నాహీరో రామలింగ రాజు

 

వేలాది మందికి ఉద్యోగాలు, లక్షలాదిమందికి ప్రాణ దానం చేస్తున్న  నాహీరో  రామలింగ రాజు ఇలా చేయాల్సి  వస్తుందని  అస్సలు అనుకోలేదు , పాపం మన మీడియా వీర ప్రతాపం గురించి ఒక ప్రముఖ మీడియా (TV9)భాగస్వామ్యుడికి తేరుకోలేని ఎదురు దెబ్బ 😦  నిన్న ఉదయం నుండి అదే పనిగా సత్యం ని మీడియా తెగనాడుతోంది దీని వలన ఎవరు లాభపడేది ?

satyamlogo

భారతీయ కంపెనీలా ?
పెట్టుబడిదారులా     ?
IT ఉద్వోగులా      ?
సాధారణ ప్రజలా     ?

logo_byrraju1mytas13logo_ilabs1
నిన్న మోన్నటి దాకా అకాశానికి ఎత్తివేసిన వీళ్ళ ందరూ ఎందుకుం ఇలా ప్రవరిస్తున్నారు ,ఇవతల ఒక పెద్ద కంపెనీ కస్టకాలంలో వుంటే ఈ పైశాచిక  శేస్టలుఏమిటీ ?

 నేను  HRNet  లో  పనిచేసేటప్పుడు మా అఫీసు క్రింద మైటాస్ వుండేది అంతేకాక  మా HRNet
  డైరక్ట్రరు మోహన దాస్ కోంత కాలం రామలింగరాజు దగ్గర VP HR  గా  పనిచేశారు  నా కంపెనీ  executive search firm కావటంతో  Satyam,Maytas, Ilabs ,Byrraju Foundation   VP/Managers positions లకు నేనే పనిచేసేవాడిని అలా నాకు ఈ కంపెనీల మీద అవగాహన ఎర్పడినది

ఈ కంపనీlu  Satyam – IT , MayTas – Infa,Ilabs -venture capital, Byrraju Foundation – Public services  చూడటానికి వేరువేరుగా ఉన్నాఇవ్వన్నీ  ఒక దానికి ఒకటి సంబదం వున్నవే . అప్పట్లో   మేటాస్‌ (2004)వారు భూములు కోనటం గురించే మాట్లా డుకోనేవారు హైదరాబాదులో ఎక్కడ వీలయిత అక్కడ భూములు కోనివేసి అ పరిసర ప్రాంతాలలో సత్యం కార్యాలయాలు పెట్టి ఆభూమి విలువ అమాతం పెంచేసి లాబాలు గడించటం వారి వుద్దేశ్యము గానుకోనేవాడిని,కానీ కాంగ్రేసు ప్రభుత్వ్ కాలంలో ఈ కంపెనీ దేశీయంగా / అంతర్జాతీయంగా మరింత ముదుంకెళ్ళిది అది ఎంతవరకు అంటె ప్రాజక్టు ఇచ్చినందుకు కంపెనీయే తిరిగి ప్రభుత్వానికి ఇచ్చేఅంతగా ! మెట్రో పాజక్టు ,ఇతర పాజక్టు  లు,ఇంకా భూములు అమ్మకంద్వారా లాభాలు ఆర్జింబోయే  మేటాస్‌ ప్రాపర్టీస్‌ కు వాళ్ళ  iLabs group (The Associated Broadcasting Company Ltd (ABCL)  – TV9) అండగావునంది ఈ iLabs group రామలింగ రాజు తమ్ముడు శ్రీనిరాజుకు చెందినదే సో.. పబ్లిక్ ,పోలిటికల్ ,బ్రాండ్ వాల్యు వున్న మేటాస్‌ ప్రాపర్టీస్‌  ను 1.3 బిలియన్‌ డాలర్లకు, మేటాస్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను 300 మిలియన్‌ డాలర్లకు సత్యం సంస్థ  కొనుగోళ్ళను వాటాదారులు అనుమతించి ఉంటే, ఈ పరిణామాలు సంభవించి ఉండేవి కావు సొంత కుటుంబ సభ్యులను మరింతగా సంపన్నులను చేయజూస్తున్నారని అందరూ భావించారు. చివరకు తేలిందేమిటంటే ఆయన ప్రయత్నమంతా సత్యం సంస్థను కాపాడడానికేనని  తెలియక మీడియావారు ఇతరులు గగ్గోలు పెట్టారు అసలు నాకు చిర్రేత్తుకోచ్హే విషయం ఎమిటంటే సో..కాల్డ్ నిపుణులు, పత్రికలు, ఈ దిక్కుమాలిన విశ్లేషణలు అన్నీ సుద్ద దండగ ఈ  Financial institutions & Governance లక్షలకు లక్షలు వెచ్హించి కోట్లరూపాయలో జీతాలు ఇచ్హి  చేస్తోన్న హాడావిడి అంతా ట్రాష్.

43 responses to “నాహీరో రామలింగ రాజు

  1. నిప్పులు చిమ్ముకుంటూ
    నింగికి నేనెగిరిపోతే
    నిబిడాశ్చర్యంతో వీరె
    నెత్తురు కక్కుకుంటూ
    నేలకు నేరాలిపోతే
    నిర్ధాక్షిణ్యంగా వీరె
    శ్రీశ్రీ

  2. చాలా బాగా చెప్పారు. ప్రతీ దానికి నెగటివ్ ప్రాపగాండా చేయడంలో మన మీడియా ముందుంటున్నారు 😦 ఏ విషయమైనా పాజిటివ్ పాయింట్స్ గురించి అసలు మాట్లాడరు.
    They just want to show some sensational news.. thats the only point.

  3. kotlali kotlu mesina idiots roju mana munde tirugutunnaru. oka rakanga manalni paripalistubbaru. vaallane emi cheyyaleni ee prabhutwalaki, 50,000 mandiki upadhi choopi, prapanchamlo AP ki kooda IT Service ivvagalige satta undi ani cheppina Raju ni sikshinchalanukovadam mana vaalla telivi takkuva tananiki nidarsanam. market cap teda valla investors ki kaligina nashtaniki parishkaram choopistamani satyam management antoone vundi. oka consortium dwara udyogualaki bhadrata kalpistamani prabhutwam cheptundi. ee sanghatana dwara mana prastuata company act (1958) mariyu ippudu amalu kanunna act lo emi savaranalu tevali, audit vishayam lo evaru jokyam chesukovali vagairalu aalochinchadam avasaram. avannee odilesi okarini sikshinchinanta matrana origedemi ledu.

  4. kotlalki kotlu mesina idiots roju mana munde tirugutunnaru. oka rakanga manalni paripalistunnaru. vaallani emi cheyyaleni ee prabhutwalaki, 50,000 mandiki upadhi choopi, prapanchamlo AP ki kooda IT Service ivvagalige satta undi ani cheppina Raju ni sikshinchalanukovadam mana vaalla telivi takkuva tananiki nidarsanam. market cap teda valla investors ki kaligina nashtaniki parishkaram choopistamani satyam management antoone vundi. oka consortium dwara udyogualaki bhadrata kalpistamani prabhutwam cheptundi.

    ee sanghatana dwara mana prastuata company act ( 1958 ) mariyu ippudu amalu kanunna act lo emi savaranalu tevali, audit vishayam lo evaru jokyam chesukovali vagairalu aalochinchadam avasaram. avannee odilesi okarini sikshinchinanta matrana origedemi ledu.

  5. “చివరకు తేలిందేమిటంటే ఆయన ప్రయత్నమంతా సత్యం సంస్థను కాపాడడానికేనని ”

    అసలు ముంచడం దేనికి తరువాత కాపాడడానికి ప్రయత్నించడం దేనికి. ఒక వేళ ఆ డీల్ జరిగి ఉంటే కొన్నాళ్ల తరువాత రెండూ కలిసి మునిగుండేవేమో.

    “వేలాది మందికి ఉద్యోగాలు, లక్షలాదిమందికి ప్రాణ దానం చేస్తున్న నాహీరో రామలింగ రాజు”

    ఏమి చేసినా, చేసిన మోసం చిన్నదవదు కదా. 7000 కోట్ల మోసం జరిగినప్పుడు ఎవరైనా అలా స్పందించడం సహజమే..

  6. మంచి టపా. అలాగే బొల్లోజు బాబా గారు శ్రీశ్రీ ని సందర్భోచితంగా quote చేయటం fantastic.

  7. whatever may be the reason, the natural, ethical principles of business
    management has to be followed. Just to keep the company in the top, you cannot make window dressing silently without the knowledge of other board members(if it is true) and the auditors forgetting their own primary duty of looking the accuracy of accounting practices—-is it not wrong, leave the law what about your own conscience.

  8. ఒకప్పుడు రమేష్ గెల్లిని కూడా బ్యాంకింగ్ హీరో అన్నారు. అయినా మదుపరులకి నష్టాలు తప్పలేదు. ఇప్పుడు సత్యం విషయం కూడా అంతే. ఎవరూ ఎప్పుడూ పుడింగీలు కాదు అని అనిపిస్తోంది.

  9. What a piece of crap!! Read the below sentence again. మన దగ్గర వ్యక్తి పూజ ఎక్కువ అని తెలుసు కానీ, మరీ ఇంత అనుకోలా. అనుభవజ్ఞులు బాబా గారికీ ఏమయిందో!!.

    “బ్రాండ్ వాల్యు వున్న మేటాస్‌ ప్రాపర్టీస్‌ ను 1.3 బిలియన్‌ డాలర్లకు, మేటాస్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను 300 మిలియన్‌ డాలర్లకు సత్యం సంస్థ కొనుగోళ్ళను వాటాదారులు అనుమతించి ఉంటే, ఈ పరిణామాలు సంభవించి ఉండేవి కావు ‘

    Are you guys out of your mind?

    అసలా డీల్ ప్రపోజ్ చేయడమే పెద్ద స్కామ్. కొన్నట్లుగా చూపించి, డబ్బులు పే చేయకుండానే, పే చేసినట్లుగా చూపించి, సత్యం బుక్స్ లో అడ్జస్ట్ చేయొచ్హన్నట్లు ప్లాన్. మరి అప్పుడు మేటాస్ ఇన్వెస్టర్స్ చంక నాకి పోరా? అమ్మినప్పుడు డబ్బులు రాకుండా ఉంటే?

    అయినా జనాల్లో ఇంత ఎమోషనల్ అటాచ్మెంట్ ఏంటండీ బాబో..

    బొల్లోజు బాబా గారూ, ఆయన ఎప్పుడు నింగికి ఎగరలేదు, ఎగిరినట్లుగా మోసం చేసాడు..శ్రీ శ్రీ గారి అంత గొప్ప కవిత ని, ఇలాంటి కార్పోరేట్ మోసగాళ్ళకీ, నీచులకీ వర్తించేట్లుగా రాయడం మీకు భావ్యమా?.

    అన్నింటి కన్నా నాకు షాక్ ఏంటంటే, 108 స్కీం లో డబ్బులు, బిల్ గేట్స్ ఎయిడ్ ప్లాన్ నుంచి వందల కోట్లు కొట్టేసినట్లుగా వస్తున్న ఆరోపణ. అది నిజమయితే కనుక, భగవంతుడా…పాపం శమించు గాక. ఒకరి కష్టార్జితమయిన ఎయిడ్ డబ్బుల్లోంచి తినేయడమనేంత నీచాన్ని ఎందుకు ఈ భూమ్మీద ఉంచాడీ దేవుడు అని నాకు చాలా భాధగా ఉంది.

  10. మేటాస్ కంపెనీలను కొన్నట్టు , డబ్బు ఇవ్వకుండానే ఇచ్చినట్టు పుస్తకాల్లో చూపించి లోటుని పూడ్చే ప్రయత్నాన్ని నేనూ హర్షించను. ఇది 100 శాతం స్కామే!

    సత్యంలో పని చేస్తున్న వాళ్ళకి, పని చేసి ఉన్న వాళ్ళకి ఆయనతో ఎమోషనల్ అటాచ్మెంట్ ఉండటం సహజం కాదా కుమార్ గారూ? మా వారి ఫ్రెండ్ ఒకరు పదమూడేళ్ళ బట్టీ సత్యంలో ఉంటూ నిన్న సాయంత్రం ఫోన్ చేసి జరిగిన మోసాన్ని ఒక పక్క అంగీకరిస్తూనే “రాజుగారికా ఇలాంటి పరిస్థితి రావాలి, ఆయన తన షేర్లన్నీ తాకట్టు పెట్టి కూడా సత్యాన్ని కాపాడలేకపోయాడే” అని దాదాపు ఏడ్చాడు.

    నాకు రామలింగ రాజంటే హీరో వర్షిప్పే! మోసం జరిగిందని ఆయనే స్వయంగా చెప్పినా, ఒక్క రోజులో ఆ భావాన్ని తెంచుకోలేకపోతున్నాను. ఇంకో విషయం..మేటాస్ ఇన్వెస్టర్స్ లో నేను కూడా ఉన్నాను. అయినా సరే, ఆయన్ని తిట్టడానికి నాకు ఇంకొంచెం టైం కావాలి!

  11. సుజాత గారూ,
    సత్యం లో పని చేసే వాళ్ళ భావాలు నేనర్ధం చేసుకోగలను. 13 యేళ్ళలో ఒక రకమైన ఆరాధన భావం నిండి పోయి ఉంటుంది కాబట్టి, అర్ధం చేసుకోవచ్చు.

    కాని బ్లాగుల్లో చాలా చోట్ల చూస్తున్నా..ఆయనో బలిపశువు అని!!, ఆయన కింద పడిపోయాడు పాపం అనీ, ఆయన చివరి వరకూ ప్రయత్నించాడు పాపం అలుపెరగని యోధుడూ అనీ..చాలా చోట్ల మన తెలుగు వాడు అన్న భావం, కొన్ని చోట్ల కుల గజ్జి కూడా కనబడింది. (ఇంకా కొన్ని చదివా ఆయన కులాభిమానం, లాస్ట్ నేం ఆయందే అయి ఉంటే, పుట్టిన ఆడపిల్లలకి ఒక లక్ష రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేసే స్కీం ఉందంట!!!)

    మీ వారి ఫ్రెండ్ మాటలే చూడండీ..”రాజు గారికా!!!ఇలాంటి పరిస్థితీ, తన షేర్లు అన్ని తాకట్టు పెట్టి కాపాడుదామనుకున్నడే!!!”

    Jesus Christ!.

    ఆ షేర్లు అమ్మినప్పుడు, అవ్వి ఆర్టిఫిషియల్ గా, చాలా హై ప్రైస్ లో అమ్మినట్లు లెక్క. అంటే కొన్న వాళ్ళు ఎప్పుడో ఒకప్పుడు నెత్తిన కొంగేసుకొని పోతారని ఆయనకూ తెలుసు..అంటే ఆయన ఇంట్లో ఉన్న పెంట ని, మనందరి ఇళ్ళల్లోకీ క్లాసిక్ గా డిస్త్రిబ్యూట్ చేయడమన్న మాట. దాంట్లో “త్యాగం” ఉన్నట్లు ఈ జనం మాట్లాడ్డమేంటీ. ఇంత తెలివి తక్కువ తనం జనాల్లో ఎప్పట్నుంచీ వచ్చిందీ.

    Yes, the Hero worship. That’s exactly what I am objecting to Sujata gaaru, even after we know what he has done.

    Thanks for your response.. I feel your pain. I don’t mean to be “mean” with you.

  12. నేను రామలింగరాజు గారిని ముఖస్తంగా రెండు సార్లు కలుసుకున్నాను. మొదటిసారి, అయిదేళ్ళ క్రితం, హార్వర్డ్ యూనివర్శిటీలో మేమిద్దరమూ ఒకే కాన్‌ఫరెన్సుకి హాజరయినప్పుడూ, రెండేళ్ళ క్రితం హైదరాబాదులో ఆయన ఆఫీసులోనూ. బైర్రాజు ఫౌండేషన్ వారు ఆంధ్రప్రదేష్ లో ఉడతా భక్తిగా సత్కార్యాలు చేస్తున్నారు. మనిషి పైకి కంగ కుండా, “రాజా” లా కనిపించినా లోపల ఇంత అగ్ని పర్వతం రగులుతోందని ఎప్పుడూ అనుకోలేదు. కాగా, సత్యం ని ఎన్‌రాన్ తో పోల్చటం సరి కాదనిపిస్తోంది. ఎన్‌రాన్ అధికారుల నోటి నుండి జరిగిన విషయం ఊడబెరకటానికి విశ్వప్రయత్నం చెయ్యవలసి వచ్చింది; రాజు గారు తప్పు జరిగిపోయిందని బహిరంగంగా ఒప్పుకున్నారు. “తప్పు జరిగిపోయింది, నేను శిక్షార్హుడనే” అని ఒప్పుకున్న ఒక అమెరికన్ CEO ని చూపించండి. ఒక పక్క మనందరినీ ముంచేస్తూనే వారు మాత్రం మిలియన్లు దాచుకుని సుఖపడ్డవాళ్ళు ఎంతమంది లేరు. భోపాల్ లో జరిగిన ఆఘాయిత్యానికి Anderson మాటవరసకి “sorry” అన్నాడా? ఇదే అమెరికాలో జరిగుంటే రామలింగరాజు గారికి బదులు ఆయన లాయరు మాట్లాడి ఉండేవాడు. నేను రాజు గారిని సమర్ధించటం లేదు, అలా సమర్ధించవలసిన అవసరం కూడా లేదు. ఈ సంఘటనని మరొక కోణం నుండి చూస్తున్నాను, అంతే.

  13. “ఒక పక్క మనందరినీ ముంచేస్తూనే వారు మాత్రం మిలియన్లు దాచుకుని సుఖపడ్డవాళ్ళు ఎంతమంది లేరు”
    ఇప్పుడు ఈయన మిలియన్లు దాసేసుకోలేదు అని చెప్పగలరా?. వాళ్ల తనయుడు కంపెనీ కి అన్ని డబ్బులు ఎక్కడ నుండి వచ్చినాయి అనుకొంటున్నారు. Foundation పెట్టి ప్రజాసేవ అంటున్నరు, దావూద్ లు, లక్షర్ తోయిబాలు కూడా ప్రజాసేవే చేస్తుంటారు అని వాళ్ల అభిమానులు కూడా అంటారు. ఒప్పెసుకొందామా. అయ్యొ పాపం అందామా. మంచి ముసుగేసుకొని ఇంత మందిని ఇన్ని ఏళ్లు ఎలా ముంచగలిగాడు, తను ముంచుతుంటే ప్రక్కన ఉన్న వంద మాధిగలు (రాం మైనంపాటి లూ, A.S. మూర్తులూ) ఎలా ఉన్నారో అని బాధపడక, ఆయన మీద జాలి ఏమిట్) నాకు మాత్రం అర్ధం కావటం లేదు.

    P.S. రాం మైనంపాటి, A.S. మూర్తి నాకు కొన్ని ఏళ్లు క్రితం బాగా పరిచయస్తులే.

  14. రావ్ వేమూరి గారూ,
    మీ విలువైన వ్యాఖ్యకి ధన్యవాదాలు. మీ కోణం లోంచి చూట్టం తప్పు అని అసలక్కడ అలాంటి కోణమే లేదూ, ఉండకూడదూ అని నేననుకుంటున్నాను.

    1. అమెరికాలో లాయర్ మాట్లాడేవాడా!! మర్చిపోయారా..Enron, Global Crossing, Qwest Communications, MCI Worldcom ఇంకా అలాంటి కంపెనీ లనీ, వాళ్ళకు సహాయ పడ్డ కన్సల్టింగ్ కంపెనీల CEO/CFOలనీ, Executivesనీ almost బట్టలూడదీసినట్లుగా, ఓపెన్ గా టి వి లో, C-SPANలో ప్రత్యక్ష ప్రసారం చేస్తూ grilling చేసిన రోజులు మర్చిపోయారా.. Years 2001/2002. And all of them were prosecuted later. Quite a few of big fish are behind bars today.

    మరి ఇప్పుడు మీరు చెప్పగలరా, రాజు గారిని ఏ చట్ట సభ ప్యానెలో టి వి లో గ్రిల్లింగ్ చేస్తూంటే, భారత ప్రజలు అందరూ ఆయన సమాధానలు వినే అవకాశం వస్తుందని!! ఎప్పుడైనా అలాంటివి చూసామా మన దేశంలో.

    2. ఆహా.. మీరు ఆయన తప్పుని ఒప్పుకున్న వైనాన్ని భలే చిత్రీకరించారు. ఆయనలో ఉన్న అంతరాత్మ నిద్ర మేల్కొని, జరిగిన దానికి ప్రాయశ్చిత్తం కోసం, వాలంటరీ గా పనిష్మెంట్ అడుగుతున్నట్లుగా..

    ఇప్పుడు ఆయన మిగతా వాళ్ళందర్నీ పక్కన పెట్టి, నా ఒక్కడిదే తప్పు అని రాయడం, అదో పెద్ద స్ట్రాటజీ అని, దీని పర్యవసానాలు ఎంత దూరం ఉంటాయో, తరువాత జరిగే గేం ప్లాన్ ఏంటో, దాంట్లో ఎవరు ఏ ఏ పాత్రలు పోషించాలో, ఆ యా పాత్రధారులకు అన్ని ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళిపోయి మరీ ఈ నాటకం జరుగుతోంది అన్నది అర్ధం చేసుకోవడానికి, ఎక్కువ దూరం ఆలోచన అక్కర్లేదు. అన్నీ తెలిసిన మీరు, ఇదేదో హృదయాంతరాల్లోంచి వచ్చిన మార్పు అన్నట్లుగా జనాలకు చెపితే పర్లేదేమో కాని, మీరు అదే నమ్మితే నాకు చాలా ఆశ్చర్యం.

    ఇన్ని సంవత్సరాలు ఈ మోసాన్ని మొదలుపెట్టక పోవడమే కాకుండా, దాన్ని పెంచి పోషించిందీ, రెండు వారాల క్రితమే ఆయన కుమారుల మేటాస్ కి దొడ్డి దారిన ఆయన చేయాలనుకున్నవీ, షేర్ హోల్డర్స్ పడనీయకపోతే విరమించుకున్నదీ జగద్విదితమే. వరల్డ్ బ్యాంకు బాన్ చేసిన వైనమూ, అదయిన తర్వాత మేము బ్యాంకు ని సూ చేస్తామూ అని ప్రచారం చేసిన పుకార్లు మర్చిపోయారా.

    3. నొట్లోంచి మాట ఊడబెరకడం.: Hmm..ఈయనా ఓ నెల రోజుల క్రితం వరకూ మా కంపెనీ ధూం, ధాం అనీ, మా షేర్లు ఇంకా కొనండి అనంట్లుగా మాట్లాడిన వాడే.. ఎన్రాన్ కెనెత్ లే లాగా. అది ఉద్దేశపూర్వకంగా ఇంకొన్ని సన్సారాలని కూల్చడం కాదా?
    What amazes me Rao gaaru is that, as adults we all know that ‘we cannot justify one bad behaviour by pointing out to another bad behaviour”. I feel pained to see such a logic from elders like you.

    Thanks
    Kumar

  15. కార్పొరేట్ వ్యాపారాన్ని కుటుంబవ్యాపారంలా నడిపారన్నది తేటతెల్లం. మార్కెట్ విలువ పెంచుకోవడానికేతప్ప వ్యాపారనైతికతకు స్థానం కల్పించలేదనేది ప్రస్తుతం విదితం. మరి ఏవిధంగా రామలింగరాజును సమర్ధించాలో,సానుభూతిచూపాలో అర్థం కావటం లేదు. గొప్పోళ్ళు హత్యచేస్తే హత్య కాదంటే ఎలా?

  16. “చివరకు తేలిందేమిటంటే ఆయన ప్రయత్నమంతా సత్యం సంస్థను కాపాడడానికేనని ” అవునా, జనాల చెవుల్లొ అడయార్ మర్రిచెట్టు కనిపిస్తుంటే, ఇలానే చెప్పాలనిపిస్తుందెమో. సత్యం ను కాపాడాలనుకొనే వాడు అయితే, అసలు తప్పుడు లెక్కలే చూపే వాడు కాదు, ఒక వేళ చూపినా, నిధులు పుత్ర రత్నం కోసం మళ్లించేవాడు కాదు (పుత్ర రత్నానికి, వేల కోట్లు, సత్యం నించి కాకుండా, రావటానికి వాళ్లేమి “గాలి” జనార్ధన్ లు కాదు కదా).

    సరే ఇన్ని ఏళ్ల తరువాత, ఎదో ఒక చెట్టు క్రింద కుర్చుంటే, జ్ఞానోదయమై నది అనుకొంటే, మరి తమ కుటుంబ ఆస్తులు బయట వాళ్లకు అమ్మి లోటు పూడ్చవచ్చు కదా? ఎంత లెదన్నా డబ్బులు దారి మళ్లించి పెట్టిన తిర్గతిప్పిన satyam కొన్ని వేల కోట్లు విలువ చేస్తుంది కదా? దాన్ని తనే కొని చేసిన తప్పును ఇంకో పెద్ద తప్పుతో, పూడ్చాలను కొన్నడే కాని, తప్పుకు ప్రాయ చిత్తం గా, బయట వాళ్లకు అమ్మి, ఆ డబ్బులు తీసుకు వచ్చి లోటు పూడ్చాలనుకోలేదే?

    మరి తప్పులు చేసి, తప్పుకుంటున్నవాడు, నిజంగా జ్ఞానోదయమై తే, వేరే వాళ్ళను (కాస్తో, కూస్తో నిజాయితీ ఏడ్చిన వాళ్లు) కాకుండా, తన బంటు లాంటి, రాం మైంపాటి & కంపెనీని కాపలాదురులు గా నియమించి మరీ పోవటమేమిటి? పోతూ పోతూ ఇన్నళ్ళు జరుగుతున్న తప్పులు కు, వంత పాడిన కాపలాదారులకు క్లీన్ చిట్ ఇవ్వడం ఏమిటి?

    పైన అన్నిటి కంటే, నన్ను బాధిస్తుంది ఏమిటి అంటె, ఇన్ని తప్పులు చేసిన ఆయన మీద మన జనాలలో ఉన్న హీరో వర్షిప్. అందుకనే అనుకోవాలేమో మనలని మనం గొఱ్ఱెలమని.

    @కుమార్ గారు, వేమురి రావ్ గారి కామెంట్ చూసి, ఆయనకు రాజు మీద ఉన్న సానుభూతి చూసి, మీకు కలిగిన ఫీలింగ్ లాంటి దే, నాకు కలిగింది. పెద్దలు, ప్రపంచాన్ని ఎక్కువ చూసిన వాళ్లె ఇలా తప్పు చేసిన వాళ్ల మీద సానుభూతులు కురిపిస్తుంటె, ఇక మిగతావాళ్లను అనుకొని లాభం ఏమిటి అనిపిస్తుంది. ఎంతైనా బేసిక్ గా మన నైజం జాలిగుణం ఎమో?

  17. నాకూ సత్యం షెర్లు వున్నయి నా పాత కంపెనీకి ఇంకా 14 లక్షలు రావాలి , సత్యం చెసినది తప్పే ,నమ్మక ద్రోహం ! కానీ నా టపా వుద్ధేశ్యము ఈ ఓవర్ యాక్షన్ మీద, ఇంతా కాలం చెక్క భజన చేసుకొంటూ కూర్చోన్న వారు ఇప్పుడే కళ్ళు తెరిచారా ! సత్యం రామలింగ రాజు గారు చేసేది వ్యాపారమే దేశ సేవ ఎమాత్రం కాదు అస్లు ఆయ్న వచ్చిందే రియల్ ఎస్టేటు కుటుంబనేపద్యం నుండి వారి వృత్తే గోరంతలు కోడంతలు చేసి చూపించటం
    ,కానీ ఈ జనాలు చెపుతున్నట్లు తలదించుకోవాలసిన తీవ్రమయిన పనులు ఎమిచేసాడు ?
    తీవ్రమయిన నస్టాలు వుంటే విపరీతమయిన లాభాలు చూపిచేవాడా .ఒక వేళ లెక్కలు తప్పు అనుకోంటే ఈ ప్రపంచంలో అంతఖ్చ్చితంగా ఎవరున్నారు వున్న ఆస్తులను ఎక్కువగా చూపించి కోట్లాను కోట్లు నిధులు కాజేసే ఈ ప్రభుత్వాలు ,కంపెనీలు కోకోల్లలు . ఇంత తెగాడుతున్నమే మనకు ప్రపంచబ్యాకుకు అత్యదిక మెత్తం అప్పుపడ్డ అమెరికా గోప్పదా , నియంత్రణా దోరణితో ఎక్కువ లాభ శాతంతో అమ్ముకోనే బిల్ల్ గేట్ గోప్పవాడా, ఎవరు గోప్ప అందరూ గురివింద గింజలమేకదా ఇప్పుడు అందరి కళ్ళు చల్ల బడ్డయికదా కంపెనీ వునికే ప్రమాదంలో పడినది మెన్న నారాయణ మూర్తి గారు సెలవిచ్చారు ”
    We will not touch tainted co like Satyam”

    infrant there is a crocodile festival.

  18. @కాశ్యప్: వరుస విజయాలు సాధిస్తున్నప్పుడు అవకతవకలున్నాయేమో అని ఎవరైనా సందేహిస్తే లేక ఆ possibility ని ఆపాదిస్తే అలా ఆపాదించేవారిని cynics అని కొట్టిపడేస్తారు. మీడియాకూడా popular trend కు వ్యతిరేకంగా ఇటువంటి “అనుమానాలకు”స్థలాన్ని,సమయాన్నీ కేటాయించవు. In some corners there were always whispers about Satyam and its model of corporate governanace.

    “ఈ జనాలు చెపుతున్నట్లు తలదించుకోవాలసిన తీవ్రమయిన పనులు ఎమిచేసాడు ?” అని మీరు ఇంత గఠిగా ప్రశ్నించడం చూస్తుంటే ఈ విధమైన వ్యాపారధోరణిని జీర్ణించుకున్న consumerist కొత్త తరానికి ప్రతినిధిగా అనిపిస్తున్నారు. వ్యాపారంలో బ్యాలన్స్ షీటు కిమించిన విలువలు కొన్ని ఉన్నాయి. అవిలేకే ఈ పరిస్థితితప్ప మరోటి కాదు. ఇంత రార్ధాంతం జరుగుతున్నా ఏ ఒక్కరన్నా ఈ విధమైన possibility ని infosys కి అంటగట్టగలరా? దానికున్న ఒకేఒక్క కారణం వారు demonstrate చేసిన వ్యాపార నిబద్ధత corporate governance and transparency.

    ఇక, ఎవరూ గొప్పకాదుకాబట్టి మోసం చేసినా తప్పుపట్టకూడదనే మీ వాదన ఎంత హీనమైనదో మీరే ఒకసారి చదివి బేరీజు చేసుకోండి.

  19. నా వాదం ” ఎవరూ గొప్పకాదుకాబట్టి మోసం చేసినా తప్పుపట్టకూడదనే ” పిడి వాదంకాదు ఖచ్చితంగా తప్పు తప్పే కానీ దాని తీవ్రత పూర్తిగా ఆయా పరిది బట్టి వుంటుంది, consumerist దోరణికి ప్రతినిదిని అన్నరు ఎమో నా చదువు,వృత్తి నన్ను అలా మార్చివుండవచ్చు .ఇక పోతే విలువల గురించి నాకేమో చిన్నపడినుండి ఈ విలువలు పూర్తి అసంబద్దంగా కని పిస్తున్నాయి నేను చిన్నప్పుడు నేర్చుకోన్నా కోన్ని విలువలు పెద్ద వాడిని అయ్యే సరికి విలువ లేంకుండా కనిపించసాగాయి,వాటి స్తానం లో వాటికి విరుద్దమైనవి విలువలుగా మారాయి,పాత విలువ ఎందుకో నేను ఎదగటాని (ఆర్దికంగా /మానసికంగా) దోహద పడలేదు. ఇంకా Infosys హి హి.. మాలాంటి వెండర్ లేదా
    ఎవర్నన్నా ఇన్ఫఫోసియన్ ను అడగండి ఉద్యోగులని ఎకానమీ క్లాసులోపంపి బిసినెస్ క్లాసుకు బిల్లు పెట్టేవారేనా, 30 లక్షల ప్రాజక్టులు కూడా బిడ్ చేస్తూ “మేము భారతదేశం లో కోత్త కంపెనీన ఎదుగుదలకు,Entrepreneur కు దోహద పడతాము” అని చెప్పుకోనేవారేనా .. ఇంకా నా software లో భోలెడు బగ్గులు రావచ్చు కానీ మీరు మాత్రం ఆ నమ్మకంలేని free software కాకుండా వేల కోట్లు పోసి కోనుక్కోమనే ఈ పేరుమోసిన కంపెనీలా ..

  20. అయ్యా బాబు! రామలింగరాజు నిజం(అబద్ధం) చెప్పి జనాల పుట్టె ముంచాడు.ఓ క్వార్టరు లాస్స్ చూపిస్తేకుడా జనాలు బయటికి వచ్చేవారు. మార్కెట్ ఫోర్సెస్‌లో జనాలు అడ్జస్ట్ అయ్యేవారు.

    తప్పులెక్కలు చూపించింది స్కాం కాదు మహా ప్రభో!
    ఇలాంటి కంఫెషన్ లెట్టర్ రాయడామే పెద్ద స్కాం!.

    అలాంటివి ఇంకా చాలా బిజినెస్స్‌లలో ఉంటాయి.దానివల్ల నష్టం లేదు.ఇంత కరప్ష్న్‌లోనూ, క్రైంలోనూ జనాలు బతికేయట్లేదా!.అలాగే ఎదో ఈ షేర్లు CNBC,NDTV న్యూస్ లతో పెరుగుతూ తరుగుతూ ఉండేవి.

    సొంత ఆస్తులు లేనట్టు చూపిస్తారు కానీ, మొత్తం ఆస్తులన్ని జప్తు చేసి వాటాదారులకు పంచేస్తే, లేకా కంపెనీ లిక్విడిటీ కోసం ఇచ్చేస్తే, జనాలు ఇంతలా నష్టపోరు.

    ఇంకొంచం సంయమనంతో ఆ ఫిక్టిషియస్ అస్సెట్స్‌ని, ఆ డీల్‌తోనో , మరోలానో మార్చి ఉంటే జనాల డబ్బులు ఇలా ఉన్నపళాన ఆవిరై పోక పోవును.

    జీతాలు ఇవ్వలేం, వెళ్ళి దేశ సేవ చేయండని మరో కంపెనీ చెప్పింది. అలా ఎదో చేసుండొచ్చు. ఇదే మార్గం అంటే నేన్నమ్మను.

    వందకోట్లు జనాలనుంచి దొబ్బేసి 10 -15 ఏళ్ళయింది. తరువాత కాలంలో ఆస్థులంతకంటే పెరిగాయి. ఏ! కనీసం మానవత్వానికి జనాల మూల ధనం తిరిగిచ్చేయ్యొచ్చుగా!! ఇవ్వలేదే, ఇవ్వాళ్ళ కూడా ఆసుపత్రి నుంచి లీగల్ బాటల్ నడిపిస్తున్నాడు ఓ ప్రబుద్ధుడు.

    రామలింగరాజు చెప్పింది నిజమూ అబద్ధమూ కూడానూ.
    ఇవాళ రాలిపోవటం తప్పు కాదు. బొల్లొజు బాబాగారి శ్రీ శ్రీ కొటేషన్ కరెక్టే. ఆ చూసే “వీరే”లో నెనొకడిని.

  21. కుజ, గురు, శుక్ర, మహా శని గ్రహాలు ఆంధ్ర దేశమునకు అనుకూలంగా లేవు. శాంతులు, పూజలూ, యాగాలు చేసి గ్రహ చలనాన్ని మార్చితే తప్ప మన దేశం బాగు పడదు. అందుకు ప్రతి వోక్కరు తమ తమ శాయ శక్తులా కృషి జరపాల్సిన ఆవశ్యకత మెండుగా ఉన్నది. రామలింగ రాజు కూడా మహా వానర యాగం చేస్తే ఫలితం తప్పక ఉంటుంది. మరి ఈ విషయం ఆయనకీ చేరేదేట్లా??

  22. రామ లింగ రాజు మోసం చేసానని స్వయం గా ఒప్పుకున్నాక కూడా, అతని మీద ఎందుకు అంత జాలి, ప్రజలకి? ప్రజలని మోసపరచి, డబ్బులు దోచుకొనేవాళ్ళు కూడా కొన్ని పుణ్యాలు చెస్తారు. ఉద్యొగాలివ్వడం, పల్లెటూళ్ళలొ మంచి నీళ్ళు ఇవ్వడం, తిరుపతి కి వెళ్ళడం లాంటివి. దొంగల దగ్గిర పనిచెసే వాళ్ళకి కూడా స్వామి భక్తి ఉంటుంది కదా !! అమాయకులై న ఉద్యోగులకు ఇది ఒక శ్రుంగ భంగం…. కోలుకోడానికి కొంత సమయం పడుతుంది.

    ఇంత మోసం జరుగు తున్నా, ప్రభుత్వం, ఆడిటర్లు ఏం చేస్తున్నారొ, ఇన్ని రోజులూ? రాజే స్వయం గా చెపితే గానీ, ఎవరికి తెలియలేదు… ఎంత చిత్రం??

    రామ చంద్రుని మనొ ధర్మం

  23. రామలింగ రాజు మీద జాలి కాదు, అభిమానం! పొరపాటు జరిగిందన్నాడు గానీ మోసం చేసాననలేదు ఆయన. అభిమానం ఎందుకంటే

    సత్యం ఒక అగ్రగామి ఐటీ సంస్థగా ఒక్క రోజులో ఎదగలేదు. 66 దేశాల్లో విజయవంతంగా నడవగలిగిదంటే దాని వెనక రాజు గారి అకుంఠిత దీక్ష, కార్యనిర్వహణ లేవా? 53 వేల మంది ఉద్యోగుల జీవన మార్గం సత్యం. బైర్రాజు ఫౌండేషన్ పశ్చిమ గోదావరికి చేసిన సేవలు ఏ ప్రభుత్వం చేసిందో చెప్పండి? ప్రై వూరికీ మంచి నీరు, ప్రతి ఊళ్ళో మోడల్ స్కూలు! ఈ రోజు రాజు కి పట్టిన గతికి పశ్చిమ గోదావరి ప్రజలు విల విల లాడిపోతున్నారు. వారికి ఆయన దేవుడు. అత్యుత్తమ అవార్డులెన్నో ఆయన్ను కోరి వరించాయి.

    ఈ కుంభకోణం వెనక ఆయన కాక మరెవరో ఉన్నారు. అది స్పష్టం. అది ఏ స్థాయి వారన్నది రాజు కే తెలియాలి.వారిని కాపాడటానికి ఆయన ఎందుకు ప్రయత్నిస్తున్నారో ఆయనే చెప్పగలరు. ఆయన కృషి బాంక్ వెంకటేశ్వర రావు లాగా పారిపోలేదు. చార్మినార్ బాంక్ ఛైర్మన్ లాగా ఆత్మహత్యా చేసుకోలేదు. చట్టానికి లొంగి నిలబడ్డారు.

    ఇక షేర్ హోల్డర్ల సంగతి! షేర్లు కొనడం అన్నది ఒక బిజినెస్. ఇకా చెప్పాలంటే ఒక జూదం! అందులో లాభాలే కాదు, నష్టాలూ ఉంటాయని తెలిసే దిగుతారు జనం. లాభాలొచ్చినపుడు దిగమింగి, నష్టాలొచ్చినపుడు సంస్థ మీద పడటం సబబా?

    ఇంతవరకూ PWC ని ఎవరూ ప్రశ్నించలేదు. ఇది వింత కాదూ?

    సత్యం, సత్యం ఉద్యోగులు కట్టిన ఇంకం టాక్స్ వల్ల ప్రభుత్వానికి వేల కోట్ల ఆదాయం లభించింది.ఇప్పుడు సంస్థని ఆదుకుని ఉద్యోగులు వీధిన పడకుండా చూడాల్సిన బాధ్యత ప్రబుత్వానిదే!

    మనదొక మాస్ మెంటాలిటీ! ఆరోపణ రాగానే రాళ్ళబుట్ట పక్కన పెట్టుకుని వరసగా విసరడమే! అదే రాజు ఉన్నత స్థితిలో ఉన్నపుడు అందరూ ఆయన్ను తెలుగు జాతి గర్వించదగిన వాడుగా అభివర్ణించారు. ఇప్పుడు ఇది ఎలా జరిగిందో, దీని వెనక ఎవరున్నారో తెలుసుకునే ప్రయత్నం చేయకుండా..దుమ్మెత్తి పోస్తున్నారు. ఇప్పటికైనా దీని వెనక ఎవరున్నారో(ఇంత స్కాం ఒకే ఒక్కడు చేస్తాడంటే ఎలా నమ్మాలో మరి) ఆయన చెపితే బాగుండు!

    నాకు తెలిసి ఉద్యోగులెవరూ శృంగభంగం జరిగిందనుకోవడం లేదు. సత్యం ఫామిలీ గా ఐక్యతతో నిలబడాలనే కోరుకుంటున్నారు.

  24. ఆల్ ఖైదాని ప్రపంచవ్యాప్తముగా విస్తరించిన బిన్ లాడెన్ కి, తన అండర్ వరల్డు సామ్రాజ్యాన్ని దేశదేశాలలో దిగ్విజయంగా నడుపుతున్న దావూద్ ఇబ్రహిం కి కూదా అంకుటిత దీక్ష,మొక్కవోని కార్యదీక్షత ఉన్నాయ్.జేజేలు కొడదామా!

    సత్యం రాజు గారు, తన కొడుకు తేజా రాజుమీద గుడ్డిపుత్ర వాత్యల్యం తో(ధ్రుతరాష్ట్రుడిలా),తేజా అత్య్యాశకి,జగన్ గాడి అవినీతి కి సత్యం ని, నమ్ముకున్న ఉద్యోగుల,ఇన్వెస్టరుల నమ్మకాన్ని తాకట్టు పెట్టారు. రాజు గారు పొరపాటు చెయ్యలెదు,ద్రోహం చేసారు.చాలా తేడా ఉంది. పొరపాటు చేస్తే ఇప్పుడైనా మూలకారణాలను, వెనుక వున్న అవినీతి దౌర్భాగ్యులను బయటపెట్టి తెలుగు జాతికి మేలు చేసెవారు.
    -నేనుసైతం

  25. ఇప్పుడే ఎకనామిక్ టైంస్ లో చదివొస్తున్నా.
    రాజు కు సపోర్ట్ గా, తెలుగు చానెల్స్ లో ఎస్ ఎం ఎస్ రూపం లో ఆయనకు విపరీతమయిన సపోర్ట్ లభిస్తోందీ అని. ప్రజలు ఆయనంటే సానుభూతి వ్యక్త పరుస్తున్నారూ అనీ, ‘Politicians..we don’t vote for you, we love Raju” అనీ, ‘He let us down, but he is not a criminal” అనీ,
    దాంతర్వాత, ఇంకా నాకు తెలీని విష్యాలు చాలా చదివొస్తున్నా.. అందులో ఆరోపణలెన్నో, నిజాలెన్నో నాకు తెలీదు. పైన సుజాత గారి కామెంటూ చదివా.
    అన్ని చదివిన తర్వాత, నాకు నిఝంగా చాలా బాధేసింది. ఐ కుడ్ ఫీల్ ఇట్ ఇన్ హార్ట్.

    రెండు విషయాలు నన్ను బాగా బాధపెడుతున్నాయి.
    1. సమాజం ఏ మూల స్తంభాల మీదయితే నిలబడిందో, ఆ నాలుగు మూలల్లో, మూడు మూలాలు, ఒకదానితో ఒకటి కుమ్మక్కై జనాలని ఇంత అవలీలగా మోసం చేస్తుంటే, సామాన్య మనుషులం మనం ఎవర్నీ నమ్మాలీ, ఇంత అపనమ్మకంతో ఎలా బతకాలీ అని కళ్ళల్లోకి నీళ్ళొచ్చాయి. ఇక్కడా అమెరికాలో గత ఆరు నెలల్లో మొత్తం ఆర్థిక వ్యవస్థ మీదే నమ్మకం పోయే సంఘటనలు ఎన్ని జరిగాయో. మాడాఫ్ అనే పెద్దాయన ఇక్కడ ఇంచుమించు ఏభై బిలియన్ డాలర్ల కుంభకోణన్ని మాకందరికీ రుచి చూపించాడిక్కడ. అతనొక్కడే ఎలా చెసాడా అని జనాలు ఇంకా ఆరా తీస్తున్నారు.

    2. పైన తెలుగు చానెల్స్ లో సర్వేలు, ఇక్కడ జనాల అభిప్రాయాలు, నేనభిమానించే సుజాత గారి మాటలు చూస్తా ఉంటే, బాధ మరింత ఎక్కువయ్యింది.
    ఔరా..జనం. “సిటిజన్ కేన్” సినిమాలో ముఖ్యపాత్ర ఓ చోట అంటుంది. జనాలు ఏమనుకుంటారూ అని ప్రశ్నించినప్పుడు…’People think what we want them to think” I know very well what they want to think about me అన్నట్లుగా..

    ఎందుకండీ ఇంత బేలతనము, ఇంత పిచ్చి తనమూ..
    సో, 8 కోట్ల జనాభాలో, కేవలం ఒక్క అమ్మాయి మీద ఆసిడ్ పోసినందుకు, వాళ్ళని ముక్త కంఠంతో చంపాలని ఆవేశపడ్డ ఈ జనం, చంపిన తర్వాత “న్యాయం” జరిగింది!! అని చప్పట్లు కొట్టిన ఈ జనం..ఈ రోజు కార్పొరేట్ చరిత్రలోనే అతి పెద్ద మోసం చేసి, కొన్ని వేల/లక్షల మంది కడుపు కొట్టిన ఈ మోసగాణ్ణి, క్రిమినల్ కాదు, తను మంచి వాడు అని కన్నీళ్ళు పెడతా ఉంటే, నాకు విషాదంతో కూడిన ఒక నిస్ప్రుహ ఆవరిస్తోంది.
    ఇంత తేలికా జనాల అభిప్రాయాలని ప్రభావితం చేసేది!! కేవలం కొన్ని మంచి పనులు, అదీ బాగా మార్కెటింగ్ చేసుకొని, వెనకాల అదే ప్రజల కడుపు కొడతా ఉంటే…

    All that matters is the presentation..who cares about the content అన్న సూత్రం ఇంత గ్రాండ్ స్కేల్ లో నిరూపితమవుతా ఉంటే..దేవుడా ఏంటీ దుస్థితి, ఇంతేనా నా మనుషుల మానసిక స్థితి అని వాపోతున్నాను.

    పైనెక్కడో, షేర్ మార్కెట్ అనేదే ఓ గాంబ్లింగ్ అనీ, డబ్బులు పోవచ్చు అంటా ఏదో చదివా..
    షేర్ మార్కెట్ గాంబ్లింగ్ కాదండీ, కసినో అనేది గాంబ్లింగ్. షేర్ మార్కెట్ కొన్ని నిర్ధుష్ట సూత్రాలకి లోబడి ఉంటుంది. దానికి కొన్ని నియమాలు ఉంటాయి. ఇన్ సైడర్స్ ట్రేడింగ్ చేయడానికి చాలా ఖశ్చితమయిన రూల్స్ ఉంటాయి. దాంట్లో ఉన్న సమాచారాన్ని ఆధారంగా తీసుకొని, ఇన్వెస్టర్స్ వాళ్ళ జడ్జ్మెంట్ ఉపయోగించి ఇన్వెస్ట్ చేస్తారు. వాళ్ళ దగ్గరున్న సమాచారన్ని, ఈ రాజు లాంటి వాళ్ళు మోసపూరితంగా తప్పుడు డాటా ఇచ్చినప్పుడు, దాన్ని మోసం అనే అంటారు, పొరపాటు అనరు. ఇన్వెస్టర్స్ తీసుకొనే కాలిక్యులేటెడ్ రిస్క్ చట్రాని ఆవల ఉండే మోసం అది. అంతే కాని, OH..investors took the risk, now that they lost their shirt, they can’t whine now అనేది highly ignorant statement.

  26. కుమార్ గారు, బ్లాగుల్లోనూ, పత్రికలలోనూ జనాల అభిప్రాయాలను చదివాక మీకు కలిగిన నిస్పృహ నాకూ కలుగుతోంది. మోసం కాదు పొఱపాటు అనే వాళ్ళకు, ఒకవేళ పొఱపాటే అనుకుందాం మరి జరిగిన వెంటనే ఎందుకు బయట పెట్టలేదు ఇన్ని సంవత్సరాలు ఎందుకు కప్పిపెట్టారు?తెలిసి ఇన్ని సంవత్సరాలుగా ప్రజలను మభ్యపెట్టారు కాబట్టి ఖచ్చితంగా రాజుగారు చేసింది మోసమే.ఇక ఆయన చేసిన ప్రజాసేవ గురించి మాట్లాడే వాళ్ళకు, నా దృష్టిలో మోసం చేసి సంపాదించిన సొమ్ముతో చేసే సేవలు నా దేశానికి అనవసరం. దీని బదులు చేసే వ్యాపారాన్ని నిజాయితీ గా నడపడమే దేశానికి ఆయనలాంటి వాళ్ళు చేసే నిజమైన ప్రజాసేవ.ఇప్పుడు ఆయన మీద సానుభూతి చూపిస్తున్న ప్రతి ఒక్కరికి, ముంబై లో జరిగిన దారుణం అప్పుడే మర్చిపొయారా?ఆ దారుణానికి కేవలం ఒక కోస్ట్ గార్డ్ లంచం తీసుకోవడమే అని టపాల మీద టపాలు రాసిన విషయం మర్చిపోయారా? కేవలం లంచమే కదా ఇది మన సమాజంలో అత్యంత సాధారణ విషయం కదా మరి ఆ కోస్ట్ గార్డ్ మీద అప్పుడు ఎందుకు సానుభూతి చూపించలేదు?చిన్నదైనా పెద్దదైనా, తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. ప్రతి తప్పునూ ఖండిద్దాం.

  27. అవును నేను కూడా కుమార్ గారితో స్నేహ గారితో ఏకీభవిస్తున్నాను. తప్పు ఎవరు చేసినా తప్పే. ప్రజాసేవ–తన ఆస్తులు అమ్మి ఏమైనా చేసారా ప్రజాసేవ, లేదే!

    నిజమే ముంబాయిలో ఉగ్రవాదుల దాడి మీద, వరంగల్ యాసిడ్ దాడి మీద అంత ఘాటుగా స్పందించిన మనం ఇక్కడ ఈయన దగ్గరకొచ్చేటప్పటికి ఇంత ఉదాసీనంగా ఎందుకు వుంటున్నాం.

    ఆయనని జైలుకి ఓ పెద్ద కారులో తీసుకెళ్లారు, చట్టం ముందు అందరూ సమానమేగా అదే ఓ సామాన్యుడికి కూడా ఇలానే మర్యాదలు చేస్తారా మన పోలీసులు. ఇక్కడే నాలాంటి సామాన్యులకి కడుపు మండేది.

    పోనీ ఇప్పుడు మోసం బయటపడ్డాకన్నా జరగాల్సిన విచారణ చట్టబద్దంగా జరుగుతుందా? జరగనిస్తున్నారా? జరగనిస్తారా?

    @సుజాత గారు, “ఆయన కృషి బాంక్ వెంకటేశ్వర రావు లాగా పారిపోలేదు. చార్మినార్ బాంక్ ఛైర్మన్ లాగా ఆత్మహత్యా చేసుకోలేదు. చట్టానికి లొంగి నిలబడ్డారు”-నిజమే చట్టం ఆయన జేబులో చుట్టం అయినప్పుడు చట్టానికి లొంగి కాదు చట్టం ఎక్కి మరీ నిలబడతారు, వాళ్లదేం పోయిందండి. ఎమోషనల్ అటాచ్మెంట్ ఉండటం సహజమే, దానిలోనుండి బయటపడటానికి కాస్త టైం కావాలిలేండి ):

    “ఇప్పుడు ఇది ఎలా జరిగిందో, దీని వెనక ఎవరున్నారో తెలుసుకునే ప్రయత్నం చేయకుండా..దుమ్మెత్తి పోస్తున్నారు. ఇప్పటికైనా దీని వెనక ఎవరున్నారో(ఇంత స్కాం ఒకే ఒక్కడు చేస్తాడంటే ఎలా నమ్మాలో మరి) ఆయన చెపితే బాగుండు!”

    అంటే ఇంత జరిగాక కూడ ఆయన్ని ఏమనకూడదంటారు, అంతేనా, సరే ఆ నిజాలేంటో ఆయన చెప్తే ఈ గొడవంతా వుండదు కదా!

  28. సుజాత గారు, రామలింగరాజు మోసం కాదు పొరపాటు చేసారు అనేది నిజం కాదు. తెలిసి, కావాలని చేసింది మోసం, నేరమే. అయితే ఈ మొత్తం ఉదంతంలో నూటికి నూరు శాతం తప్పులు కాకుండా మనకి కనపడే కొంత పాజిటివ్ అంశాల గురించి చర్చిస్తే బాగుండేది.
    1) లాభాలు ఎక్కువ చేసి చూపటం వల్ల అదనంగా వచ్చిన ప్రాజెక్టులు, కల్పించబడ్డ ఉద్యోగాలు, తద్వారా టాక్సులు రూపంలో ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం.
    2) ఇలా అదనంగా వచ్చిన డబ్బు ద్వారా బాగుపడిన కొంతమంది షేరు హోల్డర్లు, చిన్న మదుపుదార్లు
    3) ఇంకా వీటిద్వారా జరిగిన ఛారిటీ (గ్రామీణ ఐ.ఐ.టీ, మంచినీటి పధకాలు, 108 సేవలు, ఇంకా చాలా..)
    4) సత్యం ఉద్యోగులు తీసుకున్న లోన్ల ద్వారా లబ్ది పొందిన బ్యాంకులు

    ఇంకా చాలా ఉండిఉండవచ్చు. అయితే, ఈ 8000 కోట్ల సొమ్ము కేవలం ఊహాజనిత లాభాలా, లేక మళ్ళింపబడ్డ నిధులా అనే విషయం మీదే పైన పేర్కొన్న పాజిటివ్ అంశాలకు విలువ ఉంటుంది. సొంతఖాతాలో వేసుకున్నట్లైతే మాత్రం తీవ్రమైన నేరం. రామలింగరాజు జాలిపడటానికి ఏ మాత్రం అర్హుడు కాదు. అంతేకాదు, ఈ మొత్తం వ్యవహారం లో ఆడిటర్లు, సెబి పాత్ర కూడా తెలియాలి. సెబి ఇప్పుడే నిద్ర లేచినట్లుగా ప్రవర్తిస్తుంది. పర్యవేక్షించాల్సిన వారు, వాళ్ళ భాధ్యత సరిగా నిర్వహించకపోవటం కూడా తప్పే.

  29. >>>సత్యం ని ఎన్‌రాన్ తో పోల్చటం సరి కాదనిపిస్తోంది. ఎన్‌రాన్ అధికారుల నోటి నుండి జరిగిన విషయం ఊడబెరకటానికి విశ్వప్రయత్నం చెయ్యవలసి వచ్చింది; రాజు గారు తప్పు జరిగిపోయిందని బహిరంగంగా ఒప్పుకున్నారు.>>>

    మీ వాదన విచిత్రంగా ఉంది. మీరు మర్డర్ చేసి తప్పు జరిగిందని ఒప్పుకోండి. పోలీసులు మిమ్మల్ని వదిలేస్తారా?

  30. ఈ దేశాన్ని బాగు చేయడం దేవుడి తరం కూడా కాదు అన్న అర్థం వచ్చేలా ఈమధ్యనోసారి సుప్రీం కోర్టు అన్నట్లు పేపర్లో చదివాను. సత్యం ఉదంతమ్మీద విద్యావంతుల అభిప్రాయాలు చదివి, సుప్రీం కోర్టు అన్నదాంట్లో నిజం ఉందనిపిస్తోంది.
    రామలింగ రాజు క్రిమినల్. అది ఆయన ఒప్పుకున్నదే! మనం కొత్తగా కనిపెట్టాల్సిందేమీలేదు.
    ఆయన చేసింది అయ్యో పాపం అని జాలి పడాల్సిన నేరంగా చూస్తున్నామంటే, వ్యక్తి ఆరాధన ఏ స్థాయిలో ఉందో, నైతిక విలువల పట్ల సమాజానికెంత అవగాహన ఉందో అవగతమౌతుంది.
    అన్ని దారులు మూసుకు పోయి, ఇవ్వాళ కాకపోతే రేపైనా దొరికేది ఖాయమని తెలిసాకే, రాజు గారు ఆత్మ నివేదన చేసుకున్నారు. ఇడుపుల పాయ ఉదంతంలో మరో రాజు గారు ఇంచుమించు ఇలాగే అసెంబ్లీలో నివేదించుకున్న విషయం గుర్తుందా? బహుశా చాలా మంది మరచి పోయుంటారు. ఈ రాజుగారి లీలలూ అంతే.
    ఆవేశం ఆలోచనల్ని మింగేసినప్పుడు, మన కడుపులో చల్ల కదలకుండా ఉన్నప్పుడు, ఎల్లాంటి నేరస్తులనైనా సమర్ధిస్థాం. వీలైతే అంబారీ అందలాలు ఎక్కించి, అంకుశాలను చేతుల్లో పెడతాం.

  31. >>>
    ఆయన చేసింది అయ్యో పాపం అని జాలి పడాల్సిన నేరంగా చూస్తున్నామంటే, వ్యక్తి ఆరాధన ఏ స్థాయిలో ఉందో, నైతిక విలువల పట్ల సమాజానికెంత అవగాహన ఉందో అవగతమౌతుంది.
    >>>

    బ్యాంకు డాక్యుమెంటులు ఫోర్జరీ చెయ్యడం తెలియక చేసిన తప్పు కాదు. అలా ఫోర్జరీ చేసి తప్పు ఒప్పుకుంటున్నట్టు దొంగ నాటకాలు ఆడేవాడు గొప్ప సంఘ సేవకుడట?

  32. రామలింగ రాజుకి జైల్లో చికెన్ తో ఆహారం పెట్టారట. డి.జి.పి. ఈ విషయం తెలిసి “అలా పెట్టొద్దు, దాని వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ కి చెడ్డ పేరు వస్తుంది” అని పోలీసులకి ఆదేశం జారీ చేశాడట. మద్దిలచేరువు సూరికి జైల్ లో స్వీట్లు, జీడి పప్పు కూడా పెట్టారు. అప్పుడు మాత్రం డి.జి.పి.కి పోలీస్ డిపార్ట్మెంట్ పరువు గురించి గుర్తు రాలేదు. సూరి రాష్ట్రంలో పేరు మోసిన క్రిమినల్ అయితే రామలింగ రాజు అంతర్జాతీయ క్రిమినల్. క్రిమినల్స్ ని డబ్బుని చూసి ఆరాధించే హీనమైన స్థితిలో ఉన్నారు మన చుట్టూ ఉండే అమాయకులు. డబ్బున్న వాడు ఎంత మందిని మోసం చేసి ముంచినా ఫర్వా లేదు. మన లాంటి వాళ్ళు మాత్రం నిజాయితీగా డబ్బున్న దొంగలని గౌరవించాలి అనడం మనకి ఏ నాగరికత నేర్పింది?

  33. కుమార్ గారు,
    మీ వ్యాఖ్య కొంచెం ఆలస్యంగా చదివాను. రామ లింగ రాజు నిజంగా మోసం చేసి ఉంటే, ఆయన శిక్షార్హుడే! ఇంతమంది ప్రజల్ని, వాటాదారుల్ని కేవలం కొడుకుల మాట వినో, మరో రకంగానో తప్పుడు నిర్ణయాలు తీసుకుని మోసం చేసి ఉంటే తప్పక శిక్షించాల్సిందే! నేరస్థుల్ని సమర్థించి నేరస్థురాలిని కాలేను కదా!

    ముందే చెప్పినట్టుగా, ఆయన క్రమశిక్షణ, మేథస్సు,వంటి వాటిమీద అభిమానం ఉండటం వల్లనో, బైర్రాజు ఫౌండేషన్ వంటి సంస్థల సేవలను స్వయంగా చూసి ఉండటం వల్లనో, రాజు ఇలాంటి పనికి పూనుకున్నారంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను, ఒక పక్క అక్రమ డాక్యుమెంట్స్ బయట పడుతున్నాయని తెలుస్తున్నా కూడా!

    అయితే ఇది ఎవరో అన్నట్టు, కేవలం ఆయన ఇమేజ్ చూసి పెంచుకున్న గుడ్డి ప్రేమో,అభిమానమో కాదు. ఇమేజ్ చూసి అభిమానించడానికి ఆయనేమన్నా సినిమా స్టారా?

  34. కొంత మంది వ్యక్తిగత కీర్తిప్రతిష్టలు పెంచుకోవడానికి సంఘసేవ చేస్తారు. వ్యక్తిగత కీర్తిప్రతిష్టలు మనిషిని 100% నీతివంతునిగా మార్చలేవు. అతనికి నిజంగా నీతి మీద నమ్మకం ఉంటే ఫోర్జరీలు చెయ్యడు. ఫోర్జరీలు అనేవి తెలియక చేసే తప్పులు కావు. గత ఏడు సంవత్సరాల సత్యం లెక్కలు తప్పులమయంగా ఉన్నాయని తేలింది. తెలిసి తెలిసి గడ్డి తినకపొటే ఏడు సంవత్సరాల వరకు అదే తప్పు ఎందుకు కొనసాగిస్తాడు?

  35. రామలింగ రాజుకి జైల్లో చికెన్ తో ఆహారం పెట్టారట. డి.జి.పి. ఈ విషయం తెలిసి “అలా పెట్టొద్దు, దాని వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ కి చెడ్డ పేరు వస్తుంది” అని పోలీసులకి ఆదేశం జారీ చేశాడట. మద్దిలచేరువు సూరికి జైల్ లో స్వీట్లు, జీడి పప్పు కూడా పెట్టారు. అప్పుడు మాత్రం డి.జి.పి.కి పోలీస్ డిపార్ట్మెంట్ పరువు గురించి గుర్తు రాలేదు
    అయ్యూ.. ప్రత్యూష కేసులో సిద్దార్థ రెడ్డి కి పరుపులు, కూలర్లు, మినరల్ వాటర్లు ఇంకా ఎన్నో సమకూర్చారు. అప్పుడు దీనిపై అసెంబ్లీ లో కూడా పెద్ద గొడవ జరిగింది మరి.

  36. రామలింగ రాజుని కులం పేరుతో అభిమానించిన వాళ్ళున్నారని చదివాను. ఇంత చదువుకున్న వాళ్ళకి కూడా కుల గజ్జి ఉంటుందా? మాది ఎరుకల కులం. కానీ మా అమ్మానాన్నలు బాగా డబ్బు సంపాదించిన వాళ్ళు కావడం వల్ల మా వీధి వాళ్ళెవరూ మమ్మల్ని ఎరుకలోల్లుగా చూడరు. ఇప్పుడు కులం, మతం కంటే డబ్బు ప్రభావమే ఎక్కువ కనిపిస్తుంది. రామలింగ రాజుని కులం పేరుతో వెనకేసుకు రావడం అన్నిటికంటే పెద్ద విచిత్రం. కులం పేరుతోనైనా, మతం పేరుతోనైనా, డబ్బు పేరుతోనైనా క్రిమినల్స్ ని వెనకేసుకురావడం ఆటవిక న్యాయమే అవుతుంది.

  37. Pingback: పొద్దు » Blog Archive » జనవరి బ్లాగావరణం

  38. Pingback: Poddu » జనవరి బ్లాగావరణం

Leave a reply to తెలుగుఅభిమాని Cancel reply