ఆలోచించారా ..

కథ: పనికి వచ్చే ముచ్చట.!!
రచన:పరుశురాం నాగం.

ఒక ఊర్లో పదో తరగతి మిత్రులు, ఓ 80 మంది కలిసి చదువుకున్నారు. కొందరు పై చదువులకని, కొందరు బతుకు బాటను వెతుక్కుంటూ బయటి దేశానికి వలసకనీ , కొందరు ఊళ్ళోనే తోచిన పని చేసుకుంటూ , కొందరు పక్కనున్న పట్టణంలో చిన్నదో, పెద్దదో వ్యాపారం చేసుకుంటూ గడపసాగారు. గడప దాటారు. ఓ పది సంవత్సరాలు గడిచిపోయాయి.
ఇంతలో ‘WHAT’s App” లేదా మరో యాప్ వచ్చింది. ఒక మిత్రుడు అందరం రోజూ పలకరించుకుందాం, సాధకా బాధకాలు చెబుకుందాం అనే ఉద్దేశ్యంతో.. ఓ గ్రూపు Creat చేసాడు. కొద్దిరోజుల్లోనే… 80 మందిలో.. 60 మంది నెంబర్ లు దొరకబట్టి… గ్రూపులో add చేశారు.

చిన్ననాటి మిత్రులే గాని, ఇప్పుడే కొత్తగా పరిచయం అయిన వ్యక్తుల వలె.. ఎంతో ఉత్సాహంతో పలుకరించుకునే వాళ్ళు. ఎవరెవరు.. ఏమేం పనులు చేస్తున్నారో…. ఎక్కడెక్కడ ఉన్నారో.. పెళ్లి.. పిల్లల విషయం… ఒకటేమిటి… సర్వం సంభాషించుకునే వాళ్ళు.
మళ్ళీ పాత రోజులు గురుతు చేసుకుంటూ… మంచి మంచి సూక్తులు.. శాత్రాలు, పంచులు, జోకులు వేసుకుంటూ ఎంతో సంబర పడిపోయేవారు. అందరూ అడ్మిన్ లే!😊

ఇలా ఎంతో జోష్ గా గ్రూప్ నడుస్తుంది. ఒక రోజు open చేయక పోతే.. వందల సంఖ్యలో Unread మెసేజ్ లు ఉండేవి. గ్రూపు పుణ్యానా… ఒకనాడు అందరూ కలిసి ఆత్మీయ సమ్మేళనం (Get Together/ Reunion) కూడా ఏర్పాటు చేసుకున్నారు.

రోజులు గడవసాగాయి.
ఒకనాడు, గ్రూపులో ఓ మిత్రుడు… “Good Morning” మెస్సేజ్ పెట్టాడు.

ఇంకో మిత్రుడు కలుగజేసుకొని “ఎందుకురా ఈ పనికి రాని మెస్సేజ్? ఏదైనా పనికి వచ్చే మెసేజ్ పెట్టండి. Good Morning , Good Night లతో ఒరిగేది ఏం లేదు” అని అన్నాడు.

ఇక అయోమయంలో, ఏమెసేజ్ పెట్టాలో తెలియక… ఆ Good Morng చెప్పిన మిత్రుడు… మళ్ళీ ఏనాడూ మెస్సేజ్ చేయలేదు.😢

ఒకనాడు… ఆ ఊళ్ళో జరిగిన ఓ దొంగతనం గురించి… తీవ్రంగా చర్చ నడుస్తున్న సమయంలో… ఒక మిత్రుడు… తాను చూసే సినిమా టాకీస్ తో పాటు, పోస్టర్ తో దిగిన ఫోటో ఒకటి , ఈ గ్రూపులో షేర్ చేసాడు.

“అరేయ్.. మేము ఇంత తీవ్రంగా చర్చ నడిపిస్తే… మధ్యలో నీ సోది ఏంది రా?? ఏదైనా పనికి వచ్చే పోస్ట్ పెట్టు” అని అనగానే….

ఏ పోస్ట్ , ఎప్పుడు పెట్టాలో అర్థం కాకపోవడంతో…. మరొక్కమారు అతను… గ్రూపులో ఏ పోస్ట్ పెట్టలేదు.

‘ఒకతనను… మంచి మసాలా వేసి వండిన…. ‘సాంబారు’ తో పోస్ట్ చేసాడు.

‘ఎప్పుడూ.. తిండి విషయలేనా?? ఏదైనా పనికి వచ్చే పోస్ట్ చేయమన్నారు’ ఇంకొకరు.

ఆ సాంబార్ పోస్ట్ వ్యక్తి వెంటనే గ్రూపు నుండి Left అయ్యాడు.😢.

ఓసారి దేశ, రాష్ట్ర రాజకీయాలు మీద వాదోపవాదాలు నడుస్తున్నాయి.
“మా పార్టీ ఇది చేసింది, అది చేసింది” అని తీవ్రంగా వాదించుకుంటున్నారు.
ఎదురుగా ఉంటే.. కొట్టుకునే వాళ్లే!!😢.
ఇంతలో మధ్యలో.. ఒక మిత్రుడు… ఓ “అమ్మాయి ఫోటోలో.. ‘ఫోన్ నెంబర్ కావాలా??” అని రాసి ఉన్న ఫొటో పెట్టాడు.

ఆ ఇద్దరు “రాజకీయ మేధావులకు”.. ఎక్కడో కాలింది. ఇద్దరు కలిసి.. ఈ మిత్రున్ని తిట్టారు. ఏదైనా.. పనికి వచ్చే.. పోస్ట్ పెట్టమన్నారు.

అంతే.. మరోమారు.. ఈ మిత్రుడు ఏ పోస్ట్ పెట్టలేదు.
(ఇంకా ఎన్నో ఉన్నాయి చెప్పడానికి. అవి చెబితే… ఇది కూడా పనికి రాని పోస్ట్ అవుద్దని చెప్పడం లేదు. మిత్రులు మన్నించాలి😊🙏💖)

ఇలా… ఏ పోస్ట్ పనికి వచ్చేదో.. ఈ గ్రూపులో .. దెంతో లాభసాటిగా ఉంటుందో అర్థం కాక.. ఒక్కొక్కరు… పోస్టులు చేయడం మానేశారు.

చివరికి… గ్రూపులో ఓ నిశ్శబ్బ వాతావరణం నెలకొంది.

ఒకప్పుడు ఫోన్ లో TOP లో కనబడిన గ్రూపు కాస్త.. ఎక్కడో అడుగుకి పడిపోయింది. Search లో వెతికితే గాని దొరకడం లేదు.😢.
అప్పుడప్పుడు… ఊళ్ళో ఒకరినొకరు… ఎదురెదురుగా కనబడినా… మారు మాట్లాడుకునే వాళ్ళుకాదు.

అందుకే… మిత్రుల మధ్యన అడ్డుగోడలు ఏం పెట్టుకోకండి.

బడి గోడ మీద కూర్చున్నప్పుడు… ఏం మాట్లాడుకుంటాం??

కాలేజి కాంటీన్ లో, టీ తాగుతూ.. ఏం డిస్కషన్ చేస్తాం??

వాడకట్టు మిత్రులు , ఊరి మిత్రులు ఓ బస్టాండ్ దగ్గరి చెట్టు కింద కూర్చొని ఏం మాట్లాడుకుంటాం??

వీటిలో.. ఏ ఒక్క ముచ్చటకు హద్దు ఉండదు. !
ఓ హాద్డే ఉంటే.. ఆ ముచ్చట ఎంతో సేపు.. ఎంతోకాలం నడవదు.

మనం ఏదైనా… జాబ్ కోసం ఇంటర్వ్యూలో పాల్గొంటున్నమా??
ఏదైనా ఓ సంఘటన మీద డిస్కస్ చేయడానికి?? లేదు కదా.

మిత్రుల మధ్యన…. ఎప్పుడూ.. పనికి వచ్చే ముచ్చటనే ఉండక్కర్లేదు. Good Morning, Good Night ల వల్ల… ఆ మిత్రుడు మనతో కలిసి ఉన్నాడని , ఆనందంగా ఉన్నాడని అనుకోండి. 😊

ఏ పోస్ట్.. ఎప్పుడైనా.. ఏ సమయంలోనైనా పంపనివ్వండి. ఎందుకంటే.. అతని.. ప్రతి విషయాన్ని.. మీతో పంచుకుందాం అని అనుకుంటున్నాడు.

తుమ్మినా.. దగ్గినా కూడా మెసేజ్ లు పెట్టే వాళ్ళను చూసి తిట్టకండి. ఎందుకంటే.. ఎందుకంటే.. ప్రతి క్షణాన్ని, మీతో కలిసి ఓ మధుర స్మృతిగా మలుచుకుందాం అని అనుకుంటున్నారు.

చివరగా ఓ సందేశం…
మిత్రుల మధ్యన ఎప్పుడైతే… హద్దుల అడ్డుగోడలు ఏర్పడతాయో…మెల్లమెల్లగా..
ఆ స్నేహబంధం బీటలువారి బద్దలైపోతుంది.

ఇది మన గ్రూప్ కి కూడా వర్తిస్తుంది అంకుంటే, ఒక లైక్ 👍🏻 వేసుకోండి. ఈ లైక్ కూడా ఎందుకంటే, మీరు ఈ మెసేజ్ అయిన మొత్తం చదివారా లేదా అని తలుసుకోవడానికి. 😃😉

మానవ వనరులు

నేడు మనదేశంలో ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది.. ఒకపక్క ఉద్యోగాలు లేవు,మరోపక్క గొప్ప చదువులు చదివినా అత్తెసరు జీతాలు. అంతకంటే ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే అంతంత మాత్రం చదువుకున్న వాళ్ళకి బాగా డిమాండ్ ఉండటం ఎక్కువగా సంపాదించే అవకాశం ఉండటం..

ఏదైనా గ్రామంలోకి వెళ్లి ఒక రైతుని మీకు ఎదురవుతున్న ప్రధాన సమస్య ఏమిటని అడగండి.
వ్యవసాయానికి కూలీలు దొరకడం లేదు అంటారు. పట్టణంలోకి వెళ్లి ఒక హోటల్ యజమానిని అడగండి. కుక్స్, వెయిటర్స్, ఫ్రంట్ ఆఫీస్ పనులు చేయడానికి సరైన వ్యక్తులు దొరకడం లేదు అంటారు…
“అసలు ఈశాన్య భారతదేశం వారు ఉండబట్టి సరిపోయింది. లేకపొతే పెద్ద క్రైసిస్ వచ్చివుండేది” అని ఒక హోటల్ యజమాని అంటున్నాడు. భవన నిర్మాణ దారుణ్ని అడగండి ప్లంబర్లు, ఫిట్టర్లు మొదలైన వారు దొరకడం లేదు అంటారు. మారిషస్ వాళ్ళకు అక్కడ పురోహితుడు, కుక్ కావాలి దొరకడం లేదు సాయం చెయ్యండి అని వారు అడుగుతున్నారు..

ఒక పక్క దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా వుంది అంటున్నారు. మరోపక్క అన్ని రంగాల్లో సరైన నైపుణ్యం ఉన్న వ్యక్తులు దొరకడంలేదు అని ఆయా రంగాల్లో నిపుణులు చెబుతున్నారు. ఈ వైరుధ్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి…
హోటల్స్ లో దోస మాస్టర్ కు ఇరవై ముప్పై వేలు ప్రారంభ జీతం వుంది. అదే ఇంజనీర్ లు పది వేల జీతానికి కూడా క్యు లో నిల్చుంటున్నారు…

సమస్య ఎక్కడ వుంది అంటే అందరికి వైట్ కాలర్ జాబ్ లే కావాలి. జీతం ఎక్కువ వస్తుంది అని కాదు. చాల సెమి స్కిల్ల్డ్ జాబ్స్ కు రెండు మూడు రెట్లు ఎక్కువ జీతం వస్తుంది. ఈరోజు ప్రభుత్వ టీచర్ ప్రారంభ జీతం దాదాపు 50 వేలు. అదే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన డాక్టర్ { సర్జన్} జీతం నలభై వేలు. మన వారు ఒక్కో జాబ్ కు ఒక్కో సోషల్ స్టేటస్ అంటగట్టేసారు. ఇంజనీర్ డాక్టర్ అంటే గొప్ప అని టీచర్ అంటే ఏదో పనికి రాని జాబ్ అని. ప్లంబర్, ఫిట్టర్ లాంటి పనులు చేస్తున్నాను అంటే అమ్మాయి కూడా దొరకని పరిస్థితి. అంతెందుకు పురోహిత్యం చేసే వారికి విదేశాల్లో చాల డిమాండ్ వుంది. అయినా పురోహిత్యం అంటే పెళ్ళికి అమ్మాయిలు ముందుకు రాని స్థితి. అదేవిధంగా సోంత వ్యాపారాలు చెసుకునే వారికి అమ్మాయిలు ఇవ్వటం లేదు.కంప్యూటర్ ఇంజనీర్ అని చెప్పుకొంటూ ఆరు నెలలుగా జీతాలు ఇవ్వక పోయినా కేవలం ప్రెస్టేజ్ కోసం పని చేసేవారు వున్నారు. అదే హోటల్ లో కుక్ గా వెయిటర్ గా చెయ్యమంటే నామోషీ. తలతీసినట్టు ఫీల్ అవుతారు. ఇదే మనవారు అమెరికాకు వెళితే అక్కడ హోటల్ లో పనిచెయ్యడానికి సిద్ధపడుతారు…

అంటే ఇక్కడ మారాల్సింది సామజిక దృక్పధం. దొంగతనం, అడుక్కోవడం తప్ప ఏ పని చేసినా తప్పులేదు. అన్ని పనులు గొప్పవే.
మీ మనసుకు నచ్చిన ఫీల్డ్ ఎంచుకోండి. అతిచిన్న ఉద్యోగమైనా పరవాలేదు. చేతినిండా పని ఉండాలి. బ్రతకాటానికి డబ్బును ఆర్జించాలి అది ముఖ్యం.. అంతేకానీ( false prestige ) డాబుసరి దర్పం వల్ల ఒరిగేది ఏమీ ఉండదు.కానీ నేడు ఈ అక్కరకురాని డాబుసరి దర్పం కోసం జీవితాలను బలిచేసుకుంటున్నారు…మిక్కిలి దురదృష్టకరం..బాధాకరం… From whatsapp credits to original post

Public Domain Resources

 

  1. National Digital library of India

The National Digital library of India is a project under Ministry of Human Resource Development, India. The objective is to integrate several national and international digital libraries in one single web-portal. The NDL provides free access to many books in English and the Indian languages.

 

  1. Internet Archive

Internet Archive is a non-profit library of millions of free books, movies, software, music, websites, and more. The Internet Archive offers over 12,000,000 freely downloadable books and texts. There is also a collection of 550,000 modern eBooks that may be borrowed by anyone.

 

  1. National Repository of Open Educational Resources (NROER )

The Ministry of Human Resource Development (MHRD), Government of India has launched a National Repository of Open Educational Resources (NROER ) . The development of it has been a combined effort of the Department of School Education and Literacy, Ministry of Human Resource Development, Government of India, the Central Institute of Educational Technology, National Council of Educational Research and Training and Metastudio, which is the platform that hosts the Repository.

 

  1. ManyBooks

ManyBooks provides free ebooks for your PDA, iPod or eBook Reader. You can randomly browse for a ebook through the most popular titles, recommendations or recent reviews for visitors. There are 21,282 eBooks available here and they’re all free!

 

  1. GetFreeEBooks

GetFreeEBooks is a free ebooks site where you can download free books totally free. All the ebooks within the site are legal downloadable free ebooks.

 

  1. FreeComputerBooks

FreeComputerBooks consists of a huge collection of free online Computer, Programming, Mathematics, Technical Books, Lecture Notes and Tutorials. It is very well categorized by topics, with 12 top level categories, and over 150 sub-categories.

 

  1. FreeTechBooks

FreeTechBooks lists free online computer science, engineering and programming books,textbooks and lecture notes, all of which are legally and freely available over the Internet. Throughout FreeTechBooks, other terms are used to refer to a book, such as ebook, text,document, monogram or notes.

 

  1. Scribd

Scribd, the online document sharing site which supports Word, Excel, PowerPoint, PDF and other popular formats. You can download a document or embed it in your blog or web page.

 

  1. Globusz

Globusz is a unique ePublishing house, specializing in free eBook downloads. They also provide an excellent Star Rating Showcase for new and evolving authors.

 

10.KnowFree

KnowFree is a web portal where users are able to exchange freely e-books, video training and other materials for educational purposes and self-practice.

 

  1. OnlineFreeEBooks

OnlineFreeEBooks provides links to various ebooks (mostly in pdf) spanning in 9 big categories which are: Automotive Ebooks, Business Ebooks, Engineering Ebooks, Gadget Ebooks, Hardware Ebooks, Health & Medical Ebooks, Hobbies Ebooks, Programming & Technology Ebooks, Sport & Martial Art Ebooks.

 

12.MemoWare

MemoWare has a unique collection of thousands of documents (databases, literature, maps, technical references, lists, etc.) specially formatted to be easily added to your PalmOS device,Pocket PC, Windows CE, EPOC, Symbian or other handheld device.

 

13.BluePortal

 

14.OnlineComputerBooks

OnlineComputerBooks contains details about free computer books, free ebooks, free online books and sample chapters related to Information Technology, Computer Science, Internet, Business, Marketing, Maths, Physics and Science which are provided by publishers or authors.

 

15.SnipFiles

SnipFiles offers you free ebooks and software legally by brought or attained PLR, resale or master rights to all the products on their page.

 

16.BookYards

BookYards is a web portal in which books, education materials, information, and content will be freely to anyone who has an internet connection.

 

17.The Online Books Page

The Online Books Page is a Listing over 30,000 free books on the Web.

 

18.AskSam Ebooks

AskSam Ebooks has a collection of free e-books like Shakespeare, and assorted legal & governmental texts.

 

19.Baen Free Library

Baen Free Library is an online library of downloadable science fiction novels.

 

20.EBookLobby

Free ebooks in eBookLobby are divided into different categories. Categorys range from business, art, computing and education. Select the category appropriate to the e-book you’re looking for.

 

Other Free EBook Resources

1.PlanetPDF – A small collection of classic novels all in PDF format.

2.DailyLit – Read books online by daily email and RSS feed.

3.Wikibooks – Wikibooks is a Wikimedia community for creating a free library of educational textbooks that anyone can edit.

4.Dwalin – Free novels in text format.

5.Project Gutenberg – Free ebooks from producers.

6.Adobe Free eBooks – In Adobe’s Free eBooks area, you can download, unlock, and read electronic books on your personal computer or reading device.

7.Alive & Free – A page of links to some recent books from living authors available free online.

8.Franklin – Thousands of free titles in text and HTML file formats.

9.Read Easily – An ebook online library which has been designed to provide you an adaptive reading experience!

10.PDFbooks – This new site offers around 4,700 downloadable public domain e-books.

11.Witguides – An online source for a wide range of useful e-books that are completely free with no need to sign-up or buy anything.

12.Diesel eBooks -Offer free ebooks formatted for both Microsoft Reader and Mobipocket.

13.Free eBook Miners
Free eBooks for your education, research or amusement.

14.Planet eBook
Free classic literature to download and share.

15.e-Library – Plenty of free ebooks available for download.

16.BookBoon – Provides free ebooks for students and travelers in PDF format. No registration is required.

 

తెలుగు వికీపీడియా మీద శిక్షణ @ IIIT Hyd

తెలుగు వికీపీడియాను మరింత బలో
పేతం చేసేందుకు ట్రిపుల్‌ ఐటీ- హైదరాబాద్‌
సమాయత్తమైంది. ప్రతి శనివారం వికీపిడియా తెలు
గుపై అవగాహన కల్పించేందుకు ఏర్పాట్లు చేసింది.
ప్రతి శనివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ట్రిపుల్‌ఐటీ క్యాంపస్‌లోని నీలగిరి భవ
నంలోని టీచింగ్‌ల్యాబ్‌ లో ఉచిత అవగాహన
కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ట్రిపుల్‌ఐటీ ఆధ్వ
ర్యంలో ప్రత్యేక ప్రాజెక్టును రూపొందించి దీనికి ట్రిపు
ల్‌ఐటీ ప్రొఫెసర్‌ వాసుదేవవర్మ ఆధ్వర్యంలో ప్రాజెక్టు
మేనేజర్‌ విభా పర్యవెక్షణలో శిక్షకులు కృపాల్‌కశ్యప్‌,
విద్యార్థులు అవగాహన కల్పిస్తున్నారు.

ఈ సందర్భంగా శనివారం జరిగిన సమావేశంలో
శిక్షకులు కృపాల్‌ కశ్యప్‌ మాట్లాడుతూ… తెలుగు వికీపీడియాను ఎలా ఉపయోగించుకోవాలి, కొత్త సమాచారాన్ని చేర్చడం, ఉన్న సమాచారాన్ని సరిదిద్దడం వంటి
అంశాల పై ప్రత్యక్ష ప్రదర్శనతో కూడిన అవగాహన కలిపిస్తామన్నారు. ప్రొఫెసర్‌ వాసుదేవవర్మ, ప్రాజెక్టు మేనేజర్‌ విభా పర్యవేక్షణలో ప్రతి శనివారం మూడు గంటలపాటు అవగాహన కల్పిస్తామన్నారు. ఈ అవకాశాన్నిఅందరూ . సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన పుస్తక ప్రదర్శనలో ప్రత్యేక స్టాల్‌ ఏర్పాటు చేసి తెలుగు వికీపీడయాపై ప్రాజెక్టు బృందం ప్రచారం చేసిందని అందులో వెయ్యి మంది వరకు తమ పేర్షను నమోదు చేసుకొన్నారు. #Thanks #Sakshi #TeWiki #Telugu #Wikepedia #IIIT83cf4bb4-8c83-42a0-8886-7a4a77757e21

సత్యానికి మాత్రమే జయము

సత్యమేవ జయతే
————————-

ఈ ఆధునిక కాలంలో సోషల్ మీడియాలో వచ్చే వార్తలు ఫోటోలలో చాలా వరకు వెనక ముందు చూసుకోకుండా గుడ్డిగా షేర్ చేయబడుతున్నవే….

చేతిలో మొబైల్ ఫోన్ అందులో నెట్ బ్యాలెన్స్ ఉంటే చాలు ఎంత మంది ఏమాత్రం ఆలోచన లేకుండా ఫేక్ న్యూస్ ను షేర్ చేస్తూ తాము సమాజాన్ని ఏదో జాగృతం చేస్తున్నామని అని అనుకుంటున్నారు కొందరు.

ముఖ్యంగా ఫేస్బుక్ వాట్సప్ లలో వచ్చే ఫేకు వార్తలు మరియు ఫోటోలను కొంతమంది తమ వ్యక్తిగత లాభాపేక్షకు, మత పరమైన లేద కుల పరమైన మరియు రాజకీయ పరమైన లబ్ధి కొరకు వాళ్ళకి అనుగుణంగా తయారు చేసి వదిలితే చాలామంది కనీసం ఒక సెకండ్ కూడా ఆలోచించకుండా అది నిజమా కాదా అని తెలుసుకోకుండా, మన కులం వాడు‌, మన మతం వాడు, మన వర్గం వాడు పోస్ట్ చేసాడు కాబట్టి మనం షేర్ చేద్దామంటూ చివరికి అనేక సమస్యలను కొనితెచ్చుకొంటున్నారు.

ఒక న్యూస్ ఫేక్ అని ఎలా కనుగొనవచ్చు.?

1. ఆ వార్త లేదా ఫోటో దాదాపుగా ఎదో ఒక మతానికి, కులానికి, ప్రాంతానికి వర్గానికి చెందిన గ్రూప్ లలో విరివిగా షేర్ చేయబడుతుంటే దానిని ఫేక్ అని అనుకోవచ్చు.

2. ఆ వార్త లేదా ఫోటో తప్పనిసరిగా ఏదో ఒక కూలాన్ని, వర్గాన్ని, మతాన్ని కించపరిచేలా ఉంటే దానిని ఫేక్ అని అనుమానించాలి.

3. ఒక వార్తా కేవలం స్క్రీన్ షాట్ రూపంలో ఉంటే దానిని ఫేక్ గా అనుమానించాలి.

4. సామాన్యంగా మనం విన్న దానికి చూసిన దానికి భిన్నంగా వున్నప్పుడు అది ఫేకై ఉంటుందని అనుమానించవచ్చు.

ఫేక్ ఫోటోలను వార్తలను ఎలా కనుగొనాలి?

1. ఫోటో అయితే దానిని google reverse search ద్వారా ఎప్పుడు, ఎవరు, ఏ సందర్భంలో దానిని పోస్ట్ చేసారో తెలుసుకోవచ్చు..

మొబైల్ ద్వారా కనుగొనడానికి ఈ లింక్ ఉపయోగించండి. https://www.labnol.org/reverse/

2. ఆ వార్తలోని ముఖ్య పదాలు (key words) ను గూగుల్ లో వెతికితే దానికి సంబంధించిన అనేక లింకులు కనిపిస్తాయి. వాటిని బట్టి ఆ వార్త నిజమో అబద్ధమే తెలిసిపోతుంది.
ఉదా: NASA , SUN , OM SOUND అని వెతికితే “నాసా సూర్యుని నుంచి వచ్చే శబ్దం ఓం అని చెప్పింది” నిజమా కాదా అనే లింకులు వస్తాయి..

ఫేక్ వార్తల వెనక ఉన్న నిజాల నిగ్గుతేల్చడానికి అనేక పేజీలు ఉన్నాయి. వాటిలో కొన్ని..

https://www.facebook.com/SMHoaxSlayer/

https://www.facebook.com/altnews.in/

https://www.facebook.com/quintillion/

తెలుగు లో https://www.facebook.com/factlytelugu/

మూడు ఫేక్ ఫోటోలు ఆరు ఫేక్ వార్తలతో ఉన్న సమాజం సరైన దారిలో నడవాలంటే ఒక మంచి నాయకత్వం చాలా అవసరం. అలాంటి నాయకత్వం కలవాళ్లలో ఈమధ్య తరచుగా కేరళ కి చెందిన ఈ కన్నూరు IAS మొహమ్మద్ అలీ పేరు వినే వుంటారు. ఆయన ఒక మంచి ఆలోచన ద్వారా మార్పు కు స్వీకారం చుట్టారు , అది ముఖ్యంగా ఈనాటి డిజిటల్ సమాజంలో , ఈ తరానికి చాలా అవసరమైన విషయం.

కేరళలోని లోని కున్నూరు జిల్లాలోని లోని పాఠశాలలో ఫేక్ వార్తలు గురించిన అవగాహన కల్పిస్తున్నారు. అక్కడి ఉపాధ్యాయులకి శిక్షణ ఇచ్చి మరీ విద్యార్థులకి తరగతులు నిర్వహిస్తున్నారు.. స్వయంగా వాళ్లకి ఉదాహరణలతో కూడిన అవగాహన ఇవ్వడం చేస్తున్నారు.

ఇలాగే మన దేశం లోని అన్ని రాష్ట్రాలలో మొత్తం పాఠశాలలలో ఇలా జరిగితే సమాజం బాగుపడే అవకాశం ఉంది.

https://thelogicalindian.com/exclusive/kerala-govt-schools

Consequences of recent amendment _(Gazette Notification dt.03.01.2020)_ to the Employees

🙋‍♂ *Consequences of recent amendment _(Gazette Notification dt.03.01.2020)_ to the Employees’ Compensation Act:* ⤵

For death and tvpermanent total disablement due to employment injury _*from 03.01.2020, employees will get higher compensation under Employees’ Compensation Act, 1923.*_

*For Death Cases:*
Minimum: ₹7,45,275/-, Maximum: ₹17,14,050/-

*For Permanent Total Disablement Cases:*
Minimum: ₹8,94,330/-,
Maximum: ₹20,56,860/-.

The above amount of compensation is calculated based on revised wages of ₹15,000/- p.m. _(Before the latest amendment, this amount was ₹8,000/-)._

However, if the wages is less than ₹15,000/-, the compensation will be proportionately less, subject to a minimum of ₹1,20,000/- & ₹1,40,000/- for death and permanent disablement benefit respectively.

*Thumb Rule:*
> _Higher the age, lower the compensation._

> _Relevant factors specified in Schedule-IV give slabs depending upon the age of the concerned employee._

*If any of the above details are wrong or in case of variation, please do correct me and update us in this Group/Forum.*

*Note:*
_For more details & clarifications, please refer Employees’ Compensation Act._

భారత పౌరసత్వం

== భారత పౌరసత్వం పార్ట్ 1 ==

ఇప్పుడు దేశం మొత్తం మీద జరుగుతున్న చర్చ ఒకటే అంశం మీద అదే CAB and NRC.. ఎంతలా అంటే దేశం మొత్తం ప్రజలు, ప్రతిపక్షాలు రెండుగా విడిపోయి ముస్లిం vs హిందూగా మార్చి అల్లకల్లోలం రేపుతున్నారు.. అసలు పౌరసత్వ చట్టానికి సవరణ ఎందుకు తీసుకు రావలసి వచ్చింది అనే తెలుసుకునె ముందు విదేశీయులకు భారత పౌరసత్వం ఎలా ఇస్తారు తెలుసుకోవడం అవసరం..

ప్రపంచంలోని ప్రతిదేశం ఆ దేశ పౌరసత్వం ఎలా ఇవ్వాలి అనే దానిపై చట్టాలు రూపొందించుకుని ఆయా చట్టాల లోని నియమ నిబంధనల ప్రకారమే పౌరసత్వం కల్పిస్తాయి. భారతదేశం మొట్ట మొదటిసారి Indian Citizenship Act, 1955 అని పౌరసత్వ చట్టాన్ని 1955లో ఆమోదించింది.. దీనికి గతంలో 1986, 1992, 2003, 2005, 2015 లో సవరణలు చేశారు ఇప్పుడు తాజాగా 2019లో మరి ఒకసారి Citizenship Amendment Bill, 2019 పేరుతో తాజా సవరణ చేశారు.

భారత పౌరసత్వ చట్టం ప్రకారం నవంబర్ 26, 1949 నాటికి భారతదేశంలో నివాసం ఉంటున్న వ్యక్తి ఆటోమాటిక్ గా భారత పౌరుడు అవుతాడు.

భారత జాతీయతా చట్టం ముఖ్యంగా citizenship by right of birth within the territory బదులుగా citizenship by right of blood ను అనుసరిస్తుంది..

పుట్టుకతో పౌరసత్వం:

జనవరి 26, 1950 నుండి జూలై 1, 1987 మధ్యలో భారతదేశంలో జన్మించిన వ్యక్తులు, తల్లిదండ్రులలో కనీసం ఒకరు భారత పౌరులు అయి ఉండి జూలై 1, 1987 నుండి డిసెంబర్ 3, 2004 మధ్యలో జన్మించిన వ్యక్తులు, డిసెంబర్ 3, 2004 తరువాత భారత్ లో జన్మించిన వ్యక్తుల తల్లిదండ్రులు ఇద్దరు ఖచ్చితంగా భారత పౌరులు అయి ఉన్న వ్యక్తులకు జన్మతః భారత పౌరులు అవుతారు..

భారత సంతతికి పౌరసత్వం:

జనవరి 26, 1950 నుండి డిసెంబర్ 10, 1992 మధ్య కాలంలో భారత దేశానికి వెలుపల జన్మించిన వ్యక్తి యొక్క తండ్రి ఆ కాలంలో భారత పౌరసత్వం కలిగి ఉన్నట్లయితే ఆ జన్మించిన సంతానానికి భారత పౌరసత్వం లభిస్తుంది.. డిసెంబర్ 10, 1992 తర్వాత భారతదేశం వెలుపల జన్మించిన వ్యక్తి తల్లిదండ్రులలో ఎవరో ఒకరు భారత పౌరులు అయి ఉన్నట్లయితే కూడా భారత సంతతి కింద పౌరసత్వం లభిస్తుంది.. కాని డిసెంబర్ 3, 2004 తర్వాత భారత్ వెలుపల జన్మించిన వ్యక్తులు పుట్టిన తేదీ నుండి ఒక సంవత్సరం లోపు భారత దౌత్య కార్యాలయంలో నమోదు చేసుకుంటే తప్ప భారత పౌరసత్వం లభించదు. కొన్ని ప్రత్యేక సందర్భాలలో ఒక సంవత్సరం తర్వాత కూడా భారత దౌత్య కార్యాలయంలో పౌరసత్వ నమోదు చేసుకునే అవకాశం ఉంది కానీ ఆ వ్యక్తి మరే ఇతర దేశానికి చెందిన పాస్పోర్ట్ కలిగి లేడు అని తల్లిదండ్రులు ఇద్దరు అఫిడవిట్ సమర్పించాల్సి ఉంటుంది.

నమోదు ద్వారా పౌరసత్వం:

భారత పౌరసత్వ చట్టం, 1955 లోని సెక్షన్ 5 కింద కేంద్ర ప్రభుత్వం వద్ద భారత పౌరసత్వం కోసం, ఒక వ్యక్తి ఈ క్రింది వర్గాలలో దేనికైనా చెంది ఉంటే నమోదు చేసుకోవచ్చు (అక్రమ వలసదారుడు కాని వారు మాత్రమే)

భారతీయ మూలాలు కలిగి గత ఏడు సంవత్సరాలుగా భారత దేశంలో నివాసం ఉంటున్న వ్యక్తి సెక్షన్ 5(1) ప్రకారం పౌరసత్వ నమోదుకు దరఖాస్తు చేసుకోవచ్చు..(దరఖాస్తుకు ముందు తప్పనిసరిగా 12 నెలల కాలం నిరవధికంగా, గత ఏనిమిది సంవత్సరాల కాలంలో ఆరు సంవత్సరాలు భారతదేశంలో నివాసం ఉండాలి)

భారత సంతతికి చెంది, అవిభక్త భారతదేశం వెలుపల ఏ దేశంలో లేదా ప్రదేశంలో నివసిస్తున్న వ్యక్తి.

భారత పౌరుడిని వివాహం చేసుకుని భారత పౌరసత్వ నమోదు కోసం దరఖాస్తు చేయడానికి ముందు ఏడు సంవత్సరాలు సాధారణంగా భారతదేశంలో నివసిస్తున్న వ్యక్తి

తల్లిదండ్రులలో కనీసం ఒకరు భారత పౌరులు అయి, గతంలో భారత పౌరసత్వం కలిగివుండిన వ్యక్తి గత సంవత్సర కాలంగా భారత దేశంలో నివాసం ఉంటున్న వ్యక్తి.

ఐదేళ్లపాటు భారతదేశపు విదేశీ పౌరుడిగా నమోదు చేసుకుని, భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేయడానికి ముందు ఒక సంవత్సరం భారతదేశంలో నివసిస్తున్న వ్యక్తి. అలాగే భారత పౌరసత్వం కోసం నమోదు చేసుకున్న వారి సంతానం కూడా భారత పౌరసత్వం నమోదు చేసుకోవడం ద్వారా పొందవచ్చు.

సహజత్వం ద్వారా పౌరసత్వం:

గత 12 సంవత్సరాలుగా భారతదేశంలో సాధారణంగా నివసిస్తున్న ఒక విదేశీయుడు సహజత్వం ద్వారా భారత పౌరసత్వం పొందడానికి అర్హుడు అవుతాడు. ఇందులో దరఖాస్తు తేదీకి ముందు 12 నెలల కాలం మరియు ఆ 12 నెలల ముందు 14 సంవత్సరాల వ్యవధిలో 11 సంవత్సరాలు భారతదేశంలో నివాసం ఉండాలి. ఇవన్నీ కూడా భారత పౌరసత్వ చట్టం, 1955 లోని సెక్షన్ 6(1)కు లోబడి ఉంటాయి.

భారత పౌరసత్వం కొరకు పై నిబంధనలు ఇప్పటివరకు ఉన్నవి.. ఇప్పుడు ఈ చట్టంలోని సహజత్వం ద్వారా పౌరసత్వం అనే నిబంధనకు సవరణ కొరకు తీసుకు వచ్చిన బిల్లే CAB ఇంత గొడవకు కారణం.. ఈ బిల్లు ఆల్రెడీ పార్లమెంట్ ఉభయసభల్లో పాసై రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు గనుక ఇక మీదట దీనిని CAA (Citizenship Amendment Act, 2019) గా పిలుద్ధాం.

భారతదేశానికి పొరుగు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ దేశాలలో మైనారిటీలు అనే కారణంతో మతపరమైన దాడులు, హింస ఎదుర్కుని భారతదేశానికి వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు మరియు క్రైస్తవులకు భారత పౌరసత్వం ఇవ్వడానికి ఉద్దేశించి చేసినదే ఈ పౌరసత్వ సవరణ చట్టం, 2019.

పౌరసత్వ సవరణ చట్టం, 2019 ముఖ్యంగా వీరికి రెండు వెసులుబాట్లు ఇచ్చింది. అవేమిటంటే..

1) సరిఅయిన పత్రాలు లేకుండా భారతదేశానికి వచ్చి, నిర్ధారిత సమయం తర్వాత కూడా ఇక్కడే తలదాచుకున్న వారందరినీ పౌరసత్వ చట్టం, 1955 ప్రకారం అక్రమ వలసదారులుగా (illegal immigrants) గా గుర్తించే వారు. ఇప్పుడు వారిని అలా గుర్తించరు..

2) సహజత్వం ద్వారా పౌరసత్వం పొందడానికి ఒక విదేశీయుడు గతంలో 11 సంవత్సరాలు భారతదేశంలో నివాసం ఉండాలి అనే నిబంధనను 5 సంవత్సరాలు ఉంటే సరిపోతుంది అని సడలించింది.
అందుకే డిసెంబర్ 31, 2014 న లేదా అంతకు ముందు భారతదేశం లోకి ప్రవేశించిన వారికి మాత్రమే వర్తిస్తుంది అనే నిబంధన చేర్చడం జరిగింది.
ఆ తేదీ తర్వాత వచ్చిన వారు మతానికి సంబంధం లేకుండా అక్రమ వలసదారులుగానే గుర్తించబడతారు..

మరి ఇలా వచ్చినవారు ఏన్నో లక్షల మంది ఉన్నారు అని భ్రమ పడవద్దు.. ఈ చట్టంలో పేర్కొన్న పాక్, బంగ్లాదేశ్, ఆఫ్గనిస్తాన్ దేశాల నుండి డిసెంబర్ 31, 2014 లోపు భారతదేశానికి వచ్చిన వారి సంఖ్య కేంద్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం 31,313 మంది మాత్రమేనని అంచనా.. ఇందులో హిందువులు 25,447 మంది, సిక్కులు 5807 మంది, క్రైస్తవులు 56 మంది కాగా, బౌద్ధులు, పార్సీ లు ఇద్దరు చొప్పున ఉన్నారు.

ఈ పౌరసత్వ సవరణ చట్టంలో ముస్లింలను చేర్చకపోవడం ఇంత వివాదానికి కారణం. అసలు ఈ సవరణ చట్టం తెచ్చింది ఆ మూడు దేశాలలో మెజారిటీ మతం అయిన ముస్లింల నుండి మత పరమైన వివక్ష, హింస ఎదుర్కొన్న మైనారిటీలను ఆదుకోవడానికి అయితే ముస్లింలకు ఎలా చోటు కల్పిస్తారు? అందువల్ల ఆయా దేశాల ముస్లింలు ఈ చట్టంలో మినహాయించబడ్డారు. ఒకవేళ ముస్లింలను కూడా చేర్చే పక్షంలో ఈ సవరణ చట్టమే అవసరం లేదు.

మరొక ముఖ్య విషయం ఏమిటంటే ఈ సవరణ బిల్లు పౌరసత్వ చట్టం, 1955 లోని సెక్షన్ 6 లో గల సహజత్వం ద్వారా పౌరసత్వంను మాత్రమే సవరించింది.. సెక్షన్ 6A ని కాదు.. ఈ సెక్షన్ 6A జనవరి 1, 1966 నుండి మార్చి 25, 1971 వరకు అస్సాం రాష్ట్రంలో ప్రవేశించిన అక్రమ వలసదారుల ను డీల్ చేస్తుంది.. సరిగ్గా చెప్పాలంటే ఇండో – చైనా యుధ్ధం ముగిసిన సమయం నుండి బంగ్లాదేశ్ విమోచన యుధ్ధం మొదలయ్యే సమయం వరకు.
కనుక అస్సామ్ రాష్ట్రాల ప్రజలు ఈ చట్టం గురించి భయపడటం అనవసరం. ఇది కేవలం అపోహల వల్ల లేదా కొంత మంది కావాలని సృష్టించినది కావచ్చు.

కొందరు మేధావులు ఈ పౌరసత్వ సవరణ చట్టం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం.. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15, 21 లను ఉల్లఘిస్తుంది అని అంటున్నారు..

సరే ఆర్టికల్ 14 ఏమంటుందంటే.. “The State shall not deny to any person equality before the law or the equal protection of the laws within the territory of India.” అంటే ఏ వ్యక్తికైనా చట్టం ముందు సమానత్వం లేదా భారత భూభాగంలో చట్టాల సమాన రక్షణను కల్పించడంలో రాజ్యం యెటువంటి వివక్షా చూపకూడదు.

అయితే ఇక్కడ పౌరసత్వ సవరణ చట్టం మూడు దేశాలలో మతపరమైన హింసను ఎదుర్కొన్న మైనారిటీలకు సహజత్వం ద్వారా పౌరసత్వం ఇవ్వాలని ఉద్దేశించినది.. దీని అర్థం ఇతరులకు ఈ పద్దతి ద్వారా పౌరసత్వం ఇవ్వరు అని కాదు.. ఇతరులు సహజత్వం ద్వారా పౌరసత్వం పొందాలి అనుకుంటే ఆ యొక్క సెక్షన్ నియమాలు అనుసరించి పొందవచ్చు.. అందువల్ల ఇది ఆర్టికల్ 14 ఉల్లంఘించడం లేదు అని చెప్పవచ్చు.

రాజ్యాంగం లోని ఆర్టికల్ 15 ప్రకారం ఒక వ్యక్తి పై అతని మతం, జాతీ, కులం, లింగం మరియు ప్రాంతం ఆధారంగా యెటువంటి వివక్షా చూపరాదు. Prohibits discrimination of Indians on basis of religion, race, caste, sex or place of birth.

నాకు తెలిసినంత వరకు ఇది భారతీయ పౌరులకు మాత్రమే వర్తిస్తుంది. ఇతర దేశాల ప్రజలకు కాదు. సహజత్వం ద్వారా పౌరసత్వం పొందిన తర్వాత ఒక వ్యక్తి భారతీయ పౌరుడుగా మారుతాడు.. అంతకు ముందు కాదు.. అందువల్ల ఆర్టికల్ ఉల్లంఘన ప్రశ్నే తలెత్తదు.

ఆర్టికల్ 21 ఏమంటుంది అంటే “No person shall be deprived of his life or personal liberty except according to a procedure established by law.” అంటే చట్టం ద్వారా ఏర్పాటు చేయబడిన ఒక విధానం ప్రకారం తప్ప ఏ వ్యక్తి అయినా తన జీవితం లేదా వ్యక్తిగత స్వేచ్ఛను కోల్పోకూడదు.

రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కు,వ్యక్తిగత స్వేచ్ఛ హక్కు అనేది భారతదేశంలో నివసించే వారికి వర్తిస్తుంది కాని భారతదేశంలోకి ప్రవేశించాలి అని అనుకునే వారికి కాదు..

ఇంకా స్పష్టంగా చెప్పాలంటే భారత రాజ్యాంగం భారతీయుల కోసం రాసినది.. విదేశీయుల కోసం వ్రాసింది కాదు.. వాళ్ళు భారత పౌరసత్వం పొందిన తర్వాతనే రాజ్యాంగం కల్పించిన హక్కులను పొందేందుకు అర్హత పొందుతారు.

NRC గురించి నెక్స్ట్ పోస్టులో చర్చిద్దాం..

ఇప్పుడు కొన్ని ప్రశ్నలు సమాధానాలు చూద్దాం.. ____________________________________________
1) CAA మరియు NRC భారతీయ ముస్లింలకు వ్యతిరేకమా?

జ: ఎంత మాత్రం కాదు.. భారతీయ ముస్లింలకు ఈ చట్టానికి యెటువంటి సంబంధం లేదు. ఈ పౌరసత్వ సవరణ చట్టం కేవలం పాక్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ దేశాలలో మతపరమైన హింసను, వివక్షను ఎదుర్కొన్న వారికి భారత పౌరసత్వం ఇచ్చేందుకు తెచ్చిన ఒక ఉపశమన చట్టం అది కూడా ఈ ఒక్కసారికే వర్తిస్తుంది.

2) దేశ విభజన సమయంలో పాకిస్తాన్ ను కాదని భారతదేశాన్ని మాతృభూమి గా ఎంచుకున్న ముస్లింలు ఇప్పుడు ఈ దేశంలో రెండవ శ్రేణి పౌరులా?

జ: దేశ విభజన సమయం నుండి భారతదేశంలో ఉన్న అన్ని కులమతాలకు చెందిన వాళ్ళు భారతదేశ పౌరులే అవుతారు.. కొందరి పౌరసత్వం, ఓటు హక్కు రద్దు చేయబడుతుంది అనేది కేవలం అపోహ మాత్రమే.

3) పాకిస్తాన్ లో ఉన్న ఆహ్మదీయులు, షియాలను ఈ జాబితాలో ఎందుకు చేర్చలేదు?

జ: వారు అక్కడ హింస లేదా వివక్ష ఎదుర్కొంటే అది మతపరమైనది కాదు.. అందుకు ఇతర కారణాలు ఉండవచ్చు. ఎందుకంటే ఆహ్మదీయులు, షియాలు ఇస్లాం లో ఒక భాగమే తప్ప వేరు కాదు

4) మత ప్రాతిపదికన పౌరసత్వం ఇవ్వడం ఏమిటి?

జ: ఇక్కడ పౌరసత్వం మతప్రాతిపదికన ఇవ్వడం లేదు.. మతం పేరిట వేధింపులకు గురై ప్రాణభయంతో వచ్చినవారికి పౌరసత్వం ఇస్తున్నారు.. రెండింటికి తేడా ఉంది.

5) మరి శ్రీలంక నుండి శరణార్థులుగా వచ్చిన తమిళులను ఇందులో ఎందుకు చేర్చలేదు?

జ: శ్రీలంక నుండి తమిళ శరణార్ధులు వచ్చిన కారణం అక్కడ జరిగిన సింహళ-తమిళ జాతుల మధ్య జరిగిన పోరాటం వల్లనే కానీ అక్కడ హిందువుల మధ్య బౌధ్ధుల మధ్య జరిగిన హింస కాదు. శ్రీలంక నుండి శరణార్ధులుగా వచ్చిన తమిళులకు భారతీయ పౌరసత్వం ఇవ్వడానికీ ఈ సవరణ చట్టానికి సంబంధం లేదు. వాళ్ళు భారత పౌరసత్వం కోసం Indian Citizenship Act, 1955 సెక్షన్ 5 ప్రకారం దరఖాస్తు చేసుకుంటే నిబంధనల ప్రకారం వారికి పౌరసత్వం ఇస్తారు. ఇది అన్ని మతాల వారికి, జాతుల వారికి వర్తిస్తుంది. పాకిస్థాన్ నుండి వలస వచ్చే ముస్లిమ్స్ కూడా సెక్షన్ 5 క్రింద పౌరసత్వానికి నమోదు చేసుకోవచ్చు.

చివరిగా నా మాట..

అక్రమవలసదారుల పట్ల మన దేశానికి ఒక నిర్ధిష్టమైన విధానం ఎంతో అవసరం. మనకంటే చిన్న చిన్న దేశాలకు స్పష్టమైన విధానం, వైఖరి ఉన్నాయి.
మీరు అక్రమంగా ఇతర దేశాలలో ప్రవేశించి స్వేచ్చగా తిరగగలరా ఊహించండి.. భారతీయులను ఆకర్షిస్తున్న అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలు వలసదారుల విద్యా, ఉద్యోగ అనుభవం, ఆంగ్ల భాషా నైపుణ్యం, background verification, ఆరోగ్య పరీక్షలు వంటి వాటికి పాయింట్స్ ఇచ్చి ఆయా దేశాలకు వెళ్ళడానికి వీసాలు ఇస్తున్నాయి అని గుర్తుంచుకోండి. మోస్ట్ క్వాలిఫైడ్ పీపుల్ మాత్రమే ఈ దేశాల్లో స్థిర పడడానికి వెళ్తున్నారు.. చదువు సంధ్యా లేని అనామకులు కారు.. చట్టబద్దంగా విదేశాలకు పోతున్న భారతీయుల్ని, చట్ట వ్యతిరేకంగా మనదేశంలోకి చొరబడుతున్న ఇతర దేశీయుల్ని ఒకే గాటన కట్టడం మూర్ఖత్వం..ఇది తెలుసుకోవడానికి పెద్దపెద్ద చదువులు చదవాల్సిన అవసరం కూడా లేదు.. కామన్స్ సెన్స్ చాలు…

✍️ నాగరాజు మున్నూరు FB wall,  credits to original post