మంత్ర – అనసూయ ల గురించి

మంత్ర ,అనసూయ   – పోయిన వారం నేను చూసిన  చలనచిత్రాలు .
వాణిజ్య పరమయిన  విజయాలను  పరిగణ లో నికి తీసుకోన్నా  ఈ రెండు చిత్రాలు చక్కటి విజయం సాదించటం అబినందనీయం .
మంత్ర ,అనసూయ  రెండూ  కూడా  బలమయిన  వ్యక్తిత్తము, దైర్యం  గల   మహిళల గురించి (ఇక్కడ ఆడవారు/మగువలు/ అతివలు, అని రాద్దామనుకోన్నా కానీ  నేను చదువుకోన్న పుస్తకాలలో ఈ పదాలకు  వేరే అర్దాలు  విన్నాయి ,పురుషుల విషయంలో ఇంత క్లి స్టత లేదు ).

మనం  జాగ్రత్త గా పరిశీలిస్తే  ఈ మద్య  స్త్రీ    సైకాలజీ ప్రధాన మయిన  సినిమాలు విశేష ఆదరణ  పోందుతున్నాయి ,గత మూడు నాలుగు సంవత్సరాలనుండి  పత్రికలు,ఇతర పుస్తకాలలోకూడా  ఈ  సైకాలజీ  ప్రదాన అంశంగా మారటం చూడవచ్చు.  స్త్రీ    సైకాలజీ 
గురించి   Men are from Mars, Women are from Venus లో విపులంగా రాస్తాడు . ఎదిఎమయినా
మంత్ర ,అనసూయ  లు  స్త్రీ  లును తక్కువ  ఎక్కువలు  చేసిచూపకుండా   పురుషుని తో సమానంగా   చూపింటం  మన తెలుగు సినిమాలలో  వచ్హిన హర్షణీయ  పరిమాణం  !!
ఎదేమిటో  గానీ జనాలు కూడా వేలం వెర్రిగా ఈ  మననత్వ శాస్త్రం మీద విపరీతమయిన ఆశక్తి కనపరుస్తున్నారు ఇది మంచికో – చేడుకో 

కేవలం మన ఆనందంకోసం. – 2008

   ఉద్యోగంసద్యోగం… ఆస్తీపాస్తీ…        ఆనందంగా జీవించడానికి. సగటు మనిషి కోరుకునేవన్నీ అడక్కుండానే ఇచ్చాడు ఆ పైవాడు. కానీ ఎక్కడో వెలితి… ఏదో అసంతృప్తి … ఎందుకు?

కలితో డొక్కలు ఎండుకుపోయినా కాలనీలో కొత్తమనిషి కనిపిస్తే మొరిగే వీధి కుక్కని చూసినా…
ఒంట్లోని జవసత్వాలన్నీ ఉడిగిపోయినా చలికి ఒణుకుతూ గుడిమెట్లమీద అడుక్కునే వృద్ధులు కనిపించినా…
పసితనం ఛాయలు వీడకున్నా చెత్తబండీలాగే కుర్రాడు, చెత్తకాగితాలు ఏరుకునే చిన్నారి… ఎక్కడ వీధి బాలలు తారసపడినా…
అంతెందుకు… నాలుగిళ్లలో పాచిపని చేసే పాపాయమ్మ గుర్తుకొచ్చినా…
చెప్పులు కుట్టే వెంకయ్య తలపునకొచ్చినా…
మనసు మూలల్లో ఏదో కలవరం… సూదితో గుచ్చినట్లుగా పలవరం.
ఎందుకు? అన్నీ సమాధానాల్లేని శేషప్రశ్నలే. ఎప్పటికీ తీరని సమస్యలే. ఇలా నాకు మాత్రమేనా… నాలానే ఎందరో  ఆలోచిస్తూనే ఉంటారు. బాధపడుతూనే ఉంటారు. కానీ సమాజాన్ని మార్చడం తమ ఒక్కరి వల్లా ఎక్కడవుతుందన్న నిస్పృహ. ఫలితం… ప్చ్‌.. అన్న నిట్టూర్పుతోనే సరిపెట్టుకుంటారు. కర్మసిద్ధాంతంతో రాజీపడతారు. అంతేనా… నిజంగా వీటికి సమాధానం, పరిష్కారం లేనే లేవా?
తప్పక ఉంటాయి.
ఎప్పుడు? మనసున్న మనిషిగా ఆలోచించగలిగినప్పుడు… గుండెలోతుల్లో దాగిన మానవత్వాన్ని మేల్పొలపగలిగినప్పుడు…
ఇందుకు మనమంతా సామాజిక కార్యకర్తలమే కానవసరం లేదు. హృదయ వైశాల్యాన్ని పెంచుకుంటే చాలు. మనసున్న మనుషులుగా స్పందిస్తే చాలు… ఏం… అన్నం వండేటప్పుడు గుప్పెడు బియ్యం ఎక్కువ పోస్తే ఆ వీధి కుక్క ఆకలిని తీర్చలేమా? అంతవరకూ ఎందుకు? ఎలాగూ మిగిలే అన్నాన్ని చెత్తబుట్టలో వెయ్యడానికి బదులు ఆ కుక్కని పిలిచి పెట్టలేమా?ఇంట్లోని పాత దుప్పట్లని చలిపులికి ఒణికే గుడిదగ్గర అవ్వకి కప్పలేమా?

చెత్తబండీ లాగే కుర్రాడిని బుగ్గలు పుణికి ముద్దు చేయకపోవచ్చు. ‘నీకీ పని వద్దురా నాన్నా’ అంటూ బడికి పంపించలేమా… ఒక్కరంటే ఒక్కరిని చదివించలేమా?

చెత్త ఏరుకునే చిన్నారుల్ని కనీసం దగ్గర్లోని ఏ స్వచ్ఛందసంస్థకో ఓ ఫోన్‌ చేసి చదువుకునేలా చేయలేమా? ఇంట్లోని పనిమనిషిని మీ బెడ్‌రూమ్‌లో పడుకోబెట్టుకోలేకపోవచ్చు… సాటిమనిషిగా ఆదరించలేమా… ఆప్యాయంగా పలకరిస్తూ ఆప్తబంధువులం కాలేమా? చెప్పులు కుట్టిచ్చే తాతకి చిల్లర డబ్బులతోపాటు ఓ చిన్న చిరునవ్వుతో కూడిన థాంక్స్‌ చెప్పలేమా?

అన్నీ చేయగలం. అవును, మనమే చేయగలం. స్పందించగలం. కానీ చేయం. యాంత్రికత తెచ్చిపెట్టిన బిజీ జీవితంతో బాధపడుతూ ఇంకేదో అనీజీనెస్‌తో సతమతమవుతూ ప్రవాహంలో పడి కొట్టుకుపోతుంటాం.

ఎంతకాలం? ఇంకెంతకాలం?  మనం తినడం, మనం ఎదగడం, డబ్బులు మూటకట్టుకోవడం… ఇది మాత్రమేనా జీవితం. మనం ఎదుగుతూ మరికొందరిని ఎదిగేలా చేయలేమా? ఆసరా అందించలేమా?

ఒక్కసారి ఆలోచించండి… ఆ ఆలోచనను అమలు చేయడానికి ప్రయత్నించండి. ఎప్పుడో ఎందుకు? సకలజనావళి కొత్త సంవత్సర వేడుకలు జరుపుకొంటున్న ఈరోజే మనమూ ఆ పనికి శ్రీకారం చుడదాం. మనని చూసి మరొకరు… వారిని చూసి ఇంకొకరు… మంచితనం పరిమళిస్తే… అంతకన్నా ఏం కావాలి? సమాజాన్ని ఏదో ఉద్ధరించేద్దామని కాదు, ఎవరో ఏదో చేస్తున్నారనో, ఇంకెవరి మెప్పునో ఆశించి కానే కాదు. మన తృప్తికోసం… కేవలం మన ఆనందంకోసం.

( సేకరణ  కోంచెం మార్చి పంచుకోవాలని  ఇలా  :   ) join   www.tmad.org