తెలుగు వికీపీడియా 11 వ వార్షికోత్సవాలు – తేదీ: ఫిబ్రవరి 14, 15 2015 వేదిక : ఉదయీ ఇంటర్నేషనల్ హోటల్, తిరుపతి ఆర్.టి.సి. బస్టాండు ఎదురుగా.

విశ్వ విజ్ఞానాన్నంతటికీ ప్రతీకగా మారిన వికీమీడియా ఉద్యమం, జనవరి నాటికి పదమూడేళ్ళు పూర్తి చేసూకోనుంది. ఈ విజ్ఞాన సర్వస్వ మహాయజ్ఞంలో మనమూ వెనుకంజలో లేమని నిరూపిస్తూ, 2003 డిసెంబర్ 10న తెలుగు వికీపీడియా ప్రారంభమయింది. పదకొండు సంవత్సరాల ఈ ప్రయాణంలో ఎందరో ఔత్సాహికుల తోడ్పాటుతో 60 వేలకు చేరువలో ఉన్నందుకు అత్యంత ఉత్సాహంతో 11 సంవత్సరాల సంబరాలు జరుపాలని నిర్ణయింపబడినది. ఇందుకు కారణం వికీపీడియాలో వ్యాసాలు రాస్తూ అభివృద్ధి పరుస్తున్న ఎందరో మహానుభావులు. ఆ మహానుభావులను ఒక చోట చేర్చి, సత్కరించాలనీ, సమూహ సభ్యులు ఒకరినొకరు ప్రత్యక్షంగా కలవడం ద్వారా సమిష్టి కృషిలో పాల్గొనేందుకు మరింత స్ఫూర్తి దొరుకుతుందనే ఆశయంతో ఈ తెవికీ 11వ వార్షికోత్సవాలను సంబరాలుగా జరుపుకోబోతున్నాం. .

కార్యక్రమ లక్ష్యాలు

  1. తెలుగు వికీపీడియాలో వ్యాసాల నాణ్యతను, సంఖ్యను పెంచడం
  2. తెలుగు వికీపీడియా వాడుకరులను పెంచడం
  3. తెలుగు సమాచారాన్ని ఉచితంగా అందరికి అందుబాటులో ఉంచడం
  4. తెలుగు వికీపీడియా వాడుకరులు కొత్త వాడుకరులను తయారుచేసేలా ప్రోత్సహించడం
  5. తెలుగు వికీపీడియాకు గుర్తింపు వచ్చేలా, ప్రజలందరికి తెలిసేలా చేయడం
  6. గ్లోబల్ లెవల్ లో తెలుగు వికీపీడియాకు విజిబులిటి కల్పించడం
  7. ఆఫ్‌లైన్‌లో వికీని ఉపయొగించుకొనేలా అందుబాటులోకి తేవడం

    Wiki Logo

    Telugu Wikipedia

Advertisements

వికీపీడియా:ఐదు మూలస్తంభాలు

First pillar
వికీపీడియా ఒక విజ్ఞాన సర్వస్వం. ఇది మౌలిక డాక్యుమెంట్లు దొరికే వనరు కాదు, వార్తాపత్రిక కాదు, ఉచితంగానో, వెలకో వెబ్‌లో స్థలం ఇచ్చే సంస్థ కాదు. ప్రజాస్వామ్య ప్రయోగము కాదు. మీ స్వంత అభిప్రాయాలు, అనుభవాలు, వాదనలు ప్రచురించుకునే స్థలం అంతకంటే కాదు. సమాచారంలో సభ్యులంతా శ్రమించాలి.
Second pillar
వికీపీడియా తటస్థ దృక్కోణాన్ని అనుసరిస్తుంది. అంటే వ్యాసాలు ఏ ఒక్క దృక్కోణాన్నీ ప్రతిబింబించవు. దీనికోసం ఒక్కోసారి వివిధ దృక్కోణాలను చూపవలసి రావచ్చు; విషయానికి సంబంధించిన అన్ని దృక్కోణాలను నిష్పాక్షికంగా, అది ఎవరి దృక్కోణమో వివరంగా తెలిసేలా సందర్భశుద్ధిగా ప్రతిబింబించాలి. దీనివలన చదువరులకు అది ఎవరి దృక్కోణమో తెలుస్తుంది. ఫలానా దృక్కోణం నిజమనీ, సరైనదనీ చూపించరాదు. అవసరమైనచోట మీ వ్యాస మూలాలను, వనరులను ఉటంకించాలి. మరీ ముఖ్యంగా, వివాదాస్పద విషయాల్లో ఇది చాలా అవసరం.
Third pillar
స్వేచ్ఛగాపంచుకోగల విషయమైన వికీపీడియా ఎవరిచేనైనా మార్చుటకు వాడుటకు, సవరించుటకు మరియు పంపిణి చేయటకు వీలైనది.:సంపాదకులందరూ సమాజానికి ఉచితంగా తమ కృతులను అందచేస్తారు కాబట్టి , ఏ ఒక్క సంపాదకునికివ్యాస యజమానిత్వం లేదు మరియు ఏరచనలైనా ఎలాగైనా మార్పులకు గురిఅగుతాయి మరియు పంపిణి అవుతాయి. నకలుహక్కుల చట్టాలను గౌరవించండి మరియు మూలాలనుండి దొంగతనము చేయవద్దు. ఉచితం కాని మాధ్యమాలను అప్పుగా వాడుకొనుట సముచిత వినియోగం క్రింద అనుమతించబడినది కాని మొదట స్వేచ్ఛగాపంచుకోగల వాటిగురించి గట్టి కృషి చేయాలి.
Fourth pillar
వికీపీడియా తోటి సభ్యులను – వారితో మీరు ఏకీభవించకపోయినా – గౌరవించండి. వ్యక్తిగతమైన దాడికి దిగకండి. వ్యర్థ వివాదాలకు తావివ్వకండి. మీ వాదనను నిరూపించుకునేందుకు వికీపీడియాలో అడ్డంకులు సృష్టించక, నిబద్ధతతో ఉండండి. ఇతరులు కూడా అంతే నిబద్ధతతో ఉన్నారని భావించండి – అలా లేరనేందుకు మీదగ్గర తిరుగులేని సాక్ష్యం ఉంటే తప్ప. మీ వాదనకు అనుకూలంగా బలం పెంచుకునేందుకు మిథ్యా సభ్యులను సృష్టించకండి.
Fifth pillar
ఇక్కడ పైన పేర్కొన్న వి కాకుండా, వికీపీడియాలో మరే స్థిర నిబంధనలూ లేవు. వ్యాసాలలో మార్పులు చేర్పులు చేసేందుకు చొరవగా ముందుకు రండి. వ్యాసాన్ని చెడగొడతామేమోనని వెనకాడవద్దు. పాత కూర్పులన్నీ జాగ్రత్తగానే ఉంటాయి కాబట్టి, తిరిగి సరిదిద్దలేనంతగా చెడగొట్టే అవకాశం లేదు. అయితే, ఒక్క విషయం..మీరు ఇక్కడ రాసేది శాశ్వతంగా ఉండే అవకాశం ఉందని గ్రహించండి.

Komposita1.png Korintisk1.png Komposita1.png Korintisk1.png Komposita1.png