పుట్టపర్తిలో వేంకటేశ్వరుని దివ్యక్షేత్రం

ఓహో …  వేంకటేశ్వరుని దివ్యక్షేత్రంలో దేవాలయం, కళ్యాణ మండపం, ప్రవాసాంధ్రుల కోసం వంద గదులతో అతిథి గృహాలు కడతారట . తితిదే కన్ను ఇప్పుడు బాబా గారి పట్టణం మీద పడ్డది.ఒక ప్రశాంత మయిన పట్టణం ఇక పై అవినీతి,లాబీలు,అసంబద్దమైన పనులకు అడ్డగా మారునేమో .ఆదికేశవుల నాయుడు గారు మోన్న జన్మదిన వేడుకలలో మీ హడావిడి ఎందుకో అర్దం కాలేదు అందరు స్వాములను విశ్వశాంతి యజ్ఞం నికి ఎందుకు పిలిచారు? ఒక వేళ అలా పిలిస్తే ఏ ఒక్కరి కో ప్రాముఖ్యత ఇచ్హి మిగిలి న వారిని ప్రేక్షకపాత్ర వహించమనటం సబబు కాదు  ఇలాంటి సున్నిత మయిన విషయాలలో తితిదే  కోంచెం విజ్ఞతతో వ్యవహరించాలని సూచన.

ఆ౦ధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు

మా తెలుగు తల్లికి మల్లె పూ దండ
మా కన్న తల్లికి మంగళారతులు

కడుపులొ బంగారు కనుచూపులొ కరుణ
చిరునవ్వులొ శిరులు దొరలించు మా తల్లి

గలగలా గోదారి కదలి పోతుంటేను
బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను

బంగారు పంటలే పండుతాయి
మురిపాల ముత్యాలు దొరలుతాయి.

అమరావతీ నగర అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు

తిక్కయ్య కలములో తియ్యందనాలు
నిత్యమై, నిఖిలమై నిలచి ఉండేదాక

రుద్రమ్మ భుజ శక్తి, మల్లమ్మ పతి భక్తి
తిమ్మరుసు ధీయుక్తి, కృష్ణరాయని కీర్తి

మా చెవులు రింగుమని మారుమ్రోగే దాక
నీ ఆటలే ఆడతాం, నీ పాటలే పాడతాం
జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి

 

తెలుగు తల్లి

తెలుగు తల్లి

ఆ౦ధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు