వాణిజ్య ప్రకటనలు ప్రభావం

Advertisement — మన బలహీనత
..
1922 లో రేడియో కనుక్కున్నారు.
దాని ఉపయోగ౦ రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బాగా కనబడింది.
.
అటు జర్మనీ లో నాజీలు ,ఇటలీలో ఫాసిస్టులు ,
రష్యాలో కమ్యూనిస్టూలు తమతమ సిద్ధాంతాలను ప్రచార౦చేసుకోవటానికి ప్రజాభిప్రాయాన్ని సామూహికంగా మలచటానికి విస్తృతంగా వినియోగించారు.
.
మనస్తత్వ శాస్త్రజ్ఞుడైన సిగ్మండ్ ఫ్రాయిడ్ దగ్గరి బంధువు ఎడ్వర్డ్ బెర్ని అనే ఆయన మనస్తత్వానికి అనుగుణంగా సమాచార మార్పిడి అనే విషయం మీద విస్తృత పరిశోధన చేసాడు .
.
మనుషులలో అంతర్లీనం గా ఉన్న భావాలను ప్రేరేపి౦చి వస్తు వినియోగాన్ని వృద్ది చేయడం ఎలా అన్నదాని మీద ఒక సిద్ద్దాంతాన్ని లేవదీశాడు.

అదేమిటంటే
.
“ అవసరాన్ని సృష్టించు తదనుగుణంగా ఉత్పత్తిచేసి విక్రయించు “
ఇదిగో ఈ సూత్రమె ప్రకటనలకు మూలాధారం .
.
he writes in his book.. propaganda ..“ if we understand the mechanism and motives of group mind,is it not possible to control and regiment the masses according to our will without their knowing about it”.
.
…….. మన ఇళ్ళలో మొదట రేడియో కొనుక్కున్నాం, అందులో మనిషి గొంతుక మాత్రమె విన పడుతుంది.
.
మనిషి కనపడడు ,రూపం, స్వరం రెండూ కావాలి అనే అవసరం సృష్టించారు .
.
అంతే టీవీ ఉత్పత్తి అయ్యింది ,అబ్బే నలుపు తెలుపులో దృశ్యం ఉంటే ఏం బాగుంటుంది అనే ఆలోచన వచ్చింది
.
అంతే రంగుల టీవీ ప్రత్యక్షం అయ్యింది ,దృశ్యం అన్ని వైపులనుండి బాగా కనబడాలి అనే అవసరం గుర్తుకొచ్చింది అంతే flat TV పుట్టుకొచ్చింది .
.
దృశ్యం శబ్దం ఇంకా వాస్తవానికి దగ్గరగా ఉంటే! ఈ ఆలోచన lcd tv కి జన్మ యిచ్చింది.
.
అక్కడ నుండి LED tv,OLED,curve tv ,దాంట్లో వివిధ పరిమాణాలు లంకంత కొంపలో గోడకు సరిపోయినంత టీవీలు .కార్లు,ఫొన్స్,చివరికి టూత్ బ్రష్ లు కూడా ఎంత రూపాంతరం చెందాయో చూడండి.
.
ఒక్క క్షణం ఆగి మన ఇళ్ళలో ఒకే వస్తువును ఎన్ని సార్లు మార్చామో ఆలోచించండి !
.
ఈ మార్కెట్ మాయాజాలం అర్ధమవుతుంది .
.
కొనుగోలు శక్తి తగ్గుతున్నది అనుకున్నప్పుడు విరివిగా రుణాలు ఇవ్వడం అప్పుల భారం తల కెత్తడం దానికి మనము పెట్టుకున్న ముద్దు పేరు “ఆర్ధిక ప్రగతి”.
.
growth engine has started chug chugging
….దానికోసం వడ్డీ రెట్లు పెంచడం తగ్గించడం అంతా ఒక మాయా జాలం.
.
ఇదంతా విషయ వాంఛల వల్ల ఉత్పన్నమైన గందరగోళం ..
.
.ధ్యాయతే విషయాన్ పుంసః సంగస్తేషుపజాయతే , సంగాత్ సంజాయాతే కామః కామాత్ క్రోదోభిజాయతే …
.
విషయములను,భోగములను గురించి సదా ఆలోచించే మనుష్యుడు వాని యందు ఆసక్తి పెంచుకొంటాడు, ఆ ఆసక్తి వలన ఆ విషయముల పట్ల కోరిక ఉదయిస్తుంది ,ఆ కోరిక తీరక పోయిన ఎడల క్రోధం జనియిస్తుంది. క్రోధమునుండి మూఢ భావం జన్మిస్తుంది ,
దాని వలన మనిషి స్మరణ శక్తీ కోల్పోతాడు ,బుద్ది నశి౦చి పతితుడవుతాడు
.
ఇంద్రియాలను తన అధీనం లో ఉంచుకొన్న మానవుడు ప్రసన్నమైన ప్రసాద బుద్ది కలిగి ఉంటాడు
.
stress free life ! we don’t need stress management classes ..
.
ప్రాప్తంబగు లేశమైన పదివేలనుచున్ తృప్తిన్ చెందని మనుజుడు సప్త ద్వీపములనైన చక్కం బడునే అంటారు పోతనామాత్యులవారు.
.
ఆపూర్యమాణ౦ అచల ప్రతిష్టం ,సముద్రమాపః ప్రవిశ౦తి యద్వత్ ,తద్వాత్కామాయం ప్రవిశ౦తి సర్వే ,స శాంతి మాప్నోతి న కామ కామీ .
.
ఎన్నో నదులలో నుండి నీరు సముద్రాన్ని ప్రతి క్షణమూ చేరుతున్నది అయినప్పటికీ సముద్రమట్టం పెరగటంలేదు. సముద్రుడు చెలియలికట్ట దాటడం లేదు .
అదే విధంగా ఎన్ని విషయ భోగాలు ఊరించినా ఎవరిలో వికారం కలగకుండా ఉంటుందో వాడే నిజమైన శాంతిని పొందగలుగుతాడు.
.
కాబట్టి ప్రకటనల మాయాజాలం లో కొట్టుకు పోకుండా మనని మనం కాపాడుకుందాం .

జానకిరామారావు వూటుకూరు

Leave a comment