ఆధార్ సాక్షి గా మన రాస్ట్ర జిల్లాలు యాబై కి పైనే !

మన ప్రభుత్వం పెట్టిన దేశ పౌరులందరికీ గుర్తింపు కార్డుల పక్రియ ఆధార్ .. ఈ కార్డు ను వ్యక్తి వేలి ముద్రల , కంటి పాపల సమాచారం ఆధారం గా నమోదయి ఉంటుంది.మనవాళ్ళు కళ్ళు వెళ్ళే కదా కావాలి అనుకోని ఆవ్యక్తి వివరాలు , అడ్రస్సు ఋజువులు పూర్తిగా విస్మరించారు . నేను మణికొండ దగ్గర ఆధార సెంటర్కి వెళ్ళాను , అసలు ఒరిజినల్స్ ఎవ్వరూ అడగలేదు , వియ్యేవో గారు సంతకం చేసిన ఖాళీ ఫారం జిరాస్క్లు లు తీసి వాటి మీద వివరాలు ఇస్తున్నారు , అవి పూర్తి తెలుగులో ఉండటంతో తెలుగు రాని వాళ్ళు కొంచెం ఇబ్బంది పడ్డారు , ఇక వాళ్ళ ఆధార్ కార్డులో తెలుగు పేర్లు ఆయా ఆపరేటర్ల దయ kannan perumal iyengar కు కన్నన్ పెరుమల్ ఇయెంగర్ అని ఎంట్రీ చేసారు ఆ ఆపరేటర్లకు సిస్టం మీద సరిఅయిన అవగాహనే లేదు, మనం ఈమెయిలు బ్యాంకు ఇతర వివరాలు ఇచ్చినా వారు ఎంట్రీ చెయ్యరు అదేమిటని అడిగితే అవి ఎంట్రీ కావని ఓ విసుగు సమాధానం , కొంతమంది కష్ట జీవులు పని చేసీ చేసి వేళ్ళు అరిగి పోవటంతో వేలిముద్రలు సరిగా రాక వాళ్ళని సిబ్బంది తరువాత రమ్మని చెప్పారు దీనికి తోడు ఆడ్రస్ డేటా బేసులో బోలేడుతప్పుడు , ఉదా మణికొండ రెండు జిల్లాలలో వుంది కాని డివిజన్ ఒక్కటే . దానికి సంబందించిన పిన్ కోడులు కొన్ని సికింద్రాబాదుకు చెందుతాయి . గోల్కొండ ఆర్బన్, రూరల్ లో వుంది పక్కెనే ఉన్న shaikపేట ను సిస్టం తీసుకోవటం లేదు . దీని మీద ఫిర్యాదు ఇద్దామని అన్ లైనుకు వెళితే అది మన రాష్త్రం లో యాభై జిల్లాలు చూపిస్తోంది .https://docs.google.com/file/d/0B_7hKJoqHIiMNk1QOHMxQWQxelU/edit?usp=sharing ఖర్మ మూడు అనంతపూర్ లు .. యూనిక్ ఐడెంటిటీకి మన ప్రభుత్వం ఎంతో పటిష్టంగా రూపొందించాలి పాస్ పోర్టు ఇవ్వటాని అనేక నిభందనలు , వెరిఫికేషనులు పెట్టె మన ప్రభుత్వం అన్నింటికీ ‘ఆధార్’మంటూ .. ఆధార్‌కార్డులను జారీచేయడంలో అంతులేని నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది

తమ్ముడు వేలు కొరికితే కోటి రూపాయలు !

మొన్న ఆమధ్య ఒక వార్త చూసాను యౌ టూబ్ లో యాబై ఆరు సెకనుల “Charlie bit my finger” up loader సంపాదన కేవలం Youtube ద్వారా కోటి పైమాటే , ఇంకా Gangnam Style’ Has Brought In $8 Million In Ad Revenue ForYouTube . మన గీత ఆర్ట్ వారి 11,894,354 దర్శకుల కు సుమారు ఇరవై లక్షలు వచ్చి ఉంటాయి , సాధారణం గా ఒక వెయ్యి వ్యూ లకు కనీసం నూట యాబై రూపాయలు వస్తాయి , అలా మీ వీడియోలు రోజుకు ఐదు వేలమంది చూస్తే మీ చానెల్ సంపాదన నెలకు పాతిక వేల పైన ఉంటుంది . ఇందుకే కాబోలు మన సినిమాలు , లఘు చిత్రాలు , ఇంకా భోలేడు కంటెంట్ అలా దొరుకుతోంది .. భళా !!!