ఎంటీ తాజ్‌మహల్‌కు ఓటెయ్యాలా ?

ఎంటీ ప్రపంచంలోని ఏడు వింతల్లో చోటుదక్కటానికి తాజ్ కు ఓటెయ్యాలా – ఇది ఒక ప్రైవేటు చిట్టా దీనికి ఎటువంటి అధికారం లేదు –  నేను వెయ్యను , తాజ్‌మహల్‌కు ఓటెయ్యాలా – ఇది ఒక ప్రైవేటు చిట్టా దీనికి ఎటువంటి అధికారం లేదు –  నేను వెయ్యను ,

తాజ్‌మహల్‌ఈ మద్య ఇది బాగాపెరిగి పోయినది ప్రపంచంలోని ఏడు వింతల్లో భారత్‌కు చెందిన చారిత్రాత్మక కట్టడం తాజ్‌మహల్‌కు చోటు దక్కుతుందా అనే విషయం ఆగమ్యగోచరంగా ఉంది. ఇందుకు కారణం ఇటీవల నిర్వహిస్తున్న ఆన్‌లైన్ సర్వేలో ప్రస్తుతం ఉన్న ఏడు వింతలపై ప్రజాభిప్రాయ సేకరణ తాజ్‌మహల్‌కు భిన్నంగా ఉండటమే. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 200 కట్టడాలపై నిర్వహిస్తున్న సర్వేలో మొత్తం 21 కట్టడాలు తుదిగా నిలిచాయి. ప్రస్తుతం ఏడో వింతగా ఉన్న తాజ్‌మహల్‌ ఆ జాబితా నుంచి తప్పుకుంది. అయితే  తాజ్‌మహల్‌కు ఓటు వెయవలసినది గా అబ్యర్దిస్తూ జాబులు SMS  వస్తున్నాయి.అసలు ఈ ఓటంగ్ సరళి  చాలా విచిత్రంగా ఉన్నది దీని కోసము మీకు Internet accout గాని Mobile Phone గాని వుండాలి 😦 , మీకు ఓటు వెసిన రుజువు కోసం  Certificate voting కు US$2,లేదా దీనికో సము +423 663 90 02 99 call చేయాలటలేదా on line లో, ఎన్ను కోవాలట ,SMS ద్వారా కూడా ఎన్నుకో వచ్చట  అన్నిపక్రియలు వ్యయపూరిత మయినవి పైగా  ఇది ఒక వ్యక్తిగత చిట్టా ఇలా మనం ఎవరన్నా చిట్టాలు తయారు చేయవచ్చు ఇలాంటివి వుపయోగించి ప్రజల మానసిక ఉద్వేగాలను చక్కగా సోమ్ము చేసుకోవచ్చు ఇంకా బోలేడు జాబితా (data), ప్రచారం కూడా లబిస్తుంది. ఇక విషయానికి వస్తే ఈ ఓటింగు పూర్తి గా ఒక గిమ్మిక్కు ,ఇది ఒక swiss కంపెనీ వాడి మాయ వీడు http://www.new7wonders.com/ పేరుతో ఒక టూర్ నడుపుతూ ఉంటాడు వీడు మన తాజ్‌మహల్‌ అబివ్రుద్దికి ఒక్క డాలరు కూడా ఇవ్వడు అంతే కాక దీనిపై సర్వే నిర్వహిస్తున్న బెర్నార్డ్ వెర్బర్ చెపితేనే తాజ్‌మహల్‌ కు కోత్తగా వచ్చేదేమి లేదు  , అసలు UNESCO వాడికే మన తాజ్ గురించి మాట్లాడే అధికారంలేదు.ఇలాంటి పనికి రానివిషయాలి మీద మన మీడియా ప్రత్యేక మమకారం అసలు ఒక విషయంగురించి మాట్లాడేటప్పుడు సరి అయిన పరిశోదన  చేసి విచక్షణ తో ఎందుకు స్పందించరు ? ఖర్మకాలి మన ప్రర్యాటక మంత్రి అంబికా సోని గారు మీడియా సమక్షలో SMS ద్వారా ఓటు వేసారు ఆ మూడు రూపాయలను   తాజ్‌మహల్‌ అభివృద్దికి వెచ్చించినా ఈపాటికి కోన్నిలక్షల రూపాయలు జమఅయ్యేవి .

PS : ఇది రాసే సమయానికి Lisbon వాడు తుదిజాబితా ప్రకటించటానికి ఇంకా 11 రోజుల 11 గంటల సమయం మిగిలి వున్నది.దయచేసి ఈవేలంవెర్రి గురించి be MAD! (Make A Difference ) 

పందులే గుంపుగా వస్తాయి…సింహం సింగిల్‌గా వస్తుంది

ఓ ఎన్‌.ఆర్‌.ఐ. అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ సిస్టమ్‌ ఆర్కెటెక్ట్‌గా ఉంటూ రూ.250 కోట్లు సంపాదించి స్వదేశానికి తిరిగివస్తాడు. తాను సంపాదించిన సొమ్ముతో ఎన్‌.ఆర్‌.ఐ.  ఫౌండేషన్‌ ఏర్పాటు చేయాలనీ, ఓ యూనివర్శిటీ, ఓ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి వంటివి నిర్మించి ఉచిత విద్యావైద్య సదుపాయాలు కల్పించాలన్నది అతని ఆశయం. ఎన్‌.ఆర్‌.ఐ.కి పెళ్లి చేసి తమ బాధ్యత తీర్చుకోవాలని తల్లిదండ్రులు  అనుకుంటారు. సంప్రదాయంగా ఉండే  అమ్మాయిని చేసుకుంటానని ఎన్‌.ఆర్‌.ఐ.చెబుతాడు. ఒక అమ్మయిలో అలాంటి లక్షణాలే కనపడటంతో ఆమెను ప్రేమిస్తాడు. ఇక ఫౌండేషన్‌ ఏర్పాటు విషయంలో తనకు సహకరించాల్సిందిగా ఒక బిజినెస్‌మెన్‌ ను ఎన్‌.ఆర్‌.ఐ.అడుగుతాడు.ఉచిత విద్య, వైద్యం అందిస్తే తన విద్యావైద్య సంస్థలు మట్టికొట్టుకుపోతాయనే భయంతో ప్రభుత్వంలో తనకున్న పలుకుబడిని ఉపయోగించి ఎన్‌.ఆర్‌.ఐ.కి అడ్డుతగులుతాడు. అతని కుట్ర కారణంగా ఎన్‌.ఆర్‌.ఐ. తన ఆస్తులన్నీ పోగొట్టుకుని పాపర్‌ అవుతాడు. దాంతో ఎన్‌.ఆర్‌.ఐ.ని హేళన చేస్తూ ఓ రూపాయి ముష్టిగా పడేసి బిచ్చమెచ్చుకుని బతకమని ఆ బిజినెస్‌మెన్‌ సలహా ఇస్తాడు. అదే రూపాయి పెట్టుబడిగా తన ఆశయాన్ని సాధించుకుంటానని ఛాలెంజ్‌ చేసిన ఆ  ఎన్‌.ఆర్‌.ఐ.బ్లాక్‌మనీ దాచిన ఘరానా పెద్దమనుషుల ఆటకట్టిస్తాడు. ఈ క్రమంలోఆ బిజినెస్‌మెన్‌ పై  ప్రతీకారం తీర్చుకొని తన ఎన్‌.ఆర్‌.ఐ. ఫౌండేషన్‌ లక్ష్యం నెరవేర్చుకోంటాడు ….

ఇది ఎన్నాళ్ళ నుండో ఎదురు చూచిన కద ,
మళ్ళా దీనికి 75 కోట్లు ఎందుకు ?
టిక్కెట్ల కోసంవారంరోజులు పడిగాపులు ఎందుకు ?
నాకెందుకో బాబానే నచ్చినది (దాని కోసమయితే మద్రాసు నుండి కాలేజి మానుకోని అంద్రావచ్చి చూశా!)
ఇంకా నయం ఈ సినిమా చూసినది రేడియో మిర్చి వాడి సౌజన్యంతో కాబట్టి పెద్దగా బాదలేదు  …..

ఇంకోక విషయం ఎమిటంటే నేను సింగిల్‌గానే వెళ్ళా …..
 

పచ్చబొట్టు చెరిగీపోదులే….

ఈ రోజు (శనివారం అధిక జ్యేష్ఠ విదియ) covansys interview కి నన్ను coordinator గా వెళ్ళ మన్నారు మా ప్రదాన కార్యాలయం వారు , సరే తప్పదు కదా అని వెళితే అక్కడ అంతా గందరగోళం గుంపును ఒక గాడిలో పెట్టేవరకి తల ప్రాణం తోకకోచ్చినది అదేదో పార్కుకి వచ్చినట్లు కోంతమంది పెళ్ళాం పిల్లలతో వచ్చారు బహుశా అలుమోగలు ఇద్దరూ వచ్చారేమో .అసలు interview కి వచ్చిన వాళ్ళ కన్నా వారితో తోడుగా వచ్చినవారి సందడి బాగావున్నది ఇంతలో ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి “మీది భద్రాచలం కదా ” అని అడిగాడు నేను అవునని మీ కెలా తెలుసునని విస్మయంగా అడిగాను.అతను చిరునవ్వు తో తన చేతిపైన పచ్చబోట్టును చూపించాడు. అది నా పేరే! ఇక నాకు మాటలు రాలేదు ..ఒక కేక పెట్టి గట్టిగా వాటేసుకున్నాను ఆ క్షణం లో నేను Interviewer తను interviewee అన్న విషయంగుర్తురాలేదేమిటో .. ….

cut చేస్తే,

 1993 శ్రీరామాలయం , రాజవీది భద్రాచలం.

మేము ఇద్దరం (నేను,శివ) చదువుకునేది ఒకే చోట, ఇళ్ళు కూడా ఒకే వీదిలో ,సెలవలు వస్తేచాలు ఆ ఇరువురిదీ ఒకే మాట ,ఒకే ఆట ఎప్పుడూ గోదారి ఒడ్దున ఆడుకోవటం ,గుళ్ళో పెట్టే ప్రసాదాలు తినటం , రోజూ జరిగే వూరేగింపులో పాల్గోనటం .గుళ్ళో కోతులను తరమటం ఒకటేమిటి , మమ్మలిని ఆపేవారెవరు ? అడిగేవారేవరు ??.ఎంతో వుల్లాసంగా గడిపే వాళ్ళం పరీక్షలో మాఇద్దరి కీ first class వచ్చినది ,దానితో పాటే ఒక దుర్వార్త శివ వాళ్ళనాన్న గారికి కోయంబత్తూరు లో ఉద్వోగం వచ్చిందట జాయన్ అవ్వటానికి ఇంకా వారమే గడువు .చాలా బాదవేసినది మా స్నేహం చిరస్తాయిగా గుర్తుండి పోవటానికి ఇద్దరం చేతిమీద పచ్చబొట్టు పోడిపించుకోందామనుకోన్నాం అనుకున్నదే తడవు గా శివ నాపేరు తన చేతిమీద రాయించు కోన్నాడు అదేమిటో వాడి చేతి మీద బాగానే రాసిన మిషను నా దగ్గరకు వచ్చేసరికి మోరాయించినది 😦 , రేపు రమ్మని చెప్పాడు పచ్చబోట్లు వెసేవాడు ఆ రోజు రాత్రి మా నిర్వాకం ఇళ్ళలో తెలుసినది వెదవ వేషాలు వేసావంటే తోలు తీస్తానని మా నాన్న గారు హెచ్చరించారు ,ఆ పచ్చబొట్టు ఎలర్జీవచ్చి మా శివ మూడురోజులు లేవలేదు ఈ లోపల నేను ఇంట్లో జడిసి ఎలాంటి సాహసం చేయలేదు.వాడికి చేయి నయమవగానే శివ నన్ను వెంటబెట్టు కోనీ మరీ ఆ పచ్చబోట్టు వాడు వుండే ప్రదేశానికి వెళ్ళాము , వాడు బిచాణా సర్దుకోని రాజమండ్రి వెళ్ళాడని తెలుసింది నాకు మోఖం చెల్లలేదు . పాపం శివ ! అప్పడి నుండి వాడు నాతో మాట్లాడలేదు నాకు కూడా కోయుంబత్తూరు లో వాళ్ళ చిరునామా తెలియదు .

.. ఇప్పడు శివ కలిసాడు ,హైదరాబాదు లో ఉద్వోగాన్వేషణలో వున్నాడట , తనకి పెళ్ళి కూడా అయిపోయినదట ఇంకా నాపేరు తోవున్న పచ్చబొట్టు ని చూసి ఇదవరకు హైదరాబాదు లో రోజుకు ఒక్కరయినా అడిగేవారట తను ఇప్పుడు తివెండ్రం లో మకాం కాబట్టి ఇప్పుడు వారానికి ఒక్కళ్ళు అడుగుతారట ,తన భార్య చాలాసార్లు Plastic surgery చేయుంచుకోమ్మని ఆడిగిందట . నేను ఎలా ప్రతిసస్పందించాలాలో తెలవలేదు ఇద్దరంకలసి బోజనం చేసాము,

 చివరిగా వీడుకోలు చెపుతూ ఇక పై నన్ను పచ్చబొట్టు వేయించు కోవద్దని ఓట్టు పెట్టీ మరీ వేళ్ళాడు నా శివశంకర్ …………… కిం కర్తవ్యం ?