గూగుల్ ప్లస్ లొ BUG

గూగుల్ బజ్ మూసివెస్తుండటము తొ మా తమ్ముడిని గూగుల్ ప్లస్ లొ లాగిన్ అవ్వమని సూచించా
తను తన జిమెయిల్ ఐ.డి తో లాగిన్ అయ్యి ” Google PLUS లొ “Find friends:” opction లో Yahoo selcect చేసుకోగానే నా yahoo accout (krupal_kasyap) లొ contacts ఎటువంటి హెచ్హరిక, password లేకుండనే మా మా తమ్ముడిని గూగుల్ ప్లస్ లొ వచ్హిచేరాయి, ఇదేమిటా అని శోధిస్తే ఆ google chrome brower నేను పది నిమిషాల క్రితం Yahoo mail లొ లాగిన్ అయ్యి signoff కాకుండా ఆ టాబ్ ని మూసివేశా తరువాత మా తమ్ముడు తన జిమెయిల్ ఐ.డి తో లాగిన్ అయ్యి Find friends select చేసుకోన్నప్పుడు Google PLUS నా yahoo accout నుండి contactని క్రోల్ చేసినది with out any authentication ! కావున మీరు మీ computer ఇతరులతో కలసి వాడుకోనేటప్పుడు పూర్తిగా signoff అవటము మరువవద్ధు

‘ఆకాశ్’ చదువులు

ప్రపంచంలోనే అత్యంత చౌక ట్యాబ్లెట్ పీసీ ‘ఆకాశ్’ ఎట్టకేలకు డేటావిండ్ సంస్థ సహకరంతొ ఆవిష్కృతమైంది
చాలా వార్తా చానెళ్ళు ఇదేదో భారత ఆవిష్కారంగా , అర్ ఏన్ డీ గొప్పతనంగా చెపుతున్నారు పేరు పొందిన వార్త సంస్థలు కూడా దీనికి వంత పాడటం భలే విచిత్రం

ఇది సత్యదూరం ఇది ప్రవాస భారతీయుడు సునీత్ సింగ్ స్థాపించిన కెనడాకు చెందిన డేటావిండ్ సంస్థ పోడక్టు ,
ఇలాంటివి నలబై డాలర్ లకు దొరుకుతున్నయ్
http://www.alibaba.com/products/Tablet/–702————48-350054.html

ఇంచు మించు ఇలాంటి కాఫిగరేషన్ వున్న చైనా వాడి ప్రోడక్టు చూడండి
http://www.alibaba.com/product-gs/334539736/mini_7_android_tablet.html

ఇది ఏదో మన భారతీయుల ఘన కార్యంగా చెప్పుకోవటం ఎంతవరకు సబబు ?

అయితే మన ప్రభుత్వమ్ ఈ సంస్థలకు 50 శాతం సబ్సిడీ భరించటమ్ వలన ఈ ట్యాబ్లెట్ పీసీల ధర సుమారు రూ. 1,100-1,200 మద్య వున్నది అయినా కూడా
పది డాలర్లు తగ్గించి నందుకు భారత ప్రభుత్వాన్ని డేటావిండ్ సంస్థ కు ధన్యవాదములు .

చౌక ట్యాబ్లెట్ పీసీ ‘ఆకాశ్’ ఇంత వరకు బాగనే వున్నది కాని మన ప్రభుత్వమ్ తొమ్మిదవ తరగతి నుండి ఈ ఆకాశ్ టాబ్లెట్ పి సీ

లను ఎందుకు అందిస్తున్నారొ అర్దమ్ కావటంలే, అసలు కరెంటే సక్రమంగా ఉండని మనప్రాంతాలో

ఈ ఇంటర్నెట్ సాధనం వినియోగపు మాట అలావుంచి . పిల్లలు నేర్చుకోవటానికి ఈ ఏడు అంగుంళాల తెరలు ఎంతవరకు ఉపయోగపడతాయి అదీ 9-12వ తరగతి

విద్యార్దులకు ఇప్పటికే ప్రాక్టిల్ విద్యలేని మన రుద్దుడు చదువులకు మల్టీమీడియా వివరింపులు

ఎంతవరకు ఉపయోగ పడతాయి ఒక ఉదాహరణ : రసాయిన శస్త్రం లొ ఆమ్లము నీలి లిట్మస్ కాగితము ఆమ్లము లొ ముంచితే ఎర్ర గా మారుతుంది అని చదివాం , దీనిని మనం ఒక వీడియోద్వారా ఆకాశ్ విద్యార్దులకి చెప్పాం ఖచ్హితంగా పుస్తకంలో చదివిన దానికన్నా ఈ వీడియో ద్వారా అర్దమవుతుంది కానీ అసలు లిట్మస్ కాగితంఅంటె ఎమిటి? ఎదైనా ద్రవంలో ముంచితే దాని కి ఎమవుతుంది లాంతి ప్రయోగాత్మ్క జిజ్ఞాసను , ప్రయోగాలు చెయ్యాలనే అభిలాష కరువవుతుంది. చిన్నప్పుడు అనుకోనే వాడిని కొత్తగా కనిపెట్టటనికి ఎమీలేకుండా ఆని కనిపెట్టేశారే ఇప్పుడు కొత్త ప్రయోగాలు టైంవేస్టు అని. సివిల్ ఇంజనీరు కావాలనే పిల్లవాడికి సిమెంటు,మట్టి,నీళ్ళు ఇవ్వాలి కాని డిస్కవరీ చానెళ్ళలొ చూపినట్లు పెద్ద పెద్ద క్రేన్,ఇంజన్ల్ తొ జరిగే భవన నిర్మాణాల వీడియోలు డేమోలు కాదు దాని వలన వాడు తన చుట్టూ వుంన్న కొద్ది వనరులు ఆ యంత్రాలతో బేరీజు వేసుకోని ఆనాశక్తి సివిల్ ఇంజనీరు కావాలనే కోరికను చంపుకోంటాడు లేదా బాగా గేటు, ఎమ్సెసెట్టు లాంటి బిట్లు ప్రిపైర్ అయ్యి ఏ ఐ.ఐ.టి లో చేరి ఎ అమెరికా, యూరప్క్ కో పై చదువులకోసమో , ఉపాది కొరకో వెళుతున్నారు. అబివృద్ది , నవీన సాంకేతికత మీద జ్ఞాన సముపార్జన అవసరమే కానీ నేర్చుకోనే వయసులో ప్రాధమిక విషయాల పై పట్టులేకుండా ఈ మల్టీమీడియా చదువులు ఎందుకు ?. మోన్నామద్య జయలలిత తమిళనాడులో పదివేల కోట్లుపెట్టి ఒకోక్కటి ఇరవైవే॑ల విలువచే హె.పీ, ఎసర్ ల లాప్ టాపులు కొన్నారు కోంటున్నారు ( ?) . ఇప్పుడు సునీత్ సింగ్ టులి గారు ఆకాశ్’ టాబ్లెట్ పి సీ ని మూడువేలకే ఇస్తున్నారు బహుశా కపిల్ సిబాల్, సునీత్ సింగ్ టాబ్లెట్ పి సీ జయలలిత ని నచ్హలేదేమో ఏది ఏమయినా మన రాజకీయ నాయకుల నుండి ఉచిత ఇంటర్నేట్టు అశించవచ్హు …… హా బి.ఎస్,ఎన్ ఎల్ అధికారులకి ఇంటర్నేట్టు , బ్రాడ్ బ్యాండు సర్వీసులు లాభసాటిగాలేవని ప్రవేటు సంస్ద్తలు కట్టబెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు అది పూర్తి కాగానే మన నాయకులు ఉచిత అంతర్జాల వియోగ పధకం ప్రారంభించి వేలకోట్ల రూపాయలు ప్రవేటు కంపెనీలకి సమర్పిస్తారు . మన అధికారులు సుపర్ తెలివితో ప్రపంచ హార్డ్ వేర్ మార్కేటును ఆదుకొంటారు మొదట ప్రపంచంలో ఎవ్వరూ కొనక పోగుబడిన డెస్క్టటాపులు , లాప్టటాపులు మార్కెట్ ధరకన్న ఒక పది రూపాయలకు తక్కువ కోని కోంతకాలానికి వాటికి ఎ చైనా వాడివో నేట్వర్క్ మోడెంమ్ డేటా కార్డులు , పెన్ డ్రైవులు కొని అవి పాత బడ్డాయని టాబ్లెట్ పిసీలు కోని ప్రతివీది చివర వైఫై పోర్టులు పెట్టి విద్యార్దులకు జనాలకు అంతర్జాలం అందుబాట్లో వుంటుంది అప్పుడు ఎంచక్కా స్కూలుకు వెళ్ళ వలసిన అవసరం గాని , ఉపాద్యాయులు కానీ , పుస్తకాలు గాని , స్కూళ్ళు గాని అవసరం వుండదు పరీక్షలు , ఫలితాలు, ఉపాది అంతా ఆకాశ్ టాబ్లెట్ చూసుకొంటుంది. నా కంప్యూటర్ ఒక టెర్రాబైటు పుస్తకాలు,వీడియోలు వున్నాయి వీట్లిలో చాలా మటుకు నా వృతికి గాని, నా వ్యక్తిగత జీవితానికి గానీ వుపయోగపడటమ్ లేదు, వున్న పిసీ, లాప్టటాప్, ఆడ్రయిడ్ ఫోనులు ఎక్కువగా వినోదం కొరకే వాడుతున్నా . ఇహ మన టీనేజ్ పిల్లల కు ఇవి ఇచ్హి అందులో ఐ.ఐ.టి ప్రోఫెసర్ ల వీడియోలు పెట్టి పంచితే ఎమిలాభం ?