తెలుగుబాటను విజయవంతం చేయండి. రండి కలిసి నడుద్దాం. మన చేయూతనిద్దాం

మీకు తెలిసిన ప్రతి తెలుగు అంతర్జాల మిత్రులకు తెలుగు బాట గురించి తెలియచేయండి, అందరూ ఆహ్వనితులే


తెలుగు బాట తరువాత  "తెలుగు భాషకు ఆధునిక హోదా అనే అంశము మీద  ఆగస్ట్ 28, 2011 (ఆదివారం) ఉదయం పదకొండు గంటల నుండి సభ వుంటుంది .
వేదిక  పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియం  
 మాతృ భాషా ప్రేమికులు,తెలుగు భాషాభిమానులు ఈ "తెలుగుకై నడక"లో పాల్గొనండి. మీ స్నేహితులను కూడా మీతో కలిపి భాషా చైతన్యం దిశగా అడుగులు వేయించండి.*ప్రవేశం ఉచితం *మీకు తెలుగు బాట కార్యక్రమంలో పాల్గొనాలని ఉంటే, మా నమోదు ఫారాన్ని పూరించండి. http://telugubaata.etelugu.org/ తెలుగు భాష మన సంస్కృతికి ప్రతిరూపం! మన జీవన సౌందర్యం! తేనె కన్నా తీయనిది తెలుగు! తల్లి తర్వాత తల్లి లాంటిది మన మాతృభాష! మన భావాలకు, అనుభూతులకు భావోద్వేగాలకు వాహిక తెలుగు భాష! శబ్ద సౌందర్యం, అక్షర సౌష్టవం తెలుగు ప్రత్యేకత! ఇంత చక్కని మన మాతృభాషను కాపాడుకోవడం,సజీవంగా ఉంచుకోవడం, నిత్య నూతనంగా ఉంచుకోవడం మలచుకోవడం బిడ్డలుగా మన కర్తవ్యం! అంతర్జాలంలో తెలుగు భాషా వ్యాప్తి కోసం కృషి చేస్తున్న స్వచ్ఛంద సంస్థ e-తెలుగు.
అంతర్జాలంలోనే కాక బయటి ప్రపంచంలో కూడా.... అంటే ప్రభుత్వ, ప్రభుత్వేతర వ్యవహారాల్లోనూ, నిత్య జీవితంలోనూ తెలుగు వాడకం పెరగాలనే ఆశయంలో తెలుగు భాషా దినోత్సవానికి ఒక రోజు ముందు అందరికీ అనువైన ఆదివారం రోజున, అంటే ఆగస్టు 28వ తేదీ ఉదయం తెలుగు బాట కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.

సమయం: ఆగస్ట్ 28, 2011 (ఆదివారం) ఉదయం 9 గంటలు
స్థలం మరియు కార్యక్రమం: తెలుగు లలిత కళాతోరణం వద్ద అందరం కలుసుకుని, అక్కడి నుంచి బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ వరకూ "తెలుగు బాట" పేరిట తెలుగుకై నడుద్దాం. 
మాతృ భాషా ప్రేమికులు, తెలుగు భాషాభిమానులు ఈ "తెలుగుకై నడక"లో పాల్గొనాలని, మీ స్నేహితులను కూడా మీతో కలిపి భాషా చైతన్యం దిశగా అడుగులు వేయించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. తెలుగుకై నడుద్దాం, తెలుగు వాడుకను ప్రోత్సహించాలని కోరుతున్నాం !
మీ బంధు మిత్రులకు తెలుగు బాట కార్యక్రమం గురించి తెలియజేసి, విశేష సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా ప్రార్థన. http://telugubaata.etelugu.org/    ఈ తెలుగుబాట కార్యక్రమము లో పాల్గొనుటకు ఎటువంటి రుసుములేదు , తెలుగు భాష మీద  అభిమానము, వ్యాప్తికి   తెలుగు  అభిలాష చాలును!  మీకు తెలుగు బాట కార్యక్రమంలో పాల్గొనాలని ఉంటే, మా నమోదు ఫారాన్ని పూరించండి.

పిల్లలలో న్యాయకత్వ లక్షణాలు

పిల్లలలో న్యాయకత్వ లక్షణాలు పెంపోదాలని మనం చేసే ఈ Leadership ప్రయత్నం తప్పేమో , ముందు వాళ్ళని తమ తోటివారితో సమానంగా మసలు కొని ఒక సంఘ జీవిగా వుండే విద్య నివ్వాలి . గుంపులో ఒకరిని హీరోగా మార్చే / గుర్తించే పక్రియలో మిగిలిన వారు నష్ట పోతున్నారు ఈ రోజు TMAD తరుపున మేహాదిపట్టణం ప్రభుత్వ ప్రాధమిక పాఠశాల లో పంద్రాగస్టు సందర్భంగా కొన్ని పోటీలు పెట్టాం అక్కడ పిల్లలో కొందరు సూపర్ తెలివి తేటలుగలవారు , వాళ్లకి మింగిలిన వారు అనుచరులు అన్ని పనులకు వారిదే అజమాయిషీ , అయా దగ్గర నుండి ప్రధానో పాధ్యాయుల దాక అందరు పిలిచేది ,పనులు అప్పగించేది ఈ ఒకరిద్దరికే క్విజ్ , లాంటి పోటిలలో ఆ టీం లీడర్గా వున్న ఈ ఒకరిద్దరు మాత్ర్తమే చురుకుగా పాల్గొన్నారు టీం లో మిగిలిన సబ్యులు చపట్లకే పరిమితమయ్యారు . ఆ లీడర్ సమాధానం చెప్పలేక పొతే ఇంక టీం లో ఎవ్వరు నోరు విప్పేవారు కాదు . నేను కొంత మంది పిల్లల ఎందుకు సమాధాము చెప్పటానికి ప్రయత్నిమ్చారని అడిగితే వాళ్ళ లీడర్ కే తెలవంది తమకు ఎలా తెలుస్తుంది అని చెప్పారు , కొన్ని పోటీలలో అయితే ఫలానా వాడు పోటికి వున్నారని తెలిసి విరమించు కొన్నారు . నాకు ఒక్కటి మాత్రం అర్ధ మయినది మనం ఈ పోటీ ప్రపంచం లో పుట్టి పెరిగాం ఇక్కడ టైం / తెలివి బాగుండి లీడర్ అయ్యామా సరే .. లేకుంటే అనుచరులుగా మిగిలి పోతాం

క్విజ్ లో భాగంగా కొన్ని ప్రశ్నలు అడిగా , పాపులర్ ప్రశ్న లకు సమాధానం చెప్పారు కాని అదే ప్రశ్న కొంచం మార్చి అడిగితె సరిగా చెప్పలేక పోయారు

 ఉదా 1: మన జాతీయ జెండా రూపకర్త ఎవరు అంటే పింగళి వెంకయ్య అని చెప్పారు అదే  ప్రశ్న వేరే టీం కు మన దేశ జెండా చేసిన తెలుగాయన పేరు ఏందీ అంటే చెప్పలేక పోయారు
 ఉదా ౨: మీ ఇంటి తపాలా చిరునామా ఏమిటో చెప్పు అంటే ఎవ్వరు చెప్పలేక పోయారు , కాని వరంగల్ లో వుండే మీ దోస్తునకు మి ఇంటికి ఎట్ల రావల్నో రాసియంటే బాగనే రాసి ఇచ్చింన్రు

మా మెహదిపట్నం ఇస్కులు పిల్లలకు English పద్యాలు భాగా అర్ధం అవటానికి  కొన్నిటికి తెలుగు వివరణ

Twinkle, twinkle, little star.
How I wonder what you are.
Up above the world so high,
Like a diamond in the sky.

మిరిసే మిరిసే సిన్ని చుక్కా

పరేషాన్ అయితినే నిన్ను చూసి

దునియాకు మస్తు పైన,  ఎత్తుల

ఆకాశం లో వజ్రం లెక్క ఉన్నవ్

Baa, baa, black sheep,
Have you any wool?
Yes sir, yes sir,
Three bags full.
One for the master,
One for the dame,
And one for the little boy
Who lives down the lane

బా బా ..కర్రే గొర్రె

నీకాడ ఉన్ని ఎంతుంటది

ఆవునయ్యా   ఆవునయ్యా

మూడు మూటలు ఉన్నయ్

ఒకటేమో దొరకు

ఒకటేమో దొరసానికి

ఇంకా ఒకటేమో చిన్న పోరాగానిని

ఆ గొందు సివర్న వుంటడే వాడు

Humpty Dumpty sat on a wall;
Humpty Dumpty had a great fall.
All the King’s horses
And all the King’s men
Couldn’t  put Humpty together again!

హుమ్ప్తి డుమ్ప్తి గోడమీద కూకుండు

హుమ్ప్తి డుమ్ప్తి  కింద పడ్డడు

దొరవి  అన్ని గుర్రాలు

ఇంకా దొర గాని అందరు జనాలు

హుమ్ప్తి గాడిని మల్లా పైన కూకో బెట్ట లేక పోయింన్రు

చిన్నపుడు ఏదో ఇంగ్లీష్ రైమ్స్ నేర్చు కోవటమే గాని ఎప్పుడు అనువదించలే …ఇప్పుడు అనిపిస్తోంది వాళ్ళ బాల సాహిత్యం కన్నా మనదే బాగున్నది 🙂

Please consider this is not attempt  to represent my beautiful  telengana language in funny manner , I  just make some attemept to rewrite popular poems  in local language