రామోజీరావుకు సన్ స్ట్రోక్

హమ్మయ్య  సుమన్‌, ప్రభాకర్ లు ఈ టీవీ నుండి  తప్పుకోన్నారట .
అంటే   ‘నయనానందకర నట విన్యాసం’ చూసే అవకాశం ఇక తెలుగు ప్రేక్షకులకు లేదన్నమాట! 😦  పాపం SV  క్రిష్ణారెడ్డి గారిని ఎవరు పిలవాలి ఇక వారు ఎవరిని పోగడాలి? .ఈటీవీ వారు వారికి వారు ఇచ్హుకోనే అవార్దులు ఇకవుండవేమో . ఇక విషయానికి వస్తే  రామోజీ రావుకూ సుమన్‌కూ టీవీ కార్యక్రమాల విషయంలో పదేళ్ల క్రితమే అభిప్రాయభేదాలు వచ్చాయి. అప్పటినుంచీ పెద్దగా మాటలు కూడా లేవు. ఈటీవీలో తన ఇష్టానికి వ్యతిరేకమైన కార్యక్రమాలు ఎక్కువైన నేపధ్యంలో రామోజీ రావు ఈటీవీ-2 ప్రారంభించి కొడుకు నీడ పడకుండా తనే చూసుకుంటున్నారు. ఈటీవీలో మాత్రం ఇద్దరి కార్యక్రమాలూ ప్రసారమవుతాయి. ఇద్దరి అభిరుచులకూ పొంతన లేకపోవడంతో ఒకరి ప్రోగ్రామ్‌లను మరొకరు వేలెత్తి చూపడం ఎక్కువై తరచూ పరోక్షంగా గొడవలు జరుగుతుండేవి. దీంతో దాదాపు ఆరు నెలల క్రితం ఈటీవీలో తండ్రీ కొడుకులు టైమ్‌ స్లాట్స్‌ పంచుకున్నారు. నం ఎక్కువగా టీవీ చూసే ప్రైమ్‌టైమ్‌ స్లాట్స్‌ సుమన్‌ దక్కించుకున్నారు. తనకు నమ్మిన బంటు అయిన ‘క్రియేటివ్‌ హెడ్‌’ ప్రభాకర్‌ బృందం రూపొందించే ప్రోగ్రామ్స్‌ను మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల దాకా, సాయంత్రం 8 నుంచి రాత్రి 11 గంటలదాకా ప్రసారం చేసేవారు. మిగతా వేళల్లో రామోజీరావు మనుషులు తీసిన కార్యక్రమాలు వస్తాయి. ఈ ’ఒడంబడిక’ ఇలాగే కొనసాగితే ఇబ్బంది ఉండేది కాదేమో కానీ, ఇటీవల తండ్రి స్లాట్స్‌పై తనయుడు కన్నేశారు. వాటిని మార్చే విషయంలో రామోజీ మనుషులకు మార్గదర్శనం చేసే బాధ్యతను ప్రభాకర్‌కు అప్పగించారు. ఆయన వెంటనే రంగంలోకి దిగి ‘క్రియేటివ్‌’ ఆపరేషన్‌ మొదలుపెట్టారు. దాంతో గొడవ రాజుకుంది. గత గురువారం రామోజీరావుకు విషయం తెలిసి ప్రభాకర్‌ను పిలిచి చీవాట్లు పెట్టారు. దాంతో, ఆయన రాజీనామా చేశారు. అక్కడితో ఆగితే, విషయం బయటికి పొక్కకుండా సర్దుకుపోయేదే కానీ, స్వయానా సుమన్‌ కూడా ’ఎం.డి’ పదవికి రాజీనామా చేశారు.

సుమన్‌ రాజీనామా అయితే చేశారు కానీ, తండ్రిమీద పంతంతో… తన ‘్‌క్రియేటివ్‌ టీమ్‌’ రూపొందించిన కార్యక్రమాల క్యాసెట్స్‌ అందకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. గత శుక్రవారం కార్యక్రమాల విషయంలో ప్రతిష్టంభన ఏర్పడింది. దాంతో రామోజీ రావు జోక్యం చేసుకొని, సోమాజిగూడలోని ఈటీవీ ఎడిటింగ్‌ విభాగానికి ఫోన్‌ చేసి తక్షణం ’మహిళలు మహరాణులు’, ‘బంధం’, ’పద్మవ్యూహం’ కార్యక్రమాల క్యాసెట్స్‌ పంపించాలని హుకుం జారీ చేశారు. భయపడిన సిబ్బంది వాటిని పపించి ఎందుకైనా మంచిదని సుమన్‌కు విషయం చెప్పారు. ఆయన వాళ్లపై మండిపడి, మార్గమధ్యం నుంచే క్యాసెట్స్‌ను వెనుకకు రప్పించారు. చివరి నిమిషంలో జరిగిన ఈ హఠాత్పరిణామంతో కంగుతిన్న రామోజీ వర్గం గురువారం నాటి కార్యక్రమాలనే శుక్రవారం కూడా ప్రసారం చేయించింది. దీన్ని పరాభవంగా భావించిన రామోజీరావు తన అనుంగు అనుచరుడైన సంస్థ వైస్‌ ప్రెసిడెంట్‌ బాపినీడును రంగంలోకి దింపారు. ఆయన సోమాజిగూడ వెళ్లి ప్రైమ్‌టైమ్‌ ప్రోగ్రామ్‌ల క్యాసెట్‌లను స్వయగా పట్టుకుపోయారు. సుమన్‌ దీన్ని సవాలుగా తీసుకున్నారు. శనివారం మధ్యాహ్నం, ప్రైమ్‌టైమ్‌లో ప్రసారం కావలసిన కార్యక్రమాల క్యాసెట్లు ఫిలింసిటీకి వెళ్లకుండా కట్టుదిట్టం చేశారు. సోమాజిగూడ ఆఫీసును తన విధేయుల పహరాలో ఉంచారు. దాంతో మల్టినేషనల్‌ కంపెనీల స్పాన్సర్‌షిప్‌తో కోట్లు కురిపిస్తున్న ‘స్టార్‌వార్స్‌’, ’యాహూ’ వటి పలు కార్యక్రమాలు నిలిచిపోయాయి. దీనివల్ల సంస్థకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. అసలే ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ కారణంగా ‘మార్గదర్శి’ సంస్థ వివాదాల్లో చిక్కి ఇబ్బందుల్లో ఉన్న రామోజీ సొంత కొడుకు వల్ల మరో పెద్ద తలనొప్పిని ఎదుర్కోవలసి వచ్చింది.
– చివరికి రామోజీరావుకు సన్  స్ట్రోక్ తప్ప లేదు 😦
పూర్తి వివరాలకు www.telugupeople.com చదవగలరు

5 responses to “రామోజీరావుకు సన్ స్ట్రోక్

  1. ఈ నిర్ణయం ఖచ్చితంగా బ్లాగులోళ్ళ సెటైర్ల వల్లే అయుంటుంది. అనుమానం లేదు.
    — విహారి

Leave a comment