అన్ని అనర్థాలకు అదే కారణమా ?

నాకు ఒకటి అర్దం కాలేదు ఈ మధ్య ప్రతి దానికీ బడుగు, బహుజన , మైనార్టీ అంటూ ఏకమై ఈ సమస్యలు అన్నింటికీ కారణం అని ఫలానా కులంతో ముడి పెట్టి,ఉన్న వ్యవస్థ ను తిట్టిపోయటం , ఆలోచిస్తే విపరీతం అయిన ద్వేషం తో ఎక్కువ శాతం జనాలు ఉండటం రాజకీయ ఎజండాలు, ఈ మీడియా, సామాజిక మాధ్యమాల్లో విద్వేషాలు నూరిపోయటం వంటివి జరుగుతున్నాయి. అంతగా తిట్టాలి అంటే ఈ ప్రాంతం పాలించిన సుల్తాన్ లను రాజుల🤴ను ద్వేషించండి 🔥., నిజమే అంటరాని జాతులకు చాలా అన్యాయం జరిగింది, .. పోరాడితే వాళ్ళు మాత్రమే పోరాడాలి వారికే ఆ హక్కు ఉన్నది అయితే ఇప్పటి దళితులకు అప్పటి పంచములకు కేటగిరీలో, జనాభా శాతం లో చాలా తేడా ఉన్నది అన్న విషయం అందరూ గుర్తించాలి.

నా అవగాహన ప్రకారం రెండు వందల సంవత్సరాల క్రితం వరకూ సమాజంలో మంచిగానే ఉన్న మతాలు,జ్యాతులు, కులాలను కూడా ఇప్పుడు ఎందుకు కలుపుకోవాలో నాకు అర్ధం కాలేదు .. ఏమన్నా అంటే వేల సంవత్సరాల పీడన అంటారు 😔 వంద సంవత్సరాల ముందు ఇండియా అనే ఉప ఖండంలో అనేక స్వతంత్ర రాజ్యాలు ఉండేవి వారి పాలన, సామాజిక స్థితిగతులు, భాష, పరిపాలనా వేరు వేరు గా ఇప్పటి ఆఫ్రికా లాగా ఉండేవి ఇలాంటప్పుడు మనం ప్రస్తుతం ఉన్న ప్రాంతం చరిత్ర మన చరిత్ర అవుతుంది గానీ , వేరే దేశాల చరిత్ర మనది కాదు కదా 🤔 రెండువందల సంవత్సరాల ముందు ఈ ప్రాంతంలో ఉన్న ఉద్యోగాలు సైనికులు , లేదా గ్రామానికి ఒక పరిపాలనా అధికారి వంటివి తప్ప మిగిలిన వారు చేయటానికి అసలు ఏ ఉద్యోగాలు ఉండేవి , ఏ చదువులు ఉండేవి .. ఉన్న భూమి ఎంత అప్పటి జనాభా, వనరులు ఎంత, ఇప్పుడు ఉన్న అటవీ భూమి పరిరక్షణ చట్టాలు ఏమున్నాయి, గిరిజనులకు అప్పటి సమాజంలో కలవలేదు అప్పటి జీవన విధానంలో ఉన్న కరెంట్, కారు జీవన సౌకర్యాలు ఏమి ఉండేవి . దైనందిన జీవితం లో అన్ని వర్గాల, కులాల ప్రజల్లో ఏ మార్పు ఉండేది అందులో బలవంతంగా లాక్కొని అనుభవించే జీవన సౌకర్యాలు ఏమున్నాయి.ఉన్న రాజరికం లో ఎంత శాతం ప్రజలకు భృతి దోరికింది మిగిలిన పనులు కుల వృత్తుల చేతులతో ఉండేవి, ఉదాహరణకు ఈ డెక్కన్ ప్రాంతంలో జనాభా అరకోటి మించదు ,సగటు ఆయుర్దాయం 25-30 సంవత్సరాలు , గ్రామీణ సమాజంలో కొన్ని కట్టు బాట్లు ఉండేవి, అప్పటి విద్య , విజ్ఞాన శాస్త్రం , శిల్ప,లోహ పరిజ్ఞానం కుల వృత్తులచేతిలో ఉండేది అది తరతరాలుగా అందించబడేది వాటిని అడ్డుకొన్న శక్తులు ఏమిటి, అసలు వాటిని అడ్డుకోవాలని చూడటం లో వచ్చే లాభం ఏముంది. అసలు ప్రపంచంలో మిగిలిన రాజరికం, సమాజంలో ఎలా ఉండేది, అప్పటి social laws , జనాలలో చైతన్యం ఎక్కడిదీ , ఈ పీడన ప్రపంచంలో మనం ఒక్కరిదేనా? అ బ్రిటీష్ వాళ్ళ కన్నా ముందు ఈ డెక్కన్ ప్రాంతంలో 13 వ. శతాబ్దాల నుంచి మహమ్మదీయులు రాజులుగా ఇన్నారు, అప్పటి అధికారం,చట్టాలు వాళ్ళనే కదా అంతకుముందు ఉన్న శాతవాహనులు తప్పితే కాకతీయులు, చాళుక్యులు బహుజనులరాజులు , అంతకు ముందు ఇక్కడ బౌద్ధం ఆచరణలో ఉన్నది , చరిత్ర లెక్కలు తీస్తే
Telangana was governed by many rulers, including the Maurya Empire (320 BCE–180 BCE), Satavahana dynasty (180 BCE–220 CE), Vakataka dynasty (250 CE–500 CE), Vishnukundina dynasty (420 CE–624 CE), Chalukya dynasty (543 CE–753 CE), Rashtrakuta dynasty (753 CE–982 CE), the Kakatiya dynasty (1083 CE–1323 CE), the Delhi Sultanate (1323 CE–1326 CE) , the Musunuri Nayaks (1326 CE–1356 CE), the Recherla Nayaks (1356 CE–1424 CE), the Bahmani Sultanate (1347 CE–1512 CE), Vijayanagara Empire (1336 CE–1646 CE), Qutb Shahi dynasty (1512 CE–1687 CE), Mughal Empire (1687 CE–1724 CE) and Asaf Jahi Dynasty (1724 CE–1948 CE).

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s