పోలవరం ప్రాజెక్టు

ఇది 1937 లో ఆంధ్రపత్రికలో వచ్చిన వార్త. ఆనాడే బ్రిటిష్ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు వలన ఎంత లాభమో, నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందో అన్నదానిపై చాలా స్పష్టంగా చెప్పారు.

అయితే మన పాలకుల నిర్లక్ష్యానికి 83 ఏళ్ళ తరువాత కూడా ఈ ప్రాజెక్టుపై గందరగోళం అలానే ఉంది. నిర్మాణ అంచనా దాదాపు లక్ష రేట్లు పెరిగి ఇప్పుడు రూ. 56 వేల కోట్లకు చేరింది.

ఎప్పుడు పూర్తవుతుందో ఆ దేవుడికే ఎరుక!!!

from Srinivasarao Kusampudi, Bandaru Srinivasa Rao garu FB post

చాలా కాలం క్రితం రాసింది.
పోలవరం కధా కమామిషు – భండారు శ్రీనివాసరావు
దేశంలోని నదులన్నింటినీ అనుసంధానం చేయాలన్న ఆలోచనలోనుంచే ఈ ప్రాజెక్ట్ పురుడు పోసుకుంది. 1941 జులైలో అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి ఈ ప్రతిపాదన వచ్చింది. ప్రెసిడెన్సీ నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజినీర్ ఎల్. వెంకట కృష్ణ అయ్యర్ మొదటి ప్రాజెక్ట్ నివేదిక తయారుచేసారు. ఆరోజుల్లో మొత్తం ప్రాజెక్ట్ వ్యయాన్ని ఆరున్నర కోట్ల రూపాయలుగా అంచనా వేసారు. ప్రాజెక్ట్ అతీగతీ లేదు కాని అంచనావ్యయం మాత్రం స్వతంత్రం వచ్చేనాటికి ఆరున్నర కోట్ల నుంచి రెండువందల కోట్లు దాటిపోయింది. అప్పట్లోనే ఈ ప్రాజెక్ట్ కు నామకరణం కూడా చేశారు. ప్రాజెక్ట్ రిజర్వాయర్ జలాలు వెనుకవున్న భద్రాచలం సీతారామస్వామి గుడిని తాకే అవకాశం వున్నందువల్ల ‘రామపాద సాగర్’ అని పేరు పెట్టారు. తదనంతరం కె.ఎల్.రావు గారు, పోలవరం కుడి గట్టు కాల్వని, కృష్ణానదిపై ఆక్విడక్ట్ నిర్మించి గుంటూరు జిల్లావరకు పొడిగించేట్టు ప్రతిపాదించారు. ఇలా ప్రతిపాదనలన్నీ కాగితాలపై వుండగానే, ప్రాజెక్ట్ అంచనా వ్యయం 2004 కల్లా ఎనిమిదివేల ఆరువందల కోట్లకు పెరిగిపోయింది. 1980 లో అప్పటి ముఖ్యమంత్రి టి.అంజయ్య పోలవరం ప్రాజెక్టుకు మొదటి పునాది రాయి వేసారు. శంఖుస్థాపన పలకం బీటలు వారిపోయింది కాని ప్రాజెక్టు పనులు ఒక అంగుళం కూడా ముందుకు సాగలేదు. ఇలా పురోగతి లేకుండా దస్త్రాలలోనే పడివున్న పోలవరానికి, వై. ఎస్. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి కాగానే తీసుకున్న చొరవతో కదలిక మొదలయింది.
కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ప్రస్తుతం వున్న ఆయకట్టు స్థిరీకరణతో సహా సేద్యపు నీటి సౌకర్యం కల్పించడం ప్రాజెక్ట్ లక్ష్యం. పోలవరం నుంచి మళ్లించిన గోదావరి జలాలను కృష్ణా నదిలో కలిపేందుకు ప్రకాశం బరాజ్ ఎగువన కొత్తగా మరో బరాజ్ నిర్మించడం కూడా ఈ పధకంలో ఓ భాగం.
అవిభాజిత ఆంధ్ర ప్రదేశ్ లో కృష్ణా గోదావరి నదులే ప్రధాన సేద్యపు నీటివనరులు. ఇందులో కృష్ణానది నుంచి నీటి లభ్యత నానాటికీ తగ్గిపోతోంది. పోతే, గోదావరిలో మిగులు జలాలు ఎక్కువ. ఏటా కొన్ని వందల వేల క్యూసెక్కుల నీరు వృధాగా సముద్రంలో కలిసిపోతోంది. ఆ నీటిని కృష్ణా డెల్టాకు మళ్ళించడం ద్వారా కృష్ణానదీ జలాలను వాటి అవసరం ఎక్కువగా వున్న రాయలసీమ ప్రాంతానికి తరలించడం సాధ్య పడుతుంది. ఈ కోణంలో నుంచి పుట్టుకొచ్చిన ఆలోచనే పోలవరం. ఈ ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల సుమారు రెండువందల డెబ్బయ్ ఆరు గ్రామాలు ముంపుకు గురవుతాయి. దాదాపు నలభయ్ వేల పైచిలుకు కుటుంబాలవారు నిరాశ్రయులవుతారు. వారికి పునరావాసం కల్పించాల్సి వుంటుంది. ఎక్కడ ప్రాజెక్ట్ కట్టినా ఈ తిప్పలు తప్పవు. కానీ పోలవరం వల్ల నిరాశ్రయులయ్యేవారిలో సగం మంది అక్కడి నేలను, అడివినీ నమ్ముకున్న షెడ్యూల్ల్ తెగలవారు కావడం గమనార్హం.

అది ఇంకా సగంకూడా పూర్తి కాలేదు ముంపు ప్రాంతంఅయిన రుద్రంకోటలో ఇళ్ళు ఖాళీ చేయాలని చెప్పారట, నా చిన్ననాటి ఎన్నో గుర్తులు ఆఊరితో 😢

ఈదేశంలో పేద బ్రతుకు .. చెడ్డ బ్రతుకు కాదు

నాకు ఊహ తెలిసినప్పటి నుంచి వింటున్నా..

🗣️”పేదరికాన్ని నిర్మూలిస్తాం”, పేదలను ఆదుకోవాలి , ఇళ్ళు, ఆరోగ్యం,, ఉచిత విద్య,వైద్యం అన్నీ !

నాకు అర్థమవని విషయమేంటంటే….

అసలు పేదరికాన్ని నిర్మూలించాల్సిన బాధ్యత సమాజానికి ఏమిటి?
ప్రతి మనిషి ఎవరి కష్టం మీద వాళ్ళు బ్రతుకేటప్పుడు,
మద్య తరగతి వాడి కష్టం- పేదవాడి కష్టం కన్నా ఏ విషయం లో తక్కువ?
ఈ పేదవాడు ప్రభుత్వ దత్తపుత్రుడు ఎందుకవుతున్నాడు?
ప్రభుత్వం అందరిదీ అయినప్పుడు, మద్య తరగతి వాడి పొట్ట కొట్టి పేదవాడికి ఎందుకు పెడుతున్నారు?
అసలు ఈ సమాజం యొక్క సంవృద్దికి పేదవాడి సహకారం ఏమిటి?

వీడు టాక్స్ కట్టడు.
వీడు పొదుపు చెయ్యడు.
వీడు కుటుంబ నియంత్రణ పాటించడు.
వీడు చట్టాన్ని గౌరవించడు.
వీడు ఆరోగ్య సూత్రాలు పాటించడు.
వీడికసలు కుటుంబ భాధ్యతే ఉండదు.
వీడింట్లో పిల్లలకు అరటి పండుకి డబ్బు లుండవు కానీ మత్తిచ్చే మందుసీసా కి లోటుండదు.
అసలు వీడు అన్నింటిలోనూ Irresponsible.
వీడు తూలుతూ హక్కుల గురించి మాత్రమే మాట్లాడతాడు.
వీడికి సమాజం పట్ల ఎటువంటి బాధ్యత ఉండదు.
వీడంత మూర్ఖుడు ఇంకొకడు ఉండడు.
వీడికన్నీ ఉచితం గా కావాలి.
వీడికి సమాజ శ్రేయస్సు తో సంబంధం లేదు.సామాజిక భాధ్యత ఉండదు.
వీడికి అవినీతి తప్పు కాదు. కదా పైగా సమర్ధిస్తాడు.
ఎవడు ఉచితాలు, డబ్బులెక్కువిస్తే వాడికే ఓటు , ఈ నాాయకులు ఏదో
వాాళ్్ళళ జేబులో డబ్బులు ఇస్్తఇస్్తుంం ఈరోజు ప్రభుత్వవం నిర్ణయిస్తున్నారు.
వీళ్ళు ఎంత ఎక్కువ మంది ఉంటే, అవినీతిపరులు అంత సులభంగా అధికారం లోకి రావచ్చు.
అందుకే ఓటుకి నోటు ఇవ్వని వాడికి డిపాజిట్ కూడా దక్కదు.
ప్రజాస్వామ్యం లో దేశానికి అసలు నష్టం పేదవాడి వల్లే జరుగుతోంది.

అందుకే

దేశం లో అన్యాయమౌతోంది పేదవాడు కాదు,
మద్య తరగతి వాడు.
పేదవాళ్ళకి పేదరిక నిర్మూలన అవసరం లేదు. ఎందుకంటే ఉచితాలు పోతాయి.
రాజకీయ నాయకులకూ పేదరిక నిర్మూలన వల్ల ఉపయోగం లేదు.
కాబట్టి పేదరికం ఎప్పటికీ నిర్మూలించబడదు.

ఇంచుమించుగా దేశ రక్షణ పేరుతో చేస్తున్న ఖర్చు కూడా అంతే.దేశ బడ్జెట్ లో సింహ భాగం దీనికే….పాకిస్థాన్ కి , ఉత్తర కొరియాకి పనికి రాని డొప్పలున్న ఒక్కొక్క రఫెల్ ని ఉచితంగా ఇస్తాడు కంపెనీ వాడు….దాంట్లో అధ్భుతాలు అన్నీఇన్నీ కావని ప్రపంచ వ్యాప్తంగా ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తాడు…అంతే పాక్ దగ్గర ఒకటి ఉందని ఇండియా వంద , ఉత్తర కొరియా దగ్గర ఒకటుందని దక్షిణ కొరియా ఓ వంద కొనేస్తాయి.ఇంక చైనాలాంటివి సరేసరి…..ఆ పాకిస్థాన్ దగ్గరున్న డబ్బా విమానం
స్టార్ట్ అయ్యేదీ లేదు…ఇండియా లోవి ఎగిరేదీ లేదు.అప్పుడప్పుడు మాత్రం ఏదో రకంగా హడావుడి చేస్తుంటారు.మరికొన్ని లక్షల కోట్లు ఖర్చు కోసం మాత్రమే కానీ “POK” అన్న పదం మిగిలే ఉంటుంది.

టాక్స్ లు కడుతున్న వెంగళప్పలు మాత్రం మళ్లీ ఇరవై పెట్రోల్ ని డెబ్బైకి కొనుక్కొని తింగరోళ్లలా తలదించుకుని ఉరుకుల పరుగులతో బ్రతుకీడుస్తుంటారు.మౌళిక సదుపాయాలుండని మన దేశంలో గతుకుల రోడ్ల పై తిరుగుతూనే యుంటారు.

పైన చెప్పినట్లు.. పేదవాడు డబ్బు తీసుకుని ఓట్లు వేస్తూ… సంక్షేమ పధకాలన్నీ పొందుతూ, మోటార్ సైకిల్,టివి,ఫ్రిజ్,మిక్సీ,కూలర్/ఎసి,స్మార్ట్ ఫోన్ లాంటివి అన్నీ ఉన్నా మరుగుదొడ్డి మాత్రం ఉండదు,ఉన్నా వాడరు…వీరు ప్రభుత్వం దృష్టిలో మాత్రమే పేదవాడి గా ఉంటారు…అలానే తూలుతుంటాడు…అసలు కారణం ఏమిటంటే ఆ ఇంట్లో నాలుగు ఓట్లుంటాయి మరి.

క్రింద చెప్పినట్లు… దేశం చుట్టూ సైనికలు రేయింబగళ్లు,ఎండావానమంచుల్లో మాత్రం పహరా కాస్తూనే ఉంటారు.

స్థూలంగా ఈ దేశంలో వెంగళప్పలు ఎవరయా అంటే బ్యాంక్ ఋణాలు ఎగ్గొట్టకుండా..నిఖార్సుగా వాయిదాలు కడుతూ….ట్యాక్స్ లు కట్టే మధ్యతరగతి మనిషి , నా దేశం అంటూ వీరుడయ్యే సైనికుడు , దేశానికి అన్నం పెట్టే విలువ లేని రైతు

కానీ…నాయకులు , ఉన్నతాధికారులు మాత్రం పొట్ట మీద చేయి వేసుకుని రాజరికం వెలగబెడుతూ కార్పోరేట్లతో సావాసం చేస్తూ చల్లగా కులాసాగా కాలం గడిపేస్తూనే ఉంటారు.

మేరా భారత్ మహాన్ -Whatsapp Forward Edited – credits to original author

ఎక్కడి మానుష జన్మం -Edited – Personalized – Due Respects

ఎక్కడి మానుష జన్మంబెత్తిన ఫలమే మున్నది
నిక్కము నన్నే నమ్మితి.. నా  చిత్తంబికను…. నా  చిత్తంబికను 

మరువను ఆహారంబును.. మరవను సంసార సుఖము..
మరవను ఇంద్రియ భోగము.. 

మరువను అంతర్జాలంబును .. మరవను ముఖ పుస్తకమ్మును ..
మరవను  వాట్సాప్పును .. 

మరచెద సుఙ్ణానంబును… మరచెద తత్త్వ రహశ్యము..
మరచెద గురువును దైవము .. నా ఖర్మా 

విడువను పాపము పుణ్యము.. విడువను నా దుర్గుణములు..
విడువను మిక్కిలి ఆశలు.. నేనింతే.. 

విడిచెద షట్కర్మంబులు.. విడిచెద వైరాగ్యంబును..
విడిచెద నాచారంబును 

 తగిలెద బహు లంపటముల… తగిలెద బహు బంధంబుల..
తగులను ఖర్మ  మార్గము తలపున ఎంతైనా  

ఎక్కడి మానుష జన్మంబెత్తిన ఫలమే మున్నది
నిక్కము నిన్నే నమ్మితి.. నీ చిత్తంబికను…. నీ చిత్తంబికను….

Rent a Motor Cab/Cycle Schemes

అద్దె మోటారు క్యాబ్ / సైకిల్ పథకాల అమలుకు సంబంధించి అడ్వైజ‌రీని జారీ చేసిన రహదారుల‌ మంత్రిత్వ శాఖ

“రెంట్ -ఎ- మోటార్ క్యాబ్ / సైకిల్ ప‌థ‌కాలు” అమ‌లుకు సంబంధించి కొంత మంది వాటాదారులు ఎదుర్కొంటున్న‌‌ సమస్యల్ని ఆధారంగా చేసుకొని రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ సోమ‌వారం ఒక అడ్వైజ‌రీని జారీ చేసింది. ఆర్‌టీ-11036/09/2020-ఎంవీఎల్ (పీటీ-1)గా మంత్రిత్వ శాఖ దీనిని జారీ చేసింది. ఈ అడ్వైజ‌రీలో అంశాలు ఈ కింది విధంగా పేర్కొన‌బ‌డ్డాయి.

(ఎ) వాహ‌న‌దారు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ / ఐడీపీ మ‌రియు మోటారు క్యాబ్ (ఫారం 3/4) అద్దెకు సంబంధించిన లైసెన్స్ కాపీ లేదా ఆయా ప‌థ‌కాల‌కు సంబంధించిన మోటారు సైకిల్ (ఫారం 2) క‌లిగి ఉన్నట్ల‌యితే.. వారిని ఏదైనా ఇత‌ర బ్యాడ్జ్ కోసం పట్టుబట్టకూడదు.

(బి) “రెంట్-ఎ-మోటార్ సైకిల్ పథకం” అమలు చేయబడుతుంది మరియు ఆపరేటర్లకు లైసెన్సులు అధికారికంగా పరిగణించబడతాయి.

(సి)  దీనికితోడు, ‘రెంట్-ఎ-మోటార్‌సైకిల్ స్కీమ్’ కింద లైసెన్స్ ఉన్న ద్విచక్ర వాహనం వారు సంబంధిత పన్నుల చెల్లింపుల‌తో ఆయా రాష్ట్రాల గుండా ప్ర‌యాణాలు సాగించేందుకు అనుమతించబడుతారు.

రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ జూన్ 06వ తేదీ, 1989లో జారీ చేసిన ఎస్ఓ 437 (ఈ) ప‌త్రంలో రెంట్‌‌-ఎ-క్యాబ్ ప‌‌థ‌కం‌కు సంబంధించిన విధివిధానాల్ని నోటిఫై చేసింది. మంత్రిత్వ శాఖ మే 05వ తేదీ 1997లో జారీ చేసిన ఎస్ఓ 375 (ఈ) ప‌త్రంలో రెంట్‌‌- ఎ -మోటార్ సైకిల్‌ ప‌‌థ‌కం‌కు
సంబంధించి ప‌లు విధివిధానాల్ని నోటిఫై చేసింది. పర్య‌టకులు, కార్పొరేట్ అధికారుల వాహ‌నాలు, వ్యాపార ప్రయాణికులు మరియు కుటుంబాలు సెలవు దినాల్లో వినియోగించే టాక్సీ మాదిరిగా ఆయా వాహ‌నాల‌ను ప‌రిగ‌ణిస్తారు

Ministry of Road Transport & Highways

Road Ministry issues advisory for implementing Rent a Motor Cab/Cycle Schemes

Posted On: 01 JUN 2020 6:03PM by PIB Delhi

The Ministry of Road Transport and Highways has issued advisory based on the issues received from certain stakeholders in implementing “Rent a Motor Cab/Cycle Schemes” vide No RT-11036/09/2020-MVL(pt-1) dated 01 June 2020 wherein it has been written that –

a.         The person driving the Commercial Vehicle carrying the valid driving license /IDP and a copy of license for renting motor cab (Form 3/4) or for the motor cycle (Form 2) of respective scheme should not be insisted for any badge.

b.         “Rent–a-motorcycle scheme” be implemented and licenses to the operators may be considered.

c.         Further, two-wheeler with license under ‘Rent-a-Motorcycle Scheme” be allowed to drive across the States on payment of relevant taxes.

The Ministry vide SO 437(E) dated 12.06.1989 had notified guidelines for Rent-a-cab scheme and SO 375(E) at 12.05.1997 for the Rent-a-motorcycle Scheme, 1997. These Vehicles are used as compared to Taxi services by tourists, corporate officials, business travellers and families on holiday across.

***

RCJ/MS