ఇంటర్న్‌షిప్ అవకాశం @ తెలుగు వికీ – IIIT – Summer Internship Opportunity 2021 .

నమస్కారం ,
ఐఐఐటి హైదరాబాద్ ఆధ్వర్యంలోని ఇండిక్ వికీ ప్రాజెక్ట్‌ లో ఆసక్తి మరియు అర్హత గల స్థానిక అభ్యర్థుల నుండి తెలుగు రాష్ట్రాల లోని అన్ని ముఖ్య పట్టణాలు , ప్రాంతాల నుండి ఇండిక్ వికీ ప్రాజెక్టులో ఇంటర్న్‌షిప్ చేయటానికి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఈ ఇంటర్న్షిప్ మీ ప్రాంతములో నే ఉంటూ ఆన్లైన్ లో చేయదగిన సువర్ణావకాశం .మరిన్ని వివరాలకు లేదా Interview Schedule చేయటానికి, దయచేసి మీ పరిచయం తెలుగులో రాసి మీ ప్రొఫైల్ (CV) ను tewiki@iiit.ac.in కు email చేయగలరు. ఇంకా ఏమైనా సమాచారం కోసం 9014120442 ను సంప్రదించండి
ఇంటర్న్‌షిప్ అవకాశం @ తెలుగు వికీ – IIIT – Summer Internship Opportunity 2021 .
తెలుగు వికి లో విజ్ఞాన శాస్త్ర, సాంకేతిక అంశాల మీద వ్యాసాలు రాస్తూ , అందుకు అవసరం అయిన వాలంటీర్ లను చేర్చుకొని, వారికి తెలుగులో వ్యాసాలు రాయటానికి, వివిధ సాంకేతిక , అనువాద ఉపకరణాల మీద ఆన్ లైన్ లో శిక్షణ ఇవ్వవలసి ఉంటుంది. దానికి సంబంధించిన సహాయ , సహకారాలు ప్రాజెక్టు ద్వారా మీకు మేం అందిస్తాం,తద్వారా మీ వంతు కృషి మీరు చేయాల్సి ఉంటుంది . ఇది ప్రతిష్టాత్మకమైన ఐఐఐటీ హైదరాబాద్ వారి ఇండిక్ వికీ ప్రాజెక్టు నుండి ఇంటర్న్షిప్ చేసుకునే అవకాశం.
అర్హతలు:
తెలుగులో భాష దోషాలు లేకుండా రాయడం వచ్చి ఉండాలి .డిగ్రీ / పీజీ / ఇంజనీరింగ్ చదువుతున్న వారు , లేదా ఫ్రెషర్స్ .ఇంటర్నెట్ సౌకర్యంతో ల్యాప్ టాప్/ స్మార్ట్ ఫోన్ కలిగి ఉండాలి.
అర్హులైన వారికి కావాల్సిన Telugu translation tools , Community Development మీద శిక్షణ అందించబడుతుంది.•విజయవంతంగా పూర్తి చేసినవారికి IndicWiki – IIIT నుండి certificate ఇవ్వబడుతుంది•ఇందులో ప్రతిభ చూపిన వారికి ప్రాజెక్టు లో ఉపాధి అవకాశాలు, ప్రోత్సాహకాలు ఉంటాయి.  NOTE: ఇది ప్రాజెక్టు ఆధారిత Online అన్ పెయిడ్ ఇంటెర్న్షిప్, కనీస వ్యవధి 45 రోజులు.ఇండిక్ వికీ ప్రాజెక్ట్‌ పరిచయం ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ) హైదరాబాద్ భారతీయ భాషలలో వికీపీడియా వ్యాసాలు గణనీయంగా పెంచాలన్న లక్ష్యంతో ‘ప్రాజెక్ట్ ఇండిక్ వికీ’ చేపట్టింది. ఈ బృహత్తర ప్రాజెక్ట్ కు ఇది భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తున్నాయి. ఈ ఇండిక్ వికీ ప్రాజెక్టు ద్వారా ఆధునిక పారిశ్రామిక సాంకేతిక యుగంలో విజ్ఞాన సంపదను ఉచితంగా , ఎవరైనా స్వేఛ్చాగా ఉపయోగించుకోగల , సహకరించగల , నవీకరించగల సమాచారాన్ని అంతర్జాలంలో వికీ వ్యాసాల రూపంలో అందరికీ అందుబాటులోకి తీసుకు రావాలి అని ప్రయత్నం చేస్తున్నాము.
విజ్ఞప్తి :దయచేసి మీకు తెలిసిన విద్యార్థులతో లేదా చదువు పూర్తి చేసిన ఉద్యోగార్ధులతో , ఈ అవకాశం పంచుకోగలరు , మన మాతృభాషకు సేవ చేస్తూనే , కెరీర్లో ఎంతో ముఖ్యమైన ఇంటర్న్షిప్ అవకాశం ఐఐఐటి హైదరాబాద్ ఆధ్వర్యంలోని ఇండిక్ వికీ ప్రాజెక్ట్‌ లో ఉన్నది.

మీ శ్రేయోభిలాషి 
కశ్యప్Project Consultant 
TIL-Wiki-MiTy Project International Institute of Information Technology,
Professor CR Rao Rd, Gachibowli,Hyderabad, Telangana 500032
9396533666 / 9014120442 kasyap.krupal@research.iiit.ac.in

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s