Blue Whale Game Stages

BLUE WHALE , బ్లూ WHALE ?
తల్లి తండ్రులూ! పిల్లలను రక్షించుకోండి !
చాల్లా విచారకరమైన సంఘటన. ఒక కుర్రవాడు ఆత్మహత్య చేసుకొని , దానికి దారితీసిన పరిస్థితులపై రాసిన సూసైడ్ నోట్.
ఎవరైనా 11 – 19 మధ్య వయస్సుగల పిల్లలు మీఇంట్లో ఇంటర్నెట్ ద్వారా పేస్ బుక్ కానీ, వాట్స్ అప్ గాని ఈ బ్లూ వేల్ ఆటకు సంబందించిన లింకు ను తెరవకుండా చూడండి.

ఎందువల్లనంటే ఈ ఆటలో 50 స్థాయిలు ఉంటాయి. ఆఖరి స్థాయి ఆత్మహత్యకు దారితీస్తుంది.

ఆట మొదలు పెట్టి మధ్యలో ఆపేద్దామనుకొంటే వీలు కాదు. 50 స్థాయిలు ఆడవలసిందే. ఒకసారి ఆట మొదలు పెడితే మీ మొబైల్ హకెర్ చేతిలోకి వెళ్ళిపోతుంది . అప్పుడు ఆ హెకర్ మీ కుటంబాన్ని నాశనం చేస్తానని బెదిరిస్తాడుట.

మీరు గ్రూప్ ఓ ఉన్నట్లయితే , లేదా ఒక కాంటాక్టుకి ఫార్వర్డ్ చేసి అందరికి చెయ్యమని తెలుపగల ప్రార్ధన. సమయం తక్కువ.

మనకు తెలియని లింకు ఏమి ఉండదు. మొబైల్ లో మనకి తెలియని లింకులను ఎప్పుడు ఓపెన్ చేయడానికి ప్రయత్నించవద్దు.

అదే విధంగా మీకు డబ్బు, బహుమతులు వస్తాయనే లింకులను కూడా ఎప్పుడు ఓపెన్ చెయ్యవద్దు. పెద్దల పర్యవేక్షణలో తప్ప మొబైల్ ఫోన్ ఎవ్వరికీ ఇవ్వవద్దు.

బ్లూ WHEL ఆటలో ఉండే 50 స్థాయిల ఛాలెంజ్ లు ఈ విధంగా ఉంటాయి.

1 బ్లేడ్ తో మీ చేతిమీద f57 అని చెక్కి దానిని ఫోటో తీసి కురేటర్ కు పంపండి.
2 ఉదయం 4 20 నిద్రలేస్తుంచి క్యూరేటర్ పంపే భయానక, మనసుకు సంబందించిన వీడియోలు చూడండి.
3 మీ చేతిమీద, నరాలను ఎక్కువగా కాకుండా బ్లేడ్ తో 3 గాట్లు పీతి ఆ ఫోటోను క్యూరేటర్ కి పంపండి.
4 కాగితం మీద వేల్ (తిమింగలం) బొమ్మ వేసి ఫోటో తీసి క్యురేటర్ కి పంపండి.
5 మీరు ” WHALE గా మారడానికి ” రెడీ గా ఉంటె కాలి మీద YES అని బ్లేడ్ తో రాయండి.
లేదంటే చాలా సార్లు బ్లేడ్ తో గీసుసుకోండి (మీ అంతటా మీరే శిక్షించుకోండి)
6 CIPHER అనే దానితో పోటీ పదండి.
7 బ్లేడ్ తో మీ చేతిమీద F40 అని గీసుకొని అది ఫోటో తీసి క్యురేటర్ పంపండి.
8 #I _ AM _ WHALE ” అని మీ VKONTAKTE స్టేటస్ LO టైపు చెయ్యండి.
9 మీ భయం నుండి బయటకు రండి.
10 ఉదయం 4 20 గేమ్ లేవండి. మీ ఇంటి పైకి రండి. యెంత ఎత్తులో ఉంటె అంత మంచిది.
11 మీ చేతిమీద బ్లాడితో WHALE (తిమింగలం) బొమ్మ గీసుకుని ఫోటో క్యురేటర్ కు పంపండి.
12 ఆ రోజంతా మీ మనసుకు నచ్చిన, భయానక వీడియోలు చూడండి.
13 మీరు (క్యురేటర్ పంపిన) సంగీతం వినండి.
14 మీ పెదవిని కోసుకోండి.
15 చేతిలో సూదితో అనేకసార్లు పొడుచుకోండి.
16 మీకు బాధ అనిపించే పనిచేసి SICK అయిపోండి.
17 మీకు తెలిసిన ఎత్తైన మేడమీది ROOF మీదకు వెళ్లి దాని అంచు చివర చాలాసేపు నిలబడండి.
18 ఒక BRIDGE వద్దకు వెళ్లి దాని అంచున నిలబడండి.
19 ఒక CRANE మీదకు ఎక్కండి. కనీసం ఎక్కడానికి ప్రయతించండి.
20 మీ క్యూరేటర్ మీరు నమ్మకస్తులా కాదా అని పరీక్షిస్తాడు.
21 SKYPE లో వేరొక ఆటగానితో లేదా క్యురేటర్ తో “TALK WITH ఆ WHALE ” లా మాట్లాడండి.
22 ROOF పైకే ఎక్కి అంచున కాళ్లూపుతూ కూర్చోండి.
23 CIPER తో మరొక పోటీ.
24 రహస్య సంభాషణ.
25 ” WHALE ” తో మీటింగ్ కు రండి.
26 క్యురేటర్ మీరు మరణించే తేదీని సూచిస్తారు. మీరు తప్పక దానిని ఒప్పుకోవాలి.

27 UDAYAM 4 20 కు నిద్ర లేచి రైలు పట్టాల దగ్గరకు రండి.
లేదా రైలు పట్టాలు దగ్గరలో ఎక్కడ ఉన్నాయో వెతుక్కోండి.
28 ఆ రోజు ఎవ్వరితో మాట్లాడకండి.
29 మీరు ” నేను WHALE ని” ప్రతిజ్ఞ తీసుకోండి.

30-49 ప్రతీ రోజు 4 20 నిద్రలేచి క్యురేటర్ పంపే భయానక వీడియోలు చూస్తూ, సంగీతం వింటూ బ్లేడ్ తో BODY మీద
ఒక్కక ఘాటు పెట్టుకొంటూ ” WHALE తో మాట్లాడండి.

50 ఎత్తైన ప్రదేశం నుండి దూకండి. మీ ప్రాణం తీసుకోండి.

ఇది నాకు వాట్స్ అప్ లో వచ్చిన సమాచారం. దీనిని గురించి ఎవరు వివరం గా చెప్పలేదు. ఇంగ్లీష్ లో పంపంచారు. కానీ మన అక్కలకు, చెల్లెళ్లకు తెలియచేయడానికి నేను తెలుగులో తర్జుమా చేసాను. నాకు వివరంగా తెలియదు. ఇది చదివితే తప్ప.

ఏది ఏమైనప్పటికి తల్లితండ్రులు మీ పిల్లలకు సెల్ ఫోన్ ఇచ్చి గొప్ప గా ఫీల అవ్వొద్దు. అనర్ధాలకు మీరే కారణం. వారు ఎప్పుడు నిద్రపోతున్నారా లేదా ఆడుతున్నారా అని గమనించండి. ఒక వేళా ఇంట్లో వీలు కాకపొతే బయట ఏమైనా ఆడుతున్నారు చూడండి. ఈ BLUE WHALE కాకుండా కొత్తకొత్తవి వస్తుంటాయి.
పిల్లలు ఆత్మహత్య చేసుకోవచ్చు లేదా ఎవరినైనా చంపొచ్చు. రోడ్డు మీద శోకాలు పెట్టి జీవితాన్తమ్ బాధ మీదే! జాగ్రత్త.

FORWARDED THIS MESSAGE AS RECEIVED .
SUBJECT UNKNOWN CORRECTIONS IF ఏ. FORWARD TO ALL GROUPS . SAVE KIDS.

ALERT TO HOSTEL WARDENS ABOUT YOUR STUDENTS. YOUR JOB IS RISCKY. WATCH THEM ALWAYS.

Advertisements

Decomposition

Do you know how long it takes for the nature to decompose the stuff we dispose off without a thought??

Paper Towel – 2-4 weeks
Banana / Orange Peel – 3-4 weeks
Paper Bag – 1 month
Newspaper – 1.5 months
Cardboard – 2 months
Cotton Glove – 3 months
Plywood – 1-3 years
Wool Sock – 1-5 years
Milk Cartons – 5 years
Cigarette Butts – 10-12 years
Leather shoes – 25-40 years
Tinned Steel Can – 50 years
Foamed Plastic Cups – 50 years
Rubber-Boot Sole – 50-80 years
Plastic containers – 50-80 years
Aluminum Can – 200-500 years
Plastic Bottles – 450 years
Disposable Diapers – 550 years
Monofilament Fishing Line – 600 years
Plastic Bags – 200-1000 years

We request you, please share this piece of information in your network as much as you can.
This will create awareness amongst people that plastic is one of the major reasons related to the Global Green House Effect.
– Please Support a Green Environment.😊🌳🌿🌱
Have a Green Day

ఉప్మా.

ఉప్మా కనిపెట్టిన వాడ్ని ఉరికే వదలకూడదు 😣😣…ఊరూరా ఊరేగించి ఉప్పు నీళ్ళలో ఊరబెట్టి😎😎..ఊ కొడతారా ఉలిక్కి పడతారా సినిమా ఒక వంద సార్లు చూపించి ఉరితీయ్యాలి😂😂…ఎవరి ఇంటికి పోయినా త్వరగా అయిపోతుందని చేస్తారో🐒🐒కసి తీర కడుపులో మంట చల్లార్చుకోడానికి చేస్తారో తెలీదు 😰😰..కమ్మటి కాఫీ ఇచ్చి పంపిస్తే హాయిగా ఉండదు🐺🐺… వుండండి వుండండి అంటూ😛😛 వంటింట్లో నుంచి ఏ పూరి నో పొంగలో తెస్తారనుకుంటే🙆.ఉట్టిపుణ్యం గా ఊడి పడుతుంది ప్లేట్ లో ఈ ఉప్మా🙇🙇.. ఒక రెండు స్పూన్ ల వరకు బాగానే వుంటుంది👸…తరువాత చూడండి జ్వరమొచ్చినప్పుడు మాత్రలు మింగినట్టు🙅🙅స్పూన్ స్పూన్ కి ఒక గ్లాస్ నీళ్ళు తాగుతున్న మన కష్టాన్ని ఏమాత్రం లెక్కచేయకుండా👶👶..ఇంకాస్త పెట్టమంటారా అంటే😳…. ఆ స్పూన్ తో తల మీద గట్టిగ కొట్టుకొని వెర్రి గా నవ్వాలనిపిస్తుంది💣💣💣…ఈ దరిద్రానికి మళ్లీ రకాలు💥💥..గోధుమ రవ్వ,,బొంబాయి రవ్వ అంటూ👂👂..బొంబాయి ముంబై అయినా..ఈ ఉప్మా ఇంకా బొంబాయి రవ్వగానే చెలామణి అవుతాంది😛😛…జీడిపప్పు వేస్తే జీడిపప్పు ఉప్మా🐇🐇…ఉల్లిపాయలేస్తే ఉల్లిపాయుప్మ🐓🐓..టమాట వేస్తే టమేటా బాత్ 🍅🍅🍅…. ఉప్మా చేయి అంటే చాలు చిటికెలో చేతిలో ఉప్మా ప్లేట్ తో ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ వచ్చేస్తారు🎅🎅….శనివారం అయిందంటే చాలు ఎదో రూపం లో తగులుకుంటుంది🙇🙇..ఈ మంతెన గారు ఊరుకోక గోధుమ రవ ఉప్మా మంచిది అని చెప్పారు💪💪.. ఇక చూడండి👈..వారోత్సవాలు…👈బ్రహ్మోత్సవాలు జరుగుతూంటాయి☝….తప్పు మీది కాదు సర్👐👐.ధైర్యం చేసి ఉదయన్నే నాలుగు గంటలకి మీ ప్రోగ్రాం చూపించామ్ కదా✊✊…చేసిన పాపం ఉరికే పోదు👎👎..ఇది తినడం ఒక ఎత్తు అయితే తిన్నాక లోపల కి వెళ్లి ఇది చేసే హంగామ అంతా ఇంతా కాదు🏃🏃🏃…పడుకుంటే కడుపు లో షేర్ ఆటో లు తిరుగుతునట్టు ఒకటే గోల 🚆🚆🚆….అర స్పూన్ తింటే ,,.అరిగించుకోటానికి ఆరు గంటలు పడుతుంది🎠🎠🎠… ఉప్మా నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే🎭🎭…మా రామ్ దేవ్ బాబా గురూ గారు మహత్తరమైన ఉపాయం చెప్పారు😜😝😜… ఉప్మా కాశి లో వదిలేసాను అని చెప్పమన్నాడు 😛😛…ఎప్పుడైనా ఎవరైనా పెట్టినప్పుడు ఈ మాట చెప్పి తప్పించుకుంటున్నా అని చెప్పాడు 😌😌….నేను అదే చేస్తా లాభం లేదు😫😫…ఇంతకీ ఎంతమంది ఇవాళ ఉప్మా తిన్నారో 😊😊…అదే లే తినాల్సివచ్చిందో చెప్పండి😆😆…ఎదో మనిషి కి మనిషి సహాయం
😜😜…మీకోసం ప్రార్థన చేస్తా..కడుపులో పడిన ఉప్మా త్వరగా కరగాలని…
😃😃జై ఊప్మాఁ..జై జై ఊప్మాఁ..

పురుష లక్షణం

స్త్రీ ఎలా ఉండాలో అనే కాదు…

పురుషుడు ఎలా ఉండాలో కూడా ధర్మ శాస్త్రం

చెప్పింది..కానీ ఎందుచేతో ఈ శ్లోకం జన బాహుళ్యం లో లేదు

కార్యేషు యోగీ, కరణేషు దక్షః

రూపేచ కృష్ణః క్షమయా తు రామః

భోజ్యేషు తృప్తః సుఖదుఃఖ మిత్రం

షట్కర్మయుక్తః ఖలు ధర్మనాథః (కామందక నీతిశాస్త్రం)

–> కార్యేషు యోగీ :
పనులు చెయ్యడంలో ఒక యోగి వలె, ప్రతిఫలాన్ని ఆశించకుండా చెయ్యాలి.
–> కరణేషు దక్షః
కుటుంబాన్ని నడపడంలో, కార్యాలను నిర్వహించడంలో నేర్పుతో, సంయమనంతో వ్యవహరించాలి. సమర్ధుడై ఉండాలి.
–> రూపేచ కృష్ణః
రూపంలో కృష్ణుని వలె ఉండాలి. అంటే ఎల్లప్పుడూ ఉత్సాహంగా,
సంతోషంగా ఉండాలి.

–> క్షమయా తు రామః
ఓర్పులో రామునిలాగా ఉండాలి. పితృవాక్యపరిపాలకుడైన రాముని వలె క్షమించేగుణాన్ని కలిగిఉండాలి.
–> భోజ్యేషు తృప్తః
భార్య/తల్లి వండినదాన్ని (వంకలు పెట్టకుండా) భుజించి, తృప్తి చెందాలి.
–> సుఖదుఃఖ మిత్రం
సుఖదుఃఖాలలో కుటుంబానికి మిత్రుని వలె అండగా ఉండాలి. మంచి చెడ్డలలో పాలు పంచుకోవాలి.
ఈ షట్కర్మలు – ఈ ఆరు పనులు సక్రమంగా చేసే పురుషుడు ఉత్తమ పురుషునిగా , ధర్మనాథునిగా కొనియాడబడతాడు.

మధుమేహం గురించి

What is shugar or diabetes
నీకు షుగర్ తగిలింది .. అని ఆ మాట వినగానే సగం మెత్తబడతాడు , పళ్ళు తినకు , అన్నం తినకు , స్వీట్స్ తినకు , టి కాఫీ లో చెక్కర మానెయ్యాలి అని జాగ్రత్తలు చెపితే ఇంకో 30 శాతం మెత్తబడతాడు , మొత్తానికి ఒక 80 శాతం down అవుతాడు , కొన్ని వారాలు పూర్తిగా దిగులు పట్టుకుంటుంది , చుట్టాలు , ఫ్రెండ్స్ కధలు కధలుగా చెప్తారు , ఎవరు ఎలా పోయారో , ఎవరి ఎన్ని కిడ్నీలు ఫెయిల్ అయ్యయో …. దెబ్బతో ఆ మనిషి నీరసించి , క్రుంగి కృశించి ఓ 5 నుండి పది కిలోలు బరువు తగ్గిపోతాడు …. ఇక జీవితం ఫినిష్ అని డిసైడ్ అవుతాడు ….
.
పైన చెప్పినవి దాదాపుగా చాలా మందికి అనుభవం లోకి వచ్చిన సంఘటనలే …
ముందుగా అసలు మధుమేహం అంటే ఏంటి అనేది మనం పామరుల భాషలో తెలుసుకుందాం …
మధుమేహం లో రెండు రకాలు ఒకటి టైపు 1 అంటే ఇంజక్షన్ ద్వారా insulin తీసుకునేది
రెండోది టైపు 2 దానికి మందులు వాడతారు ….
మనం టైపు 2 గురించి మాట్లాడుకుందాం …
మన తినే ఆహారాన్ని జీర్ణించి దాంట్లో ఎనర్జీ , ప్రోటీన్ , విటమిన్స్ , ఖనిజ లవణాలు అన్నిటిని మన శరీరానికి కావాల్సిన చోటకి సరఫరా చేస్తుంది మన digestive system , అందులో ముఖ్యంగా మన దేహం లో ఉండే కణాలకు శక్తి ని glucose (చక్కర లాంటిది ) రక్తం ద్వారా అందిస్తుంది దానికోసం మన pancreas గ్రంధి insulin తయారు చేస్తుంది …

కొన్ని కారణాల వల్ల అది insulin తయారు చెయ్యడం ఆపేస్తుంది , అప్పుడుఆ సమస్యకు తగిన వైద్యం వైద్యులు మనకు సూచిస్తారు , ఇంజక్షన్ లేదా మందులు …
ఎక్కువగా వివరంగా వెళ్ళకుండా మనకు కావాల్సిన సబ్జెక్టు లోకి వస్తున్నా ..
రోజు మొత్తంలో కనీసం 45 నిముషాలు చెమటలు పట్టేలా పని చెయ్యండి , నడవండి , లేదా మరే ఇతర శరీర శ్రమ అయినా చెయ్యండి
.
ఆహరం కనీసం నాలుగు సార్లు తీసుకోవాలి ..అది కూడా మితంగా ..

.
తక్కువ తక్కువ ఎక్కువ సార్లు తీసుకుంటే రక్తం లో గ్లూకోస్ లెవెల్స్ ఎక్కువగా పెరగవు …
calories తక్కువ తీసుకుంటు ప్రోటీన్ ఇతర మినరల్స్ సమతుల్యత గల ఆహరం తీసుకోవాలి …
rice, చపాతీ , రాగులు , సజ్జలు , కొర్రలు , జొన్నలు అన్ని రోజు ఒక రకం అలా తీసుకుంటే మనకు విసుగు పుట్టదు …
చేప లేదా చికెన్ కనీసం వారానికి రెండు సార్లు , ఆయిల్ ఎక్కువ వెయ్యకుండా కొవ్వు లేకుండా lean meat తింటే బెటర్ , ఎక్కువగా పప్పు dalls , ఆకుకూరలు తీసుకోవాలి , (మనవాళ్ళు NV అంటే నునే లో ఊరబెడతారు అందుకే తినమని చెప్పాలంటే భయం 🙂 )
మందులు మాత్రం క్రమం తప్పకుండా వాడాలి…
మన శరీరానికి కావాల్సిన సరైన డోస్ సెట్ అయ్యేవరకు మొదట్లో నెలలో రెండు సార్లు రక్త పరీక్ష చేయించుకుని కాస్త రద్దీ తక్కువ ఉన్న డాక్టర్ ని సంప్రదించండి ….
కొన్ని సెకండ్స్ , లో ఇలా చూసి అలా next పేషెంట్ ని పిలిచే డాక్టర్ కి ఒక
పెద్ద నమస్కారం పెట్టెయ్యండి … (నేను అదే చేశా 😀 )

ఒక మోతాదులో స్వీట్స్ తీసుకోవచ్చు కాని అప్పుడు కొంత ఆహారాన్ని త్యాగం చెయ్యాలి ఆ పూట 🙂
షుగర్ లెవెల్స్ సరిగ్గా కంట్రోల్ లో లేకపోతె , మనం శరీర శ్రమ / వ్యాయామం చెయ్యకపోతే దాని దాడి .. మన కళ్ళు , కిడ్నీలు , గుండె మీద ఉంటుంది ,

నెల నెల రక్తం లో షుగర్ పరీక్ష ,అలాగే urine టెస్ట్ ప్రతి సంవత్సరానికి ఒక సారి రక్తం లో కొవ్వు శాతం తెలిపే lipid profile పరీక్ష , సంవత్సరానికి ఒక సారి కళ్ళ టెస్టింగ్ తప్పనిసరిగా డాక్టర్ గారి సూచనల ప్రకారం చేయించుకోవాలి …
.
.
మొత్తానికి మధుమేహం లో ఉన్న మధు ని మనం బెస్ట్ ఫ్రెండ్ చేసుకుంటే మాత్రం కనీసం ఒక డెబ్భై ఏళ్ళు హాపీ గా బ్రతకగలం ….
From Naveenkumar

మంచి సందేశం

మంచి సందేశం… AGAIN.. AGAIN

ఒక కుర్రాడు, వాళ్ళ నాన్నతో ఒక గంట సేపటి పాటు కొంచెం డబ్బు పంపటం కోసం బ్యాంకులో వేచి ఉన్నాడు. తను విసిగిపోయి ఆగలేక తన తండ్రిని ఇలా అడిగాడు….

“నాన్నగారు, మీరు internet banking ఎందుకని activate చేసుకోరు?”

“ఎందుకు చేయించుకోవాలి” అని తండ్రి తిరుగు ప్రశ్నించారు.

“ఇలా ఇక్కడ గంట సేపు transfer కోసం ఎదురు చూడనక్కర్లేదు, ఇంకా సామాన్లు కూడా online లో ఇంటికే తెప్పించుకోవచ్చు”.

తండ్రిని internet banking ప్రపంచంలోకి తీసుకురావాలని కొడుకు ప్రయత్నిస్తున్నాడు.

తండ్రి : “అలా చేస్తే నేను ఇంట్లో నుండి బయటకు రావాల్సిన అవసరం లేదు కదా??”

“హ హ, ఆవును అవును”, అని కొడుకు జాబిచ్చాడు. “ఇంకా ఇంటికి కిరాణా సామాన్లు, ఇంటికి కావాల్సిన వస్తువులు ఇలా ఎన్నో తెప్పించుకోవచ్చు, amazon flipkart లాంటి ఎన్నో కంపెనీలు ఎంతో సులువుగా, కచ్చితంగా సామాన్లు ఇంటికి అందజేస్తున్నాయి”, అని వివరించే ప్రయత్నం చేసాడు.

అంతా విన్న తండ్రి ఇచ్చిన సమాధానానికి ఆ కొడుకుకి ఇంక మాటల్లేవ్ !!!

“నేను ఈరోజు బయటకి రావటం వల్ల, నా పాత స్నేహితులని నలుగురిని కలిసాను. ఇక్కడ పని చేసే సిబ్బందితో నాకు మంచి పరిచయాలు ఉన్నాయి. వాళ్ళతో మాట్లాడాను.

నీకు తెలుసు నేను ఒంటరివాడిని. నాకు ఈ సమయంలో కావాల్సిన స్నేహం ఇటువంటిదే. నాకు కావాల్సినంత సమయం ఉంది. నేను ధీమాగా తయారయ్యి ఇలాంటి పరిచయాల్ని పెంచుకుంటాను.

రెండు సంవత్సరాల క్రితం నాకు అనారోగ్యం వచ్చినప్పుడు, నేను ఎప్పుడూ పళ్ళు కొనే కొట్టు వాడు నన్ను చూడటానికి వచ్చి, నాకోసం బాధపడి, కన్నీళ్లు కార్చి, నేను బాగు అవ్వాలని కోరుకున్నాడు.

కొన్ని రోజుల క్రితం…
అమ్మ పొద్దున్నే, మార్నింగ్ వాక్ కి వెళ్ళినప్పుడు కళ్ళు తిరిగి పడిపోయింది. అప్పుడు మనం ఎప్పుడూ సామాన్లు కొనే కిరాణా కొట్టువాడు, తన బండి తీసుకుని అమ్మని ఇంటికి చేర్చాడు.

నువ్వన్నట్టు online లో shopping లు అవి చేస్తే, నాకు ఈ మానవ సంబంధాలు ఉండేవా? పళ్ళ కొట్టువాడు నా బాధను పంచుకునేవాడా? అమ్మని కిరాణా కొట్టువాడు ఇంటికి చేర్చగలిగేవాడా???

ఒక computer లేదా mobile phone తో సావాసం చేసి ఇంటికే అన్ని తెప్పించుకుని నాకు దొరికే స్నేహితుడు ఎవడు, ఒక electronic పరికారమా!!!

నేను ఏదైనా కొనేటప్పుడు వాళ్ళని చూసి వాళ్ళతో మాట్లాడటం ఇష్టం. నాకు ఇవన్నీ నువ్వనే ఆ amazon flipkart లో దొరుకుతాయా, కేవలం నీకు సామాను పంపే seller పేరు తప్ప. మనిషి మనీషి కలిసిన నాడే సత్సంబంధాలు ఏర్పడతాయి, బంధాలు బలమవుతాయి.

టెక్నాలజీ ఉండాలి కానీ…
అది మాత్రమే జీవితం కాకూడదు !

మనుషులతో జీవించండి…..
పరికరాలను వాడుకోండి…..

“ప్రేమించల్సిన మనుషుల్ని వాడుకొని,
వాడుకోవాల్సిన పరికరాలతో జీవించకండి”….

(‘తెగిపోతున్న మానవ సంభందాల’ గురించి ఒక్క సారి అలోచించండి) 🙂🙂🙂🙂

కోన్ని ఆలోచనలు

శ్రీమతి సుశీలా సోమరాజు గారు రాసిన కవిత ఇది
నాకు బాగా నచ్చి మీ అందరికీ షేర్ చేస్తున్నాను
ప్రయాణం
—-

పెద్దతనం, ముసలి తనం, వృద్ధాప్యం అని అందరూ
హడలగొట్టి చంపేసే ఆ దశ వచ్చేసిందా? అప్పుడే వచ్చేసిందా?

నిన్నగాక మొన్ననేగా మావయ్య కొనిచ్చిన కొత్త ఓణీ చూసి మురిసి ముక్క చెక్కలయిందీ !
ఎదురింట్లో అద్దెకున్న స్టూడెంట్ కుర్రాడు ఇంకా కాలేజీకి వెళ్ళడేమిటా
అని విసుక్కున్నదెప్పుడూ… నాలుగు రోజుల క్రితమేగా!

ప్రతి పెళ్ళిచూపులకి సింగారించుకుని కూచుని, తీరా వాళ్లు జాతకాలు నప్పలేదని కబురు పెడితే
తిట్టరాని తిట్లన్నీ అందరం కలిసి తిట్టుకుంటూ ఎంజాయ్ చేసింది నిన్న మొన్నేగా!
నాన్నని కష్టపెట్టకూడదని కూడబలుక్కుని, ఇంటి అరుగుమీద పెళ్ళి,
పెరట్లో కొబ్బరి చెట్టుకింద బూందీ, లడ్డూ, కాఫీలతో రిసెప్షనూ ఇచ్చి,
ఇంటి ఇల్లాలినయి ఎన్నాళ్ళయిందనీ !
అందుకు తగ్గట్టే పెళ్లివారు ఒకే పట్టుచీర తెచ్చి అన్నిటికీ దాన్నే తిప్పితే,
నలుగురూ నవ్వినందుకు పౌరుషం వచ్చి, ‘మేం బొంబాయిలో కొనుక్కుంటాం’ అని గొప్పలు పోయింది ఈ మధ్యనేగా !

అయినా ఏం లోటయిందని ?
వాయిల్సూ, జార్జెట్ లూ, బిన్నీలూ, బాంబే డయింగులూ, విమలలూ,
వెంకటగిరి , ఉప్పాడ, గద్వాల, గుంటూరు, బెనారసు, కంచి, మైసూరు, ధర్మవరం, మహేశ్వరం, ఒరిస్సా, అస్సాం, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్… అబ్బ.. అబ్బబ్బ ఎన్ని రాష్ట్రాలని పాలించాం! ఎన్ని చీరలు కట్టాం!

ముగ్గురు పిల్లల్నేసుకుని రిక్షాలెక్కుతూ దిగుతూ, హాస్పిటళ్లూ, స్కూళ్లూ, పెళ్లిళ్లూ, పేరంటాలూ, పురుళ్లూ, తద్దినాలూ, నోములూ, వ్రతాలూ…ఎన్నెన్ని పండగలూ, ఎంతెంత హైరానాలూ….ఒక్కరోజయినా నడుం నొప్పని పడుకుని ఎరుగుదుమా, ఎవరైనా పలకరించడం విన్నామా?!
పాపాయ్, నానీ, చిట్టితల్లీ, బంగారం, అక్కా, వదినా, ఇదిగో, కోడలమ్మా, పిన్నీ, అత్తా, చిన్నమ్మా. అమ్మా, పెద్దమ్మా, అమ్మమ్మా, నానమ్మా, పెద్దమ్మమ్మా, పెద్ద బామ్మా, జేజమ్మా… అమ్మో ఎన్ని మెట్లెక్కాం! ఎన్నెన్ని పిలుపులకి పలికాం !

ఇంతట్లోకే పెద్దయిపోయామా! అప్పుడే అందరూ అమ్మగారనడం మానేసి మామ్మగారంటున్నారు!
అంటే అన్నారుగాని పాపం లేవబోతుంటే చేయందిస్తున్నారు!
చేతనున్న చిన్న బ్యాగు తామే తెస్తామని లాక్కుంటున్నారు….
పదికిలోల బియ్యం అవలీలగా వార్చిన వాళ్లం! ఈ బరువొక లెక్ఖా, వాళ్లంత ముచ్చట పడుతుంటే కాదనడం ఎందుకని గానీ?

పెద్దయితే అయ్యాంగానీ ఎంత హాయిగా ఉంటోందో!
మండే ఎండల తర్వాత వాన చినుకు పడ్డట్టు…
ముసుళ్ల వానల ముజ్జిడ్డులు దాటి, వెన్నెల మోసుకొచ్చే చందమామ కనపడ్డట్టు…
గజ గజ లాడే చలి వణుకులు వణికాక వెచ్చటి కమ్మటి మట్టిగాలి పలకరించినట్టు…
ఎంత హాయిగా వుందో!

ఒకటే ఇడ్లీ తింటే గంటకే ఆకలేస్తుంది.. పోనీ అని రెండు తింటే అపరాహ్నమయినా అన్నానికి లేవబుధ్ధి కాదు!
ఆవకాయని చూస్తే బీపీ, మామిడి పండుని తల్చుకుంటే సుగరూ, పగలు కాస్త రెండు ముద్దలెక్కువయితే
రాత్రికి మజ్జిగ చాలు… ఎంత తేలిక అవసరాలు!

సగం భోజనం మిగతా సగం మందులు .. అవి ఉండ బట్టే కదా ఇంకా మనగల్గుతున్నాం!
ఇంకొక పెద్ద విశేషం ఉందండోయ్, ఎవరికీ తెలియనిదీ మనం పైకి చెప్పనిదీ ..
మనం ఎవరికీ అక్కర్లేదు కాబట్టి మనకీ ఎవరూ అక్కర్లేదు!
ఎవరూ మన మాట వినిపించుకోరు కాబట్టి మనమూ ఎవరి మాటా వినిపించుకోనక్కర్లేదు !
అంతా నిశ్శబ్ద సంగీతం!
ఏరుని ఎప్పుడూ గలగలా ప్రవహించమంటే కుదుర్తుందా? సముద్రం దగ్గర పడుతుంటే హాయిగా నిండుగా హుందాగా అడుగులేస్తుంది కదా!

అయినా ఎపుడేనా మనకి తిక్క పుట్టినపుడు అడ్డంగా, అర్ధం పర్ధం లేకుండా వాదించి ఇవతల పడచ్చు.
ఇంత వయసు వచ్చాక ఆ మాత్రం చేయ తగమా !
ఈ మధ్యనే నేను కనిపెట్టాను ఇంకొక పెద్ద విశేషం…అస్తమానం ప్రవచనాలు వింటూ హైరానా పడక్కర్లేదు.
మనకి చెప్పడం రాదు గానీ వాళ్ళు చెప్పేవన్నీ మనకూ తెలుసు!
కాబట్టి హాయిగా పవన్ కళ్యాణ్ సినిమాలు చూస్తూ కుళ్లు జోకులకి కూడా గట్టిగా నవ్వుకోవచ్చు. ఎవరూ ఏమీ అనుకోరు.

అవునూ… మనం కనపడగానే మొహం ఇంత చేసుకుని ఆనంద పడిపోయే మన పిన్నిలూ, బాబాయిలూ, అత్తయ్యలూ, మామయ్యలూ ఏమయిపోయారు? ఎప్పుడెళ్లిపోయారు?
’ పిచ్చిపిల్లా కొత్త మాగాయలో వేడన్నం కలుపుకుని, ఈ నూనె చుక్కేసుకుని రెండు ముద్దలు తిను’ అంటూ వెంటబడే వాళ్లెవరూ లేరే?
అంటే మనమే పెద్దవాళ్లయిపోయామన్నమాట!
చూస్తూండగానే సాటివాళ్లు కూడా కనిపించడం మానేస్తున్నారు. కొందరుండీ లేనట్టే. లేకా వున్నట్టే. జీవితానికి విశ్రాంతి దానంతటదే వస్తోంది.

అయినా రైలెక్కాక కిటికీ పక్కన కూచుని దారిలో వచ్చే పొలాలూ, కాలవలూ, కుర్రకారూ, పల్లెపడుచులూ, టేకు చెట్లూ, భవనాలూ, వాటి పక్కనే గుడిసెలూ, అక్కడాడుకుంటూ చేతులూపే చిన్నారులూ, ఉదయిస్తూ అస్తమిస్తూ అలుపెరగక డ్యూటీ చేసే సూర్యనారాయణమూర్తులూ, మిణుకు మిణుకుమని హొయలుపోయే చుక్కలూ చూస్తూ ప్రయాణం ఎంజాయ్ చెయ్యాలి గానీ స్టేషనెప్పుడొస్తుందో అని ఎదురుచూడడం ఎందుకూ?

తీరా అదొస్తే ఏముందీ! జీవితమంతా పోగేసిన సామాన్లన్నీ వదిలేసి దిగిపోవడమేగా
Written by srimathi Suseela Somaraju