల్లంఘించడం లేదు అని చెప్పవచ్చు.

రాజ్యాంగం లోని ఆర్టికల్ 15 ప్రకారం ఒక వ్యక్తి పై అతని మతం, జాతీ, కులం, లింగం మరియు ప్రాంతం ఆధారంగా యెటువంటి వివక్షా చూపరాదు. Prohibits discrimination of Indians on basis of religion, race, caste, sex or place of birth.

నాకు తెలిసినంత వరకు ఇది భారతీయ పౌరులకు మాత్రమే వర్తిస్తుంది. ఇతర దేశాల ప్రజలకు కాదు. సహజత్వం ద్వారా పౌరసత్వం పొందిన తర్వాత ఒక వ్యక్తి భారతీయ పౌరుడుగా మారుతాడు.. అంతకు ముందు కాదు.. అందువల్ల ఆర్టికల్ ఉల్లంఘన ప్రశ్నే తలెత్తదు.

ఆర్టికల్ 21 ఏమంటుంది అంటే “No person shall be deprived of his life or personal liberty except according to a procedure established by law.” అంటే చట్టం ద్వారా ఏర్పాటు చేయబడిన ఒక విధానం ప్రకారం తప్ప ఏ వ్యక్తి అయినా తన జీవితం లేదా వ్యక్తిగత స్వేచ్ఛను కోల్పోకూడదు.

రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కు,వ్యక్తిగత స్వేచ్ఛ హక్కు అనేది భారతదేశంలో నివసించే వారికి వర్తిస్తుంది కాని భారతదేశంలోకి ప్రవేశించాలి అని అనుకునే వారికి కాదు..

ఇంకా స్పష్టంగా చెప్పాలంటే భారత రాజ్యాంగం భారతీయుల కోసం రాసినది.. విదేశీయుల కోసం వ్రాసింది కాదు.. వాళ్ళు భారత పౌరసత్వం పొందిన తర్వాతనే రాజ్యాంగం కల్పించిన హక్కులను పొందేందుకు అర్హత పొందుతారు.

NRC గురించి నెక్స్ట్ పోస్టులో చర్చిద్దాం..

ఇప్పుడు కొన్ని ప్రశ్నలు సమాధానాలు చూద్దాం.. ____________________________________________
1) CAA మరియు NRC భారతీయ ముస్లింలకు వ్యతిరేకమా?

జ: ఎంత మాత్రం కాదు.. భారతీయ ముస్లింలకు ఈ చట్టానికి యెటువంటి సంబంధం లేదు. ఈ పౌరసత్వ సవరణ చట్టం కేవలం పాక్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ దేశాలలో మతపరమైన హింసను, వివక్షను ఎదుర్కొన్న వారికి భారత పౌరసత్వం ఇచ్చేందుకు తెచ్చిన ఒక ఉపశమన చట్టం అది కూడా ఈ ఒక్కసారికే వర్తిస్తుంది.

2) దేశ విభజన సమయంలో పాకిస్తాన్ ను కాదని భారతదేశాన్ని మాతృభూమి గా ఎంచుకున్న ముస్లింలు ఇప్పుడు ఈ దేశంలో రెండవ శ్రేణి పౌరులా?

జ: దేశ విభజన సమయం నుండి భారతదేశంలో ఉన్న అన్ని కులమతాలకు చెందిన వాళ్ళు భారతదేశ పౌరులే అవుతారు.. కొందరి పౌరసత్వం, ఓటు హక్కు రద్దు చేయబడుతుంది అనేది కేవలం అపోహ మాత్రమే.

3) పాకిస్తాన్ లో ఉన్న ఆహ్మదీయులు, షియాలను ఈ జాబితాలో ఎందుకు చేర్చలేదు?

జ: వారు అక్కడ హింస లేదా వివక్ష ఎదుర్కొంటే అది మతపరమైనది కాదు.. అందుకు ఇతర కారణాలు ఉండవచ్చు. ఎందుకంటే ఆహ్మదీయులు, షియాలు ఇస్లాం లో ఒక భాగమే తప్ప వేరు కాదు

4) మత ప్రాతిపదికన పౌరసత్వం ఇవ్వడం ఏమిటి?

జ: ఇక్కడ పౌరసత్వం మతప్రాతిపదికన ఇవ్వడం లేదు.. మతం పేరిట వేధింపులకు గురై ప్రాణభయంతో వచ్చినవారికి పౌరసత్వం ఇస్తున్నారు.. రెండింటికి తేడా ఉంది.

5) మరి శ్రీలంక నుండి శరణార్థులుగా వచ్చిన తమిళులను ఇందులో ఎందుకు చేర్చలేదు?

జ: శ్రీలంక నుండి తమిళ శరణార్ధులు వచ్చిన కారణం అక్కడ జరిగిన సింహళ-తమిళ జాతుల మధ్య జరిగిన పోరాటం వల్లనే కానీ అక్కడ హిందువుల మధ్య బౌధ్ధుల మధ్య జరిగిన హింస కాదు. శ్రీలంక నుండి శరణార్ధులుగా వచ్చిన తమిళులకు భారతీయ పౌరసత్వం ఇవ్వడానికీ ఈ సవరణ చట్టానికి సంబంధం లేదు. వాళ్ళు భారత పౌరసత్వం కోసం Indian Citizenship Act, 1955 సెక్షన్ 5 ప్రకారం దరఖాస్తు చేసుకుంటే నిబంధనల ప్రకారం వారికి పౌరసత్వం ఇస్తారు. ఇది అన్ని మతాల వారికి, జాతుల వారికి వర్తిస్తుంది. పాకిస్థాన్ నుండి వలస వచ్చే ముస్లిమ్స్ కూడా సెక్షన్ 5 క్రింద పౌరసత్వానికి నమోదు చేసుకోవచ్చు.

చివరిగా నా మాట..

అక్రమవలసదారుల పట్ల మన దేశానికి ఒక నిర్ధిష్టమైన విధానం ఎంతో అవసరం. మనకంటే చిన్న చిన్న దేశాలకు స్పష్టమైన విధానం, వైఖరి ఉన్నాయి.
మీరు అక్రమంగా ఇతర దేశాలలో ప్రవేశించి స్వేచ్చగా తిరగగలరా ఊహించండి.. భారతీయులను ఆకర్షిస్తున్న అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలు వలసదారుల విద్యా, ఉద్యోగ అనుభవం, ఆంగ్ల భాషా నైపుణ్యం, background verification, ఆరోగ్య పరీక్షలు వంటి వాటికి పాయింట్స్ ఇచ్చి ఆయా దేశాలకు వెళ్ళడానికి వీసాలు ఇస్తున్నాయి అని గుర్తుంచుకోండి. మోస్ట్ క్వాలిఫైడ్ పీపుల్ మాత్రమే ఈ దేశాల్లో స్థిర పడడానికి వెళ్తున్నారు.. చదువు సంధ్యా లేని అనామకులు కారు.. చట్టబద్దంగా విదేశాలకు పోతున్న భారతీయుల్ని, చట్ట వ్యతిరేకంగా మనదేశంలోకి చొరబడుతున్న ఇతర దేశీయుల్ని ఒకే గాటన కట్టడం మూర్ఖత్వం..ఇది తెలుసుకోవడానికి పెద్దపెద్ద చదువులు చదవాల్సిన అవసరం కూడా లేదు.. కామన్స్ సెన్స్ చాలు…

✍️ నాగరాజు మున్నూరు FB wall,  credits to original post

Know About Your Income TAX

మనం ముందు జాగ్రత్తతో అడుగులు వేయకపోతే ఫిబ్రవరి 2020 నెలలో మన జీతం ఐటీ కే సరిపోతుంది.నాకు తెలిసినంతవరకు కింది విధంగా మనం ఇన్కమ్ టాక్స్ కట్టవలసి వస్తుంది.
➧ ముఖ్యంగా జీతం (GRASS) మొత్తం ఏడు లక్షల 50 వేల రూపాయలు లోపల ఉండి, సేవింగ్స్ మొత్తము 1,50,000 రూపాయలు ఉంటే ఎటువంటి టాక్స్ పడదు. వీరికి taxable income ఐదు లక్షల లోపు ఉంటుంది కాబట్టి Rs12,500 వరకు రిబేట్ వస్తుంది..
➧ ఫిబ్రవరి 2019 నాటికి ఎవరికైతే బేసిక్ పే Rs40,270 పైన ఉంటే ఇన్కమ్ టాక్స్ కంపల్సరీ కట్టవలెను. వీరికి Net taxable income ఐదు లక్షల పైన ఉంటుంది. కావున టాక్స్ మినహాయింపు( రిబేట్) లేదు. వీరి జీతం(GRASS) మొత్తం Rs7,68,464 అగును. వీరికి టాక్స్ Rs14,260 కట్టవలెను. savings 1,50,000+50,000 standard deduction+ HRA”60,000 తగ్గించిన టాక్స్ ఇన్కమ్ 5,08,464 (aprox) వచ్చును.
——————————–
క్రింది విధంగా టాక్స్ లెక్క కట్టవచ్చును
Up to Rs.250000—-tax- nil

250000-5lakhs—- 5%tax…….12,500

8,464—- 20% tax….1,693

Edu.cess( టాక్స్ పైన)4%….67
Total tax 14260
——————————-
మరి కొన్ని బేసిక్ PAY లు వారి కట్టవలసిన ఇన్కమ్ టాక్స్ వివరాలు( షుమారు)
ఫిబ్రవరి 2019 నాటి BASIC PAY………GRASS …… TAX
➧39,160…7,47,29 – NO TAX

➧40,270…7,68,464 – 14,441

➧41,380…7,75,950 – 15,881

➧42,490…8,18,868 – 24,140

➧43,680…8,41,576 – 28,506

➧46,060…8,87,526 – 37,344

➧47,330…9,11,768 – 42,006

➧48,600…9,36,016 – 46,690

➧49,870…9,60,856 – 51,447

➧53,950…1039394 – 66,552

➧61,450…1183208 – 94,207

➧64,670..1245318 – 106153

➧77,030..1482694 – 169204 tax
————————————-
Net taxable income 5 lakhs లోపు ఉన్నవారికి
రు.12500 tax rebate కలదు.
(ఇంతకు ముందు
.2500 గా ఉండేది)
ఈ financial year లో housing loan తీసుకున్న వారికి మాత్రమే:
ఈ”financial year లో నూతనంగా ఇచ్చిన u/s 80EEA ప్రకారం
Housing loan interest amount ఈ financial year లో 3.5 lakhs వరకు చూయించవచ్చు.
ఇంతకు ముందు housing loan తీసుకున్న వారికి మాత్రం housing loan interest section 24 ప్రకారం
2 lakhs మాత్రమే.
Standard deduction
Rs:50000/-
(ఇంతకు ముందుRs:40000)
Bank వారు fixed deposit etc…. Interest ను
రు.10000/ దాటితే TDS cut చేసేవారు దానిని ఇపుడు
రు.40000 దాటితేనే TDS cut చేస్తారు.
Cps వారికి 80C కింద 150000 పూర్తి అయితే ఇంకా 80CCD(1B) కింద additionalగా Rs.50000 వరకు savings చూయించవచ్చు.*కావున మీ savings ను సరి చూసుకోగలరు.
Tax పడే దానిని బట్టి Advance tax pay చేసుకోగలరు.
ముందుగా మీ దగ్గర లోని CA, లేదా Tax Consultant ను సంప్రదించగలరు

Copied from Whatsapp Forward, Credits to Original Author {unknown}

 

భగవద్గీత ఇంకోక కోణం

ఒకరు భగవద్గీత పై  పెట్టిన పోస్టుపై, ఒక వాట్సాప్ గ్రూపులో స్పందించిన ఒకాయన ఇలా కామెంట్ చేశారు.
” ప్రతిదానికి వంకర వ్యాఖ్యానాలు వద్దు.
ధర్మ రక్షణకు బాంధవ్యాలను కూడ పక్కన పెట్టాలని గీత బోధించింది”
చాలాబాగుంది! గీత గొప్పదనం అదే!! ఒక్కొక్కరికి ఒక్కోలా అర్థమవుతుంది!!!

ఒకరికి అది మనోవైద్య శాస్త్రం,
ఇంకొకరికి ధర్మ రక్షణ శాస్త్రం,
మరొకరికి బిజినెస్ మేనేజ్మెంట్ గ్రంథం.
అక్కడితో ఆగలేదు!
గాంధీకి గీత అహింసని బోధిస్తే, గాడ్సేకి గాంధీని చంపి ధర్మ సంరక్షణ చెయ్యమంది!!
బాలగంగాధర తిలక్ ని ఆంగ్లేయుల మీద పోరాటానికి పురికొల్పింది.
నేడు కొంతమంది కోర్టులో దేవుడి మీద ప్రమాణం చేసి అబద్ధ సాక్ష్యాలు చెప్పేందుకు కూడ ఉపకరిస్తోంది.

ఒక వ్యక్తి మరో వ్యక్తికి హితబోధ చేస్తే అందులోని సారాంశం సూటిగా, అందరికీ ఒకేలా అర్థమయ్యేలా ఉండాలి. భగవద్గీత దీనికి పూర్తి వ్యతిరేకం. దాన్ని చదివిన వారిలో ఒక్కొక్కరికి ఒక్కోలా అది అర్థమవుతోందంటే; అందులో స్పష్టత లోపించిందని అర్థం.

ఇటీవలి కాలంలో గీతను “బిజినెస్ మేనేజ్మెంట్ గ్రంథం” అనేవారి సంఖ్య పెరుగుతోంది. 3 వేల ఏళ్లనాడు ఏ బిజినెస్ లు ఉన్నాయో, ఏ మేనేజ్మెంట్ కోర్సులున్నాయో అలాంటి వాళ్లు చెప్పాలి. అందుకు అనుగుణంగా గీత ఏమి చెప్పిందో కూడా వివరించాలి.

భగవద్గీత ప్రధానంగా కర్మ సిద్ధాంతాన్ని చెప్పింది. దాని ప్రకారం…
” కర్మను ఆచరించే వ్యక్తి ఫలితాన్ని ఆశించకూడదు”
ఇది అర్థం పర్థం లేని బోధ!
సమాజంలో భాగంగా జీవిస్తున్న వ్యక్తి, తన ప్రవర్తనకు తానే జవాబుదారీతనం వహించాలి. ఇది నీతికి, ధర్మానికి, నైతికతకు మూలం. అలాకాదంటే, దేవుడు నడిపించేవాడు, మనిషి నిమిత్తమాత్రుడు అవుతారు. అంటే; నేరాలు, ఘోరాలు, అవినీతికి పాల్పడే వారు సైతం దేవుడు నడిపించడం వల్లనే అలా ప్రవర్తిస్తున్నారని; అందులో వారి తప్పు లేదని భావించాల్సి ఉంటుంది.

ఇంతకూ భారతం ప్రకారం; గీతా బోధన లక్ష్యం కురుక్షేత్ర సంగ్రామం ఎలాగయినా జరగాలని, యుద్ధం ఆగకూడదని కృష్ణుడు భావించడం వల్లనే.
అందుకే వేమన ఇలా అన్నాడు….

పంచమ వేదంబు భారతమ్మనుచు
పొగిడిరేల జనులు బుద్ధిలేక
హింసకార్యంబు తమకిష్టమేలాయెరా?
విశ్వదాభిరామ వినురవేమ!

ఒక్క నిమిషం ఇలా వినండి

ఒక 5 నిమిషాలు…..

అత్యాచారం చెయ్యడానికి మూలాలను కారణాలను ఎంకౌంటర్ చెయ్యకుండా, నిందితుల ఎంకౌంటర్ చెయ్యడం వల్ల యావత్ జాతిని అసలు విషయం నుండి డైవర్ట్ చేశారు, అమాయక జనం కొందరు చప్పట్లు కొట్టారు జనం లో మరి ఇంత అవగాహన రాహిత్యం ఉంది, అనుకోలేదు ఇందులో సంఘంలో పెద్దమనుషులుగా చెలామణీ అయ్యేవారు కూడా ఉన్నారు..

కానీ మూలాల కారణాలు మాత్రమే సమాజం లో సజీవంగా మిగిలి పోతున్నాయి

మూలాల కారణాలు

1,స్త్రీని ఒక బోగ వస్తువుగా ఆట వస్తువు గా మార్చిన మతం, సంస్కృతి పురుష ఆధిపత్యం

2.ప్రభుత్వాలు మద్యపానాన్ని ప్రోత్సహించడం
ఇది ఒక వ్యాపారం అయింది

3.వివేకము విలువలు లేని విద్య , వ్యాపారం అయిన విద్యావ్యవస్థ విద్య నేడు పెద్ద వ్యాపారం

4.సమాజాన్ని తప్పుదారి పట్టిస్తున్న మీడియా విలువలు లేని మీడియా ఇది నేడు ఒక పెద్ద వ్యాపారం అయింది

5.మనస్సును కలుషితం చేసే సీరియల్స్,సినిమాలు

6.మితిమీరిన స్వేచ్ఛా ప్రవృత్తి దీని వల్ల ఎవరు ఏమి చెయ్యలేరు అన్న అహంకారం మనిషిలో పెరిగింది

7.న్యాయ వ్యవస్థను ధనిక అగ్రవర్ణాలకు చుట్టం గా మారుచుకొన్నారు లేదా కొన్నారు ఇది న్యాయం కూడా ఒక వ్యాపారం

8.అశ్లీల వెబ్ సైట్లు ఇది ఒక పెద్ద వ్యాపారం

9.కుటుంబ విలువలు నేర్పించకపోవడం. పేరెంట్స్ పైసలకు ఇచ్చిన ప్రాముఖ్యత పిల్లలకు ఇవ్వడం లేదు పిల్లలకు డబ్బులు మాత్రమే ఇస్తున్నారు..

10 విదేశీ సంస్కృతి విదేశీ వేషధారణ… తరాలు తరబడి మన సంస్కృతి లో మగ్గిన మన మస్తిష్కాలు అకస్మాత్తుగా వచ్చిన ఈ మార్పు మన వారికి జీర్ణం కాక కొన్ని చిట్ల పశువుల వలే ప్రవర్తిస్తున్నారు అందుకే సమాజం కొన్ని ఒడుదొడుకులకు లోనైతుంది.. ఇక్కడ మరాల్సింది మన మస్తిష్కాలు .

11. నీతి నియమాలను విలువలను జాతీయభావం ను హక్కులను విధులను సామాజిక స్పృహ ను బోధించే సామాజిక శాస్త్రాలను ప్రక్కకు పెట్టి సైన్స్ కు మాత్రమే పెద్ద పీట వెయ్యడం

ఇలా ప్రతిది వ్యాపారం అయి అందులో విలువలు నాశనం అయినాయి ఎందుల్లోకి వ్యాపారం ప్రవేశిస్తే అందులో విలువలు పోయి లాభమే ముఖ్యం అవుతుంది..

పెట్టుబడి దారి అర్థక విధానం వస్తు సంస్కృతి ని ప్రోత్సహిస్తుంది వస్తువుల తయారీకి సైన్స్ కావాలి, అందుకే నీతిని బోధించే సామాజిక శాస్త్రాలను సంక నాకించి విలువలను తుంగలో తొక్కి లాభమే అంతిమ దేయంగా వ్యాపారం చేస్తున్న ఈ దేశాలు

సామాజిక స్పృహ దేశం పట్ల బాధ్యత లేని మన లాంటి రెండో తరం దేశంలో ఇది ఇంకా చాలా ప్రమాదం

వీటిని ఎంకౌంటర్ చెయ్యాలి

ఈ ప్రపంచీకరణ యుగం లో వీటిని ఎంకౌంటర్ చేసే దమ్ము ఏ ప్రభుత్వం కు ఏ పార్టీకి ఉంది…

ఒక సారి ఆలోచన చెయ్యండి……

 

About Telugu Brahmins తెలుగు బ్రాహ్మణ మూలాలు

తెలుగు బ్రాహ్మణులు

వింధ్య పర్వతాలకు దక్షిణాన ఉన్న బ్రాహ్మణులలో తెలుగు బ్రాహ్మణులకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. కల్హణుని ‘రాజతరంగిణి’లో పేర్కొన్న ‘పంచ ద్రావిడుల’లో తెలుగువారు ఒకరు. ఒక జాతి సంఖ్యాపరంగా విస్తృతం అవుతున్నప్పుడు, వారు భాషలవారీగా, ప్రాంతాలవారీగా, పాటించే విధానాలు, ఆచారవ్యవహారాల ఆధారంగా పలు తెగలుగా విడిపోవడం సహజం. సాంఘికంగా ఇలా వచ్చే అనేక మార్పులలో భాగంగానే, తెలుగు మాట్లాడే ప్రాంతాలలోని బ్రాహ్మణులు ‘తెలుగు బ్రాహ్మణులు’గా పరిగణనలో ఉండటం సహజం. వీరుకూడా, కాలానుగతంగా వచ్చే మార్పుచేర్పులకు లోనవుతూ, అనేక విధాలైన పరిణామాలకు గురి అవుతుంటారన్నది గుర్తించాలి.

1891లో ప్రచురితమైన ఒక గ్రంధం ప్రకారం, తెలుగు బ్రాహ్మణులలో స్మార్తులు అత్యధికులు. మధ్వులు ఉన్నప్పటికీ వారి సంఖ్య పరిమితం. మధ్వులలోనూ కన్నడ ప్రాంతాలనుంచి వచ్చి, తెలుగు ప్రాంతాలలో స్థిరపడినవారే అధికం.

ఆ పుస్తకం ప్రకారం, తెలుగు స్మార్త బ్రాహ్మణులలో కానవస్తున్న తెగలు అనేకం ఉన్నప్పటికీ, వాటిలో ప్రధానమైన తెగలు ఇవి:

1. తెలగాణ్యులు :

నైజామ్‌ ప్రాంతంలో, నాటి నిజామ్‌ దురంతాలను భరించలేక ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినవారు. వీరు ముఖ్యంగా నేటి కరీమ్‌నగర్‌ జిల్లాలోని ధర్మపురి, మంథని, కాళేశ్వరం, చెన్నూరు ప్రాంతాలకు చెందినవారు.

2. మురికినాడు :

ఇది చిత్తూరు, నెల్లూరు, కడప, అనంతపురం ప్రాంతమని ‘కాకతీయ సంచిక’లోని 168వ సేజీ పక్కనగల చిత్రపటం ద్వారా తెలుస్తోంది. ఈ మురికినాడులోని కొంత ప్రాంతాన్నే ‘తొండపినాడు’, ‘తొండపి మండలం’ అనికూడా అనేవారు. (‘ముల్క్‌’ అంటే ‘దేశం’ అని అర్థం. నైజామ్‌ ప్రాంతానికి ఒకప్పుడు ‘ముల్క్‌’ అనే పేరుండేది. ఇది ‘ముల్కి నాడు’ శబ్దం అపభ్రంశం అయి, ‘మురికినాడు’ అయిందన్న భావన తప్పుగా తోస్తోంది.)

3. వెలనాడు – వీరిలోనూ 3 తెగలు. అవి:

1. శుద్ధ వెలనాడు, 2. కాకిమాని వెలనాడు, 3. పెరుంబటి వెలనాడు.

(వీరినే ‘వెలినాటి బ్రాహ్మణులు’ అంటారనీ తెలుస్తోంది. వీరిలోని 3 శాఖలనూ 1. శుద్ధ వెలినాడు, 2. పేరుంబేడి వెలినాడు, 3. వెలినాడు బ్రాహ్మణులుగా పేర్కొంటున్నారు. మొత్తంమీద వీరందర్నీ ‘వెల్నాటి బ్రాహ్మణులు’ అనడమూ ఉంది.)

4. కాసలనాడు :

ఒకప్పటి ‘కోసల దేశం’ నేటి ‘మధ్యప్రదేశ్‌’ అనుకోవచ్చు. అప్పటి దక్షిణ కోసల దేశం అయిన జబల్‌పూర్‌, రేవా, బిలాస్‌పూర్‌, సాగర్‌, సాత్నా వంటి ప్రాంతాలనుంచి కొన్ని మతపరమైన కారణాల వల్ల మన ప్రాంతాలకు వలస వచ్చినవారు వీరు. వీరినే ‘కోసలనాటి బ్రాహ్మణులు’ అనేవారు.

5. కరణ కమ్మలు –

1. బాల కరణాటి బ్రాహ్మణులు, 2. కొలింగేటి బ్రాహ్మణులు, 3. ఓగేటి బ్రాహ్మణులు.
(వీరిలోనూ 1. బగల్నాటి కరణ కమ్మలు, 2. కొవిజేటి కరణ కమ్మలు. 3. ఓగోటి కరణ కమ్మలు అని 3 శాఖలున్నట్లు కూడా ఉంది. ఇవి పౖౖెన పేర్కొన్న 3 శాఖల పేర్లే అనిపిస్తోంది.)

6. వేగినాడు

7. తొండ్రనాడు

(ఇది బహుశా నేటి తిరుపతి ప్రాంతం కావచ్చు. తిరుమాండ్యం శాసనం, కపిలేశ్వర శాసనాల ఆధారంగా నేటి తిరుపతి ప్రాంతానికి ఒకప్పుడు ‘తుండీర మండలం’, ‘తుండక విషయం’, ‘తుండైనాడు’, ‘తొండమనాడు’ అనే పేర్లుండేవని తెలుస్తోంది. ఈ పేర్లలోంచే ‘తొండ్రనాడు’ కూడా రూపొంది ఉండవచ్చు.)

8. ఔదమనాడు

9. కోనసముద్ర ద్రావిడులు

10. ఆరామ ద్రావిడులు
1891లో ప్రచురితమైన ఆ పుస్తకం ప్రకారం పైన పేర్కొన్న పది తెగలవారూ ‘వైదికులు’. వీరిలో కోనసీమ ద్రావిడులు, ఆరామ ద్రావిడులూ మొదట తమిళనాడు ప్రాంతానికి చెందినవారైనా, తెలుగునాడుకు వచ్చి, ఇక్కడ స్థిరపడ్డారు. క్రమంగా వీరి భాష, కట్టూబొట్టూ అన్నీ పూర్తిగా తెలుగు సంప్రదాయానికి అనుగుణంగా మారిపోయాయి. ఈ రెండు తెగలవారికీ తెలుగు బ్రాహ్మణులలో విశిష్టస్థానాలు ఉన్నాయి. తమిళ ప్రాంతంనుంచి వచ్చి, తెలుగు ప్రాంతంలో స్థిరపడిన కారణంగా, వీరిని కొన్నిచోట్ల ‘సంకీర్ణులు’ అని వ్యవహరించటంకూడా ఉంది.

ఆరామ ద్రావిడులు
ఆరామ ద్రావిడుల గురించి మరిన్ని విశేషాలు ఇప్పుడు చూద్దాం:

ఆరామ ద్రావిడులనే కొందరు ‘తూర్పు ద్రావిడులు’, ‘కోస్తా ద్రావిడులు’, ‘కోనసీమ ద్రావిడులు’, ‘పేరూరు ద్రావిడులు’ అనడమూ ఉంది. ప్రాథమికంగా ఇవన్నీ వారు స్థిరపడిన ప్రాంతాలకు సంబంధించిన పేర్లేనన్నది స్పష్టం. తూర్పు ద్రావిడులు ప్రధానంగా మన కోస్తాకు ఆవల ఉన్న ఉత్కళ ప్రాంతం, తూర్పు ఆంధ్రదేశంలోని వారు. కోస్తా ద్రావిడులు కోస్తా జిల్లాలలో స్థిరపడినవారు. ఇక, కోనసీమ ద్రావిడులు మన కోనసీమలో స్థిరపడినవారు. ఈ ఆరామ ద్రావిడులలో పేరూరు ద్రావిడులనే వారూ ఉన్నారు.

ఆరామ ద్రావిడులు ఆంధ్రదేశానికి రావటం వెనుక కొన్ని కథలు ఉన్నాయి. జనజీవనచరిత్ర అంతా పలు సందర్భాలలో జరిగిన, జరుగుతున్నవలసల వివరమేనన్నది వాస్తవం. ఆరామ ద్రావిడుల కథా అంతే! ఒక కథనం ప్రకారం – చాళుక్యరాజైన రాజేంద్రచోళుడు, తన కుమార్తె అయిన అమ్మంగి దేవిని రాజమహేంద్రవర పాలకుడైన రాజరాజ నరేంద్రునికి ఇచ్చి వివాహం చేశాడు. ఆ సందర్భంలో, ఆయన తన కుమార్తెతోబాటుగా, 18 కుటుంబాల బ్రాహ్మణులను వేంగి రాజ్యానికి పంపాడు. ఈ 18 కుటుంబాలవారూ అసలు నాటి చాళుక్యదేశం (దాదాపు నేటి తమిళనాడు) లోని ‘వేలంగమన్‌’ అనే గ్రామానికి చెందినవారు. (ఇప్పుడు ఈ గ్రామం ‘వలంగైమన్‌’ పేరుతో తిరువరూర్‌ జిల్లాలో ఉంది.) రాజాజ్ఞ తలదాల్చి, వీరిలో కొందరు ‘అగ్నిహోత్రం’ ధరించి, కాలినడకన వేంగి రాజ్యానికి రాగి, మరికొందరు నావలమీద వచ్చారు. నావలమీద వచ్చినవారు సముద్రతీరంలోని ‘కొనసీమ’ లేదా ‘కోనసీమ’కు చేరారు. వారే ‘కోనసీమ ద్రావిడులు’ అయ్యారు. ఇక, భూమార్గాన వచ్చినవారికి రాజరాజనరేంద్రుడు, ర్యాలి సమీపాన స్థలం ఇచ్చి నివాసం ఉండమన్నాడు. వారంతా అరవ ప్రాంతంనుంచి వచ్చిస్థిరపడిన కారణంగా, అక్కడ (ర్యాలిలో) ఉన్న గుట్టలను స్థానికులు ‘అరవ దిబ్బలు’గా వ్యవహరించేవారని అంటారు. నేటికీ ర్యాలిలో అరవ దిబ్బలు ఉన్నాయి.

అరవదేశంనుంచి ఇక్కడ స్థిరపడినవారిలో – నన్నయభట్టారకుడి శిష్యుడు నారాయణ భట్టు ముఖ్యుడు. ‘శ్రీమదాంధ్ర మహాభారతం’ ఆంధ్రీకరణంలో నన్నయభట్టుకు నారాయణ భట్టు చేసిన సహాయానికి మెచ్చిన రాజరాజ నరేంద్రుడు ఆయనకు నందంపూడి అగ్రహారాన్ని కానుకగా ఇచ్చారన్న కథా ఉంది.

ఇక, చోళదేశంనుంచి వచ్చిన మరికొందరు, పలిమెలపాడు పాలకుడి అనుమతితో పేరూరులో స్థిరపడ్డారని అంటారు, వీరు అసలు తమిళనాడులోని ‘పెరియ ఊర్‌’ (పెద్ద ఊరు) నుంచి వచ్చారని, కనుక, తాము స్థిరపడిన ఊరికి అలాగే, ‘పేరూరు’ అని పేరు పెట్టుకున్నారని అంటారు. ఇక్కడి ద్రావిడులు ‘పేరూరు ద్రావిడులు’గా సుప్రసిద్ధులయ్యారు.

వీరికి ‘ఆరామ ద్రావిడులు’ అన్న పేరు రావడానికి మరో కారణాన్ని శ్రీ చందూరి వేంకట సుబ్రహ్మణ్యం గారు తమ ‘వర్ణ వ్యవస్థలో బ్రాహ్మణులు’ పుస్తకం (పేజీ 82)లో వివరించారు. మన రాష్ట్రంలో ఉన్న పంచారామాలు- ద్రాక్షారామం, భీమారామం, క్షీరారామం, అమరారామం, కుమారారామం- లలో ముందుగా స్థిరపడిన ద్రావిడులు గనుక వీరిని ‘ఆరామ ద్రావిడులు’ అంటారని ఆ పుస్తకంలో ఉంది.

11. తుంబల వారు

12. ప్రథమ శాఖీయులు

13. నియోగులు-

1. ఆరువేల నియోగులు 2. కమ్మెల బ్రాహ్మణులు 3. ప్రాజ్ఞాడు బ్రాహ్మణులు 4. నందవరీక బ్రాహ్మణులు
5. పెసలవాయిల బ్రాహ్మణులు 6. తుమ్మనాడు లేదా కమ్మనాడు బ్రాహ్మణులు 7. లింగధారులు 8. ప్రథమశాఖ నియోగులు

ఇక్క డ మనం కొన్ని ముఖ్య విశేషాలు గమనించాల్సి ఉంది. పైన పేర్కొన్న తెగలలో కొన్ని ప్రాంతాలపరంగా ఉండటం స్పష్టం. వీటిలో కొన్ని ఇప్పుడు కనపడటం లేదనిపిస్తోంది.

(బాల కర్నాటి, కొలింగేటి, ఓగేటి, తొండ్రనాడు, ఔదమనాడు వంటి కొన్ని నియోగ బ్రాహ్మణ శాఖలు ఎక్కడైనా ఉన్నాయోమో కానీ, ఈ సంకలనకర్త దృష్టికి రాలేదు.)

నందవరీకులు
నందవరీకుల గురించిన ఈ దిగువన వివరిస్తున్న చరిత్ర శ్రీ గోపానందనాథులు 1996లో రాసిన ‘శ్రీ దేవీ మాహాత్మ్యము- శ్రీ చౌడేశ్వరీ చరిత్రము’ అనే పుస్తకంలో ఉంది.

సోమ వంశంలో పాండురాజు సంతతికి చెందిన నందరాజు అప్పటి కర్నాటక దేశంలోని నందవరం రాజధానిగా పరిపాలన చేసేవాడు. ఈ నందరాజు జనమేజయునికి తొమ్మిదో తరానికి చెందిన ఉత్తుంగభుజుని కుమారుడు. ఈయన చాణక్య-మౌర్యుల చరిత్రలోని నవనందులలోనివాడు కాడు. నందరాజు గొప్పశివభక్తుడు. ఈయన శివభక్తికి మెచ్చి, ఒక సిద్ధుడు ఒక దివ్యపాదుకల జతను ప్రసాదిస్తాడు. తను ఇచ్చిన దివ్యపాదుకల విషయం ఎవ్వరికీ చెప్పవద్దనే ఆంక్ష కూడా విధిస్తాడు. ఈ దివ్యపాదుకల ప్రభావంతో నందరాజు ప్రతీ నిత్యమూ వేకువజామున లేచి, కాశీనగరం చేరుకుని గంగాస్నానానంతరం విశ్వేశ్వరుని, విశాలాక్షిని దర్శించుకుని, తిరిగి తెల్లవారే లోగా తన రాజధానికి చేరుకునేవాడు. ఇలా కొంతకాలం జరిగాక, తన భర్త తెల్లవరే సమయంలో అదృశ్యం కావడాన్ని గుర్తించిన రాణి, తన భర్తను ఆ విషయమై నిలదీస్తుంది. తప్పనిసరై, నందరాజు తనకు సిద్ధుడు ఇచ్చిన పాదుకలగురించి వివరిస్తాడు. అది ఒక గొప్పవింతగా భావిస్తూ, తననూ కాశీకి తీసుకువెళ్లమని కోరుతుంది. నందరాజు ఆమెను అక్కడికి తీసుకెళ్తాడు. అక్కడికి వెళ్లిన తర్వాత, రాణికి రజోదర్శనం అవుతుంది. ఆ అశుచి ఫలితంగా దివ్యపాదుకలను ఉపయోగించుకోలేక, రాజధానికి తిరిగి చేరలేని పరిస్థితి ఏర్పడి, వారిద్దరూ కాశీలో చ్కిడిపోతారు.

ఈ దశలో వారు అక్కడున్న కొందరు విప్రులను చూస్తారు. వారి తేజస్సును చూసి, వారికి నమస్కరించి, తమకు సంప్రాప్తించిన విపత్తును వివరించి, సహాయం చేయవలసిందిగా కోరతారు. తపస్సంపన్నులయిన ఆ బ్రాహ్మణులు తమ దివ్యదృష్టితో భవిష్యత్తును చూసినవారై, త్వరలోనే కాశీనగరం కరవుకాటకాల పాలవుతుందని గ్రహించి, ఆ సమయంలో తమను నందరాజు ఆదుకోగలడని ఆశిస్తూ, ఆయననుంచి తగిన వాగ్దానం పొందుతారు.

వారు చేస్తామన్న సహాయానికి ప్రతిగా, తన రాజ్యంలోని నందవర అగ్రహారాన్ని వారికి దానం ఇచ్చేందుకు అంగీకరిస్తూ, విళంబినామ సంవత్సర చైత్ర బహుళ అమావాస్య సూర్యోదయ సమయంలో కాశీలోని గంగాతీర మణికర్ణికా ఘట్టంలో, శ్రీవిశ్వేశ్వర మహాదేవునికి సమర్పణంగా, శ్రీ చాముండాదేవి సాక్షిగా

ఆ విప్రులకు దానం చేశాడు. (ఇది నేటి క్రీ.శ. 2013కు 4135 సంవత్సరాల క్రితం, అంటే యుధిష్టిర శకంలోని 980కి సమానం.) ఆ తర్వాత, ఆయనకు సహాయం చేయడానికి సిద్ధపడిన విప్రులు, వేదోక్తవిధిని రాణిని శుచిని చేసి, రాజును, రాణిని క్షేమంగా నందరాజ్యానికి చేర్చుతారు.

ఆ తర్వాత, ఆ విప్రులు గుర్తించినట్లే కాశీనగరం కరవుకాటకాల పాలవుతుంది. తాము అక్కడ ఉండలేక, మొత్తం 500 ఇళ్లవారు నందరాజు తమకు ఇచ్చిన దానాన్ని గుర్తు చేసుకుని, నందరాజ్యానికి వస్తారు. నందరాజ్యం చేరిన వారికి రాజదర్శనం వెంటనే లభించక, కొంత సమయం వేచి ఉండాల్సి వస్తుంది. ఆ సమయంలో తమ నిత్యకర్మానుష్టానాలను రాజభవనంముందే పూర్తి చేసి, తీర్థజలాన్ని అక్కడే ఉన్న ఒక ఎండు రావి చెట్టుమీద చల్లుతారు.

ఆ విధంగా మూడు రోజులు గడిచేసరికి, ఆ ఎండు చెట్టు చిగురిస్తుంది. ఇది కేవలం ఆ విప్రుల తపోబలప్రభావమేనని భావించిన రాజసైనికులు వెంటనే

ఆ విషయాన్ని రాజుగారికి తెలియజేస్తారు. ఆయన రాజభవనం ముందుకు వచ్చి, ఆ విప్రులను సభకు ఆహ్వానిస్తాడు. సభలో, విప్రులు రాజుకు ఆయన తమకు ఇచ్చిన వాగ్దానాన్ని గుర్తుకు తెస్తారు. నందరాజుకు ఆ విషయం జ్ఞప్తికి వచ్చినా, తాను దివ్యపాదుకలను పొందిన సంగతినిగానీ, తాను ప్రతినిత్యం కాశీకి వెళ్లిన సంగతినిగానీ ప్రజలు విశ్వసించరేమోనన్న భీతితో, తాను అసలు కాశీకి వెళ్లనే లేదని బొంకుతాడు. అప్పుడు ఆ విప్రులు నందరాజు, కాశీలో విశాలాక్షి సాక్షిగా తమకు వాగ్దానం చేశాడని సభలో వివరిస్తారు. అయితే, సభలోని పురజనులు సైతం రాజుకే వత్తాసు పలుకుతూ, తమ రాజు అసలు కాశీకి వెళ్లనే లేదనీ, ఒకవేళ విప్రులు చెప్పేది నిజమే అయిన పక్షంలో విశాలాక్షిచేత తనముందు సాక్ష్యం చెప్పించాలని గేలి చేస్తూ విప్రులను నిండుసభలో అవమానపరుస్తారు. జగన్మాతముందు చేసిన వాగ్దానాన్ని కాదనటమేగాక ఆవిధంగా నిండుసభలో తమను అవమానపరచటంతో వారు ఎంతగానో నొచ్చుకుని, కాశీలోని విశాలాక్షి మాత చేతనే సాక్ష్యం చెప్పించటం భావ్యంగా ఉంటుందని భావించి, తమలో నలుగురు పెద్దలను ఎంచుకుని, వారిని విశాలాక్షి దగ్గరకు పంపుతారు. అలా కాశీకి వెళ్లిన నలుగురు పెద్దలు:

1. బ్రహ్మశ్రీ అవధానం పెద్దిభట్టు (శ్రీవత్సస గోత్రం)
2. బ్రహ్మశ్రీ తర్కశాస్త్రం మాధవభట్టు (వశిష్టస గోత్రం)
3. బ్రహ్మశ్రీ పురాణం శ్రీధరభట్టు (భారద్వాజస గోత్రం)
4. బ్రహ్మశ్రీ వార్తికం కమలనాభ పండితుడు (హరితస గోత్రం)

పై నలుగురు ప్రముఖులు కాశీకి వెళ్లి, అక్కడ జపతపహోమాలను శాస్రోక్తంగా చేసి, జగన్మాతను పూజించి, ఆమెను ప్రసన్నం చేసుకుంటారు. వారి భక్తికి మెచ్చి, ఆమె వారిముందు ప్రత్యక్షం కాగానే, జరిగిన విషయం ఆ తల్లికి వివరించి, తమతో వచ్చి, సభలో సాక్ష్యం చెప్పవలసిందిగా కోరతారు. వారు కోరినట్లే తాను నందరాజు వద్దకు వచ్చి, సాక్ష్యం చెప్తాననీ, అయితే, మార్గంలో ముందు వెళ్లే విప్రులు ఎవ్వరూ జ్యోతి రూపంలో వచ్చే తనను వెనుదిరిగి చూడరాదని స్పష్టం చేస్తుంది. ఆ ప్రకారమే, నందరాజ్యం పొలిమేర వరకూ వచ్చిన విప్రులు, అక్కడ వెనుదిరిగి చూస్తారు. ఫలితంగా ఆ జగన్మాత జ్యోతి రూపంలో అక్కడ నిలిచిపోతుంది. ఈ వృత్తాంతం అంతా విప్రులు వచ్చి, నందరాజుకు విన్నవిస్తారు. ఆయన తన సతీమణి, బంధుమిత్ర పురజనపరివారసహితంగా వచ్చి, అందరిముందూ జరిగినదంతా తెలియజేసి, మహానుభావులైన విప్రుల పట్ల తను చేసిన తప్పును క్షమించమని జగన్మాతను ప్రార్థిస్తాడు. పశ్చాత్తాపం చెందుతున్న రాజును జగన్మాత క్షమించి, విప్రులకు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చమని ఆనతి ఇస్తుంది. ఆ ప్రకారమే, నందరాజు వెంటనే ఆ విప్రులకు నందవరాది అగ్రహారాలను దానం చేసి, తగిన వృత్తులను కలగజేస్తాడు. కాశీనుంచి విచ్చేసిన జగన్మాతను అక్కడే స్థిరనివాసం ఏర్పరుచుకోవలసిందిగా నందరాజు ప్రార్థిస్తాడు. తాను చౌడేశ్వరీ నామంతో అక్కడ వెలసి, విప్రులను, ఇతర చరాచరసృష్టినీ కాపాడతానని తల్లి అభయప్రదానం చేసి, అక్కడ జ్యోతిరూపంలో వెలుస్తుంది. నాటినుంచీ అక్కడి బ్రాహ్మణులు అందరూ ‘నందవరీకులు’గా పేరొంది, నిత్యం వేదశాస్త్ర అభ్యాసంతోబాటు, అగ్నిష్టోమ్యాది యజ్ఞకర్మలను ఆచరిస్తూ,, తమ ఇళ్లలోని అన్ని శుభకార్యాలలోనూ చౌడేశ్వరీమాతను ‘జ్యోతి’ రూపంలో కొలుస్తూ, ఆ జగన్మాతను ఆరాధిస్తూ,

తల్లి కరుణతో జగద్విఖ్యాతిని పొందుతున్నారు – అని ప్రచారంలో ఉన్న గాథ.

శ్రీ చౌడేశ్వరీమాత ఆవిర్భావ చరిత్ర, చరిత్రరచనకు ముందునాటి భవిష్యత్పురాణం, భాగవతంలోని ద్వాదశ స్కంధములో ఉన్నట్లూ, ఆధునిక కాలంలో విన్నకోట సీమ, కొండవీడు, కొండపల్లిల దండకవిలెలలోనూ నమోదు అయిఉన్నట్లు శ్రీ గుంటుపల్లి సోమయ్య వివరించారు. వీరు 1914 ప్రాంతంలో ‘ప్రబంధ కల్పవల్లి’ అనే మాసపత్రికకు సంపాదకులుగానూ ఉండేవారు. చారిత్రక ఆధారాలనుబట్టి, శ్రీ చౌడేశ్వరీమాత అవతారం జరిగి, క్రీ.శ. 2013 నాటికి సుమారు 4134 సంవత్సరాలయిందని శ్రీ గోపానంద నాథులు రచించిన ‘శ్రీ నందవర చౌడేశ్వరీ చరిత్ర’ అనే పుస్తకం పేర్కొంటోంది.

సీ. జన్మదేశంబశేష బ్రహ్మవిద్యల కాశ్వలాయన శాఖకాశ్రమంబు

సంకేత భవనంబు సకల శాస్త్రములకు ప్రథమాగమములకు పట్టుకొమ్మ,
ఉపనిషత్తులకు నిత్యోత్సవస్థానంబు, యామళంబులకు సింహాసనంబు,
ఆలయంబఖిల కావ్యాదికంబులకు గంధర్వలోకంబు గాంధర్వమునకు,
కాశికాక్షేత్ర కళ్యాణ కటకనగర విప్ర పంచశతీ వృత్తి విస్తృతంబు,
గుణపవిత్ర త్రయోదశ గోత్రయుతము నందభూవరదత్తంబు నందపురము.

సీ.శ్రీవత్సగోత్ర, వాశిష్ఠ సాత్రేయ, కౌశికస విశ్వామిత్ర, శ్రీ యగస్త్య,
కాశ్యప, కుత్సస, గౌతమ, మౌనభార్గవ ఋషిగోత్ర మౌద్గల్య, వీత
హవ్య, భరద్వాజ హరితస ముఖ్య త్రయోదశ గోత్రులౌ భూదివిజుల
నాశ్వలాయన సూత్రులౌ విప్రవర్యుల సకత వేద శాస్త్ర పురాణవిదుల

చముండ మాంబా ప్రసాద ప్రశస్త ఘనుల

పూజ్యుల గణించి తనదు సామ్రాజ్యగరిమ
నగ్రహార క్షితిని వృత్తులారునేడు
భూవరు డొసగె యానంద లీల.

పైన చెప్పిన విధంగా నందవరీకులు ప్రధానంగా కాశీనుంచి ఇక్కడికి వచ్చినవారుగా అర్థమవుతోంది. అయితే, పైనగల మొదటి సీస పద్యం ఆరో పాదంలో ‘కాశికాక్షేత్ర కల్యాణ కటకనగర…’ అన్న పదాల ఆధారంగా వీరు కల్యాణ్‌ (నేటి మహారాష్ట్ర ప్రాంతంలో ఉంది), కటకనగరం (నేటి ఒడిషా రాష్ట్రంలో ఉంది) వంటి ప్రాంతాలనుంచి కాశీకి చేరి ఉంటారనే భావనా ఉంది.

అలాగే, రెండో సీస పద్యంలో పేర్కొన్న విధంగా వీరిలో ‘శ్రీవత్సగోత్ర, వాశిష్ఠ సాత్రేయ, కౌశికస, విశ్వామిత్ర, శ్రీ యగస్త్య, కాశ్యప, కుత్సస, గౌతమ, మౌనభార్గవ, (ఋషిగోత్ర) మౌద్గల్య, వీతహవ్య, భరద్వాజ హరితస’ అనే 13 గోత్రాలు ఉండేవనేదీ స్పష్టం. వీరు ఋక్శాఖ, ఆశ్వలాయన సూత్రులైన కరణకర్మ శాఖీయులు. అలాగే, మిగిలిన అందరు బ్రాహ్మణులకు మల్లేనే నందవరీకులు సైతం మొదట పూర్తిగా వైదికులేకాగా, తర్వాత కాలంలో వారిలోనూ వైదికి, నియోగి విభేదాలు ఏర్పడ్డాయి.

నందవరీకులలో విశిష్టమైన ఖ్యాతి గడించిన ప్రముఖులు అనేకంగా ఉన్నారు. చాణక్యుడు, మహామంత్రి తిమ్మరుసు, విద్యానాథుడు, తాళ్లపాక అన్నమయ్య, తరిగొండ వేంగమాంబ, నన్నయ భట్టారకుడు, సంకుసాల నృసింహ కవి, రాయన భాస్కర మంత్రి వంటి ప్రముఖులు అందరూ నందవరీకులే.

లింగధారులు
లింగధారణ అనేది శివారాధనకు చెందిన విశ్వాసచిహ్నం అన్నది స్పష్టం.

వీరశైవులకు వృషుడు, నంది, భృంగి (భృంగిరిటి), వీరుడు, స్కందుడు అనే అయిదుగురే గోత్రకర్తలు, పంచాచార్యులు. వీరికే యుగభేదాలనుబట్టి వేర్వేరు పేర్లు సమకూడాయి. అలా వచ్చిన పేర్లు (పైన చెప్పిన వరుస క్రమంలోనే): రేవణసిద్ధ, మరుళసిద్ధ, ఏకోరామ, పండితారాధ్య, విశ్వారాధ్య అనేవి. ఈ ఆరాధ్య మతధర్మాలను స్వీకరించినవారు మిగిలిన బ్రాహ్మణులనుంచి తాము భిన్నమని చెప్పుకోవడానికి ‘ఆరాధ్య’ పదస్వీకారం చేసి, ‘ఆరాధ్యబ్రాహ్మణులు’ అయ్యారని తెలుస్తోంది.

‘ఆరాధ్య బ్రాహ్మణులు లింగధారణాది వీరశైవ ధర్మములను స్వీకరించినను లింగముతోబాటు యజ్ఞోపవీతమును ధరించి యుపనయన సంస్కారములు గ్రహింతురు. లింగధారులుగాని బ్రాహ్మణులు చెప్పికొను ఋషిగోత్ర సూత్రములనే వీరును జెప్పుకొందురు. వీరిలో నిప్పటికినిట్టి గోత్రసూత్రవ్యవహారమే జరుగుచున్నది.’ అంటారు శ్రీ బండారు తమ్మయ్యగారు. (పాలకురికి సోమనాథ కవి, వ్యాసం, కాకతీయ సంచిక, 1991, పే. 214)

ప్రథమ శాఖీయులు
ప్రథమ శాఖీయులు అటు వైదీకులలోనూ, ఇటు నియోగులలోనూ ఉండటం గమనార్హం.

ప్రథమ శాఖీయులగురించి తెలుసుకోవాల్సిన విశేషాలు అనేకం ఉన్నాయి. ముందుగా వీరికి ‘ప్రథమ శాఖ’ అన్న పేరు ఎందుకు వచ్చిందో చూద్దాం:

వైశంపాయనుడి వద్ద వేదాభ్యాసం చేస్తున్న యాజ్ఞవల్క్యుడు, వైశంపాయనుని ఆగ్రహానికి గురై, తను అంతవరకూ నేర్చుకున్న వేదాలను కక్కివేయాల్సివస్తుంది. అప్పుడు, తీవ్రమైన నిరాశకు గురయిన యాజ్ఞవల్క్యుడు వేదాభ్యాసం కోసం సూర్యుడిని ప్రార్థిస్తాడు. సూర్యుడు ఒక గుర్రం రూపంలో ప్రత్యక్షమయి, యాజ్ఞవల్క్యునికి యజుర్వేదం నేర్పుతాడు. ఆయన నేర్పినవే 15 శాఖలు. యజుర్వేదంలోని ఆ మొదటి 15 శాఖలను ‘శుక్ల యజుర్వేదం’ అంటారు. వాటిని యాజ్ఞవల్క్యుడు తన శిష్యులైన కణ్వుడు, మధ్యందినుడు, కాత్యాయనుడు, వాజసనేయుడు-లకు నేర్పాడని భాగవతంలో ఉంది.

అయితే, సూర్యుడినుంచి వేదం నేర్చుకోవటం పాపమనీ, అధమమనీ వైశంపాయనుడు శపిస్తాడు. దానికి యాజ్ఞవల్క్యుడు, బాధపడి, తన గురువైన వైశంపాయనుడిని క్షమాపణ కోరతాడు. అప్పుడు సూర్యుడి వినతి మేరకు శాంతించిన వైశంపాయనుడు, తన శాపం తప్పదనీ, అయితే దానికి కొంత మినహాయింపు ఇవ్వగలననీ చెప్తూ, శుక్ల యజుర్వేదం నేర్చుకునేవారు ప్రతీదినం ఒక ముహూర్తకాలంపాటు (అంటే, 48 నిమిషాలపాటు) అధములుగా ఉంటారని చెప్పాడని వరాహ పురాణం పేర్కొంటోంది. ఈ శుక్ల యజుర్వేద (యజుర్వేదంలోని తొలి 15) శాఖలను అనుసరించేవారిని ‘ప్రథమ శాఖీయులు’ అంటారు. వీరినే ‘వాజసనేయులు’, ‘కాత్యాయనులు’ లేదా ‘శుక్ల యజుస్‌’లనీ అనడమూ ఉంది. యాజ్ఞవల్క్యుని వద్ద వేదం నేర్చుకున్న కాత్యాయనుడు, వేదానికి సూత్రాలను రాశాడు కనుకనే, ఈ సూత్రాలను పాటించే వీరికి ‘కాత్యాయనులు’ అని పేరు వచ్చింది.

స్కంద పురాణం, 17, 18 అధ్యాయాలలో శుక్ల యజుర్వేదం గురించిన ప్రసక్తి ఉన్నా, ఈ శాపం గురించిన ప్రస్తావన లేదు.

యాజ్ఞవల్క్యుడు, సూర్యుని వద్ద నేర్చుకున్న యజుర్వేద శాఖలను ఏమాత్రం ఎవ్వరూ మార్చలేదు గనుక, ఇవి ‘శుద్ధ’మైనవి గనుక, ఇవి ‘శుక్ల యజుర్వేదం’గా పేరు పొందాయనీ అంటారు.

Copied and updated with some information from A facebook Group, Credits to Original Author {unknown}

Mind says “Unacceptable!” But the heart says “Great Job!”

Surgery is needed in chronic condition. Agreed. But measures to build healthy society is of paramount importance.

ఇలాంటి శిక్షను ప్రజలు కోరుకోవడంలోనే వ్యవస్థ నిర్లక్ష్యం ఉందని చెప్పవచ్చు. కాదంటే వ్యవస్థ నిర్లక్ష్యం గురించి మాట్లాడే సమయం ఇది కాదు.

ఇది పూర్తిగా పోలీసులకూ నేరస్తులకూ సంబంధించిన విషయంగా, పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్న విషయంగా చూడనవసరం లేదు. పోలీసులు చట్టాన్ని అనేక విషయాల్లో తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు అనేది నిజం. ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నది ఒకటే. ఎలాంటి సంస్కారం, భయం, పాపభీతి లేని నేరగాళ్లు అనేకం మన మధ్యనే ఉండారు. వాళ్ల మెదళ్లలో సంస్కారం, పాపభీతి వంటి సున్నితమైన అంశాలకు తావులేని విధంగా, ఏ నేరం చేసినా చెల్లుబాటు అవుతుందనే విధంగా ప్రోగ్రామింగ్ జరిగిపోయి ఉంది. ఇందుకు మన సినిమాలు, టీవీలు, సెల్‌ఫోన్‌లు, మద్యం, వైట్నర్స్, గంజాయి వంటి అనేకం కారణాలు. ఇవి నిరోధించలేని స్థితికి సమాజం చేరుకునింది. వీటికి లోబడిన వారు కనీసం భయానికి అన్నా లోబడతారనే ప్రజల ఆకాంక్ష.

రేపటినుంచి రేపులు జరగవా అనేది కొందరి ప్రశ్న కావచ్చు. తిరిగి వారికి ఇదే ప్రశ్న. పోనీ వారిని చట్ట ప్రకారం ఎప్పటికో శిక్షిస్తే చట్టానికి భయపడి రేపులు ఆగిపోతాయా?

తినాల్సిన ఆహారం ముందు పెట్టుకుని వాదించుకునే సందర్భాలు, సన్నివేశాలు కొన్ని ఉంటాయి. ముందు తినాలి. తల్లో, బిడ్డో, తమ్ముడో, తండ్రో చనిపోయినప్పుడు కూడా మర్నాడో ఆ మర్నాడో సిగ్గుపడుతూ ఐనా రెండు ముద్దలు తింటాం. కొన్ని పనులు జరగాలి. కోట్లమంది అభీష్టం మేరకైనా జరగాలి. కోట్లమందికి చట్టాలపై అవగాహన ఉండక పోవచ్చు.
వాళ్లు మూర్ఖులేననీ, మిగతావారు మేధావులనీ ఒప్పుకుందాం. ఐతే ఈ మేధావులు చావుల విషయంలో తప్ప మిగతా సమయంలో మనుషులు కోల్పోతున్న హక్కులపై పోరాడే దిశగా ఉద్యమాలు ఎందుకు విస్తరించుకోరనేది ప్రశ్న. From padmakar wall

అయేషా మీరా, ప్రత్యూష, నిన్న ఉన్నావో ఉదంతాలు .. స్పీడీ జస్టిస్ మర్చిపోతున్నారు.. ఇదే ఉత్సాహం లో శిక్ష వేసి.. శిక్షని వైరల్ చేయవచ్చు కదా.. ఇవన్నీ పోతే.. స్త్రీ ని అబ్యూజ్ చేసే వాళ్ళని చంపటం మొదలెడితే.. ఇంక మగవాడు అనేవాడే మిగలడు.. ఇదెలా ఉంది అంటే.. తాగేవాళ్ళని అందర్నీ చంపేయండి.. మద్యం షాపుల్ని మాత్రం మూయటం మా వల్ల కాదు ..అన్నట్టు ..
శ్రీరాం గారి పోస్ట్ ..
కొత్త నిబంధన నుంచి పాత నిబంధన వైపు పరిగెడుతున్న భావజాలాలు. కంటికి కన్ను – పంటికి పన్ను

క్షమించమని ఎవ్వరనడంలేదు. నేర విచారణ చేసి శిక్షించండి. ఉరితీసి చాటిచెప్పండి. ఎన్నుకున్న ప్రజాస్వామ్యమూ, న్యాయ రక్షణ వ్యవస్థా అన్నీ హేతుబద్దంగా, నీ-నా-పేదా-ధనికా తేడాల్లేకుండా అందరినీ ఒకేలాగ పరిగణించే స్వతంత్ర వ్యవస్థ సక్రమంగా పనిచేస్తూందని నిరూపించండి.

ఉద్వేగాలు తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు ఆ ఉద్వేగాల్లో కొట్టుకుపోయే నాయకత్వాలుంటాయి. ఆ ఉద్వేగాలని సరిగ్గా వాడుకునే రాజకీయాలూ ఉంటాయి. అదే అదనుగా పెంటపురుగుల్లా వాలిపోయే వార్తా మాధ్యమాలుంటాయి.వాటి గూటిలో చేరే రాబందులూ దమ్ములగొండ్లూ ఉంటాయి. నాలుగు ప్రశ్నల్లో తేలిపోయే ప్రతిస్పందనని పదిహేన్నిమిషాలపాటు పొడిగించుకుని ప్రసారం చేసుకునే వ్యాపార ప్రయోజనాలుంటాయి.

భావోద్వేగాలని నియంత్రించుకునే పరిపక్వత నాయకత్వానికి అవసరం. భావోద్వేగాలని సాకుగా తమ వైఫల్యాలని ఒక్క రాత్రిలో విజయాలుగా మార్చుకునే తెలివిని గ్రహించే రేషనాలిటీ అవసరం. అవన్నీ మనకుండవు. కుళ్ళుకాలవలో కొట్టుకునిపోయే చెత్తా చెదారాలే మన భావోద్వేగాలు. విడదీసి చూడాలి. న్యాయం-ధర్మం-నాగరికతని బట్టి మారుతుంటాయని గ్రహించాలి. మనదంతా ప్యాంట్లేసుకున్న ఆటవిక భావజాలాలు.

Integrity is doing only the right thing even when no one is watching you. ఇది మనలో ఎంతుందో ఎవరికివారు తరచి చూసుకోవాలి. రాచరిక లక్షణాలని నెత్తికెత్తుకునే బానిస మనస్తత్వం మనది అని మళ్ళీ నిరూపించబడింది.వాళ్ళు మనుషులు కారు, జంతువులు.సందేహం లేదు.మనకంటూ ఒక వ్యవస్థ ఉన్నదెందుకు? దానికి ప్రజాస్వామ్యమని పేరెందుకు? బలమున్నోడు సరిహద్దులు గీసుకుని ఎవరికి వారు పాలించుకోవచ్చుకదా?

ఒక వ్యవస్థ అనేది భావజాలాలకీ, రాగద్వేషాలకి అతీతంగా, గీసుకున్న సరిహద్దుల్లోపల, రాసుకున్న నిబంధనల పరిథిలో నడవాలి. అది మీరినప్పుడు మనదొక నాగరికత అనడానికి సిగ్గుండాలి.

వాళ్ళని నేర నిర్ధారణ చేసి ఉరితీయండి. కావలిస్తే కోర్టు అనుమతితో ప్రజల భావోద్వేగాలని సంతృప్తి పరిచేలా చూసేందుకు వచ్చినవారిని వచ్చినట్లు అనుమతించండి. అంతే కానీ, చంపేసి హీరోలమనే భజనలు చేయించుకునే ధోరణిని చూస్తూ ఉండేందుకు ఎంత పరిపక్వత అయినా చాలదనిపిస్తోంది.

ఈ నాయకత్వారాధనా భావజాలాలనుండి మన సమాజం బయటకు రాదు. చేతనైతే దానిమీద కథలూ సినిమాలూ తీస్తూ బాగుపడడం నేర్చుకోవాలి. అందుకే అంటారేమో, తాత్వికత ఒక స్థాయి దాటితే వాడు తత్వవేత్త అయినా అవుతాడు లేదా వ్యాపార వేత్త అయినా అవుతాడంటారు, రాం గోపాల్ వర్మ లా!

Copied from Facebook Wall, Credits to Original Author {unknown}

భవిష్య నగరం అరోవిల్లి

అప్పటిదాకా, తమిళనాడులో పురాతన పట్టణాల్ని చూస్తూ ఉన్ననాకు ఒక భవిష్యనగరాన్ని కూడా చూడాలనిపించి ఆరోవిల్లి వెళ్ళాలని అనుకున్నాను.ఆరోవిల్లి పుదుచ్చేరిలో భాగమని అనుకునే వాణ్ణి, కాని అది విల్లుపురంజిల్లాలోనే ఉందని అక్కడికివెళ్ళాకే తెలిసింది.

కులమతాలకీ, విశ్వాసాల అడ్డుగోడలకీ, అన్నిరకాల జాతీయతావాదాలకీ ఆవల వసుధ ఒకే కుటుంబానికి చెందిందనే భావనతో చేపట్టిన ఒక ప్రయోగం ఆరోవిల్లి. అది భవిష్యత్తులో సుమారు యాభైవేలమంది పౌరులు నివసించడానికి వీలుగా అంకురార్పణ చేసిన విశ్వనగరం. ఇప్పుడక్కడ దాదాపు యాభై దేశాలకు చెందిన వాళ్ళు సుమారు రెండున్నరవేలమంది నివసిస్తూ ఉన్నారు. 1968లో శ్రీమాత అక్కడ ఒక విశ్వ నగరానికి బీజారోపణ చేసినప్పుడు దాదాపు నూట ఇరవై దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. అప్పుడక్కడొక చిన్న అడివిలాంటి ప్రదేశంలో ఒక మర్రిచెట్టు కేంద్రంగా ఆమె ఆ నగరానికి శంక్తుస్థాపన చేసారు. తమిళనాడులో ప్రతి ప్రాచీన దేవాలయానికీ ఒక స్థలవృక్షం ఉన్నట్టే, ఆ నవ్యమానవాలయానికి ఆ మర్రిచెట్టు స్థల వృక్షం అని చెప్పవచ్చు.

ఆ మర్రిచెట్టు ఆరోవిల్లి తాలూకు గరిమనాభి. ఆ చెట్టుని ఆనుకుని ఉన్న అంతర్వలయం ఆ నగరం తాలూకు శాంతివృత్తం. ఆ శాంతివలయంలోనే మాతృమందిరం ఉంది. ఆరోవిల్లి వెళ్తే మాతృమందిరం తప్పకుండా చూడాలని జిల్లా కలెక్టరు కూడా నాతో అన్నాడు. ఆ మాతృమందిరంలో అడుగుపెట్టాలంటే మరీ పొద్దున్నే వెళ్ళవలసి ఉంటుందని చెప్పడంతో మేము తొందరగా తొందరగా అక్కడికి చేరుకున్నాం గాని, అప్పటికే అక్కడ మాలాంటి సందర్శకులు చాలామంది వేచి ఉన్నారు.తీరా మేమా మందిరంలోకి అడుగుపెట్టేటప్పటికి పదిగంటలు కావొస్తూంది.

మాతృమందిరం శ్రీమాత పేరుమీద నిర్మించిన ఒక ధ్యానాలయం. ఆ నిర్మాణం ఆరోవిల్లికి ఆత్మలాంటిదని శ్రీమాత అన్నారట. ఆ నిర్మాణానికి దాదాపు నలభయ్యేళ్ళు పట్టింది. అది పన్నెండు దళాల మధ్య నిలబెట్టిన ఒక గోళాకార భవనం. ఆ గోళానికి బయటివైపు బంగారు తాపడం చేసారు. దాంతో ఆ భవనం ఆ ఉదయకాలపు ఎండలో ఆరనిజ్యోతిలాగా ధగధగలాడుతూ ఉన్నది. ఆ గోళానికి నాలుగు వేపులా నాలుగు మహాస్తంభాలు ఉన్నాయి.

ఆ అంతరాలయంలో అడుగుపెట్టడానికి అందరికీ అన్నివేళలా అనుమతి దొరకదు. అది ముందస్తు అనుమతిమీద మాత్రమే చూడగల స్థలం. ఆ రోజు ఆరోవిల్లి పౌరులు కొంతమందికి అక్కడ ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేసి ఉండటంతో వారితో పాటు మాకు కూడా ప్రవేశం దొరికింది.

ఆ లోపల వలయాకారంలో విశాలమైన ఒక మందిరం ఉంది. ఆ మందిరం మధ్యలో ఒక స్ఫటిక గోళం ఉంది. భవనం పైన ఏర్పాటు చేసిన కటకాల ద్వారా సూర్యకాంతి సన్నని తీగలాగా కిందకి ప్రసరించి, ఆ స్ఫటికగోళంలో ప్రతిఫలిస్తూ ఉంది. బయట సూర్యుడి భ్రమణాన్ని బట్టి ఆ కటకాలు కూడా తమంతతామే తిరిగి, ఆ సూర్యకాంతి కిరణాల్ని పట్టుకునేటట్టుగా ఏర్పాటు చేసారు. దాంతో రోజంతా కూడా ఒక నిశ్చల సూర్యకాంతిరేఖ ఆ స్ఫటికగోళంలో ప్రతిఫలిస్తూనే ఉంటుంది. ఆ లోపల గోడలు, పైకప్పు తెల్లగా ఉన్నాయి. కింద తెల్లటి పరుపులు, జంబుఖానాలు పరిచిఉన్నారు. లోపలకి అనుమతించినతర్వాత సందర్శకులు పూర్తి నిశ్శబ్దం పాటించాలి. అట్లా ఇరవైనిమిషాల పాటు ప్రశాంతంగా కూచున్నాక, వ్యవధి ముగిసిందన్నట్టుగా చిన్న సంకేతం వినబడుతుంది. దాంతో సందర్శకులు అక్కణ్ణుంచి బయటకు కదలవలసి ఉంటుంది.

మాతృమందిరంలోని ఆ అంతరాలయంలో ఆ కొద్దిక్షణాలు గడపడం ఒక అనుభవం. ఆ సమయంలో నీలో ఏదో జరుగుతున్నట్టుగా నీకు అనుభవానికొస్తుంది. అయితే ఆ అనుభవం ఎటువంటిది అనేది మనం స్పష్టంగా చెప్పలేం. ఒక సందర్శకుడు అక్కడ కొంతసేపు గడిపిన తరువాత ‘అది ధ్యానమందిరం కాదు, ఏకాగ్రతా మందిరం’ అన్నాడట. నా మటుకూ నాకు ఆ మందిరమంతా ఒక distilled light పరుచుకుని ఉందనిపించింది. ఆ మందిరం ఒక experiment with light. అక్కడ కూచున్నంతసేపూ ఎవరో ఒక డస్టరు తీసుకుని నెమ్మదిగా నీ మనోమాలిన్యాల్ని తుడిచిపెట్టేస్తున్నట్టు అనిపిస్తుంది. అదొక ప్రక్షాళనానుభవం. అయితే, అక్కడ నీ మనసుని కడిగేది నీళ్ళతో కాదు, కాంతితో.

ఒకసారి అందులో అడుగుపెట్టి కొన్ని క్షణాలు గడిపిన తరువాత మరొకసారి మళ్ళా అక్కడ కొంతసేపు గడపాలనిపించడం సహజం. కాని ఒకసారి మాతృమందిరంలోకి అడుగుపెట్టడానికి అనుమతి దొరికినవాళ్ళకి మళ్ళా వెంటనే అనుమతి దొరకదు. ఈలోగా అక్కడ గడిపిన ఆ కొద్దిక్షణాల్లోనూ మనలో ఏమి సంభవించిందో మనకై మనం స్పష్టపరుచుకోడానికి ఏదోలా ప్రయత్నిస్తూనే ఉంటాం.

మాతృమందిరం కాక, ఆరోవిల్లి లో చెప్పుకోదగ్గ సందర్శనీయస్థలాలేవీ కనిపించలేదు. అక్కడ ఆరోవిల్లి పౌరులు తయారు చేసే అగరవత్తులు, సుగంధ ద్రవ్యాలు, దుస్తులు, అరవిందుల, శ్రీమాత సాహిత్యాల విక్రయమందిరం ఒకటి ఉంది. అక్కడ ఆరోవిల్లి ఏర్పాటు వెనక ఉన్న ఉద్దేశ్యాన్ని, ఆరోవిల్లి నిర్మాణక్రమాన్ని వివరించే పదినిముషాల డాక్యుమెంటరీ కూడా ఒకటి ప్రదర్శిస్తున్నారు. ఆ విక్రయశాలలో ఆరోవిల్లిలోనే తయారయ్యే అగరవత్తులు కొనుక్కున్నాను. 50 Poems from Auroville అనే ఒక కవితాసంకలనం కూడా కొనుక్కున్నాను. ఆరోవిల్లిలో నివసిస్తున్న విశ్వనగర పౌరులు అప్పుడప్పుడూ రాస్తూ వచ్చిన కవిత్వంలోంచి ఎంపిక చేసిన యాభై కవితలవి. అందులో, ‘హెరాక్లిటసూ, మాతృమందిరమూ’ అనే కవిత ఒకటి నన్ను ఆకట్టుకుంది. యుకె కి చెందిన డిక్ బాట్సన్ అనే ఆయన రాసిన ఆ కవిత ఇలా ఉంది:

*
హెరాక్లిటసూ, మాతృమందిరమూ
__________________________

ఆ నిశ్శబ్దం ఏ రెండుసార్లూ ఒక్కల్లాంటి నిశ్శబ్దం కాదు,
అందులో అడుగుపెట్టేటప్పుడుగాని,
బయటకి వచ్చేటప్పుడు గాని
ఏ మనిషీ రెండోసారి కూడా ఒక్కలానే ఉండడు
బహుశా అక్కడెదీ అద్భుతం సంభవించకపోవచ్చు.
బహుశా అక్కడేదో కొత్తగా బయటపడకపోవచ్చు లేదా
నీకేదో సాక్షాత్కారం సంభవించకపోవచ్చు.
అక్కడ ఉన్నదల్లా సూర్యకాంతిమయ అంతరాలయంలో
ద్వాదశస్తంభాల మధ్య పెద్ద స్ఫటికగోళమూ
ఒక ధవళనైశ్చల్యం మనమీద కలిగించే ఒత్తిడీను.

2

ఆరోవిల్లినుంచి పుదుచ్చేరివెళ్ళాం. అక్కడ అరవిందాశ్రమానికి చెందిన రూపాంతర్ కార్యక్రమానికి సారధిగా ఉన్న పెద్దమనిషి ఒకాయన మాకోసం ఎదురుచూస్తూ ఉన్నారు. దేశంలో పాఠశాలల్లో బోధన అభ్యసన కార్యక్రమం మెరుగుపర్చడానికి శ్రీ అరవిందో సొసైటీ చేపట్టిన ప్రయోగాల గురించి నేనింతకుముందు మిత్రులతో ఇక్కడ పంచుకున్నాను కూడా. అతి తక్కువ ఖర్చుతో పాఠశాలల్లో బోధన ఎలా చేపట్టాలన్న అంశం మీద శ్రీ అరవిందో సొసైటీ ఉత్తరప్రదేశ్ లో మొదలుపెట్టిన కార్యక్రమం ఇప్పుడు దేశవ్యాప్త ఉద్యమంగా మారింది. ఆంధ్రప్రదేశ్ లో కూడా సమగ్ర శిక్ష కింద ఆ ప్రయోగాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి శ్రీ అరవిందో సొసైటీకి చెందిన కార్యనిర్వాహకులతో కొంతసేపు ఆ ప్రయోగాల గురించి చర్చించేం.

అక్కణ్ణుంచి అరవిందాశ్రమానికి వెళ్ళి శ్రీ అరవిందుల సమాధి చూడాలని బయల్దేరాం. మధ్యలో, ఫ్రెంచి ఇన్స్టి ట్యూట్ ఆఫ్ పాండిచ్చేరికి వెళ్ళాను. ఆ సంస్థ ప్రాచీన తమిళ సాహిత్యం మీద అద్భుతమైన పుస్తకాలు వెలువరించింది. చాలాకాలం కిందట అక్కణ్ణుంచి కబీర్ వాణి పుస్తకం నాకోసం మిత్రులు ఆకెళ్ళ రవిప్రకాశ్ తెప్పించారు. అప్పణ్ణుంచీ ఆ సంస్థని స్వయంగా చూడాలని అనుకుంటూ ఉన్నాను. ఆరోజు అక్కడ, డిజిటల్ తేవారంతో పాటు, Tirumamkai Alvar’s Five Shorter Works: Experiments in Literature(2019), The Four Hundred Songs of Love: An Anthology of Poems from Classical Tamil, The Akananuru(2015), Mapping the Chronology of Bhakti (2014), Narrinai (2008) లతో పాటు ఆదిత్య కోసం A Grammar of Old Tamil for Students(2018) కూడా కొన్నాను.

అరవిందాశ్రమం మళ్ళా మధ్యాహ్నభోజన విరామం తరువాతనే తెరుస్తారనడంతో, పాండిచ్చేరి సముద్రతీరానికి వెళ్ళాం. అక్కడ ఆ మధ్యాహ్నవేళ సముద్రం వెండికర్మాగారంలాగా ఉంది. అలలూ, మేఘాలూ, చివరికి ఇసుక కూడా ఉక్కులాగా వెండి కరగించి పోతపోస్తున్నట్టుగా కనిపిస్తున్నాయి. అరవిందులూ, శ్రీమాతా కూడా జీవితమంతా అన్వేషించిందీ, ఆరాధించిందీ ఆ వెలుతురునే. వాళ్ళది పరిపూర్ణమైన సౌరారాధకులని చెప్పవచ్చు. బహుశా అరవిందుల సావిత్రి అంతమంత్రమయంగా రూపొందడం వెనక, ఆ తూర్పుతీరపు ప్రత్యూషాల మహిమ కూడా చాలా వరకూ కారణమనుకుంటాను.

3

అక్కణ్ణుంచి అరవిందాశ్రమానికి వెళ్ళాం. ఆశ్రమం అంటే అరవిందుల సమాధి, అరవిందుల, శ్రీమాతల సాహిత్యవిక్రయశాల, అంతే. ఆ మధ్యాహ్నవేళ, ఒక చెట్టునీడన అరవిందులు జీవించి ఉన్నప్పటిలానే తన సమాధిలో కూడా గాఢ ధ్యానమగ్నులుగా ఉన్నట్టున్నారు. ఆ సమాధిమీద పొద్దున్నే పెట్టిన పూలరాశులు ఇంకా వాడిపోకుండా ఉన్నాయి. ఆ చెట్టుమీద అప్పుడప్పుడూ వినిపించే పక్షి కూజితమూ, అరవిందాశ్రమంలో వాలంటీర్లుగా పనిచేస్తున్న వాళ్ళ అనవసరమైన హడావిడీ తప్ప అక్కడంతా ప్రగాఢమైన నిశ్శబ్దం. మామూలుగా మనకి గ్రంథాలయాల్లో వినిపించే నిశ్శబ్దంలాంటిదే అక్కడ పరుచుకుని ఉంది.

అరవిందుల యోగానుభవం నాకు మొదట్లో అంతగా అర్థమయ్యేది కాదు, కాని, ఈ మధ్య, నా జీవితానుభవాలు నాలో రేకెత్తిస్తున్న ప్రశ్నలవల్ల, ఆయన రచనలు నన్ను నేను అర్థం చేసుకోడానికి సహాయకారిగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా Integral Yoga అని ఆయన చెప్తున్నదేమిటో కొంత స్థూలంగా అర్థమవుతున్నది. మనిషిలో రెండు లేదా అంతకన్నా ఎక్కువగా ఉన్నట్టు కనిపించే వ్యక్తిత్వాల్ని సమన్వయించుకుని, అద్వైత అస్తిత్వానుభూతిని సాధించుకోవడమెలానో ఆయన రాస్తూ ఉన్నాడు.

అంటే నువ్వు పూర్తి నువ్వుగా మారడమన్నమాట.

దానికి రెండు మార్గాలున్నాయంటున్నాడు ఆయన. ఒకటి, అద్వైతం. అంటే, నీకు తటస్థిస్తున్న ప్రతి ఒక్క అనుభవాన్నీ, నీ అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయకోశాలకు చెందిన అనుభవాలుగా పోల్చుకుంటూ, అవేవీ నువ్వు కాదని, వాటికి, దూరంగా జరగడం. అతీతంగా నిలబడటం. రెండోది సాంఖ్యులు చెప్పినట్టుగా, నిన్ను నువ్వు ప్రకృతినుంచి విడదీసుకోవడం. ఈ అర్థంలో ఆయన చెప్పే యోగం కలిపేది కాదు, విడదీసేది. ఉపనిషత్కారుడు చెప్పినట్టుగా, ఆకులోంచి ఈనెని బయటిలాగే కౌశల్యం. ప్రకృతినుంచి పురుషుణ్ణి విడుదల చేయడం. కాని, ఈ అంశంలో, ఆయన సాంఖ్యులకన్నా మరింత ఎక్కువ సన్నిహితంగా మాటాడుతున్నాడు. పురుషుడు కేవలం సాక్షిగా ఉండిపోయి, ప్రకృతి తన పని తాను చేసుకు పోతూ ఉంటుందనీ, దాని ఉత్థానపతనాలతో తనకు సంబంధం లేదనీ, తననేదీ అంటదనీ భావించే పద్ధతిని ఆయన నిరసిస్తున్నాడు. పురుషుడు కేవలం సాక్షిగా నిలబడిపోవడం కాదు, తనపట్ల తనకు స్వాధీనత లభించాలంటే, ప్రకృతిని ఏ మేరకు అంగీకరించాలో, ఏ మేరకు అనుమతించాలో కూడా తెలిసి ఉండాలంటాడు.

ఆయన ఇలా రాస్తున్నాడు:

(ఇంకా ఉంది) శ్రీ చినవీర భద్రుడు వారి FB posts నుంచి CtrV