నాకు మంచి గుణపాఠం – Thanks Android Devicemanager

మా కజిన్ ఎంగేజ్ మెంట్ కు కొత్తగూడెం వెళ్లి వస్తూ సోమవారం ఉదయం 3.45 కుంట – ఖమ్మం – హైదరాబాద్ – RTC బస్సు
ఇమ్లిబన్ దగ్గర అందరూ బస్సు దిగుతున్నప్పుడు
నేను కళ్ళు తెరిచి చూస్తే బ్యాగు లేదు ( అందులో Digital Camera , Moto 4G Plus ,ఫోను ఒక జత బట్టలు , RayBan Sunglass )
వెంటనే Moto 4G కు కాల్ చేసాను , అది switched Off , వెంటనే Delivery Report enable చేసి మోటో ఫోను కు ఒక మెసేజ్ , ఒక whatsappమెసేజ్ పెట్టి , బస్టాండు లోన పార్క్ చేసిన బస్సు డ్రైవర్ ,ను కండక్టర్ ను పోయిన బ్యాగు గురించి అడిగాను వాళ్ళు తెలియదు అని చెప్పారు . అక్కడ RTC కంట్రోల్ రూములో బ్యాగు పోయింది అని చెపితే. “బ్యాగు తో ప్రయాణం చేస్తున్నప్పుడు ఎలా పడుకొన్నారు ఇప్పుడు వచ్చి పోయింది అని చెపితే ఎలా అని నిర్లక్ష్యపు సమాదానం “, అక్కడే ఉన్న పోలీసు ఔట్ పోస్టులో అడిగితే ” మీరు బ్యాగు పోయంది అని తెలుసు కొన్నది ఇమ్మ్ల బిన్ లో కదా అది మద్య దారిలో ఎక్కడ అన్నా పోయి ఉండవచ్చు , ఇక్కడ MGBS లో పోయిన వాటికే Complaint తీసు కొంటాము , అఫ్జల్ గంజ్ Police Station లో Complaint ఇవ్వమని చెప్పారు . దార్లో 5:05 కు మొబైల్ ,whatsapp డెలివరీ అయినట్లు మెసేజు వచ్చినది . వెంటనే https://www.google.com/android/devicemanager తో లాగిన్ అయ్యి వెతికితే KPHP దగ్గర భాగ్య నగర్ కాలనీ లో ఉన్నట్లు Trace అయ్యి మ్యాప్ లోకేష్ చూపించినది . నేను అఫ్జల్ గంజ్ Police Station లో ఇది చెపితే కంప్లైన్ట్ తీసుకొన్నారు , నేను ఫోను ఉన్న ప్రాంతం గురించి చేపితే ఇప్పడు ఆ సైబర్ సెల్ ఎవ్వరూ లేరు అని పొద్దున్న 11 గంటలకు పోయిన ఫోను “EMEI నెంబరు , అబాక్సు ” తీసుకువస్తే mobile IMEI number tracker ద్వారా చెపుతాము అని అన్నారు , వాళ్ళు ఫోను చేస్తే స్విచ్ ఆఫ్ అయినది , device manager లో ట్రేస్ కావటం లేదు . నాకు ఫోను దొరికినా బ్యాగులో ఉన్న cannon digital camera విలువైనది కావటంతో మళ్ళా స్టేషన్ బయటకు వచ్చి 100 కు కాల్ చేసి పరిస్థితి వివరించాను . వాళ్ళు KPHP Police Station రమ్మని చెప్పారు . ఇక నాకు ఇలాంటి సమయాలలో ఆపత్ బాంధవుడు అయిన నా తమ్ముడు భార్గవ్ కి ఫోను చేసి ఫోను లొకేషను ను whatsapp లో షేర్ చేసాను , అరగంటలో వాడు అక్కడికి వెళ్ళాడు నేను ఎక్కినా బస్సులో ఎక్కువగా ఒరిస్సా కు చెందిన వాళ్ళు ఉండటంతో బహుశా వాళ్లు వలస కూలీలు కావచ్చు నేమో అనుకోని వాళ్ళు ఉంటే వెతకమని అడిగాను . మావాడు డిటెక్టీవ్ గా ఆ దగ్గర సెక్యూరిటీ గార్డ్ లను చుట్టూ పక్కల వాల్లను అడిగి ఒక construction site లో ఒక ఇద్దరు ఓరిస్సా వాళ్లు పొద్దున్న వచ్చారు అని తెలుసుకొని నేరుగా వాళ్ళ దగ్గరకు వెళ్ళితే ఆ షెడ్డులో నాఫోను చార్జిగ్ పెట్టి ఉన్నారు మా తమ్ముడిని చూసి ఒకడు పారి పోయాడు ఇంకో అతను పారిపోతుంటే మావాడు పట్టుకొని రెండు పీకితే వాడు ఆ బ్యాగు అతను తియ్యలేదు అని ఆది ఆ తీసిన వాడు ఆ పారిపోయిన అతను అని నేను అతని బాబాయ్ అని చెప్పి క్షమించమని అడిగిగాడు బ్యాగు ,ఫోను , కెమెరా అన్ని తిరిగి ఇచ్చాడు . మావాడు ఒక్కడే అవటం వలన వాడిని చివాట్లు పెట్టి అక్కడ సూపర్ వైజర్ కు ఈ విషయం చెప్పి పోయిన బ్యాగుతో 6:30 కల్లా ఇంటికి వచ్చాడు
చాలా సంతషం వేసినది , ఖమ్మం నుంచి వచ్చేటప్పుడు మా అమ్మొమ్మ అమ్మ రెండు జతల గాజులు , గొలుసు ఇచ్చినది ఎందుకన్నా మంచిది అని అవి బ్యాగులో పెట్ట కుండా జేబులో పెట్టు కొన్నాను అందువలన ఇంకో ఫోను బ్యాగులో పెట్టటం అందులో DATA ఎనేబుల్ గా ఉండటం మంచిది అయినది. ఎంతో సమయస్పూర్తి తో , అతి త్వరగా స్పందించి ఆ దొంగలను ట్రేస్ చేసి నా వస్తువు లు అందించిన మా తమ్ముడు భార్గవ్ కి నెనర్లు . ఎంత సమాచారం ఇచ్చినను , అన్ని వనరులు ఉన్ననును సరిగా స్పందించ లేని పోలీసు వారికి, బ్యాగు ఉన్నప్పడు నిద్రపోకూడదు అన్న విషయం చెప్పిన RTC వారికి నా సానుభూతి .
విలువైన వస్తువులతో ప్రయాణం చేస్తూ కూడా సోయి లేకుండా దున్న పోతులా ఆదమరిచి నిద్రపోయిన నాకు మంచి గుణపాఠం . #Bag #Theft #Google#Devicemanager #Police #Act #lifelessons

Kasyap_MotoG