omicron Covid Virus

తావిడ్ – 19 కలుగజేసిన SARS COV వైరస్ మ్యుటేషన్ ద్వారా వచ్చిన కొత్తరకం వైరస్ ఒమిక్రాస్ ఇది దక్షిణ ఆఫ్రికాలోగల బోట్స్ వాణా, నవంబర్ 24న కనుగొని, ధృవీకరించారు. బి.1.1.529 స్ట్రెయిన్గా దానికి ఒమిక్రాన్ అని నామకరణం చేసారు. ప్రస్తుత పరిస్థితి?

ప్రపంచ వ్యాప్తంగా పణికిస్తున్న మహామ్మారి. బ్రిటన్, అమెరికా ఫ్రాన్సు దేశాల్లో, సోమాలియా మొదలగు ఆఫ్రికా దేశాల్లో సులభంగా వ్యాప్తి చెంది, భారతదేశంలోని 17 రాష్ట్రాలలో త్వరితంగా వ్యాప్తి చెందుతోంది. గణాంకాల ప్రకారం భారతదేశంలో 6000 పై చిలుకు. మన తెలుగు రాష్ట్రాలలో కూడా వేగంగా వ్యాప్తి చెందుతూ ప్రతిరోజూ కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఈ వ్యాధి వ్యాప్తికి కారణం అంతర దేశ ప్రయాణాలు.

అయితే ఇది కోవిడ్-19 అంత ప్రమాదం కాదు. కానీ త్వరితంగా వ్యాపిస్తుంది. ఈ వ్యాధి లక్షణములు… ఒళ్ళు నొప్పులు, జలుబు, వాసన, రుచి తెలియక పోవడం, విరేచనాలు, దగ్గు, జ్వరం, అలసట మొదలైనవి. అంత ఉదృతం కాదు. కాకపోతే 2 లేదా 4 రోజుల్లో వ్యాధి వచ్చి తగ్గి, ఇతరులకు వేగంగా అంటుకుంటుంది. కోవిడ్-19 సీడిత రోగిలా మరణవాత పడకపోవచ్చు. కానీ కోవిడ్-19 కేసులు కూడా ఒమిక్రాన్తో నమోదవుతున్నాయని గుర్తించవలసి వుంది.

ఎక్కువ ప్రమాదంలో వున్నవారు ఎవరంటే… పెద్ద వయసు గల వారు, మధుమేహం, హృద్రోగం, ఇతరత్రా రక్షణ వలయం తక్కువ

వున్నవారు. కోవిడ్ టీకాల రక్షణ విషయానికి వస్తే… రెండు డోసుల Covacine or Covishield తీసుకున్నవారిలో 50% Antibodies తయారై కొన్ని

ఒమిక్రాను నియంత్రిస్తాయి.

టీకాలు తీసుకుంటే ఏ విధంగా రక్షణ : శరీరంలో “T Cell” (కణ ములు శరీరంలో ప్రవేశించే బాక్టీరియా) వైరస్ని నియంత్రించే కణ జాలం కోవిడ్ వచ్చినా, టీకాలు రెండు డోసులు వేసుకున్నా శరీరంలో యుద్ధంలాంటి వాతావరణ మేర్పడి, మనల్ని రక్షించడానికి TCells దోహద పడతాయి. దీన్ని IMMUNITY అంటారు. మంచి సమతుల్య ఆహారం, వ్యాయామం, మాంసకృత్తులు, పోషకాలతో IMMUNITY పెంచవచ్చు.

2 డోసుల టీకాల ద్వారా కూడా 50% ‘యాంటీబాడీస్’ తయార వుతాయి. ఊపిరితిత్తుల జబ్బులు, గుండె జబ్బులు, IMMUNITYని దెబ్బతీసే వ్యాధులు, కొన్ని మందుల వాడకం వల్ల శరీర రక్షణ తగ్గుతుంది. వయో వృద్ధులు, మధుమేహ వ్యాధిగ్రస్తులు మరియు ధూమపాన, మద్య పాన ప్రియుల్లో కూడా immunity తగ్గుతుంది

తెలంగాణ రెవెన్యూ ,భూ సంబంధిత పదాలు

గ్రామ కంఠం : గ్రామంలో నివసించేందుsకు కేటాయించిన భూమిని గ్రామ కంఠం అం టారు. ఇది గ్రామానికి చెందిన ఉమ్మడి స్థలం. ఇందులో ప్రభుత్వ సమావేశాలు, సభలు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. గ్రామ కంఠం భూ వివరాలు పంచాయతీ రికార్డుల్లో ఉంటాయి.

సాదాబైనామా: తెల్ల కాగితంపై భూమి కొనుగోలు లేదా రిజిస్టర్ కాని క్రయ విక్రయాలు చేసిన భూములను విదానాన్ని సాదాబైనామా అంటారు. రిజిస్ట్రేషన్ కానీ ఏ కాగితాల ద్వారా భూమి కొనుగోలు చేసినా అది సాదాబైనామా కొనుగోలే అవుతుంది.

అసైన్డ్‌భూమి : భూమిలేని నిరుపేదలు సాగు చేసుకునేందుకు, ఇండ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం మంజూరు చేసిన భూమి. దీనిని వారసత్వ సంపదగా అనుభవించాల్సిందే తప్ప ఇతరులకు అమ్మడం, బదలాయించడం కుదరదు.

ఆయకట్టు : ఒక నీటి వనరు కింద సాగయ్యే భూమి మొత్తం విస్తీర్ణాన్ని ఆయకట్టు అంటారు.

బంజరు భూమి (బంచరామి) : గ్రామం, మండల పరిధిలో ఖాళీగా ఉండి ప్రజావసరాల కోసం ప్రభుత్వం నిర్దేశించిన భూమి. దీనిని రెవెన్యూ రికార్డుల్లో ప్రత్యేక గుర్తులతో సూచిస్తారు.

అగ్రహారం : పూర్వకాలంలో బ్రాహ్మణులకు శిస్తు లేకుండా తక్కువ శిస్తుతో ఇనాంగా ఇచ్చిన గ్రామం లేదా అందులోని కొంత భాగాన్ని అగ్రహారం అంటారు.

దేవళ్‌ ఇనాం : దేవాలయ ఇనాం భూమి. దేవాలయాల నిర్వహణ కోసం పూజారుల పేరునగానీ, దేవాలయం పేరున కేటాయించిన భూమి.

అడంగల్‌ (పహాణీ) : గ్రామంలోని సాగు భూముల వివరాలు నమోదు చేసే రిజిస్టర్‌ను అడంగల్‌ (పహాణీ) అంటారు. ఆంధ్ర ప్రాం తంలో అడంగల్‌ అనీ, తెలంగాణలో పహాణీ అని పిలుస్తారు. భూమికి సంబంధించి చరిత్ర మొత్తం ఇందులో ఉంటుంది. భూముల కొనుగోలు, అమ్మకాలు, సాగు చేస్తున్న పంట వివరాలు ఎప్పటికపుడు ఇందులో నమోదు చేస్తారు.

తరి : సాగు భూమి

ఖుష్కీ : మెట్ట ప్రాంతం

గెట్టు పొలం హద్దు

కౌల్దార్‌ : భూమిని కౌలుకు తీసకునేవాడు

కమతం : భూమి విస్తీర్ణం

ఇలాకా : ప్రాంతం

ఇనాం : సేవలను గుర్తించి ప్రభుత్వం ఇచ్చే భూమి

బాలోతా ఇనాం : భూమిలేని నిరుపేద దళితులకు ప్రభుత్వం ఇచ్చే భూమి

సర్ఫేఖాస్‌ : నిజాం నవాబు సొంత భూమి

సీలింగ్‌ : భూ గరిష్ఠ పరిమితి

సర్వే నంబర్‌ : భూముల గుర్తింపు కోసం కేటాయించేది

నక్షా : భూముల వివరాలు తెలిపే చిత్రపటం

కబ్జాదార్‌ : భూమిని తన ఆధీనంలో ఉంచుకుని అనుభవించే వ్యక్తి

ఎన్‌కంబరెన్స్‌ సర్టిఫికెట్‌ (ఈసీ) : భూ స్వరూపాన్ని తెలియజేసే ధ్రువీకరణ పత్రం. 32 ఏళ్లలోపు ఓ సర్వే నంబర్‌ భూమికి జరిగిన లావాదేవీలను తెలియజేసే దాన్ని ఈసీ అంటారు.

ఫీల్డ్‌ మెజర్‌మెంట్‌ (ఎఫ్‌ఎంబీ) బుక్‌ : దీన్నే ఎఫ్‌ఎంబీ టీపన్‌ అని కూడా అంటారు. గ్రామ రెవెన్యూ రికార్డుల్లో ఎఫ్‌ఎంబీ ఒక భాగం. ఇందులో గ్రామంలోని అన్ని సర్వే నంబర్లు, పట్టాలు, కొలతలు ఉంటాయి.

బందోబస్తు : వ్యవసాయ భూములను సర్వే చేసి వర్గీకరణ చేయడాన్ని బందోబస్తు అంటారు.

బీ మెమో : ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని సాగు చేసుకుంటున్న వ్యక్తి శిస్తు, జరిమానా చెల్లించాలని ఆదేశించే నోటీస్‌ను బీ మెమో అంటారు.

పోరంబోకు : భూములపై సర్వే చేసే నాటికి సేద్యానికి పనికిరాకుండా ఉన్న భూములు. ఇది కూడా ప్రభుత్వ భూమే.

ఫైసల్‌ పట్టీ : బదిలీ రిజిస్టర్‌

చౌఫస్లా : ఒక రెవెన్యూ గ్రామంలో ఒక రైతుకు ఉన్న వేర్వేరు సర్వేనంబర్ల భూముల పన్ను ముదింపు రికార్డు.

డైగ్లాట్‌ : తెలుగు, ఇంగ్లిఫ్‌ భాషల్లో ముద్రించిన శాశ్వత ఏ-రిజిస్టర్‌.

విరాసత్‌/ఫౌతి :భూ యజమాని చనిపోయిన తర్వాత అతడి వారసులకు భూమి హక్కులు కల్పించడం.

కాస్తు :సాగు చేయడం

మింజుములే : మొత్తం భూమి.

మార్ట్‌గేజ్‌ : రుణం కోసం భూమిని కుదవపెట్టడం.

మోకా : క్షేత్రస్థాయి పరిశీలన(స్పాట్‌ఇన్‌స్పెక్షన్‌).

పట్టాదారు పాస్‌ పుస్తకం : రైతుకు ఉన్న భూమి హక్కులను తెలియజేసే పుస్తకం.

టైటిల్‌ డీడ్‌ : భూ హక్కు దస్తావేజు, దీనిపై ఆర్డీవో సంతకం ఉంటుంది.

ఆర్వోఆర్‌ (రికార్డ్స్‌ ఆఫ్‌ రైట్స్‌) : భూమి యాజమాన్య హక్కుల రిజిస్టర్‌.

ఆర్‌ఎస్సార్‌ : రీ సెటిల్‌మెంట్‌ రిజిస్టర్‌ లేదా శాశ్వత ఏ రిజిస్టర్‌.

పర్మినెంట్‌ రిజిస్టర్‌ : సర్వే నంబర్ల వారీగా భూమి శిస్తులను నిర్ణయించే రిజిస్టర్‌. సేత్వార్‌ స్థానంలో దీన్ని ప్రవేశపెట్టారు.

సేత్వార్‌ : రెవెన్యూ గ్రామాల వారీగా మొదటి సారి చేసిన భూమి సర్వే వివరాలు, పట్టాదారుల వివరాలు తెలిపే రిజిస్టర్‌. ఇది 1953 దాకా అమలులో ఉంది. తర్వాత ఖాస్రా పహాణీ అందుబాటులోకి వచ్చింది.

సాదాబైనామా : భూ క్రయ విక్రయాలకు సంబంధించి తెల్లకాగితంపై రాసుకొనే ఒప్పంద పత్రం.

దస్తావేజు : భూముల కొనుగోళ్లు, అమ్మకాలు, కౌలుకు ఇవ్వడం లాంటి ఇతరత్ర లావాదేవీలను తెలియజేసే పత్రం.

ఎకరం : భూమి విస్తీర్ణం కొలమానం. 4840 చదరపు గజాల స్థలంగానీ, 100 సెంట్లు (ఒక సెంటుకు 48.4 గజాలు)గానీ, 40గుంటలు (ఒక గుంటకు 121 గజాలు)ను ఎకరం అంటారు. ఆంధ్రా ప్రాంతంలో సెంటు, తెలంగాణలో గుంట అని అంటారు.

ఆబాది : గ్రామకంఠంలోని గృహాలు లేదా నివాస స్థలాలు

అసైన్‌మెంట్‌ : ప్రత్యేకంగాకేటాయంచిన భూమి

శిఖం : చెరువు నీటి నిల్వ ఉండే ఏరియా విస్తీర్ణం

బేవార్స్‌ : హక్కుదారు ఎవరో తెలియకపోతే దాన్ని బేవార్స్‌ భూమి అంటారు.

దో ఫసల్‌ : రెండు పంటలు పండే భూమి

ఫసలీ : జులై 1నుంచి 12 నెలల కాలన్ని ఫసలీ అంటారు.

నాలా : వ్యవసాయేతర భూమి

ఇస్తిఫా భూమి : పట్టదారు స్వచ్ఛందంగా ప్రభుత్వపరం చేసిన భూమి

ఇనాం దస్తర్‌దాన్‌ పొగడ్తలకు మెచ్చి ఇచ్చే భూమి

ఖాస్రాపహానీ : ఉమ్మడి కుటుంబంలో ఒక వ్యక్తి పేరుమీద ఉన్న భూ రికార్డులను మార్పు చేస్తూ భూమి పట్టా కల్పించిన పహాణీ.

గైరాన్‌ : సామాజిక పోరంబోకు

యేక్‌రార్‌నామా : ఇరు గ్రామాల పెద్దల నుంచి సర్వేయర్‌ తీసుకునే గ్రామాల ఒప్పందం…..

భారత సంవిధానము

GOVERNMENT OF INDIA MINISTRY OF PARLIAMENTARY AFFAIRS

PREAMBLE TO THE #CONSTITUTION

భారత సంవిధానము

ప్రస్తావన: భారతదేశ ప్రజలమగు మేము, భారతదేశమును సార్వభౌమ్య సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర
రాజ్యముగ నెలకొల్పుటకు మరియు అందలి పౌరులెల్లరకు సామాజిక, ఆర్థిక, రాజకీయ, న్యాయమును, భావము, భావప్రకటన, విశ్వాసము… ధర్మము, ఆరాధన -వీటి స్వాతంత్య్రమును, అంతస్తులోను, అవకాశములోను సమానత్వమును చేకూర్చుటకు, మరియు వారందరిలో వ్యక్తి గౌరవమును, జాత్మైక్యతను, ఆఖండతను తప్పక ఒనగూర్పు సౌభ్రాతృత్వమును పెంపొందించుటకు; సత్యనిష్టాపూర్వకముగ తీర్మానించుకొని,

ఈ 1949వ సంవత్సరము నవంబరు ఇరువదియారవ దినమున మా సంవిధాన సభయందు ఇందుమూలముగ, ఈ సంవిధానమును అంగీకరించి, ఆధిశాసనము చేసి మాకు మేము ఇచ్చుకొన్నవారమైతిమి.

శరీరం మాట వినాలి

రచయిత
సాయి పద్మ గారు

ఇవాళ ఒక విషయం చెప్దామని డిస్కస్ చేద్దామని ఈ పోస్ట్ పెడుతున్నా.. ఎవర్నీ భయపెట్టాలనో, ఇబ్బంది పెట్టాలనో కాదు. మీకు కోవిడ్ గురించి, దానికి సంభందించిన విషయాల గురించి తెలుసుకోవద్దు అనుకుంటే, ముందుకు చదవకండి. అంతే గానీ.. నన్ను అనవసరంగా ట్రోల్ చేయొద్దు.. నేనే చెప్తున్నాను, నేను డాక్టర్ని కాను, మీలా ఒక మామూలు మనిషిని, సోషల్ వర్క్ ఫీల్డ్ లో ఉండటం వల్ల మీకంటే కాస్త ఎక్కువగా వింటాను, ఎక్పోజర్ ఉంటుంది.. నాకు చేతనయినది చేస్తున్నాను, చేస్తాను కూడా.. నా శరీరం సహకరించని వేళల్లో, ఫోన్ సైలెంట్ లో పెట్టి.. ఈ రోజుకి ఇంతే దేవుడా అనుకుంటూ పడుకుంటా.. అంతే..
సరే.. విషయానికి వస్తే.. మళ్ళీ కార్డియాక్ ప్రొబ్లెంస్ పెరుగుతున్నాయి. చాలా ఆరోగ్యవంతులు అన్నవాళ్లు, కోవిడ్ బారిని పడి, తగ్గిన వాళ్ళు, రెండు డోస్ లూ కూడా తీసుకున్న వాళ్ళు.. కూడా, సడన్ గా వెళ్ళిపోతున్నారు. దానికి ఏజ్ తో సంబంధం, మెడికల్ హిస్టరీ తో సంబంధం ఉండటం లేదు. ఈ మధ్య కాలంలో ఇంచుమించు పది కేసులు పైగా విన్నాను. అందరూ, అంతకు ముందు చాలా ఆరోగ్యంగా ఉన్నవాళ్ళే. చాలా తక్కువ మందిలో బీ పీ, షుగర్ ఉంది గానీ, మిగతావాళ్ళకి అది కూడా లేదు. కొంతమంది నేను అడిగిన డాక్టర్లు కూడా మళ్ళీ కార్డియాక్ రిలేటెడ్ ఇష్యూస్ పెరుగుతున్నాయి అని చెప్తున్నారు లేదా మల్టీ ఆర్గాన్ ఫైల్యూర్ అంటున్నారు. ఏమీ అర్ధం కావటం లేదు.
నాకు అర్ధం అయినవీ, నేను కొంతమంది డాక్టర్లు, ఫిజియో తెరపిస్ట్ ల ద్వారా తెలుసుకున్నది, ఇక్కడ పాయింట్స్ రూపంలో పెడుతున్నాను. మా మ్యూజిక్ మేడం కూడా.. రాసి పెట్టండి ఎవరికైనా ఉపయోగ పడవచ్చు అన్నారు కాబట్టి రాస్తున్నాను.
• సుమారు రెండేళ్ళు, అందరం స్లీప్ మోడ్ లా ఉన్నాం. భయం భయంగా, ఇబ్బందిగా, చాలా నేర్చుకున్నాం. నష్టపోయాం. కానీ కొంతే నేర్చుకున్నాం.

• రెండేళ్ళు ఆపేసిన పరుగు ఒక్కసారి మొదలు పెట్టాం. పెళ్ళిళ్ళు, చేయాల్సిన పనులు, నష్టపోయిన డబ్బులు, వ్యాపారాలు, వృత్తి, కలలు, కోరికలు.. కానీ.. ఫ్రిజ్ లో డేట్ ఎక్పైర్ అయిన వస్తువు పడేసినంత తేలిక కాదు.. శరీరం.. రెండేళ్ళు తప్పు పట్టించి, ఒక్కసారి ఏదన్నా చేద్దామంటే అవదు. ఏదన్నా మళ్ళీ మొదలు పెట్టె ముందు, ఒక్క నిమిషం మీ శరీరాన్ని మీరే స్కాన్ చేసుకోండి. మీకు ఎలా అనిపిస్తోంది. ఎక్కడ ఇబ్బంది ఉంది, నెప్పి ఉంది ఇలాంటివి పరిశీలించండి. దాన్ని బట్టే మొదట నడక మొదలు పెట్టండి, తర్వాతే పరుగు. నడక అన్నాను కదా అని.. మోకాళ్ళ నెప్పుల తో నడవకండి.ఉ ఉదాహరణ కి చెప్పాను అంతే
• మనం అన్నీ అతిగా చేస్తాం. భయం అంటే అతి. అలాగే ఎంజాయ్ చేయమంటే మళ్ళీ అది అతి. కానీ అతి సర్వత్రా వర్జయేత్ అని చెప్తూ ఉంటాం.. నేను లేకపోతే ఎలా ? అనే పనులు ప్రపంచంలో లేనే లేవు. మనం లేకపోయినా అన్ని పనులూ నడుస్తాయి.. మనం ఉండేట్టు చూసుకోవటం ఇప్పుడు అన్నిటి కన్నా ఇంపార్టెంట్.

• ఇంకో రకం ఏమిటంటే, ఎలాగూ సెలవు దొరికింది, కోవిడ్ వల్లనా, వర్క్ ఫ్రొం హోమ్ అంటూ పిల్లలు ఇంట్లో ఉన్నారు.. చేయాల్సిన పనులు ఇప్పుడే చేసేద్దాం అని మొదలు పెట్టేస్తున్నారు. ఇల్లు రిపేర్లు, పెండింగ్ లో ఉన్న ఆరోగ్య సమస్యలు, ఎలక్టివ్ సర్జరీలు లాంటివి. అలాంటివి ఒకేసారి చేయద్దు. రెండు మోకాళ్ళ ఆపరేషన్, డాక్టర్లు ఖాళీ గా ఉన్నారని సర్జరీలు దయచేసి చేయించుకోవద్దు. ఇందాక పొత్తూరి విజయలక్ష్మి గారి తో మాట్లాడుతుంటే..ఎలా ఉన్నారు అంటే.. గారాజ్ లో పెట్టిన బండి లా బానే ఉన్నాను అన్నారు. భలే నవ్వుకున్నాం. కానీ, నిజానికి అందరం గారాజ్ లో పెట్టిన బళ్ల లా ఉన్నాం రెండేళ్ళు పైగా.. తుడిచి పెడతాం కాబట్టి బయటికి అన్నీ బానే ఉంటాయి. కానీ, లోపలే పార్ట్స్ ఎలా ఉన్నాయో నెమ్మదిగా సరి చూసుకోకుండా బండి బయటకి తీస్తే బ్రేక్ డౌన్ ఖాయం.

• మరో విచిత్రమైన రకం, రెండు వెక్సిన్స్ తీసుకున్నాం కాబట్టి, రోగ నిరోధక శక్తి పెరిగిపోయింది ఇంకా ఫిట్ నెస్, ఇమ్యూనిటీ పెంచుకుంటే చాలు అన్న టైప్ లో బాగా ఎక్సర్సైజ్ చేసేస్తున్నారు. పునీత్ రాజ్ కుమార్ గారికి కూడా కోవిడ్ వచ్చి తగ్గింది అని ఒక న్యూస్ చదివాను. నిజం కావచ్చు, ఫేక్ కావచ్చు, కానీ.. ఫిట్ నెస్, వెయిట్ ట్రైనింగ్ అతిగా చేయటం వల్ల నష్టం ఉంది అని మనకి చాలా జీవితాలు చెప్పాయి, చెప్తున్నాయి. ఆయన భార్య స్వయంగా స్టేట్ మెంట్ ఇచ్చారు, మీకు శరీరంలో ఏ చిన్న ఇబ్బంది ఉన్నా, ఫిట్ నెస్ ఏక్టివిటీస్ చేయొద్దు. నిదానమే ప్రధానం, తొందరపడి అమృతం లాంటి జీవితాన్ని మృతం చేసుకోవద్దు.

• మీరు మీ ఇళ్ళల్లో పెద్దవాళ్ళని గమనించండి (ఉంటే) లేదా క్రానిక్ విషయాలతో బాధపడుతున్న వాళ్ళని గమనించండి. వాళ్లకి కోవిడ్ వచ్చినా కూడా, రికవరీ బాగుంది. అంతే కాకుండా మధ్య వయస్కుల కన్నా, వాళ్ళ రేసీలిఎన్స్ (ఏదన్నా తట్టుకొనే సామర్ధ్యం ) బాగుంది. వాళ్ళకీ, మనకీ తేడా నాకు తెలిసినంత వరకూ.. వాళ్ళు రిలాక్స్డ్ గా , సహజంగా ఉన్నారు. మనం లైఫ్ స్టైల్ పూర్తిగా స్ట్రెస్ తో, భయంతో ఉంది. అదే లైఫ్ కీ డెత్ కీ, ఏదోలా బతకటానికి, క్వాలిటీ తో బతకటానికి తేడా చూపిస్తోంది.

• మనకి వేలం వెర్రి కూడా ఎక్కువే. మంతెన గారు చెప్పారని ఉప్పు మానేస్తాం, సోడియం లెవెల్స్ పడిపోతాయి. వీరమాచనేని అన్నారని నూనె వీరంగం వేస్తాం, వెంటనే, కిడ్నీ మీద ప్రోటీన్ లోడ్ పడుతుంది. కీటో డైట్ అని, టైం క్లాక్ ని మారుస్తాం, నిద్ర సరిగ్గా పట్టదు. మర్నాడు తిక్కగా ఉంటుంది, ఆహారం అంటే నిద్ర కూడా. ఖాదర్ వలీ అన్నారని మిల్లెట్లే తింటాం. అన్ని మిలేట్స్ అందరికీ పడవు. నాకు అండు కొర్రలు తింటే కడుపు మండినట్టు ఉంటుంది. అలా ఒక్కక్కరికీ ఒక్కోలా ఉండొచ్చు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు.. ఇవాళ అన్నం అంటే అసహ్యించుకోనేది, పిప్పి, కార్బో హైడ్రేట్ అంటున్నారు. దానికి కారణం మనమే. ఆలోచిస్తే, చాలా మంది బ్రౌన్ రైస్ తింటున్నారు, తక్కువ పాలిష్ బియ్యం ఇప్పుడు ఖరీదు ఎక్కువ. కానీ పూర్తిగా అలవాటు అయిన బేసిక్ food ఒక్కసారి మానేయటం వల్ల, వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ ఎవరూ చెప్పారు. తినే తిండి మీద సంతృప్తి ఉండదు. సేటైటీ (satiety) లెవెల్ అంటారు దాన్ని. అన్నం మానేయగానే, జుట్టు ఊడిపోతోంది, దానికి తోడు , కోవిడ్ వచ్చి తగ్గితే , వాడిన మందులు స్తిరాయిడ్స్. కోపం చిరాకు ఉంటుంది. వెయిట్ తగ్గకపోగా పెరుగుతారు. ఇవాళ అన్నిటికీ నిపుణులు ఉన్నారు, మీ శరీరానికి తగ్గ పద్ధతి ఎంచుకోండి. బాగుందని మీ శరీరానికి పట్టని నప్పని బట్టలే వేసుకోము, కానీ డైట్ మాత్రం ఎవరు ఏది చెప్తే అది చేసేస్తాం అతిగా.. ఆలోచించండి.

• మళ్ళీ చాలామంది మాస్క్ వేసుకోవటం మానేశారు. అన్నీ వెస్ట్ అనిపిస్తున్నాయి వాళ్లకి. కోవిడ్ జలుబులాంటిదే కావచ్చు చాలా మందికి, అలానే వచ్చి తగ్గిపోవచ్చు, కానీ మారథాన్ లు పరిగెత్తిన వాళ్ళు, కోవిడ్ తర్వాత రెండు మూడు కిలోమీటర్లు నడవలేక పోతున్నాం అని చెప్తున్నారు. అర్ధం చేసుకోండి.

• మీ గోల్స్, రూల్స్ మీరు డిఫైన్ చేసుకున్నవి. మీ శరీరానికి పాపం అవి తెలీదు. అది ఒక యంత్రం, తుప్పు పడుతుంది, తెగుతుంది, మరకలు పడుతుంది, మాసిపోతుంది. గమనించుకోండి. రోజులో పది నిమిషాలు మీ శరీరం మీకేం కమ్యూనికేట్ చేస్తోంది గమనించండి. ఇబ్బంది రాగానే మీ ఫేమిలీ డాక్టర్ ని సంప్రదించండి. డాక్టర్ పేరు వెనుక డిగ్రీల కన్నా, వారికి మీరు, మీ లైఫ్ స్టైల్ , కుటుంబ మెడికల్ హిస్టరీ, శరీర తత్వం తెలియటం ముఖ్యం. కనీసం మీ గోడు వినే డాక్టర్ దగ్గరకి వెళ్ళండి.

• బ్రిటన్ లో ఫాస్ట్ food కి వ్యతిరేకంగా స్లో food ఫెస్టివల్స్ చేస్తారు. అంటే, అన్నీ సహజమైన ఆర్గానిక్ పద్ధతులలో వండుకొని, వన భోజనాల్లా తింటారు. అసలు కార్తీక మాసాలూ, ఉపవాసాలూ గమనిస్తే.. స్లో లైఫ్ , డీ టాక్స్ (శరీరంలో మలినాలు తొలగించే పద్ధతి ) .. మనకి చాలా బాగా అర్ధం అవుతుంది. మా ఆరోగ్య సంస్థ కి వచ్చినవాళ్ళకి నేను అదే చెప్తాను. డీ టాక్స్ చేయండి/ చేసుకోండి.. మీకు బోటోక్స్ ( కెమికల్స్ ద్వారా అందం పెంచే ప్రక్రియ) అక్కర్లేదు అని.. !!

లైఫ్ స్టైల్ అనే మాటలోనే .. మనం మన అభిరుచుల, అలవాట్ల కి అనుగుణంగా అలవరచుకున్నది అని అర్ధం.. మనం చేయాలి అనుకోని స్విచ్ వేస్తే వచ్చేది ఆరోగ్యం కాదు. ఆరోగ్యం అంటే. ఏ రుగ్మతా లేకుండా ఉండటం. ముఖ్యంగా ఏదన్నా ఎదుర్కొనే, శారీరక మానసిక శక్తి కలిగి ఉండటం. So, design your life style around wellness not just prevention of illness..!!

మీ ఆరోగ్యాభిలాషి
సాయి పద్మ
Sarada Subramaniam Padma Meenakshi Avinashh Milletmatix Avinashh HolisticHealing Avinashh

Wikimedia Technology Summit 2021

Greetings from IndicWiki Project , International Institute of Information Technology, Hyderabad (IIITH), We are pleased to announce Wikimedia Technology Summit 2021 ,This conference is free and open to the students, researchers, technology enthusiastic public, event will be in a virtual mode on 19th and 20th of November 2021.  The theme of this summit is “Role of Technology in Community Encyclopaedias”.
For more details and free registration, please visit: https://indicwiki.iiit.ac.in/summit2021
We are looking forward to representatives from the MediaWikicommunity as well as contributors of Wikimedia projects in various languages.

నేను మారుతున్నాను

చాలా కాలం తరువాత నా మిత్రుడు కలిస్తే ఏరా చాలా ఏళ్ళు వచ్చాయి మనకి. వయస్సు తో పాటు ఏమైనా ఆలోచనలో కూడా మార్పు వచ్చిందా అని క్యాజువల్ గా అడిగాను. అప్పుడు అతను అన్నాడు.

అవును నేను మారుతున్నాను

తల్లిదండ్రులను, బంధువులను, భార్యను, పిల్లలను స్నేహితులను, సినెమా హీరోలని ఇన్నాళ్లు ప్రేమించాను.ఇప్పుడిప్పుడే నన్ను నేను ప్రేమించుకోవడం మొదలు పెట్టాను.

అవును నేను మారుతున్నాను

నేనేమీ ప్రపంచ పటాన్ని కాదు, ప్రపంచాన్నంతా నేనే ఉద్ధరించాలని అనుకోవటం లేదు. ఎదుటి వాళ్ళ లో లోపాలని చూసే ముందు నాలో లోపాలని సవరించుకోవాలి అనుకుంటున్నాను.

అవును నేను మారుతున్నాను

ఇంతకముందు ఏ పని చేయాలన్నా సమాజం ఏమనుకుంటుందో అని నామోషీ గా భావించేవాడిని. సమాజానికే ఇజ్జత్ లేదు, దాని గురించి ఆలోచించటం మానేసి నేను ఏమనుకుంటున్నానో దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాను.

అవును నేను మారుతున్నాను

కూరగాయల వాళ్లతో, పండ్ల కొట్ల వాళ్ళతో బేరాలు ఆడటం మానేశాను. వాళ్లకు నాలుగు రూపాయలు ఎక్కువ ఇచ్చినంత మాత్రాన నేను పెద్దగా నష్టపోయేది ఏమీ లేదని తెలుసుకున్నాను.ఆ డబ్బులు వాళ్ల పిల్లల స్కూల్ ఫీజు కన్నా పనికి వస్తాయి కదా అని అనుకుంటున్నాను.

అవును నేను మారుతున్నాను

ఒకప్పుడు నేను ప్రత్యేకమైనవాడిని అనుకునేవాడిని. శతకోటి లింగాలలో మనం ఒక బోడి లింగం మాత్రమే. ఈ భూమి మీద కొన్ని లక్షల, కోట్ల గొప్ప వాళ్ళు, వీరులు జన్మించి చనిపోయారు. ఏదో ఒకరోజు మనం కూడా పోతాం. జీవితం లో జీవితం ని మించిన గొప్పది, విలువైనదీ ఏమీ లేదు అని తెలుసుకున్నాను.

అవును నేను మారుతున్నాను

గతం లో ఫేస్ బుక్ లో వ్యతిరేక కామెంట్స్ పెడితే వాదించేవాడిని. ఇప్పుడు మీ అభిప్రాయాన్ని గౌరవిస్తున్నాను అని చెప్పి ఊరుకుంటున్నాను.

అవును నేను మారుతున్నాను

ఒకప్పుడు ఇతరులు ఏ మాట అన్నా బాధ పడేవాడిని, ఇంకా ఎవరెవరు మన గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోటానికి ప్రయత్నించేవాడిని. ఇప్పుడు ఇతరుల మాటలకి నవ్వి ఊరుకుంటున్నాను.

అవును నేను మారుతున్నాను

కొందరు జనాలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అనుకొని బుర్ర పాడుచేసుకునేవాడిని.ఇప్పుడు ఎవరి చదువు, పెరిగిన పరిస్థితులు, అవగాహన, ఏర్పరచుకున్న అభిప్రాయాలు, వాళ్ళ జీవన ప్రయాణం ని బట్టి వాళ్ళు ఉంటారు. మనుష్యులుగా పుట్టినంత మాత్రాన అందరూ మనుష్యులు కాదు, రక రకాలుగా ఉంటారు; వైవిధ్యం ఉంటుంది, ఉండాలి కూడా అని తెలుసుకున్నాను.

అవును నేను మారుతున్నాను

ఒకప్పుడు డబ్బు ది ఏముంది, కొండాపూర్ లో కుక్కని కొట్టినా డబ్బులు వస్తై అనుకునేవాడిని. ఇప్పుడు విలువలతో పాటు డబ్బు కూడా చాలా అవసరం అని తెలిసుకున్నాను.

అవును నేను మారుతున్నాను

ఒకప్పుడు ఎవరైనా వచ్చి మా నాన్నకి శుభలేఖ ఇస్తే మనకి సెపరేట్ గా ఇవ్వలేదు కదా, మనల్ని పేరు పెట్టి పిలవలేదు అని ఆ పెండ్లి కి వెళ్ళేవాడిని కాదు. ఇప్పుడు వెధవలని కూడా అప్పుడప్పుడూ వెళ్ళి కలిసి వస్తున్నాను, లేకపోతే అసమర్ధుని జీవయాత్ర లో సీతారామారావు లా మిగిలిపోతాం.

అవును నేను మారుతున్నాను

నాకు చాలా విషయాల మీద అవగాహన ఉంది, నేను ఉత్తముడిని అనుకునేవాడిని. ప్రతి ఒక్కరూ మనలాగే ఉంటారు, చాలా విషయాల్లో నేనే వెనకబడి ఉన్నాను, నేను తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది చాలా ఉంది.

అవును నేను మారుతున్నాను

టాక్సీ డ్రైవర్ దగ్గర చిల్లర కోసం తగాదా పడటం లేదు, ఆ కాస్త చిల్లర అతని మొహంలో నవ్వులు పూయించడం నాకు ఆనందంగా ఉంది. ఏదేమైనా జీవిక కోసం నాకన్నా ఎంతో కష్ట పడుతున్నాడు అతను.

అవును నేను మారుతున్నాను

ఒకప్పుడు జనాల మాటల్ని నమ్మేవాడిని. రూపాయి ఖర్చుపెట్టకుండా రాజకీయం చేశాను అని చెప్పినా గుడ్డిగా నమ్మేవాడిని.ఇప్పుడు పనులని బట్టి మాత్రమే కాకుండా దానివెనక వారి ఆలోచనలని బట్టి జనాలని నమ్ముతున్నాను.

అవును నేను మారుతున్నాను

చెప్పిందే ఎందుకు చెబుతున్నావ్ అని పెద్దవాళ్ళను అడగడం మానేశాను. వాళ్లు గతాన్ని నెమరు వేసుకోవడానికి అది పనికి వస్తుందని గ్రహించాను.

అవును నేను మారుతున్నాను

తోటివారిలో తప్పు ఉంది అని తెలిసినా వారిని సరిదిద్దే ప్రయత్నం మానుకున్నాను.అందరిని సరైన దారిలో పెట్టే బాధ్యత నా ఒక్కడి భుజాలమీద లేదు అని తెలుసుకున్నాను. సమగ్రత కన్నా ప్రశాంతత ముఖ్యం అని తెలుసుకున్నాను.

అవును నేను మారుతున్నాను

ఒకప్పుడు జనాలు చేసే మోసాలు చూసి బురదలో పందుల్లా, పెంట మీద పురుగుల్లా, కొండాపూర్ లో కుక్కల్లా బతుకుతున్నారు అనుకునేవాడిని. ఇప్పుడు ఉచితంగా ఉదారంగా అభినందనలు అందరిపై కురిపిస్తున్నాను, అది వారితో పాటు నాకు ఆనందాన్నిస్తోంది.

అవును నేను మారుతున్నాను

చొక్కా పై పడ్డ మరకలు చూసి బెంబేలు పడటం మానేశాను ఆకారం కన్నా వ్యక్తిత్వం ముఖ్యం అని తెలుసుకున్నాను.

అవును నేను మారుతున్నాను

ఇంతకముందు నేను పట్టిన కుందేలు కి మూడే కాళ్ళు అన్న చందాన ఉండేవాడిని. ఇప్పుడు నిజంగా మూడే కాళ్ళు ఉన్నా, నేను ఏమైనా నాలుగో కాలిని చూడలేకపోతున్నానా అనుకుంటున్నాను.

అవును నేను మారుతున్నాను

నాకు విలువనివ్వని వారికి దూరం గా జరగడం నేర్చుకున్నాను. వారికి నా విలువ ఏమిటో తెలిసి ఉండకపోవచ్చు కానీ నా విలువ ఎంతో, ఏమిటో నాకు తెలుసు.

అవును నేను మారుతున్నాను

ఎవరైనా నన్ను తీవ్రమైన పోటీ లోకి లాగాలని చూసినప్పుడు ప్రశాంతంగా ఉండటం నేర్చుకున్నాను. నాకు ఎవరితో పోలిక లేదు, పోటీ అవసరం లేదు.

అవును నేను మారుతున్నాను

గతం లో నా అభిప్రాయం మాత్రమే కరక్ట్ అనుకునేవాడిని. ఇప్పుడు అవతలివారి కోణం లో అర్ధం చేసుకుంటున్నాను. ఇతరుల అభిప్రాయాలని, దానివెనక కారణాలని తెలుసుకుని నన్ను నేను సరి చేసుకుంటున్నాను.

అవును నేను మారుతున్నాను

నా భావావేశాలు నన్ను కలవర పెట్టకుండా చూసుకుంటున్నాను. ఎందుకంటే నన్ను నన్నుగా మనిషిగా నిలబెట్టేవి అవే. ఒక బాంధవ్యాన్ని ఒక సంబంధాన్ని తుంచుకోవడం కన్నా అహంకారాన్ని చంపుకోవడం మంచిదని గ్రహించాను.ఎందుకంటే నా అహంకారం నన్ను ఒంటరి గా నిలబెడుతుంది
సంబంధ బాంధవ్యాలు కొనసాగితే నేను ఎప్పుడూ ఒంటరిని కాదు కదా.

అవును నేను మారుతున్నాను

ప్రతిరోజు అదే చివరి రోజు అన్నట్టుగా బతకడం నేర్చుకున్నాను. నిజానికి ఈరోజే చివరి రోజు కావచ్చుఏమో..!

అవును నేను మారుతున్నాను

నాకేది సంతోషాన్ని ఇస్తుందో అదే చేస్తున్నాను. నా సుఖసంతోషాలకు నేనే…నేను మాత్రమే బాధ్యుడిని.

అవును నేను మారుతున్నాను

 • అజ్ఞాత రచయిత

ఇంటర్న్‌షిప్ అవకాశం @ తెలుగు వికీ – IIIT – Internship Opportunity : Oct-Spt 2021

తెలుగు భాషాభిమానులకు , విద్యార్థులకు శుభవార్త,

ఇంటర్న్‌షిప్ అవకాశం @ తెలుగు వికీ – IIIT – Internship Opportunity : Oct-Spt 2021

వికీపీడియా సమాచారం మరింత మెరుగ్గా తెలుగులో  అందించేందుకు ఐఐఐటీ-హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రాజెక్ట్ ఇండిక్ వికీ లో ఇంట షిప్ చేయడానికి దరఖాస్తులు కోరుతున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల అభ్యర్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ ఉచిత  ఇంటర్న్‌షిప్ శిక్షణ లో భాగంగా tewiki.iiit.ac.in లో  వివిధ అంశాల పై వ్యాసాలు సృష్టించటం , అభివృద్ధి చేయటం, అనువాద వ్యాసాలను సవరించటం,MCD ద్వారా ఇంగ్లీష్ నుంచి అనువాదం చేయడం వంటి రచనా సహాయం మీ నుంచి ఆశిస్తున్నాము.

విజయవంతంగా పూర్తి చేసిన వారికి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హైదరాబాద్ (IIIT – Hyd)  IndicWiki Project నుండి ఇంటర్న్‌షిప్ సర్టిఫికెట్ అందచేయబడుతుంది.

ఇంటర్న్ షిప్ వ్యవధి : 4 అక్టోబరు నుండి 30 నవంబరు 2021

ఈ  కార్యకమం గురించిన మరింత సమాచరం కొరకు , ఇందులో   మీ పేరు నమోదు చేసుకోవటానికి ఈ ఫారం లో వివరాలు ఇవ్వగలరు

https://forms.gle/CpswCzGB4DryhjMR9

సామాజిక మాధ్యామాలలో , అంతర్జాలంలో  తెలుగు భాషా వినియోగం పెరుగనున్న సమయంలో ఈ ఇంటర్న్ షిప్ కు  చాలా ప్రాధాన్యత వుంది.తెలుగు వారందరికీ తెలుగు విజ్ఞానం అందించాలి అన్న సంకల్పం , తెలుగులో వ్రాయాలనే ఉత్సాహమే ముఖ్యం. ఇందులో అనుభవం లేదు , తెలుగు టైప్ చేయడం రాదనే విషయాలు అతి చిన్నవి. అవి మీరు ఈ తెవికీ ఇంటర్న్ షిప్ లో నేర్చుకోవచ్చు మీరు చేరండి ,

NOTE: ఇది ప్రాజెక్టు ఆధారిత Online  అన్ పెయిడ్ ఇంటెర్న్షిప్ ( Free Training & No stipend),  కనీస  వ్యవధి 45 రోజులు.

ఇంకేదైనా సమాచారం కోసం 9014120442 ,లేదా tewiki@iiit.ac.in ను సంప్రదించండి .

*దయచేసి  మీకు తెలిసిన తెలుగు భాష అభిమానులు , విద్యార్థులకు , ఇంటర్న్ షిప్ అవకాశాల కోసం  అన్వేషిస్తున్న వారితో  ఈ అవకాశము గురించి తెలియచేయగలరు*

తెలుగు తల్లి – శ్రీశ్రీ

అదెవో తెలుగు తల్లి

అందాల నిండు జాబిల్లి

ఆనందాల కల్పవల్లి

అదె నీ తెలుగు తల్లి

పదవోయ్ తెలుగువాడా

అదె నీ తెలుగు మేడ

సంకెళ్ళు లేని నేల

సంతోష చంద్రశాల

కనవోయ్ తెనుంగు రేడా

అదే నీ అనుంగు నేల

అదిగో సుదూరవేల

చనవోయ్ తెలుగు వీరా

స్వర్గాల కాంతి స్వప్నాలు

స్వప్నాల శాంతి స్వర్గాలు

నిన్నే పిలుస్తున్నాయి.

నిన్నే వరిస్తున్నాయి

ఆందోళనాల డోల

సందేహాల హిందోళ

ఎందాక ఊగిసలాట

ఇదె నీ గులాబీ తోట

సరి అయిన తెలుగు _ రచన సత్తి సునీల్ గారు

“నీరజ్ చోప్రా vs. నీరజ్ చోప్డా”

NEERAJ CHOPRA అనే 23 ఏళ్ళ భారత ఆర్మీ సుబేదార్ ఇటీవల టోక్యో లో జరిగిన ఒలింపిక్స్ -2020 లో పురుషుల ‘జావెలిన్ త్రో’ క్రీడలో స్వర్ణ పతకం మన దేశానికి తీసుకవచ్చాడు … హరియాణా రాష్ట్రం, పానీపత్ ప్రాంతానికి చెందిన ఇతను ఆర్మీలో “4 – రాజ్ పుతానా రైఫిల్స్” కు చెందిన వాడు …. రాజ్ పుతానా రైఫిల్స్ నే హ్రస్వ రూపం లో “రాజ్ రిఫ్ – RAJ RIF” అంటారు ….

విషయంలోకి వద్దాం … NEERAJ CHOPRA అన్న పేరును తెలుగులో ఎలా రాయాలి? … యధాలాపంగానే చాలావరకు తెలుగు పత్రికా మాధ్యమాలు, ప్రసార మాధ్యమాలు, సామాజిక మాధ్యమాలు “నీరజ్ చోప్రా” అని రాసేశాయి … చదివేశాయి … నాలాంటి వారు ఒకరిద్దరు “నీరజ్ చోప్డా” అని అనడం కూడా రాశాము … అదెట్టా అని అడిగిన వారికి, అదిట్టా అని కూడా వివరంగా కూడా టపాలు పెట్టాను … ఉత్తర భారత దేశంలో కొన్ని కొన్ని చోట్ల (కొన్ని కొన్ని పదాలలో) R అక్షరం పదము మధ్యలోగానీ, చివరలో గానీ వస్తే దాన్ని “డ” గా ఉచ్ఛరిస్తారు అని … నిజానికి B R CHOPRA ను “బి ఆర్ చోప్డా” అంటారు … PREM CHOPRA ను “ప్రేమ్ చోప్డా” అంటారు … PRIYANKA CHOPRA ను “ప్రియంకా చోప్డా” అంటారు … (ప్రియాంక అనడం కూడా తప్పే, ప్రియంకా సరైనది … అక్కడ ఉత్తర భారతం లో) ….

ఈ విషయం లో చిన్నపాటి రీసెర్చ్ చేశాను …. ఈ విధమైన ‘ర’ అక్షరం ‘డ’ అక్షరంగా కొన్ని కొన్ని చోట్ల ఎందుకు ఉచ్ఛరిస్తారు … ఎవరైనా భాషా శాస్త్రజ్ఞులు చెప్పాలి … అయితే ఈ ప్రధ గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, హరియాణా, దిల్లీ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, బిహార్, ఝార్ ఖండ్, ఛత్తీస్ గఢ్, మధ్య ప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బంగాల్, అసోమ్, తెలంగాణా మొదలైన రాష్ట్రాలలో ఉన్నది … రాష్ట్రాల పేర్లలో, నగరాల పేర్లలో, ప్రదేశాల పేర్లలో, మనుషుల పేర్లలో, భోజన పదార్ధాల పేర్లలో, వస్తువుల పేర్లలో, నిర్మాణాల పేర్లలో విస్తారంగా ఉంది … మొత్తం భారత దేశంలో ఇలాంటివి కొన్ని వేలు ఉంటవి … స్థానికులు ఎలా పలుకుతారో మనం ఆలా పలకాలి … అంతే కానీ, మాకు ఇది సౌఖ్యంగా ఉంది మేము ఇలానే పలుకుతాము అంటే అంత బాగోదు …

నేను గమనించిన కొన్ని పదాలు కింద ఇస్తున్నాను … అక్షర క్రమంలో … IN ALPHABETICAL ORDER …. భాషా ప్రేమికులు, మాధ్యమాల వారు ఒక సారి చూడండి …. “నచ్చితే డౌన్ లోడ్ చేసుకుని భవిష్యత్తు రిఫరెన్స్ కోసం ఉంచుకోండి” ….

 1. AZAMGARH … (U P) … ఆ జ మ్ గ ఢ్ … ఆజం ఘర్ / ఆజం గర్ అనడం తప్పు …
 2. ALIGARH …. (U P) … అ లీ గ ఢ్ సరైనది …. అలీఘర్ / ఆలిగర్ అనటం తప్పు … అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ గుర్తుందా …
  3.. BAHADURGARH …. (RAJASTHAN ) … ఝు న్ ఝు ను జిల్లా – బహాదుర్ గఢ్ సరైనది … బహదూర్ గర్ తప్పు …
 3. BALLABHGARH …… (HARYANA ) … ఫరీదాబాద్ జిల్లా – బ ల్ల భ్ గ ఢ్ సరైనది … బల్లబ్ ఘర్ తప్పు …
 4. BARGARH … (ODISHA) … బ ర్ గ ఢ్ (సిటీ & జిల్లా) సరైనది … బార్ ఘర్ తప్పు …
 5. BARMER … (RAJASTHAN ) … బా డ్ మే ర్ సరైనది …. రెండవ పెద్ద జిల్లా – బాడ్ మేర్ నగరం కూడా ఉంది … బార్మర్ / బర్మేర్ అనటం తప్పు …
 6. CHANDIGARH … (UNION TERRITORY ) ,,, చం డీ గ ఢ్ సరైనది … చండీ ఘడ్ / చండీ గర్ అనటం తప్పు …
 7. CHHATTISGARH … (STATE ) …. ఛ త్తీ స్ గ ఢ్ సరైనది …. ఛతీస్ ఘర్ / చతీస్ గర్ అనటం తప్పు ….
 8. CHAWRI BAJAR … DELHI …. చా వ్ డీ బా జా ర్ …. (ఓల్డ్ దిల్లీ) … చావరి బజార్ అనటం తప్పు …
 9. CHHINDWARA …. (MADHYA PRADESH ) …. ఛి న్ ద్వా డా సరైనది …. చింద్వారా అనటం తప్పు ….
 10. CHITTORGARH … (RAJASTHAN ) … చి తో డ్ గ ఢ్ జిల్లా – చితోడ్ గఢ్ సరైనది … చిత్తూర్ గర్ తప్పు …
 11. CHURIWALAN … OLD DELHI …. చూ డీ వా లా సరైనది …. చురీవాలన్ అనటం తప్పు ….
 12. DEOGARH … (ODISHA) … దే వ్ గ ఢ్ (సిటీ & జిల్లా) సరైనది … డియోఘర్ తప్పు …
 13. DHARKAN … (BOLLYWOOD FILM ) …. ధ డ్ క న్ సరైనది …. ధర్ కన్ అనటం తప్పు ….
 14. DIBRUGARH … (ASOM) …. డి బ్రూ గ ఢ్ సరైనది … దిబ్రు ఘర్ /దిబ్రు గర్ అనటం తప్పు ….
 15. DONGARGARH … (CHHATTISGARH ) … డోం గ ర్ గ ఢ్ సరైనది …. దొంగర్ గర్ అనటం తప్పు ….
 16. GAUR (NORTH INDIAN SURNAME) …. గౌ డ్ సరైనది …. గౌ ర్ అనటం తప్పు ….
 17. GARH …. (కోట) …. గ ఢ్ సరైనది … ఘడ్ / గర్ అనటం తప్పు ….
 18. GARHI … (చిన్న కోట / కోట లాంటి పెద్ద ఇల్లు) … గ ఢీ సరైనది …. ఘరి/ గర్హి అనటం తప్పు … (తెలంగాణా రాష్ట్రంలో స్థానిక జమీందారులు / భూస్వాములు / దొరల ‘గఢీలు’ ఇవే )
 19. GOVINDGARH …. (మధ్య ప్రదేశ్) …. గో విం ద్ గ ఢ్ సరైనది …. గోవింద్ ఘర్ అనటం తప్పు ….
 20. GUR … (బెల్లం) …. ‘గుడ్’ సరైనది … గుర్ అనటం తప్పు ….
 21. HANUMANGARH … (RAJASTHAN ) …. (నగరం + జిల్లా పేరు) … హనుమాన్ గఢ్ సరైనది … హనుమాంగర్హ్ అనటం తప్పు ….
 22. HAPUR (UTTAR PRADESH ) …. ‘హా పు డ్’ సరైనది …. హాపూర్ అనడం తప్పు …
 23. HARKANA … (FORCED TO TURN AWAY / అరవడం /తిట్టడం) … హ డ్ కా నా సరైనది …. హర్కానా అనడం తప్పు …
 24. HOWRAH … (WEST BENGAL ) …. హా వ్ డా సరైనది …. హౌరా అనటం తప్పు ….
  26 JAKHAR BALRAM (RAJASTHAN) …. జా ఖ డ్ సరైనది …. జక్కర్ అనటం తప్పు ….
 25. JALPAIGURI … (WEST BENGAL ) …. జల్[పాయ్ గుడీ సరైనది …. జల్[పాయ్ గురి అనటం తప్పు ….
 26. JAYA BHADURI … (WEST BENGAL ) … జ యా భా దు డీ సరైనది … జయా భాదురి అనటం తప్పు ….
 27. JUNAGARH … (GUJARAT) … (నగరం + జిల్లా పేరు) … జునాగఢ్ సరైనది … జునాగర్ / జునాఘర్ అనటం తప్పు ….
 28. KAKKAR … (NORTH INDIAN SURNAME) …. కక్కడ్ సరైనది … కక్కర్ అనటం తప్పు ….
 29. KHAIRAGARH … (CHATTISGARH) …. (రా జ్ నాం ద్ గా వ్) … ఖై రా గ ఢ్ సరైనది …. ఖైరాగర్ అనటం తప్పు ….
 30. KHARAGPUR …. (WEST BENGAL ) …. ఖ డ గ్ పు ర్ సరైనది …. ఖరగ్ పూర్ అనటం తప్పు ….
 31. KHARORE … (N.V. SOUP) …. ఖ రో డే సరైనది …. ఖరోరే అనటం తప్పు …. (మేక/ కోడి కాళ్ళ సూపు) …
 32. KIRORI MAL (COLLEGE) … (NEW DELHI) … కి రో డి మ ల్ సరైనది …. కిరోరి మల్ అనటం తప్పు ….
 33. KISHANGARH (AJMER Dt ., RAJASTHAN ) … కి శ న్ గ ఢ్ సరైనది …. కిషన్ గర్ అనటం తప్పు ….
 34. KUMBHALGARH (Rajsamand Dt) , RAJASTHAN … కుం భ ల్ గ ఢ్ సరైనది …. కుంభాల్ గర్ అనటం తప్పు ….
 35. KUPWARA …. (J & K) …. కు ప్ వా డా సరైనది …. కుప్ వారా అనటం తప్పు ….
 36. MARWAR … (A Region in Rajasthan) …. మార్వాడ్ సరైనది …. మార్వార్ అనటం తప్పు ….
 37. MARWARI …. (Rajasthan) …. మా ర్వా డీ సరైనది …. మార్వారీ అనటం తప్పు ….
  40.. MEWAR … ( Rajasthan) …. మే వా డ్ సరైనది …. మేవార్ అనటం తప్పు ….
 38. MAIDANGARHI …. ( S. W. DELHI ) …. మై దా న్ గ డీ సరైనది …. మైదాన్ గరీ/ మైదాన్ గర్హీ అనటం తప్పు …. (IGNOU ఉంది ఇక్కడ)
 39. MUJAFFERGARH … (VIDISHA, MADHYA PRADESH) … ము జ ఫ్ఫ ర్ గ ఢ్ సరైనది …. ముజఫర్ గర్ అనటం తప్పు ….
 40. MUKUNDGARH … (JHUNJHUNU Dt, RAJASTHAN) …. ము కుం ద్ గ ఢ్ సరైనది …. ముకుంద్ గర్ అనటం తప్పు ….
 41. NAJAFGARH …. (DELHI) …. న జ ఫ్ గ ఢ్ సరైనది …. నజఫ్ గర్/ నజఫ్ ఘర్ అనటం తప్పు ….(వీరేందర్ సహ్వాగ్ ను ‘నజఫ్ గఢ్ కా నవాబ్’ అంటారు … సెహ్వాగ్ అనటం తప్పు … సహ్వాగ్ అనటం సరైనది …)
 42. NARAINGARH … (AMBALA , HARYANA) …. నా రా య ణ్ గ ఢ్ సరైనది …. నారాయణ్ గర్ అనటం తప్పు ….
 43. NUMALIGARH … (GOLAGHAT Dt .. . ASOM) …. ను మా లీ గ ఢ్ సరైనది …. నుమాలి గర్ అనటం తప్పు …. (ఆయిల్ రిఫైనరీస్)
 44. PATNAGARH …. (BALANGIR Dt.. ODISHA) …. ప ట్నా గ ఢ్ సరైనది ….. పాట్నగర్ / పాట్నఘర్ అనటం తప్పు ….
 45. PITHORAGARH … (UTTARAKHAND) ( సిటీ & జిలా) …. పి థో రా గ ఢ్ సరైనది ….. పితోరాగర్ / పితోరాఘర్ అనటం తప్పు …
  49 PHAGWARA … (PUNJAB ) ….. ఫా గ్ వా డా …. సరైనది ….. ఫా గ్ వా రా అనటం తప్పు …
 46. PRATAPGARH …. (UTTAR PRADESH) (సిటీ & జిలా) …. ప్ర తా ప్ గ ఢ్ సరైనది ….. ప్రతాప్ గర్ / ప్రతాప్ ఘర్ అనటం తప్పు …
 47. RABRIDEVI … (BIHAR) (మాజీ ముఖ్య మంత్రి) …. రా బ్డీ దే వీ సరైనది ….. రాబ్రీ దేవి అనటం తప్పు …
 48. RAMGARH … (JHARKHAND) ( సిటీ & జిలా) …. రా మ్ గ ఢ్ సరైనది ….. రా మ్ గర్ / రా మ్ ఘర్ అనటం తప్పు …
 49. ROORKEE …. (UTTARAKHAND) ….. రూ డ్ కీ సరైనది ….. రూర్కీ అనటం తప్పు …
 50. ROPAR …. (PUNJAB ) …. రో ప డ్ సరైనది ….. రోపార్ అనటం తప్పు …
 51. SARI / SARRY … (కట్టుకునే చీర) …. ‘సాడీ’ సరైనది ….. శారీ అనటం తప్పు …
  56 SATPURA …. (MOUNTAIN RANGE) ….. సా త్పు డా సరైనది ….. సాత్పుర అనటం తప్పు … …..
 52. SEVOKE MORE …. (DARJEELING Dt, WEST BENGAL) , సేవక్ మోడ్ సరైనది ….. సివోకే మోర్ అనటం తప్పు …
 53. SILIGURI … (DARJEELING Dt, WEST BENGAL) …. శి లీ గు డీ/ సి లి గు డీ సరైనది ….. సిలిగురి అనటం తప్పు …
 54. SITAMARHI …. (BIHAR) ….. సీ తా మ డీ సరైనది ….. సీ తా మా ర్హి అనటం తప్పు …
 55. SUNDARGARH …. (ODISHA) …. (సిటీ & జిలా) …. సుందర్ గఢ్ సరైనది ….. సుందర్ గర్/ సుందర్ ఘర్ అనటం తప్పు ….
 56. SURAJGARH …. (JHUNJHUNU Dt. RAJASTHAN) …. సూరజ్ గఢ్ సరైనది ….. సూరజ్ గర్/ సూరజ్ ఘర్ అనటం తప్పు …
 57. SURATGARH … (SRI GANGANAGAR Dt, RAJASTHAN) …. సూరత్ గఢ్ సరైనది ….. సూరత్ గర్/ సూరత్ ఘర్ అనటం తప్పు …
 58. TIKAMGARH …. (MADHYA PRADESH) …. టీ క మ్ గ ఢ్ సరైనది ….. తి కామ్ గ ర్ అనటం తప్పు …
 59. TITAGARH … (North 24 Paraganas, WEST BENGAL) …. టి టా గ ఢ్ సరైనది ….. టిటాగర్/ టిటాఘర్ అనటం తప్పు …
 60. TITL AGARH … (Balangir Dt , ODISHA ) …. టి ట్లా గ ఢ్ సరైనది ….. టిట్లాగర్/ టిట్లాఘర్ అనటం తప్పు …
 61. UTTAR PARA …. (WEST BENGAL) ….. ఉ త్త ర్ పా డా సరైనది ….. ఉత్తర్ పారా అనటం తప్పు …
  భాషా ప్రేమికులు, మాధ్యమాల వారు ఒక సారి చూడండి …. “నచ్చితే డౌన్ లోడ్ చేసుకుని భవిష్యత్తు రిఫరెన్స్ కోసం ఉంచుకోండి” ….
  అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు ….
  సత్తి సునీల్ … 15-8-2021 / ఆదివారం … విశాఖపట్న

ఆదాయ పన్ను మినహాయింపులు

News Source from Eenadu

Published : 28/07/2021 11:47 IST   Tax Saving Methods: మీకు తెలుసా.. వీటన్నింటికీ పన్ను మినహాయింపు ఉంటుంది!

Tax Saving Methods: మీకు తెలుసా.. వీటన్నింటికీ పన్ను మినహాయింపు ఉంటుంది!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆదాయపు పన్ను చట్టం, 1961 ప్రకారం మనం పెట్టే కొన్ని రకాల పెట్టుబడులు, చేసే వ్యయాలు, వచ్చే ఆదాయంపై పన్ను మినహాయింపు లభిస్తుంది. వేతన జీవులు వీటిని ఆదాయపు పన్ను రిటర్నుల్లో చూపెట్టడం ద్వారా పన్ను ఆదా చేసుకోవచ్చు. ఇంతకీ ఏ సందర్భాల్లో పన్ను మినహాయింపు లభిస్తుందో చూద్దాం..!

సెక్షన్ 80సీ కిందకి వచ్చే మినహాయింపులు..

* ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు: ఐదేళ్ల కాలపరిమితితో చేసే ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వచ్చే వడ్డీలో రూ.1.5 లక్షల వరకు మినహాయింపు ఉంటుంది.

* పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌(పీపీఎఫ్‌)పై వచ్చే వడ్డీకి పన్ను రాయితీ లభిస్తుంది.

* ఈక్విటీ లింక్డ్‌ సేవింగ్స్‌ స్కీమ్‌(ఈఎల్‌ఎస్‌ఎస్‌)లో వచ్చే రాబడిపై లాంగ్‌ టర్మ్‌ క్యాపిటల్‌ గెయిన్స్ ట్యాక్స్‌ ఉంటుంది. అయితే, రూ.1 లక్ష వరకు మినహాయింపు పొందవచ్చు.

* నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌ పథకం ద్వారా లభించే వడ్డీలో రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంటుంది.

* మనం చెల్లించే వివిధ రకాల ఇన్సూరెన్స్‌ ప్రీమియంలకు కూడా మినహాయింపు ఉంటుంది. అయితే, ఆ ప్రీమియంల మొత్తం రూ.1.5 లక్షలు మించకూడదు. అలాగే బీమా విలువ వార్షిక ప్రీమియానికి పదింతలు ఉండాలి.

* గృహ రుణ చెల్లింపులో ఏటా చెల్లించే అసలులో రూ.1.5 లక్షలకు పన్ను మినహాయింపు లభిస్తుంది.

* పిల్లల చదువు కోసం చెల్లించే వార్షిక ట్యూషన్‌ ఫీజులో రూ.1.5 లక్షల వరకు రాయితీ ఉంటుంది.

* సంఘటిత రంగంలో ఉండే ఉద్యోగుల వేతనాల నుంచి 12 శాతం ఈపీఎఫ్‌లో కలిసిపోతుంది. ఏటా రూ.1.5 లక్షల ఈపీఎఫ్‌కు పన్ను మినహాయింపు కోరే అవకాశం

* సీనియర్‌ సిటిజన్స్‌ సేవింగ్స్‌ స్కీమ్‌(ఎస్‌సీఎస్‌ఎస్‌)లో పెట్టే పెట్టుబడిపై రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు కోరవచ్చు. ఈ స్కీమ్‌ 60 ఏళ్లు పైబడి వారి ఐదేళ్ల కాలపరమితితో అందుబాటులో ఉంది.

* సుకన్య సమృద్ధి యోజన: 10 ఏళ్ల లోపు బాలికల తల్లిదండ్రులు ఈ పథకంలో మదుపు చేసినట్లయితే.. వారికి పన్ను మినహాయింపు లభిస్తుంది.

నేషనల్‌ పెన్షన్‌ స్కీమ్‌..

* నేషనల్‌ పెన్షన్‌ స్కీమ్‌లో పెట్టుబడిపై సెక్షన్‌ 80సీసీడీ(1బి) కింద రూ.50,000 వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది.

హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్రీమియం..

ఆరోగ్య బీమా కోసం ఏటా చెల్లించే ప్రీమియంలలో రూ.25,000 వరకు పన్ను మినహాయింపు ఉంటుంది. ఇది సెక్షన్‌ 80డీ పరిధిలోకి వస్తుంది. సెక్షన్‌ 80సీ కింద ఇన్సూరెన్స్‌ ప్రీమియంలకు లభిస్తున్న మినహాయింపునకు ఇది అదనం.

హెచ్‌ఆర్‌ఏపై

మీ వేతనంలో హెచ్‌ఆర్‌ఏ కూడా కలిపి ఉంటే.. ఆ మొత్తానికి పన్ను మినహాయింపు కోరే అవకాశం ఉంది. అయితే, దీనికి కొంత గరిష్ఠ పరిమితి ఉంటుంది. ఒకవేళ హెచ్‌ఆర్‌ఏ రాకపోయినా.. అద్దె చెల్లిస్తున్నట్లయితే, ఏటా రూ.60 వేల వరకు పన్ను మినహాయింపు కోరేందుకు వెసులుబాటు ఉంది. 

గృహ రుణంపై చెల్లించే వడ్డీ..

గృహ రుణంపై చెల్లించే అసలుపై సెక్షన్‌ 80సీ కింద పన్ను మినహాయింపు లభిస్తే.. ఐటీ చట్టం సెక్షన్‌ 24 ప్రకారం.. ఏటా చెల్లించే రూ.1.5 లక్షల గృహరుణ వడ్డీకి కూడా పన్ను రాయితీ కోరవచ్చు.

పొదుపు ఖాతాలో ఉండే సొమ్ము..

పొదుపు ఖాతాల్లో ఉంచే సొమ్ములో రూ.10,000 వరకు సెక్షన్‌ 80టీటీఏ కింద పన్ను మినహాయింపు ఉంటుంది. సీనియర్‌ సిటిజన్స్‌ అయితే ఈ పరిమితి రూ.50 వేల వరకు ఉంటుంది.

స్వచ్ఛంద సంస్థలకు ఇచ్చే విరాళాలు..

వివిధ స్వచ్ఛంద సంస్థలకు ఇచ్చే విరాళాలతో పాటు ధార్మిక కార్యక్రమాలకు చేసే ఖర్చులో 50 శాతం వరకు పన్ను మినహాయింపు కోరవచ్చు. అయితే, దీనికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఏయే విరాళాలు, ధార్మిక కార్యక్రమాలకు పన్ను మినహాయింపు ఉంటుందో తెలుసుకోవాలి. స్వచ్ఛంద సంస్థలైతే 80జీ సర్టిఫికెట్‌ కలిగి ఉండాలి.