స్టూడియో N vaadu చిన్న జియ్యర్ పై బురద చల్లుడు కార్యక్రమం

నిన్న  స్టూడియో ఎన్ వాడు  జియ్యర్ స్వామి భద్రాచలం లో గిరిజనుల భూమి కబ్జా చేసి మఠం కడుతున్నట్లు  ఒక లైవ్ ప్రోగ్రాం ఇచ్హాడు, నిజానికి ఆ భూమి మాతాత గారు పలివెల లక్ష్మినారాయణ గారిది వారు ఎనబై సంవత్సరాల క్రితమే  అక్కడ ఇల్లు కట్టారు అంతకు పూర్వం అది కోండపల్లి కి చెందిన బ్రాహ్మణులది , మా తాతగారి తదనంతరం మా బాబాయిలు జియ్యర్ స్వామి మఠానికి ఇస్ట పూర్తిగా ఆ ఇల్లు ఇచ్హారు మాతాత గారు కొన్న అప్పుడు గిరిజన చట్టాలు లేవు, నిన్న ఆ విషయం స్టూడియో ఎన్ వాడికి ఫోనుచేసి చెప్పినా ఫలితంలేదు

సందులో సడేమియా లాగా ఎవరో శాస్ర్తి గారు   ఆలయ పరిరక్షణ నాయకుడిని అని పరిచయం చేసుకోని జియ్యర్  స్వామి ని తెగనాడారు, ఇంకా చందాలింగయ్య గారు అయితే ఆ కడుతున్న భవనాన్ని గిరిజనుల అభివృ ద్దికి ఇవ్వాలని సెలవిచ్హారు

మన న్యూస్ చానళ్ళు  స్వాముల వెంటపడి అదేదో అంతర్జాతీయ సమస్య అయినట్టు రచ్చచెయ్యటంలోనైతే చానెళ్ల వీరులది పోటాపోటీ స్పీడు. చానెళ్ల అధర్మపీఠం ముందు నిజానిజాలతో నిమిత్తం లేదు. నోటికొచ్చినట్టు ఎవరిపై పడితే వారి మీద నిందవేసి తమాషా చేయటమే తప్ప అభాండానికి కనీస ఆధారం చూపాలన్న జంజాటం బొత్తిగా లేదు.
ఇలాంటి బురద చల్లుడు దురద కార్యక్రమాలు ఇంతకుముందూ అనేకం చూశాం. నీళ్ల పంపుదగ్గర అలగా తగాదాల స్థాయిలో బాధ్యతగల చానెళ్లే బజార్న పడి కాట్లాడుకుని ఒకరి నీచత్వాన్ని ఒకరు బయపెట్టుకున్నాక ఇంతోటి నీతిమంతులు పరులపై వేసే నిందలకు విలువెంతన్నది విప్పిచెప్పక్కర్లేదు. ఇలా ఒక్కో చానెల్ పూటకో బలిపశువును పట్టి నానా అల్లరితో పరువు తీయటమంతా దిక్కుమాలిన రేటింగుల కోసమే గదా? దానికోసం నిష్కారణంగా వందలమంది భ్రష్టుపట్టాల్సిన పనిలేకుండా ప్రజలంతా కలిసి చానెళ్లవాళ్లతో మాట్లాడుకుంటే మేలు. తిట్టినా, మొట్టినా నలుగురి నోళ్లలో నానడమే ముఖ్యమనుకొని దున్నపోతుల్లా నిందలను భరించే పబ్లిసిటీ పిచ్చోళ్లను… చానెళ్ల సాయంతో సొంత కక్షలు తీర్చుకోవాలని, సొంత కార్యాలు చక్కబెట్టుకోవాలని కోరుకునే ఏబ్రాసులను మేమే వెతికి రోజుకొకరిని చొప్పున ప్రతి చానెల్‌కూ పంపిస్తాము. నంజుడికి మనిషితోబాటు, నమలడానికి రెండు ఎనుబోతులను, బండెడు భోజనాన్ని బకాసురుడికి ఏర్పాటుచేసినట్టు – చానెళ్లకు పూటగడవటానికి బలిమానవుడితో బాటు చానెలు పూట ఖర్చుల నిమిత్తం ఇంత మొత్తం ఎదురు కట్నాన్నీ రోజూ సమర్పించుకుంటాము. మీరు మా జోలికి రాకండి. డబ్బులకోసం మందిని పీడించకండి – అని జంటిల్మెను అగ్రిమెంటు కుదుర్చుకుంటే జనానికీ హాయి. చానెళ్లకూ హాయి.