ఏమిటొ అసలు ఈ జీవితము

ఏమిటొ అసలు ఈ జీవితము లో మరీ మలుపులు ఎక్కువయి పోయినాయి అసలు పండగ ఎప్పుడొ తెలుకునె అప్పటి కే పండగ వెళ్ళిపోతోంది. హామ్మ నిన్న కొన్ని తొరణము ఇవ్వాళ కొన్ని తోరణము,
నిన్న రెండు సార్లు తలస్తానము (షాంపూ లేకుండా),ఇవ్వాళ ఒక సారి షాంపూతొటి
నిన్న పరవన్న నవేద్యము ఈరోజు కొబ్బరి కాయ,నిన్న స్వయంపాకము ఈ రోజు మెస్సు లో ఉగాది ప్రతేక బోజనము, ఇలా నా ఉగాది గడచినది..

ఈ  సర్వబాదలను ఈ సర్వ జిత్ నామ సంవత్సరం లో చిత్తు చేయాలని వున్నది -(అంటే దీని అర్దం పెళ్ళి చేసుకోంటా నని ఖచ్చితముగా కాదు),

మరి ఉగాదికి కవిత రాయాలి కదా !

నిర్బయ మయిన మనస్సు ,అలొచలా అలోచనాని శిరస్సు 

మటుమాయమయినాయి వెలుగు నీడల తెరలు

హరించి పోయినది ప్రతి దుఖభాష్పం’

గతించి పోయాయి క్షనికానంద ఉషోదయాలు   

ఒక చిన్ని నవ్వు బుడగనినేను

అయిపోయూను ఆనంద సాగరముగా!
ఉగాది శుబాకాంక్షలు ఈ నూతన సంవత్సరం మీకు మరింత ఆనందాన్ని కలిగించాలి అని కోరుకుంటూ ….
మీ శ్రేయోబిలాషి
కృపాల్ కశ్యప్
తినేది చేదని తెలిసీ, అది ఉగాది విందని తలచి. ఇష్టపడే ఆ పూతే అలవాటైతే ప్రతి రోజూ వసంతమౌతుంది !

ఉగాది ఎప్పుడొ ? -లాంగ్‌ వీకెండ్‌ కోసం పండగనే మార్చారా !!

నాకు అర్ధం కాని విషయం ఏమిటంటేఉగాది 20 మార్చిని కాదు, 19నే అని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి శలవు ప్రకటించింది.ది ఏమైనప్పటికి పాఢ్యమి ఘడియలు ఉదయం ఉన్న వేళల్లో ఉగాది పండుగను చేసుకోవాలి వ్యయనామ సంవత్సర పంచాంగాలలో 20 వ తేదీ ఉగాదిఅని వుంది.
19
న అమావాస్య ఉదయం 8-52 వరకు (ఒక పంచాంగం ప్రకారం) వుంది. అదేరోజు సూర్యగ్రహణం ఉదయం 7-32 వరకు. సంకల్పం అమావాస్య తిథిగానే చెప్పుకోవాలి.
20
న పాడ్యమి తిథి ఉదయం 6-43 వరకు వుంది (ఒక పంచాంగం ప్రకారం). సూర్యోదయానికి పాడ్యమి వుంది కనుక సంకల్పంలో సర్వజిత్‌ నామ వత్సరే, ఉత్తరాయణే, వసంత ఋతౌ, చైత్రమాసే, శుక్లపక్షే ప్రతిపతిథౌ, భౌమవాసరే అని చెప్పుకోవాలికొత్త గా విడుదలైన సర్వజిత్‌ నామ సంవత్సర పంచాంగాలు కూడా 20 వ తేదినుంచే ఉగాదితో మొదలయ్యాయి.
మరి ఇంత హథాత్తుగా ప్రభుత్వానికి ఉగాది తేదీపై అనుమానం ఎందుకు వచ్చింది? ప్రముఖ దేవస్థానాలన్నీ కూడా 20 వతేదీనే ఉగాది పండుగ చేస్తూవుంటే మధ్యలొ ప్రభుత్వానికీ జోక్యం ఎందుకు?
దీనికి ఒకటే కారణం నాకైతే అనిపిస్తోంది. అదే వరుసగా శలవలు వస్తాయనేమోనని!!-