పరమ పద సోపాన పఠము ( పాము పఠము)

శివ రాత్రికి పూజామాగ్రి  కై సికింద్రాబాదు మార్కెట్టు వెళితే ఇది లభించింది ,నేను ఆమద్య తెలుగు పఠము  / వైకుంఠ పాళి కోసం అంతర్జాలంలో వెతికే దోరక లేదు అందుకే ఇది అందుబాటు లోకి తేవటానికి ఒక చిన్న ప్రయత్నం పెద్దది గా కావాలనుకోంటే దయచేసి

https://photos.app.goo.gl/LFLkcB9UU5U454YQ7

ఈ చిత్రం ను భద్రపరచి కావలసిన పరిమాణం లో ముద్రించుకోగలరు

paamu-patam

ఆంగ్లలో దోరికే Snakes and ladders కన్నా మన తెలుగు పఠమే బాగుంటుంది ఇది dice కన్నా గవ్వలలో ఆడితేనే మజా..
చిన్న ప్పుడు తెగ ఆడేవాడిని,ఒక రకం గా ఇది వ్యక్తిత్వ వికాశానికి మార్గదర్శకం ఈ  పటాన్ని చూడండి
సుగుణం అనే నిచ్హెన ద్వారా సాలోక్యము , గురు బోద ద్వారా దేవలోకం  అలాగ నే ఆన్ని గడులు పూర్తిచేసినా చివరి గడి 121 అహంకారము లో పాము కరిచి చివరికి రాక్షసుడి గడి కి చేరతాడు    దీన్ని మరింర మెరుగులు దిద్ది ఒక ఆన్ లైను గేములా తయారు చేయాలి  http://www.freevbcode.com/ShowCode.asp?ID=6709 ఇలాగే ఇలాంటివి ఎన్నో ఆటలు వెలుగు లోకి తీసుకురావసిన అవసరంవున్న ది http://en.wikipedia.org/wiki/Snakes_and_ladders  లోచూడండి  ఇలా  తెలుగు వికిలో  ఇలాంటి మన తెలుగు ఆటల గురించి రాయవలసిన అవసరం వున్నది. మోన్న ఒక ప్రముఖ తెలుగు బాలశిక్షలో చూశాను మన చిన్నప్పటి నుండి నేర్చుకోన్న పాటలు పద్యాలు, ఇంకా అనేక విషయాలమీద ఆ గ్రంధ రచయిత కాపీ రైటు వేసుకోన్నాడు . ఇక మన పరమ పద సోపాన పఠము కూడా ఎవడో తర్జుమా చేసి ఒక గోప్ప ఇన్నోవేషన్ గా కాపీ  రైటు వేసుకోంటాడు మనం మేమో మన ఆటకు అంత పేరు ఆనంద పడి వాడి ద్వారా వచ్హినందుకు భాధపడతాం !

మహా శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు

తెలుగు తాంత్రిక సంఘాలు

“సమాచార సాంకేతికతకు సంబంధించిన ప్రాజెక్టులు తమిళంలో చేస్తే… అది జనబాహుళ్యానికి సులభంగా అర్థమయ్యే రీతిలో ఉంటుందని… అందులో విషయాలు సుబోధకంగా నలుగురికి ఉపయోగపడతాయని ఇవి ఒకవిధమైన ప్రత్యేకతతో అలరారుతూ మార్కెట్‌ పరంగా మంచి గిరాకీ సాధిస్తాయట . అంతేకాక తమిళంలో సాఫ్ట్‌వేర్‌ను రూపొందించే విద్యార్థులకు లక్ష రూపాయల నగదు బహుమతి కూడా రాష్ట్ర తమిళ భాషాభివృద్ధి శాఖ ఇస్తుందట.
కన్నడం లోకూడా చెప్పుగోదగ్గ ప్రయత్నాలు జరుగుతున్నాయి వీటికి అయా రాష్ట్రంలో సాంకేతిక సంఘాల కృషి వుంది.
మన భాషకు   ఇలాంటి సదుపాయముంటే ఎంత బాగుండు 😦

అయినా మన కు ఇలాంటివి సరిపడవేమో,  మనలాంటి కత్తులు ఒక్క ఒరలో అస్సలు ఇమడం

నాకు తెలిసి 1997 నుండి కూడా తెలుగులో ఇలాంటివి జరుగు తున్నాయి ఒక యాహూ గుంపు లో కోంత మందిలో ఒక చిన్న సమూహంగా ఎర్పడి మాకు తోచినంత అబ్దివృద్ది చేసాము కోంత కాలానికి మన జ్యాడ్యాలు అయిన ఇగోలు రాజకీయాలు బయలు దేరి గ్రూపు అచేతనావస్తకు వెళ్ళిపోయింది తరువాత కోంతమంది కలసి మరి కోన్ని ఉపరణాలు తయారు చేసారు కానీ మనకు వున్నంత సాంకేతిక నిపుణుల లబ్యతకు మనం అద్బుతాలు చేయవచ్హు కానీ అదేమిటో గాని మన తెలుగు నెట్జ్ జనులు ఎందుకనో సమూహాలుగా కలసి పనిచేయటానికి ముందుకు రారు . అమ్మా పెట్టదు అడుక్కోతిన్నివ్వదు అన్న చందంగా మన లో చాలా మందికి ఒక స్థాయి దాటిన తరువాత ఈ జ్యాడ్యం పెరుగు తుంది.
మనమేమో ఎప్పుడూ నువ్వు గోప్పా అంటే నువ్వెంత అనుకోంటూ ఇలా వుండి పోతున్నాము. తెలుగులో టెక్నాలజీ కు చెందిన అనేక అంతర్జాల సమూహాలు ఇప్పుడు అచేతన ఆవస్తలో ఉండటానికి కారణాలు ఇలాంటివే .మన సంఘీభావం అంతా రాజకీయాలు, సినిమాలు పరిమైపోతుందెందుకనో ..:(