సింధు కు హిమదాస్ కు పోలిక ఎందుకు? ఎవరీ గొప్ప వారిదే. ఎవరీ విభాగం వాళ్లదే.

సింధు కు హిమదాస్ కు పోలిక ఎందుకు? ఎవరీ గొప్ప వారిదే. ఎవరీ విభాగం వాళ్లదే. కానీ ప్రతీ దానికి కొన్ని లెక్కలు ఉంటాయి. అసలు ఇక్కడ పోలిక అవసరమా? ఒకసారి పరిశీలన చేద్దాం.

2018 హిమదాస్ కామన్ వెల్త్ గేమ్స్ లో 6 స్థానంలో నిలిచింది. అంటే ఆమె తరుపున కామన్ వెల్త్ గేమ్స్ లో ఇండియా కి మెడల్ రాలేదు. ఆ స్థానంలో నిలవడం కూడా గర్వించదగిన విషయమే. జూనియర్ ఛాంపియన్ లో అండర్ 20 లో మాత్రం 5 సర్వాలు గెలిచింది. నిజంగా అద్భుతం అని చెప్పవచ్చు. జనవరి 01/01/2019 ప్రకారం ఉమెన్స్ 200 మీటర్స్ లో 164, అదే 400 మీటర్స్ లో 63 వ స్థానంలో ఉంది. హిమదాస్ ఉమెన్స్ వరల్డ్ ఓవరాల్ ర్యాంక్ 1118. అంటే ఆమె కంటే ఈ ప్రపంచంలో ఇంకా ఎంత మంది ముందున్నారో విశ్లేషణ చేస్తే అర్ధమవుతుంది. ప్రస్తుతం కొంచెం ర్యాంక్ మెరుగు పర్చుకోగలిగింది. ఆమె ఇంకా ఒలింపిక్ కి సెలెక్ట్ కూడా కాలేదు. ఒలింపిక్ గేమ్స్ కి సెలెక్ట్ కావాలన్న ప్రస్తుతం ఇంకా ర్యాంక్ మెరుగు పర్చుకోవాల్సింది ఉంది.
ఇక మీడియా అంటారా హిమదాస్ గురించి వాళ్ళ రాష్ట్ర మీడియా, పేపర్స్ ఆకాశానికి ఎత్తేశాయి. దింగ్ ఎక్సప్రెస్ అస్సాం అంటూ కితాబు ఇచ్చాయి. నార్త్ మీడియా కూడా ఆమె మీద బోలెడన్ని ఆర్టికల్స్ రాశాయి. అవి మనం చదవం, ఎందుకంటే మనకు భాష సమస్య.
ఇక తెలుగు మీడియా ఎందుకు రాయట్లేదు రాయట్లేదు రాయట్లేదు అంటే హిమదాస్ ఏమైనా తెలుగు బిడ్డ నా? ఆమె తెచ్చిన 5 స్వర్ణాలు ఓవరాల్ వరల్డ్ వైడ్ అయితే కాదు. కేవలం అండర్ 20 జూనియర్ వరల్డ్ ఛాంపియన్ షిప్ మాత్రమే.
ఇలాంటి ఛాంపియన్ చాలా దేశాల్లో జరుగుతూనే ఉంటాయి.
ఇకపోతే సింధు 2016 ఒలింపిక్ గేమ్స్ లో సిల్వర్ తెచ్చింది. అప్పటి దాకా ఆ విభాగంలో ఎవరు తీసుకురాలేదు. ఒలింపిక్ గేమ్స్ అంటే జూనియర్ గేమ్స్ కాదు ఓవరాల్ వరల్డ్ వైడ్ గేమ్స్.
◼️ఆమె సాధించిన విజయాలు ఒకసారి చూద్దాం.
👉2013 – కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్
రెండవ స్థానం
👉2011 – BWF ప్రపంచ జూనియర్ ఛాంపియన్
మూడవ స్థానం
👉2012 – ఇండోనేషియా ఓపెన్ సూ.సీ.ప్రీ
రెండవ రౌండ్
👉2010 – ఇండియా ఓపెన్ సూ.సీ.ప్రీ
సెమి ఫైనల్
👉2012 – చైనా ఓపెన్ సూ.సీ.ప్రీ
సెమి ఫైనల్
👉2012 – జపాన్ ఓపెన్ సూ.సీ.ప్రీ
రెండవ రౌండ్
2011- డచ్ ఓపెన్ సూ.సీ.ప్రీ
రజిత పతకం
👉ఇండియన్ ఓపెన్ గ్రాండ్ పీక్స్
2010 మరియు 2011 లో వరసగా రెండవ రౌండ్
👉2012 లో రజిత పతాకం

◼️వ్యక్తిగత విజయాలు
👉2011 – ఇండోనేషియా ఇంటర్నేషనల్
👉2014 – మలేషియా మాస్టర్స్
👉2013, 2014, 2015 – మకావూ ఓపెన్
👉2016 – మలేషియా మాస్టర్స్

◼️ రెండవ స్థానంలో సాధించిన విజయాలు
👉2011 డచ్ ఓపెన్
👉2012 సయ్యద్ మోడి ఇంటర్నేషనల్
👉2014 సయ్యద్ మోడి ఇంటర్నేషనల్
👉2015 డెన్మార్క్ ఓపెన్
👉2016 దక్షిణ ఆసియా క్రీడలు
👉2016 రియో ఒలింపిక్స్

సింధు ప్రయాణం
◼️BWF గ్రాండ్ ప్రిక్స్
👉 మలేషియా మాస్టర్ గ్రాండ్ ప్రిక్స్ గోల్డ్
👉సయ్యద్ మోడీ గ్రాండ్ పిక్స్ గోల్డ్
👉జర్మన్ ఓపెన్
👉స్విస్ ఓపెన్
👉చైనా ఓపెన్
👉చైనాస్ కాఫీ గ్రాండ్ ఫైనల్స్
👉వియత్నాం మాస్టర్ గ్రాండ్ ప్రిక్స్ గోల్డ్
👉ఇండోనేషియా మాస్టర్స్ గ్రాండ్ పిక్స్ గోల్డ్
👉థాయిలాండ్ మాస్టర్ గ్రాండ్ ప్రిక్స్ గోల్డ్
👉డచ్ మాస్టర్ గ్రాండ్ ప్రిక్స్ గోల్డ్
👉మాకావు మాస్టర్ గ్రాండ్ ప్రిక్స్ గోల్డ్
👉ఇండియా మాస్టర్ గ్రాండ్ ప్రిక్స్ గోల్డ్

◼️BWF సూపర్ సిరీస్
👉ఆల్ ఇంగ్లాండ్ సూపర్ సిరీస్ ప్రీమియర్
👉ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్
👉మలేషియా సూపర్ సిరీస్
👉సింగపూర్ ఓపెన్ సిరీస్
👉ఇండోనేషియా సూపర్ సిరీస్ ప్రీమియర్
👉ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ సిరీస్
👉జపాన్ సూపర్ సిరీస్
👉కొరియా సూపర్ సిరీస్
👉ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్
👉చైనా సూపర్ సిరీస్
👉హాంకాంగ్ సూపర్ సిరీస్ ప్రీమియర్

◼️సింగిల్స్
👉ఆడినవి – 270
👉గెలిచినవి – 184
👉ఓడినవి – 86

◼️డబుల్స్
👉ఆడినవి 17
👉గెలిచినవి 09
👉ఓడినవి 08

👉2011 కామన్ వెల్త్ యంగ్ గేమ్స్ లో స్వర్ణం
👉2014 కామన్ వెల్త్ గేమ్స్ లో కాంస్యం
👉2016 రియో ఒలింపిక్స్ లో రజతం
ఈ లెక్కలన్నీ 2016 ఆగష్టు ప్రకారమే.
ఇంకా ఉన్నాయి…

సింధు 2009 లో వచ్చినప్పుడు ఎంత మందికి తెలుసు? అప్పుడు ఆమె గురించి ఏ మీడియాలో వచ్చింది? ఏ పేపర్స్ లో రాశారు. 2011 లో గోల్డ్ మెడల్ వస్తే ఎన్ని మీడియాలో మోగింది? 2016 లో సిల్వర్ వచ్చాకే సింధు పూర్తి స్థాయిలో తెలిసింది.
దయచేసి ఒకరితో ఒకరిని పోలుస్తూ ఒకర్ని గొప్పగా ఒకరిని తక్కువగా చూడడం కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ఒక్క లెక్క ప్రకారం సింధు (2009 నుండి స్ట్రగుల్ చేస్తే 2016 వరకు) తెలియడానికి 7 సంవత్సరాలు పడితే, కేవలం 1 ఇయర్ లోనే
(ఎంట్రీ 2018) హిమదాస్ దేశం మొత్తం తెలిసింది. ఈ విషయంలో హిమదాస్ ముందు ఉన్నట్లే లెక్క కదా.
అంతక ముందు సింధు అన్నీ ఆడిన ఎన్ని మెడల్స్ తెచ్చిన గుర్తింపు లేనట్లే కదా.
నువ్వు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటే నిన్ను కూడా పొగుడుతుంది, ఈ ప్రపంచం నీ విజయం గురించి మాట్లాడుతుంది. అక్కడ విజయం కనపడుతుంది, విజయమే వినిపిస్తుంది.
కులమో మతమో కాదు.
ఎవరీ గొప్ప వారిదే.
సింధు సింధునే…..
హిమదాస్ హిమదాస్ యే…..
ఇద్దరు ఇద్దరే……