గ్రాట్యుటీ అర్హత Entitlement of Gratuity

ENTITLEMENT OF GRATUITY
*_(4 years & 240 days)_*

This refers to the query by one of the members on whether employee is eligible for payment of gratuity if he does not complete 5 Years of

Service

*Objective of PG Act*

The Payment of Gratuity Act is a statutory benefit paid to the employees who have rendered continuous service for at least five years. It is a lump sum amount paid to an employee based on the duration of his total service. The benefit gratuity is payable to an
employee on cessation of employment (either by resignation, death, retirement or termination, etc) by taking the last drawn salary as the basis for the calculation.

*Applicability*

It is applicable where ten or more persons are employed, or were employed, on any day of the preceding twelve month

*Eligibility*

An employee who has rendered not less than five years of service becomes entitled to gratuity on his superannuation or on his retirement or resignation or on his death or
disablement. The pre requisite of completion of continuous service of five years shall not be necessary where the termination of the employment of any employee is due to death or disablement.In the case of death of the employee, gratuity payable to him shall be paid to his nominee or, if no nomination has been made, to his heirs.

*Meaning of Continuous Service*

Gratuity shall be payable to an employee on the termination of his employment after he has rendered continuous service for not less than five years. An employee shall be said to be in
continuous service for a period if he has, for that period, been in uninterrupted service and includes service which may be interrupted on account of sickness, accident, leave, absence from duty without leave, lay off, strike or a lock-out or cessation of work not due to any fault of the employee, whether such uninterrupted or interrupted service was rendered before or after the commencement of this Act.

*Calculation of Gratuity*

Gratuity is calculated at 15 days wages last drawn by the employee for each completed year of service. The monthly Basic Salary is divided by 26 and multiplied by 15. In computing a
completed year of service the period in excess of six months
shall be taken as a full year.

*Gratuity = Monthly salary / 26 x 15 days x No. of years of service.*

The maximum amount of
gratuity payable under the Act is Rs.20 Lacs.

*Compulsory Insurance*

The Payment of Gratuity (Amendment) Act, 1987 has prescribed provisions for compulsory insurance for employer’s liability for payment towards the gratuity under the Act from LIC under the LIC Act,1956 or any other prescribed Insurer.

*Nomination*

Each employee who has completed one year of service is required to make a nomination for the purposes of gratuity in case of his death. There can be more than one nominee. (Form F). Nominees may be changed at any time by the employee, by giving a written notice to the employer. (Form H). If no
nomination has been made, it shall be paid to the legal heirs of the deceased employee.

*Protection of Gratuity*

No gratuity payable under the Act shall be liable to attachment in execution of any decree or order of any civil, revenue or criminal court. However if the employee had agreed to a deduction from the amount due as gratuity then that amount can be recovered.

*Forfeiture of Gratuity*

if the services of such employee have been terminated for his
riotous or disorderly conduct or any other act of violence on his part, or for any act which constitutes an offence involving moral turpitude, provided that such offence is committed by him in the course of his employment, gratuity shall be forfeited to the extent of the damage or loss so caused or may be forfeited wholly or partially.

*Time Limit for Payment of Gratuity*

The employer must pay the amount of gratuity within *30 days* from the date it becomes payable to the person to whom the gratuity is payable.

*Failure to Pay Gratuity Amount*

Any employer who contravenes or makes default in complying
with any of the provisions of this Act or any rule or order made there under shall be punishable with imprisonment for a term which shall not be less than three months but which may extend to one year or with fine which shall not be less than Rs.10000/-but which may extend to Rs.20000/-, or with both.

*Remedy in Case the Employer Does Not Pay Gratuity*

If the amount of gratuity is not paid by the employer within the prescribed time to the person entitled thereto, the aggrieved person should make an application to the Controlling Authority

*Income Tax Exemption*

The gratuity received up to the limit of Rs.20 Lacs is liable to be exempted from taxation under the Income Tax Act. The
exemption is, however, not available for payment of gratuity when the employee is still in service.

*Whether employee is eligible for gratuity for less than 5 Yrs Service*

As per the judgment of the Supreme Court an employee is eligible for gratuity if he has completed 4 years of continuous service and 240 days continuous working in 5th
year. On the day when he completes his 240 days in the 5th year he will be eligible for gratuity.

The judgment of Supreme Court rendered under the provisions of
the Industrial Dispute Act in Surendra Kumar Verma vs. Central
Govt. Industrial Tribunal,[(1980) (4) S.C.C.433)], it is enough that an employee has a service of 240 days in the preceding 12 months and it is not necessary that he should have completed one whole year’s service. As the definition of continuous service in Industrial Dispute Act and Payment of Gratuity Act are synonymous, the same principal can be adopted
under the act also and hence an employee rendering service of
*4 year 10 months 11 days* is considered to have completed 5
years continuous service under sec.4(2) and thereby is eligible for gratuity.”

Now almost all organizations are paying gratuity if an employee has completed 4 years of continuous service and 240 days continuous working in 5th year.

Hope you will find the above brief note useful.

రాజకీయ నాయకులు జనాకర్షక పథకాలు సోమ్ము – సోకు

DSP విశారదన్ మహరాజ్ గారు చెప్పిన చిన్న కథ

ఒక బస్సు ఆ బస్సు వనపర్తి నుండి మహబూబ్ నగర్ వెళుతుంది అందులో చాలామంది ప్రయాణికులు ఎక్కారు
ఆ బస్సు బయలు దేరుతుంది కండక్టర్ టికెట్లు తీసుకుంటుండు అందర్నీ టికెట్ ఇవ్వాలని కోరుతూ ముందుకు వస్తున్నాడు.
అలా సగం మంది టికెట్లు తీసుకో గా ఒక ఆయన దగ్గరికి వచ్చాడు ఓ పెద్దాయన టికెట్ తీసుకో అని చెప్పాడు
ఆ పెద్దమనిషి తన జేబులు అన్ని తడుముకొని చూసి అరే అరే నా జేబులో ఐదు వందల రూపాయల నోటు ఉండాలి అది ఎక్కడో పడిపోయింది అని ఆ పెద్దమనిషి చెప్పాడు
కండక్టర్ లేదు నువ్వు కచ్చితంగా టికెట్ తీసుకోవాలి లేదంటే నిన్ను ఈ మధ్యలోనే బస్సులో నుంచి దింపి వేయడం జరుగుతుంది అంటూ ఆ పెద్దమనిషిని తిట్టసాగాడు కండక్టర్

ఆ పెద్దమనిషి అయ్యా నేను ఒక ముఖ్యమైన పనిమీద వెళుతున్నాను నేను ఈ క్షణాన అక్కడికి వెళ్లకపోతే చాలా ప్రమాదం జరుగుతుంది నేను కచ్చితంగా నేను వెళ్ళాలి అని కండక్టర్ ని వేడుకుంటూ ఉన్నాడు
ఇంతలో ఆ బస్సులోనే ఇంకొక రెండవ పెద్ద మనిషి అయ్యా అతని టికెట్ నేను తీసుకుంటాను అతని తిట్టొద్దు అంటూ రెండవ పెద్ద మనిషి మొదటి పెద్ద మనిషిని టికెట్ తీసుకున్నాడు

మొదటి పెద్దమనిషి ఆ టికెట్ తీసుకున్న రెండవ పెద్ద మనిషిని చూసి అయ్యా నువ్వు నిజంగా దేవుడవయ్యా అన్ని మొక్కడం మొదలుపెట్టాడు
నాకు ఈ ప్రయాణం ఎంతో ముఖ్యం అందరిలోనూ నువ్వు నాకు టికెట్ తీసుకున్నందుకు నువ్వు దేవుడవయ్యా

అని తను బస్సు దిగి ఇంటికి పోయిన తర్వాత కూడా బస్సులో ఒక పెద్ద మనిషి నాకు టికెట్ తీసుకున్నాడు అంటూ ఇంకా మనసులో ప్రార్థిస్తూ ఉన్నాడు ఇలా సాయం చేసినందుకు జీవితాంతం ఆ పెద్దమనిషిని మరవకుండా కొలవడం ఈ పెద్దమనిషి పని అయింది

అయితే తన దగ్గర ఉన్న 500 రూపాయలు ఎక్కడో పడిపోయి అనుకున్నాడు మొదటి పెద్దమనిషి
కానీ
రెండో పెద్ద మనిషే ఇతని 500 రూపాయలను దొంగలించింది ఇతగాడే….

ఐదు వందల రూపాయలు దొంగలించి 5 రూపాయల బస్సు టికెట్ తీసుకుని దేవుడవయ్యా అనిపించుకున్నాడు
ఆ రెండవ దొంగ పెద్దమనిషి

“#రాజకీయాలలో ఉన్న పెద్ద మనుషులు అందరూ తమ సొంత కష్టార్జితం సంపాదించి తన ఇంట్లో నుంచి ఇస్తున్నట్టుగా
పించన్ ఇస్తున్నాం
రేషన్ ఇస్తున్నాం
ఉచిత వైద్య ఇస్తున్నాం
ఉచిత విద్య ఇస్తున్నాం
ఉచిత కరెంటు ఇస్తున్నాం
ఉచిత భూములు ఇస్తున్నాం
ఉచిత త్రాగునీరు ఇస్తున్నాం
ఉచిత ఇండ్లను ఇస్తున్నాం
మరెన్నో ఇంకా ఉచితం… ఉచితం….. ఉచితం…..

ఇవి మొత్తం ఉచితం అయితే సమాజంలో ప్రజలపై
టాక్సెస్ పెరిగినాయి
పెట్రోలు పెరిగింది
బస్సు చార్జీలు పెరిగాయి
కరెంటు చార్జీలు పెరిగాయి
రాష్ట్రంలో దేశంలో అప్పులు పెరిగాయి
ఇలా చాలా చాలా దోపిడీ చేస్తోంది #రాజకీయ_వ్యవస్థ

🙏🙏🙏

సమాచార హక్కు చట్టం

12 అక్టోబర్ 2005 తేదీన సమాచార హక్కు చట్టం భారతదేశమంతటా అమలులోకి వచ్చిన రోజు సందర్భంగా

ప్రభుత్వాలు ప్రజలుకు జవాబుదారీగా ఉండటానికి, వారి అవినీతిని అరికట్టటానికి, ప్రజలకు విషయ పరిజ్ఞానం కలిగించే చట్టం సమాచార హక్కు చట్టం 2005

ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల నుంచి సమాచారాన్ని అడిగి తీసుకునే అధికారమే సమాచార హక్కు (Right to Information).
మనం ఏ ఆఫీస్ లో కాలిడినా కావలిసిన సమాచారం
పొందుట కష్టం. లంచం ఇచ్చుకోనిదే ఏ ఫైలు కదలదు. సామాన్యుడికి ఏ ఆఫీసుకు వెళ్ళినా పనిచేయించుకోవటం, తనకు కావలసిన సమాచారాన్ని రాబట్టటం చాలా కష్టం.

సందేహాలు సమాధానాలు

1.సమాచార హక్కు చట్టం అ౦టే ఏమిటి?

సమాచార హక్కు చట్టం 2005 లో వచ్చింది. కేంద్ర , రాష్ట్ర పభుత్వాల పాలనకు ఒక పార దర్శకత, జవాబుదారీ తనం తీసుకురావడానికి ఇది ఉద్దేశించినది. రెండు ప్రభుత్వాల పని తీరుకి సబంధించిన సమాచారం దేశ ప్రజలందరికి అందుబాటులో వుంచడానికి ఇది కృషి చేస్తుంది.

2. పబ్లిక్ ఆధారిటీలు అ౦టే ఎవరు?

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాసనాల ద్వారా గాని , రాజ్యాంగంలో చేసిన ఏర్పాటు వల్ల గాని, స్వంతంగా పాలనా నిర్వహణ ఏర్పాటు చేసుకునే సంస్థలు పబ్లిక్ అధారిటి అంటారు. ప్రభుత్వ ఆర్ధిక సహాయంతో నడిచే సంస్థలు, ప్రభుత్వ అధికారం కింద పనిచేస్తున్న సంస్థలు, ప్రభుత్వ స్వంత సంస్థలు –ఇవి కూడా పబ్లిక్ అధారిటిల కిందే వస్తాయి. ప్రభుత్వం ద్వారా ఆర్ధిక సహాయం వల్ల నడిచే నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ కూడా ఈ కోవలోకే వస్తాయి.smd

3.కోరిన సమాచారాన్ని ఎవరు అందిస్తారు?

సమాచారం ఇవ్వడ౦ కోసం ప్రత్యేకంగా ఒక పబ్లిక్ సమాచార అధికారి ప్రతి పబ్లిక్ సంస్థ లో నియమించబడతారు. వారు తప్పనిసరిగా ప్రజలు కోరిన సమాచారం ఇవ్వాలి. ఆర్.టి. ఐ. దరఖాస్తులు కూడా వీరికి అడ్రస్ చేసి పంపాలి.సబ్ డివిజినల్ స్థాయిలో అసిస్టెంట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసరు వుంటారు. వీరు చేరిన దరఖాస్తులను , అప్పీల్స్ ను పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసరుకు పంపుతారు.

4.సమాచార కమిషనుకు రాసే దరఖాస్తు, పబ్లిక్ అథారిటికి మీరు రాసే దాని కంటే ఏ విధంగా ప్రత్యేకమైనది?

సమాచార హక్కు చట్టం ప్రకారం ఇతర దరఖాస్తుల మాదిరి కాకుండా ఇక్కడికి సమాచారాన్ని కోరుతూ వచ్చిన దరఖాస్తులకు, అప్పీళ్ళకు తప్పనిసరిగా స్పందించి,పరిమిత సమయంలో అందించాల్సి వుంటుంది.
అలా జరగని పక్షంలో ఆ అధికారిపై చట్ట ప్రకారం శిక్ష విధించ వచ్చు. అంతే కాదు, అతనిపై క్రమశిక్షణా చర్య తీసుకోవచ్చు.
RTI నుపయోగించి, పొందగల సమాచారం పరిధి ఎంతో విశాలమైంది. ఈ చట్టం ప్రకారం, పార్లమెంటుకు కానీ, రాష్ట్ర శాసన సభకు కానీ సమర్పించే ఏ సమాచారమైనా ప్రజలు RTI ద్వారా పొంద వచ్చు.
ప్రజలు తాము కోరుతున్న సమాచారానికి కారణం కానీ, తమ వ్యక్తిగత వివరాలు కానీ,ఒక్క కాంటాక్టు అడ్రసు తప్ప, అధికారికి చెప్పాల్సిన పనిలేదు.

5.సమాచార హక్కు ను కోరుతున్న దరఖాస్తు ఇన్ని పదాల లోనే వుండాలని నిబంధన ఏమయినా వుందా?

ఔను. ఆర్.టి ఐ అప్లికేషన్, సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసరు చిరునామాతో కలిపి, 500 పదాలకు మించి వుండరాదు.
అయితే అప్లికేషనుకు అనుబంధం వుంటే అది లెక్కలోకి రాదు. అయినాకానీ , పదాల పరిమితి పెరిగిందనే కారణంతో ఎవరి దరఖాస్తును తిరస్కరించడానికి వీల్లేదు..

6. సమాచార హక్కు చట్టం ప్రకారం నేను సమాచారం పొందాలంటే ఏం చెయ్యాలి?

నిర్దేశించిన రుసుము చెల్లించి,సంబంధిత పబ్లిక్ అధారిటి యొక్క పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ పేరిట, దరఖాస్తు చేయాలి. ఆ అధికారికి మీరు అడుగుతున్న సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత వుంది. పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ పేరు ఇక్కడ అవసరం లేదు.ఒకవేళ మీరు దరఖాస్తు రాయలేని నిరక్షరాస్యులు అయినట్టయితే , మీకు దరఖాస్తు రాసి పెట్టడానికి ఎవరినాయినా సూచించే బాధ్యత పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ తీసుకుంటారు.

7. సమాచార హక్కు చట్టం ఎలా ఉపయోగించుకోవాలి?

సమాచార హక్కు చట్టం కింద ఈ క్రింది విషయాలు మీరు పొందవచ్చు.
డాక్యుమెంట్స్, రికార్డ్స్, మెమోలు, ఈ మెయిల్స్, అభిప్రాయాలు. సలహాలు, పత్రికా ప్రకటనలు, ఆర్డర్స్, లాగ్ బుక్స్, కాంట్రాక్టులు, రిపోర్టులు, పేపర్స్, సర్క్యులర్స్, శాంపిల్స్, మోడల్స్
ఎలెక్ట్రానిక్ ఫారంలో వున్న డేటా, డాక్యుమెంటు ఒరిజినల్ కాపీ,
మైక్రోఫిల్మ్, ఇమేజ్ రూపంలో వున్న మైక్రో ఫిల్మ్

8. ఏ ఏ విషయాలు ఆర్.టి. ఐ ద్వారా పొందడానికి సాధ్యం కాదు ?

ఈ క్రింది విషయాలు ఆర్.టి. ఐ ద్వారా పొందడానికి సాధ్యం కాదు.
భారతదేశ సమగ్రత, సార్వభౌమత్వాలకు భంగం కలిగించే సమాచారం
దేశ భద్రత, వ్యూహాత్మక , వైజ్ణానిక, ఆర్ధిక ప్రయోజనాలపై , విదేశీ సంబంధాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపించే సమాచారం, హింసను ప్రేరేపించే సమాచారం
ఫలానా సమాచారాన్ని ప్రకటించకూడదని ఏదయినా న్యాయస్థానం లేక ట్రిబ్యూనల్ ఆదేశించి వున్న పక్షంలో అలాంటి సమాచారం ,
సమాచార వెల్లడి కోర్టు ధిక్కరణ కిందికి వస్తుందనుకుంటే ఆ సమాచారం
సమాచార వెల్లడి పార్లమెంట్ , రాష్ట్ర శాసన సభ హక్కులను ఉల్లంఘించేదయితే అలాంటి సమాచారం
వాణిజ్య పరమయిన గోప్యత, వ్యాపార రహస్యాలు, మేధో సంపత్తికి సంబంధించిన సమాచారం, సమాచార వెల్లడి వల్ల పోటీ రంగంలో తృతీయ పక్షానికి హాని కలిగేటట్లయిటే అలాంటి సమాచారం . అయితే, అలా వెల్లడి చెయ్యడం వల్ల ప్రజలకుఎక్కువ మేలు కలుగుతుందంటే ,ఆ సమాచారం ఇవ్వవచ్చు.
ఉద్యోగ సంబంధ రీత్యా ఒక వ్యక్తికి అందుబాటులో వున్న సమాచారం విశాల ప్రజాప్రయోజనాల రీత్యా వెల్లడి చేయాల్సిన అవసరం వుందని సంబంధిత అధికారి భావిస్తే దాన్ని ప్రకటించవచ్చు.
ఏదయినా విదేశ ప్రభుత్వం నుంచి అంది,గోప్యంగా ఉంచాల్సిన సమాచారం
సమాచార వెల్లడి వల్ల ఒక వ్యక్తికి ప్రాణ హాని కానీ, ప్రమాదం కలుగుతుందనుకుంటే ఆ సమాచారం,
చట్టాల అమలుకోసం, భద్రతా ప్రయోజనాల కోసం గోప్యంగా సమాచారం అందించిన,లేక సహాయపడిన వారి గుర్తింపుకు దారితీసే సమాచారం
దర్యాప్తు ప్రక్రియనూ, నేరస్తులను పట్టుకునేందుకు గానీ,వారిని శిక్షించేందుకు అవరోధాలు కలిగించే సమాచారం
ఏదైనా అంశాలపై మంత్రి మండలి నిర్ణాయక పత్రాలు,అవి బహిర్గతం చేసే దాకా ఆ నిర్ణయాలకు ప్రాతిపదిక అయిన సమాచారాన్ని వెల్లడి చేయరాదు.
సమాచారం ప్రజా ప్రయోజనాలకు కాని, ప్రజా కార్యక్రమాలకు సంబంధంలేని, వ్యక్తిగత సమాచారం గోప్యతను వెల్లడి చేసే వివరాలు

9. సమాచారం తీసుకోవడానికి ఏ భాషను ఉపయోగించాలి?

మీకు కావలసిన సమాచారాన్ని ఇంగ్లీషు, హిందీ లేక ఈ దరఖాస్తు పంపుతున్న మీ ప్రాంతంలోని అధికార భాష గ గుర్తించిన ప్రాంతీయ భాషలో గాని వుండవచ్చు.

10. నాకు కావలసిన సమాచారాన్ని నేను కాపీ చేయడం గాని, చూడడం కాని ఎలా చెయ్యాలి?

డాక్యుమెంట్స్ , మాన్యుస్క్రిప్టులు, మరియు రికార్డులు తనిఖీ చేయవచ్చు.
నోట్స్ తీసుకోవచ్చు., సర్టిఫైడ్ డాక్యుమెంట్స్ కాపీలు లేక వాటి అనుబంధ కాపీలు,
పదార్ధాల సర్టిఫైడ్ శాంపుల్స్ ,
సీడీ ల రూపంలో వున్న సమాచారం, ఫ్లాపీలు, టేపులు, వీడియో కాసెట్స్, ప్రిట్ అవుట్స్
( కంప్యూటరులో వున్న సమాచారం), లేక ఇతర ఎలక్ట్రానిక్ రూపంలో వున్న సమాచారం

11. నాకు కావలసీనా సమాచారం అధికారులు ఏ రూపంలో ఇవ్వగలరు?

పబ్లిక్ సంస్థ వనరులలో వ్యత్యాసాలతో కూడిన మార్పులు జరగకపోతే, కోరిన రూపంలో సమాచారం ఇవ్వవచ్చు. ఆ డాక్యుమెంటుకు హాని లేని పక్షంలో , లబ్దిదారులు కోరిన విధంగా, కోరిన రూపంలో సమాచారం ఇవ్వవచ్చు .

12. ఆర్. టి. ఐ. అప్లికేషన్ నింపడానికి ఏదయినా ఖచ్చితమైన ఫార్మెట్ వుందా?

లేదు. సమాచారాన్ని కోరుతూ దాఖలు చేస్కునే దరఖాస్తు ఫారానికి ప్రత్యేకమయిన ఫార్మెట్ ఏమీ లేదు. కానీ దరఖాస్తు దారుడు ఈ‌ క్రింది వివరాలు రాయాల్సి వుంటుంది.
*దరఖాస్తు తేదీ.
*సంబ౦ధిత పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసరు చిరునామా
*దరఖాస్తుదారుని చిరునామా
*కోరదల్చుకున్న సమాచారం( స్పష్టత కోసం నంబర్లవారీగా కానీ, టేబుల్ రూపంలో గానీ వుంటే మంచిది. దానికి ప్రతిస్పందనలు కూడా అదే రూపంలో వుంటాయి.)
*కోరిన సమాచారం ఎలాంటి రూపంలో – ప్రింట్ అవుట్స్, సిడి , ఈ మైయిల్స్
*చెల్లించాల్సిన రుసుము స్టాంపు రూపంలో అయితే అంటించండి
*చెల్లింపు విధానం తెలపండి.
*సంతకం

కే౦ద్ర, రాష్ట ప్రభుత్వ సంస్థలు శాంపిల్ ఫార్మేట్స్ ను రూపొందించాయి.
సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ వారు కూడా ఒక దరఖాస్తు ఫార్మెట్ తయారు చేశారు. ఇది దరఖాస్తు సౌలభ్యం కోసం మాత్రమే తప్ప తప్పనిసరిగా పాటించితీరాలని నిబంధన ఏమీలేదు. ఈ ఫార్మెట్ లేదనే కారణం గా దరఖాస్తుని తిరస్కరించడానికి వీల్లేదు.

13. ఆన్ లైన్ ద్వారా సమాచారాన్ని ఫైల్ చేయవచ్చా?

అది పబ్లిక్ అధారిటి మిద ఆధార పడి వుంటుంది.కేంద్ర ప్రభుత్వం ఇటీవలనే సమా చార హక్కు http;//rtionline.gov.in/ పేరిట ఒక పోర్టల్ నూ రూపకల్పన చేసింది. ఇందులో కొన్ని కేంద్ర ప్రభుత్వ శాఖలపై మాత్రమే వినియోగదారుడు తమ దరఖాస్తులను నమోదు చేసుకోవచ్చు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సమాచార హక్కు గురించి వెబ్ సైట్స్ మొదలు పెట్టబోతున్నట్లు సమాచారం.

14. జవాబు పొందడానికి ఎంత సమయం పడుతుంది?

సమాచారం ఎవరయినా వ్యక్తి ప్రాణానికి, వ్యక్తిగత స్వేచ్చకు
అవసరమయినది అయితే అభ్యర్ధన అందిన 48 గంటలలోపు సమాచారం అందించాలి.
దరఖాస్తు చేరిన ౩౦ రోజులలోగా పబ్లిక్ ఇన్ఫర్మేషన్
అధికారి సమాచారం అందించాలి.
అప్లికేషన్ అసిస్టెంట్పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారికి ప౦పినట్టయితే అతను
సంబంధిత అధికారిని దాన్ని చేర్చి సమాచారం సేకరీంచే
నిమిత్తం మరొక 5రోజులు అవసరమవుతుంది.
ఒకవేళఆ సమాచారం ఎవరయినా వ్యక్తి ప్రాణానికి, వ్యక్తిగత స్వేచ్చకు
అవసరమయినది అయితే అభ్యర్ధన అందిన 48 గంటలలోపు సమాచారం అందించాలి.

15. సమాచార హక్కు దరఖాస్తు సరైన అధికారికి పంపకపోతే వెనక్కి తిరిగి వచ్చేస్తుందా?

మీ దరఖాస్తు సంబంధిత అధికారికి చేరకుండా మరొకరికి చేరినా కానీ, దాన్ని తిప్పి పంపంచడానికి వీల్లేదు. ఈ‌ చట్టం పకారం దాన్ని అందుకున్న వ్యక్తి, లేక సంస్థ 5 రోజుల్లోగా నిర్దేశిత అధికారికి తిరిగి చేర్చితీరాలి.

16. సమాచారం తీసుకోవడానికి నేను ఏమయినా ఫీజు చెల్లించాలా.?

సమాచార హాక్కు కింద సమాచారం కోరుతూ పంపే అప్లికేషను ఒక కాపీ మీ దగ్గర అట్టిపెట్టు కొండి. అప్లికేషను రిజిష్టర్ పోస్టు అక్నాలేడ్జిమేంట్
లో పంపండి
రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ అథారిటి సమర్పించబోయే సమాచారానికి ఒక నియమిత ఫీజును నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ ఆ మొత్తాన్ని రూ. 10 గా ప్రకటించింది.
ఒకవేళ దరఖాస్తు దారుడు దారిద్యరేఖ దిగువున వున్నా వాడితే,
( ఫీజు చెల్లించలేని పరిస్థితిలో) వుంటే దానికి సంబంధించిన గుర్తింపు కార్డును సమర్పించాల్సి వుంటుంది. అప్లికేషను ఫీజు కాకుండా,
కోరిన సమాచారాన్ని బట్టి వాటి ప్రి౦టవుట్స్ కి పేజీకి రూ.2 చొప్పున చెల్లించాలి. అదనపు చార్జీలు ఎవైన వుంటే, ఆఫీసరు తన జవాబులో తెలియజేస్తారు. ఒకవేళ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసరు సమాచారం ఇవ్వడంలో 30 రోజులకంటే ఎక్కువ జాప్యం చేస్తే, అప్పుడు ఎటువంటి ఫీజు వసూలు చెయ్యకుండా ఉచితంగా సమాచారం ఇవ్వాల్సి వుంటుంది.

17.ఆర్.టి.ఐ దరఖాస్తుకి స్పందన లేకపోతే ఏం చెయ్యాలి?

సమాచారం కోసం సమర్పించిన దరఖాస్తుకి సంబంధిత అధికారి నుంచి స్పందన లేకపోతే అప్పిలేట్ ఆధారిటీ కి అప్పీల్ చేసుకోవచ్చు. అన్ని పబ్లిక్ అథారిటిల తాలూకు అప్పిళ్ళను చూసేది అప్పలేట్ అధారిటి. మీ మొదటి అప్లికేషనుకు జవాబు రావాల్సిన తేది నుంచి 30 నుంచి 60 రోజుల వ్యవధిలోపల అప్పీలు చేసుకోవాలి.

18. నాకు చేరిన సమాచారం తప్పుగానో, అసంపూర్తిగానో వుంటే ఏం చెయ్యాలి?
ఇచ్చిన సమాచారం అవాస్తవంగానో , అసంపూర్తిగానో వుంటే అప్పిలేట్ ఆధారిటికి అప్పీల్ చేసుకోవాలి. సమాధానం చేరిన 30 రోజులలోపు అప్పీలుచేయాలి. సరైన కారణాలు వున్నప్పుడు అంతకంటే ఎక్కువ జాప్యం జరిగిన కూడా అప్పీలు అంగీకరిస్తారు.

19. సమాచారాన్ని నాకు ఇవ్వడానికి తిరస్కరించవచ్చా?

తిరస్కరించవచ్చు. కొన్ని సమాచార విషయాలు ఆర్.టి.ఐ. సహాయంతో అందరితో పంచుకునే వీలులేదు. అలాంటప్పుడు సంబంధిత అధికారులు మీ అప్లికేషన్ తిరస్కరించవచ్చు. అయితే, ఆర్.టి.ఐ చట్టం కింద సదరు సమాచారం ఇవ్వ యోగ్యమైనదే అనిపిస్తే, మీరు అప్పీలు చెయ్యవచ్చు.
మీరు ఈ అప్పీలును మీకు జవాబు వచ్చిన 30 రోజుల లోగా చేసుకోవాలి.మీ అప్లికేషన్ తిరస్కరించినప్పుడు, దానికి కారణాలు, మీరు దానిపై ఎలా అప్పీలు చేసుకోవచ్చో, మీరు పంపాల్సిన అప్పలేట్ అధారిటి ,ఇవన్ని కూడా తిరస్కరిస్తున్న పబ్లిక్ అథారిటి ఇవ్వాల్సి వుంది.

20. అప్పిలేట్ అథారిటీ ఇచ్చిన సమాచారం నాకు అసంతృగా వుందనిపిస్తే నేను ఏం చెయ్యాలి?

అలాంటప్పుడు, మీరు కేంద్ర సమాచార కమిషన్ కు లేదా, రాష్ట్ర సమాచార కమిషన్ కు రెండో సారి అప్పీలు చేయవచ్చు. మీరు మొదట పంపిన అప్పీలుకు జావాబు ఇవ్వాల్సిన సమయం అయిన తరవాత 90 రోజులోగా రెండో అప్పీలు పంపుకోవాలి. లేదా, మొదటి అప్పీలుకు జావాబు వచ్చిన తరవాత 90 రోజులలోగా రెండో అప్పీలు పంపాలి. సరైన కారణం వున్నప్పుడు, ఈ సమయం దాటి పోయినా కూడా అప్పీలు అనుమతించబడుతుంది.smd

21.నేను కోరిన సమాచారాన్ని సంబంధిత రాష్ట్ర సమాచార కమిషన్/కేంద్ర సమాచార కమిషన్ గాని నిర్ణిత సమయం లో ఇవ్వాలని వున్నదా?

అటువంటి సమయ నిబంధన ఏది లేదు.

22.కోరిన సమాచారం ఇవ్వని అధికారి పై ఎం చర్యలు తీసుకుంటారు?

పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసరు ఈ క్రింద వివరించిన నిర్ణయాలు తీసుకున్నప్పుడు, అతను దరఖాస్తూ స్వీకరించే వరకు,లేదా, సమాచారం ఇచ్చే వరకు కేంద్ర సమాచార కమిషన్ లేదా రాష్ట్ర సమాచార కమిషన్ రోజుకు రు .250 లు చొప్పున పెనాల్టి విధించ వచ్చు. గరిష్టంగా రు.25,000లు వరకు పెనాల్టి వేయవచ్చు.

* సరైన కారణం లేకుండానే ఆర్.టి.ఐ. దరఖాస్తు తీసుకోవడానికి నిరాకరించడం
*నిర్ణయించబడిన సమయంలో సమాచారం ఇవ్వడానికి నిరాకరించడం
*సమాచారం కావాలని ఆలస్యంగా ఇవ్వడం
*తెలిసి కూడా తప్పుడు సమాచారం/అసంపూర్తి సమాచారం/తప్పు దోవ పట్టించే సమాచారం ఇవ్వడం
*అడిగిన సమాచారాన్ని అసలు లేకుండా చెయ్యడం,
*సమాచారం ఇవ్వడానికి ఏదో విధంగా అడ్డుపడడం

వాణిజ్య ప్రకటనలు ప్రభావం

Advertisement — మన బలహీనత
..
1922 లో రేడియో కనుక్కున్నారు.
దాని ఉపయోగ౦ రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బాగా కనబడింది.
.
అటు జర్మనీ లో నాజీలు ,ఇటలీలో ఫాసిస్టులు ,
రష్యాలో కమ్యూనిస్టూలు తమతమ సిద్ధాంతాలను ప్రచార౦చేసుకోవటానికి ప్రజాభిప్రాయాన్ని సామూహికంగా మలచటానికి విస్తృతంగా వినియోగించారు.
.
మనస్తత్వ శాస్త్రజ్ఞుడైన సిగ్మండ్ ఫ్రాయిడ్ దగ్గరి బంధువు ఎడ్వర్డ్ బెర్ని అనే ఆయన మనస్తత్వానికి అనుగుణంగా సమాచార మార్పిడి అనే విషయం మీద విస్తృత పరిశోధన చేసాడు .
.
మనుషులలో అంతర్లీనం గా ఉన్న భావాలను ప్రేరేపి౦చి వస్తు వినియోగాన్ని వృద్ది చేయడం ఎలా అన్నదాని మీద ఒక సిద్ద్దాంతాన్ని లేవదీశాడు.

అదేమిటంటే
.
“ అవసరాన్ని సృష్టించు తదనుగుణంగా ఉత్పత్తిచేసి విక్రయించు “
ఇదిగో ఈ సూత్రమె ప్రకటనలకు మూలాధారం .
.
he writes in his book.. propaganda ..“ if we understand the mechanism and motives of group mind,is it not possible to control and regiment the masses according to our will without their knowing about it”.
.
…….. మన ఇళ్ళలో మొదట రేడియో కొనుక్కున్నాం, అందులో మనిషి గొంతుక మాత్రమె విన పడుతుంది.
.
మనిషి కనపడడు ,రూపం, స్వరం రెండూ కావాలి అనే అవసరం సృష్టించారు .
.
అంతే టీవీ ఉత్పత్తి అయ్యింది ,అబ్బే నలుపు తెలుపులో దృశ్యం ఉంటే ఏం బాగుంటుంది అనే ఆలోచన వచ్చింది
.
అంతే రంగుల టీవీ ప్రత్యక్షం అయ్యింది ,దృశ్యం అన్ని వైపులనుండి బాగా కనబడాలి అనే అవసరం గుర్తుకొచ్చింది అంతే flat TV పుట్టుకొచ్చింది .
.
దృశ్యం శబ్దం ఇంకా వాస్తవానికి దగ్గరగా ఉంటే! ఈ ఆలోచన lcd tv కి జన్మ యిచ్చింది.
.
అక్కడ నుండి LED tv,OLED,curve tv ,దాంట్లో వివిధ పరిమాణాలు లంకంత కొంపలో గోడకు సరిపోయినంత టీవీలు .కార్లు,ఫొన్స్,చివరికి టూత్ బ్రష్ లు కూడా ఎంత రూపాంతరం చెందాయో చూడండి.
.
ఒక్క క్షణం ఆగి మన ఇళ్ళలో ఒకే వస్తువును ఎన్ని సార్లు మార్చామో ఆలోచించండి !
.
ఈ మార్కెట్ మాయాజాలం అర్ధమవుతుంది .
.
కొనుగోలు శక్తి తగ్గుతున్నది అనుకున్నప్పుడు విరివిగా రుణాలు ఇవ్వడం అప్పుల భారం తల కెత్తడం దానికి మనము పెట్టుకున్న ముద్దు పేరు “ఆర్ధిక ప్రగతి”.
.
growth engine has started chug chugging
….దానికోసం వడ్డీ రెట్లు పెంచడం తగ్గించడం అంతా ఒక మాయా జాలం.
.
ఇదంతా విషయ వాంఛల వల్ల ఉత్పన్నమైన గందరగోళం ..
.
.ధ్యాయతే విషయాన్ పుంసః సంగస్తేషుపజాయతే , సంగాత్ సంజాయాతే కామః కామాత్ క్రోదోభిజాయతే …
.
విషయములను,భోగములను గురించి సదా ఆలోచించే మనుష్యుడు వాని యందు ఆసక్తి పెంచుకొంటాడు, ఆ ఆసక్తి వలన ఆ విషయముల పట్ల కోరిక ఉదయిస్తుంది ,ఆ కోరిక తీరక పోయిన ఎడల క్రోధం జనియిస్తుంది. క్రోధమునుండి మూఢ భావం జన్మిస్తుంది ,
దాని వలన మనిషి స్మరణ శక్తీ కోల్పోతాడు ,బుద్ది నశి౦చి పతితుడవుతాడు
.
ఇంద్రియాలను తన అధీనం లో ఉంచుకొన్న మానవుడు ప్రసన్నమైన ప్రసాద బుద్ది కలిగి ఉంటాడు
.
stress free life ! we don’t need stress management classes ..
.
ప్రాప్తంబగు లేశమైన పదివేలనుచున్ తృప్తిన్ చెందని మనుజుడు సప్త ద్వీపములనైన చక్కం బడునే అంటారు పోతనామాత్యులవారు.
.
ఆపూర్యమాణ౦ అచల ప్రతిష్టం ,సముద్రమాపః ప్రవిశ౦తి యద్వత్ ,తద్వాత్కామాయం ప్రవిశ౦తి సర్వే ,స శాంతి మాప్నోతి న కామ కామీ .
.
ఎన్నో నదులలో నుండి నీరు సముద్రాన్ని ప్రతి క్షణమూ చేరుతున్నది అయినప్పటికీ సముద్రమట్టం పెరగటంలేదు. సముద్రుడు చెలియలికట్ట దాటడం లేదు .
అదే విధంగా ఎన్ని విషయ భోగాలు ఊరించినా ఎవరిలో వికారం కలగకుండా ఉంటుందో వాడే నిజమైన శాంతిని పొందగలుగుతాడు.
.
కాబట్టి ప్రకటనల మాయాజాలం లో కొట్టుకు పోకుండా మనని మనం కాపాడుకుందాం .

జానకిరామారావు వూటుకూరు