అసలు ప్రతిదీ ఖండించటంతోనే మెదలవుతుంది

మద్య అనేక బ్లాగులో వ్యవస్థ మీద అనేక సూచనలు చూస్తున్నాను , నాకు ఎప్పటి నుండో వున్న అభిప్రాయం మీతో పంచుకోవాలని ..

150 సం క్రితం వరకు ప్రధాన వృత్తులు మానవుడి కనీస అవసరాల మీదే కదా , వ్యవసాయం వాటి ఉత్పత్తు ల మీద వ్యాపారం ఈ కనీస అవసరాలు తీరిన వాడికి వినోదం వీటి కోరకు అనేక యుద్దాలు వీటి అంతామూలం బ్రతకటం బ్రతికిన తరువాత చావటం ఇందులో చావటం ని ఎదుర్కోనటానికి అనేక విదాలుగా మనిషి ప్రయత్నించాడు ఈ క్రమంలో దేవుడిని సృస్టించాడు చావు కి భయపడే వారికి చావు తరువాత కూడా జీవితం వుండోచ్హని ఆశ పెరిగినది ఆ దీనిని సమాధాన పరుచుటకు ఒక తెగ బయలు దేరినది వీరు మనిషి కోరికలను చేతనయిన విధముగా పరిష్కరింటానికి ప్రయత్నించారు సఫలమైతే దైవం అన్నారు కాక పోతే విధి అన్నారు కారణం పాపము అన్నారు ఎవరైనా ఆటంకపరిస్తే వారిని రాక్షసులు అన్నారు . ఇలా సమాజంలో అవసరాలకు తమకు తోచిన ఎర్పాటు చేశారు ఎవరు ఏపని చేయాలో ఎది చేయకూడదో చెప్పటాకి ఒక వ్యవస్థతయారు చేసారు అయితే ఇందులో ప్రజల అసంతృప్తి బయట పడకుండా ,విప్లవాలు రాకుండా వర్ణవ్యవస్థను విద్యావస్థను అదుపులో వుంచుకోన్నారు ఇలా ఈ వ్యవహారాన్ని అనేక వందల (వేల)సంవత్నరాల పాటు సమాజానికి దిశానిర్దేశ్యం చేయటాకి ప్రయత్నించారు ఈ మద్యకాలం లో కొంత మంది దీనికి వ్యతిరేకంగా కొంత మంది అనుకూలంగా పోరాటాలు చేశారు గెలిచారు/ఓడిపోయారు గత వందసంవత్సరాల నుండి దీనిని వ్యతిరేకించేవారు పెరిగి పోయారు వర్ణవ్యవస్త కులాలు తెగిపోయాయి అనేక వేలసంవత్సరాలో సాధించిన విజ్ఞానాన్ని ఈ వందసంవత్సరాల లో అనేక రెట్లు అధికమించాము కాని బ్రతుకు ఇంకా దుర్భలంగానే వున్నది ఇది ఎప్పటికి బాగవునో …అసలు బాగవునో ..అసలు తెలియకుండావున్నది

నేను చూసిన ఫ్లాషు న్యూసు..

హమ్మయ్య ఒక ఘట్టం ముగిసినది,

ఈ సారి ఎన్నికలు వాడి గా వేడి గా కన్న అలా జరిగినట్లు చూపబడినాయి ,ఈ సారి మీడియా ప్రభావం విపరీతంగా పెరిగినది నాకు తెలిసినంత వరకు ప్రతి మీడియా (పత్రికలు,చానెళ్ళు) పోటీలు పడిమరీ పని చేశారు త్రిముఖ పోటీ జరగటం వలన వీరికి కావలసినంత విషయం దోరికిన్నీ దురదుస్టవశాత్తు ఎదీ కూడా
నిస్పక్షపాతంగా వ్యవహరించలేదు. ఎన్నికల సంఘం నియమావళి దెబ్బకు నాలాటి ఓటరుకు పోలింగ్ బూతుకు వెళ్ళి అక్కడ పట్టిక చూశేదాక అసలు ఎంత మంది అబ్యర్దులు వున్నారో తెలియకుండా పోయినది ఇక తెలుగు వార్తా చానెళ్ళ లో మాత్రము ఏది చూసినా ఒక 20 మంది పార్టీల ఎజంట్లు అయా పార్టీల తరుపున వకల్తా పుచ్హుకోని ఇంకా నాగేశ్వర్ వంటి తటస్తులు వీరి అరుపులు వారి విశ్లేషణలు మద్యలో యానిమేషన్ వ్యంగాస్త్రాలు , మద్య లో ఇంటి కే ఉచితంగా పత్రికలు ఇవి కాక ఓటు వేయండహో అంటూ వివిధ ప్రకటనలు అంతా ఎదో అయో మయంగా నడిచినది , ఎవరు ఏది చెపుతున్నారో ఏది నమ్మాలో నమ్మకూడ దో తెలియని పరిస్తితి . ఈ పోలీసు పహరా మూలం గా బస్తీ లలో తప్ప ఇంక ఎక్కడా తాయిలాల పంపిణీ జరగని పరిస్థితి దీని వలన అబ్యర్దులు లాభ పడ్డారు ప్రజలు ప్రస్తుతానికి నష్టపోయారు ఇహ పోలింగ్ రోజు నకూడా పెద్దగా హడావిడి కనిపించలేదు ఎక్కడో జరిగిన అరకోర విషయాలనే మీడియా విపరీతంగా కవర్ చేసినది ఉదాహరణకు నేను మోతీ నగర్ లో ఓటు వేస్తునప్పుడు అక్కడకు జయప్రకాష్ వచ్హి ఎదో ఇంటర్వు ఇవ్వబోయాడు అక్కడే వున్న కాంగ్రేసు వారు ఇక్కడ పోలింగ్ వద్ద కాకుండా బయట పెట్టు కోనవలసినది గా సూచించారు దీని పై కేవలం 3 నిమిషాలు వాగ్వివాదం జరిగినది తరువాత జయప్రకాష్ వెళ్ళిపోయాడు , ఓటు వేసి ఇంటికి వచ్హి టీవీ పెడితేఅన్ని తెలుగు వార్తా చానెళ్ళ లో “మోతీ నగర్ లో జే.పీ పై కాంగ్రేసు వర్గీయుల దాడి అని ఫ్లాష్ వస్తోంది ! 😦