‘బిగ్‌బ్రదర్’ రియాల్టీ షో కిరీటాన్ని బాలీవుడ్ సుందరి శిల్పాశెట్టి సొంతంచేసుకుంది. ఎన్ని నాటకీయ పరిమాణాలు- ఇది ఊహించిందే !భారత ప్రజలారా మీకు‘బిగ్‌బ్రదర్’ రియాల్టీ షో చక్కటి అవగానవచ్హి నదికదూ !!మరి ఇకనే బహూళజాతి కంపెనీల రాబడికి మరి ఇన్ని అకాశములు . ఒక పద్యము గుర్తుకు వస్తోందిభరతఖండంబు చక్కని పాడియావు—————————– (ప్రస్తుత పరిస్తితులకు ఇక్కడ భారతీయులు అనుకోవచ్చు నేమో)
—————————-పితుకుచున్నారు మూతులు బిగియగట్టి.అంతా
మన ఖ(క)ర్మ
‘బిగ్‌బ్రదర్’ రియాల్టీ షో కిరీటాన్ని బాలీవుడ్ సుందరి శిల్పాశెట్టి సొంతంచేసుకుంది. ఈవిజయంతో శిల్పాశెట్టికి లక్ష పౌండ్ల ప్రైజ్‌మనీ లభించింది. ప్రారంభమైనప్పటినుండి వివాదాల నడుమ చిక్కుకున్న ఈ కార్యక్రమంలో ఆసియానుండి పాల్గొన్న తొలిసారే కిరీటం గెలుచుకోవటం విశేషం. 63 శాతం ప్రజలు శిల్పాశెట్టికి అనుకూలంగా ఓటువేశారు. జెడ్‌గూడీ ఎపిసోడ్ తర్వాత శిల్పాశెట్టికి ఆదరణ పెరిగింది. ఇంగ్లాడ్‌లోని ప్రముఖ పత్రికకు గూడీకి వ్యతిరేకంగా వచ్చిన 50వేల లెటర్స్ చూస్తుంటే శ్‌ిల్పాశెట్టికి ఉన్నఆదరణ తెలుస్తుంది. గూడీతో పాటు శిల్పపై చిర్రుబుర్రులాడిన మాజీ సుందరి డేనియల్ లాయిడ్ షో ముగిసిన తర్వాత సారీ చెప్పింది. ఈ కిరీటం దక్కిన తర్వాత శిల్పకు హాలీవుడ్ ఛాన్స్‌లు ఇబ్బడిముబ్బడిగా వచ్చిపడుతుండగా ఇప్పటికే రెండు సినిమాలతో ఒప్పందం చేసుకుంది. బ్రిటన్ పార్లమెంట్‌లో జాతివివక్ష ఆరోపణలపై చర్చజరిగిన తర్వాత ఈ షోకు విపరీతంగా రేటింగ్స్‌పెరిగాయి. ఈ షో అర్ధాంతరంగా ముగిసిపోతుందనుకున్న నిర్వాహకులకు అనూహ్యంగా రేటింగ్స్ పెరగటంతో ఊపిరిపీల్చుకున్నారు. ఇది ఐదవ బిగ్‌బ్రదర్ రియాల్టీషో. . www.telugupeople.com నుండి
భరత ఖండంబు అనే పద్యని చిలకమర్తి వారు వ్రాశారు భరతఖండంబు చక్కని పాడియావుహిందువులు (భారతీయులు ) లేగదుడలై ఏడ్చుచుండతెల్లవారును గడుసరి గొల్లవారు పితుకుచున్నారు మూతులు బిగియగట్టి.