Micro$oft పై మన ప్రభుత్వ ప్రేమ

22,00,00,000 అనగా ఇరవై రోండు కోట్లరూపాయలు మన ప్రభుత్వం శ్రీశ్రీశ్రీ  Micro$oft వారికి చెల్లింస్తుందట రాష్ట్రంలోని ఐదువేల ఉన్నత పాఠశాలల్లో చేపట్టబోయే కంప్యూటర్‌ విద్య కోసం ఒక్కో బడికి రూ.44వేల విలువైన సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేయనున్నారు. మైక్రోసాఫ్ట్‌ కార్పొరేషన్‌ (ఇండియా) ప్రైవేట్‌ లిమిటెడ్‌ తరపున ఆరంజ్‌ బైట్స్‌ సిస్టమ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఈ సాఫ్ట్‌వేర్‌ను అందజేస్తుంది.అంతర్జాలంలో ఉచితంగా లభించే ఉపకరణాల సహాయంతో ఒక రెండు వందల మందితో చేసుకోనే ఉపకరణాలకు బదులు గా ఈ MNC కంపెనీ లను మేపటమెందుకు ?
ఒక ఆలోచన .

“200 మంది కంప్యూటర్ నిపుణులు కావలేను”
ఆ.ప్ర ప్రభుత్వం ,జీతం 5- 15 వేలు, Qul : BCA,BSc,BE,MSC,ME, MCA with Computer scince” Fee : 1000/- for ST,BC,SC 500/-, exp : 0 – 7 years”
దీని వచ్హే కనీన ధరకాస్థులు  2,00,000 వచ్హేసోమ్ము సుమారు 15 కోట్ల రూపాయలు ఇందులో ఖర్చులు, రోండు వందల మందిజీతాలు  రెండు సంవత్సరాలకు 5 కోట్లు మిగులు 10 కోట్లు . మన ప్రభుత్వం పెట్టాలనుకోన్న  ఖర్చు ఇరవై రోండు కోట్లరూపాయలు. ఇది కాక ట్రైనింగ్ కంపెనీ కి ముట్టజెప్పే 50 కోట్లు …..

దశావతారం – తమిళ్

చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా కమల్‌హసన్ పది విభిన్న పాత్రల్లో నటించిన చిత్రం దశావతారం.అందులోనూ రజనీ ‘శివాజీ’ తర్వాత అత్యంత వ్యయం (65  కోట్లుతో) నిర్మించిన కావటంతో అందరి కళ్ళూ దీని పైనే ఉన్నాయి. దాంతో దశావతారం లో ప్రతీ చిన్న విషయమూ సంచలనమవుతోంది.

avataaram

 

 

ఇంత ప్రసిద్దిగాంచిన సినిమాని మోదటి షో చూడటానికి 9:00 గంటలకే  IMAX కు వెళ్ళితే టిక్కట్లనీ అన్నీ సోమవారం దాకా అయిపోయాయని తెలిసింది  నిరాశ గా వెనుతిరుగు తుంటే కమల్ హానన్  ఒక తమిళ యవకుడి రూపం లో వచ్హి ఒక టిక్కేట్టు ప్రసాదించాడు.

తమిళ భాష అయుతే  నేమిటి “యనక్కు  తమిళ్ళ్ తెరియం” కదా అనుకోంటూ  IMAX  హాలులో అడుగు పెట్టా ను  అప్పటి కే బోమ్మ మోదలు పెట్టి 10 నిమిషాలు అయినది. మానవాళి భవితను సర్వనాశనం చేసే బయో వైరస్‌ను యాక్టివేట్‌ కాకుండా ఎలా నిరోధించారనే థీమ్‌ చుట్టూ కథ నడుస్తుంది. వైష్ణవ బ్రాహ్మణుడు రంగరాజన్‌ నంబి, అమెరికా సైంటిస్ట్‌ గోవిందు, అమెరకన్‌ టెర్రరిస్టు ఫ్లెచర్‌, తెలుగు సెక్యూరిటీ ఆఫీసర్‌ బలరామ్‌ నాడార్‌, జపనీస్‌ ఫైటర్‌, మానసిక వ్యాధితో బాధపడే వృద్ధురాలు కామాక్షి, పంజాబీ గజల్‌ గాయకుడు అవతార్‌ సిం,దళిత నాయకుడు పుణ్యకోణి, ముస్లిం యువకుడు కరీముల్లా, అమెరికా ప్రెసిడెంట్‌ జార్జి బుష్‌ .
అమెరికా ప్రెసిడెంట్‌ జార్జి బుష్‌, భారత ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కరుణానిధి హాజరైన వేదిక నుంచి సైంటిస్ట్‌్‌ అయిన కమల్‌హాసన్‌ చేసే ప్రసంగంతో కథకు అంకురార్పణ జరిగింది. విశ్వంలో జరిగే ప్రతి విపత్తుకూ ఒక థియరీ ఉందనీ చెబుతుండగానే కథ 12వ శతాబ్దంలోకి జారుతుంది. శైవ-వైష్ణవుల మధ్య ఆధిపత్య పోరు జరుగుతున్న తరుణంలో శైవుడైన 2వ కుళోత్తుంగ చోళుడు వైష్ణవ మతంపై కన్నెర చేస్తాడు. చిదంబరంలోని భారీ వైష్ణవ విగ్రహాన్ని విధ్వసం చేసేందుకు అతని సైన్యం సిద్ధమయినప్పుడు వైష్ణవ భక్తుడు రంగరాజ నంబియార్‌ వారిని ఎదురిస్తాడు. దాంతో అతన్ని బంధిస్తారు. పంచాక్షరి జపిస్తే వదిలి వేస్తామని కుళోత్తుంగ చోళుడు పెట్టిన షరతును రంగరాజు లెక్కచేయడు. దాంతో చోళరాజు ఆ విగ్రహానికి రంగరాజును కట్టి నదిలో పారేయిస్తాడు. రంగరాజు కథ ముగుస్తుంది. రెండవ అధ్యాయం వాషింగ్టన్‌ ్‌డి.సి.లో మొదలవుతుంది. గోవిందు (కమల్‌హాసన్‌) ఓ ప్రముఖ సైంటిస్ట్‌. అతను తన మేథస్సుతో ప్రపంచ మానవాళిని కబళించే ‘సింథటిక్‌ బయో వెపన్‌’ కనిపెడతాడు. దానిని టెర్రరిస్టులు చేజిక్కించుకునేందుకు ఎ్లాన్‌ చేస్తుంటారు. దాంతో గోవిందు ఆ బయో-వైరస్‌ను ఒక అగ్గిపెట్టి లాంటి బాక్స్‌లో పెట్టి అక్కడ్నించి తరలిస్తాడు. టెర్రరిస్టుల ఎ్లాన్‌ను ఎఫ్‌్‌.బి.ఐ.కి చెప్పే ప్రయత్నంలో ఫ్లెచర్‌ (కమల్‌హాసన్‌) అనే కరడుకట్టిన టెర్రరిస్టు గోవిందు వెంటబడతాడు. ఈ ప్రయత్నంలో బయో-వైరస్‌ బాక్స్‌ నాటకీయంగా గోవిందు చేజారుతుంది. దాన్ని వెదుక్కుంటూ చిదంబరం వరకూ వస్తాడు. అక్కడ లక్ష్మి (ఆసిన్‌) అనే వైష్ణువుల అమ్మాయి పరిచయమవుతుంది. పార్సిల్‌్‌లో అక్కడకు వచ్చిన బయో-వైరస్‌ బాక్స్‌ను లక్ష్మి బామ్మ కామాక్షి (కమల్‌హాసన్‌) గోవిందరాజు విగ్రహంలోకి జారవిడుస్తుంది. ఫ్లెచర్‌, అతని సహచరురాలు (మల్లికా షెరావత్‌) ఆ విషయం కనిపెట్టి చిదంబరం చేరుకుంటారు. దీంతో గోవిందు-లక్ష్మీ కలిసి విగ్రహంతో సహా తప్పించుకుంటారు. వారిని ఫ్లెచర్‌ ఛేజ్‌ చేస్తుంటాడు. మరోవైపు గోవిందును టెర్రరిస్టుగా అనుమానించిన సెక్యూరిటీ ఆఫీసర్‌ (కమల్‌హాసన్‌ తెలుగు ) వెంటపడతాడు. ఈ క్రమంలోనే పాప్‌ గాయకుడు ్‌అవతార్‌సింగ్‌ (కమల్‌), పొడగాడు ముస్లిం యువకుడు కరీముల్లా (కమల్‌), దళిత నాయకుడు పుణ్యకోటి (కమల్‌) వంటి పాత్రలు తారసపడతాయి. చివరకు బయో-వైరస్‌ను దక్కించుకోవాలకున్న ఫ్లెచర్‌  తో ఫైటర్‌ పోరాడి చివరకు ఫ్లెచర్‌ ఆ బయో-వైరస్‌ ను మింగి ప్రాణాలు విడుస్తాడు ఇక ఆ వైరస్ వ్యాప్తి చెందుతుందనుకోన్న తరుణంలో సునామీ వస్తూంది దానిలో వుండే ఉప్పు వలన మానవకోటికి పెనుప్రమాదం తప్పుతుంది. కావున కోన్ని లక్షల మందికి బదులుగా కోన్ని వేలమంది తోనే కధ శుఖాంత మవుతుంది

ఇందులో మోదటి గంట వరకు బాగానే నచ్హింది తరువాత అంతా ఆ విగ్రహం చుట్టూతిరుగుతుంది, కమల్ 10 వేషాలలో 5 వేషాలే5బాగున్నాయి మిగిలిన వి కుదరలేదు ఏదో రబ్బరు ముక్కు బుగ్గలు పెట్టినట్లు వునాయి
చాదస్తపు తెలుగు అధికారిగా కమల్ నటన తమిళ తంబిలకి నచ్హవచ్హు !
ఇక చివరిలో వచ్హ్హే సునామీ గ్రాఫిక్ వర్కులు చాలా పేలవంగా వున్నాయి,ఇక జయలలిత ,కరుణానిది కోన్ని సెకనుల పాటు కనిపిస్తారు.
 కేరళ కుట్టి అసిన్ కు తమిళ ప్రేక్షకులు పాస్ మార్కులు వేస్తారు , మనకు ఆ నటన వెగటుగా అనిపించవచ్హు  
 రజనీ ‘శివాజీ’ లో ఒక పాటలో రజనీ సారు వేసిన విదేశీ గెటప్పులు  దశావతారం గెటప్పుల కన్నా నాణ్యంగా కనిపిస్తాయి . ఇది శివాజీ అంత విజయం సాధిచకపోవచ్హు కానీ ఒక సారి చూడోచ్హు ఇక చివరిలో వచ్హ్హే సునామీ గ్రాఫిక్ వర్కులు చాలా పేలవంగా వున్నాయి,ఇక జయలలిత ,కరుణానిది కోన్ని సెకనుల పాటు కనిపిస్తారు.( ఇక్కడ గ్రాఫిక్స్ బాగానే వాడారు కానీ వీరు / మీడియా చెపుతున్నట్టు అంతర్జాతీయ  స్తాయిలోలేవు )
నాకైతే  కమల్ హాసన్  దశావతారాలు  సరిగా ఎత్తలేదు అనిపించింది.ఎదైనా  మీడియావాళ్ళు సృష్టింనంత దృశ్యంలేదు. హాలు నుండి బయటకు వచ్హేటప్పుడు కాపు గాసిన చానల్ ETV,TV5 , CNBC వాళ్ళతో ఇదేచెప్పా ! బహుశవారికి రుచించకపోవచ్హు !! 🙂