స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం – తెలుగు వికీపీడియా

వికీపీడియా – ఎన్‌సైక్లోపీడియా పేరును అనుసరిస్తూ పెట్టిన పేరిది. 2001 లో జిమ్మీ వేల్స్ అనే అమెరికనుకు వచ్చిందీ ఈ స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం ఆలోచన. ఎవరైనా రాయగలిగేదీ, దిద్దుబాట్లు చెయ్యగలిగేదీ, చదువుకునేందుకు ఇంటర్నెట్లో అందరికీ ఉచితంగా అందుబాటులో ఉండేదే స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం.  జర్మను, రష్యను, చైనీసు, హిందీ, తమిళం, బెంగాలీ  ఇలా ప్రపంచ వ్యాప్తంగా అనేక  భాషల్లోనూ వికీపీడియా తయారవుతోంది. గొప్ప గొప్ప వ్యాసాలెన్నో తయారయ్యాయి, అవుతూ ఉన్నాయి. ఇది మామూలు వెబ్ సైట్ల వంటిది కాదు. ఇక్కడ సమాచారాన్ని చూడటమే కాదు,  ఎవరైనా ఉన్న సమాచారంలో అవసరమైన మార్పుచేర్పులు చెయ్యవచ్చు . ఇక్కడ లేని సమాచారాన్ని చేర్చవచ్చు కూడా. మీరో వ్యాసాన్ని దిద్దుబాటు చెయ్యడం మరియు కొత్త వ్యాసాన్ని ప్రారంభించడం కూడా చెయ్యవచ్చు.

 Image

వికీపీడియా – తెలుగు విజ్ఞాన సర్వస్వం   http://te.wikipedia.org

 తెలుగు వికీపీడియా ప్రారంభించి డిసెంబర్ 2013కు పదిసంవత్సరాలు నిండబోతున్నది. వెన్న నాగార్జున తెలుగు వికీపీడియాను స్థాపించారు ఈ ప్రయాణం ఉద్ఘంటభరితంగా సాగిందనే చెప్పాలి. వందలకొలదీ సభ్యుల కృషి ఫలితమే ఈనాటి తెలుగు వికీపీడియా మరియు ఇతర తెలుగు వికీమీడియా ప్రాజెక్టుల ప్రస్తుత రూపం.   తెలుగులో విజ్ఞాన సర్వస్వాలు చాలా అరుదు. అందునా ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా లాంటి బృహత్తర విజ్ఞాన సర్వస్వం అసలు లేనేలేదు. ప్రతీ సందేహానికి పుస్తకాలు కొని వెతకాలన్నా,కొన్ని కోట్ల పేజీలు వున్న ఇంటర్నెట్ లో సమగ్రం గా వెతకాలి అన్నా , ఎవరినైనా అడగాలన్నా చాలా సమయం పడుతుంది. ఇది ఒకోసారి సాధ్యంకాకపోవచ్చు. కాని నిమిషాల్లో వీకీపీడియా ద్వారా ఈ సమాచారం తెలుసుకోవచ్చు. అది కూడా మన మాతృభాష తెలుగులోనే. ప్రత్యేక సాఫ్ట్వేర్లతో పనిలేకుండా తెవికీలోనే నేరుగా తెలుగులో టైపు చేయగలిగే సదుపాయం తెలుగు వికీపీడియాలో  కలదు, తెలుగు టైపింగు రాకపోయినా  మన పేరు ఇంగ్లిష్ లో రాసినట్లే  లిప్యంతరీకరణ  ద్వారా తెలుగు లిపిలో కూడా వ్రాయవచ్చు , దీనికి ఓ ఐదు నిమిషాల సాధన చాలు , వేగంగా టైపు చేయకలిగిన వారికి  ఇన్‌స్క్రిప్టు  సౌలబ్యము కూడా ఉన్నది.  ప్రస్తుతం తెలుగు వికీపీడియాలో 53 వేల పైన  వ్యాసాలున్నాయి.

 

వికీపీడియా గురించి తెలియని ఇంటర్నెట్ వాడుకదారులు ఉండరు అన్న మాట అతిశయోక్తి అనిపించేంతగా వికీ మనకు దగ్గరయింది. ఆంగ్లంలో ప్రతి వాడుకరి దాదాపు ఏ కొత్త విషయమై తెలుసుకోవాలన్నా వికీ నే సందర్శిస్తారు  అయితే తెలుగునాట తెలుగు జనంలో వికీ ఇంకా చాలా ప్రాచుర్యం పొందాల్సి ఉంది  వికీపీడియా ఒక్క విజ్ఞానసర్వస్వమే కాక ఇంకా మరెన్నో రూపాలుగా మనకు ఉపయోగపడుతుంది కొందరికి యాత్రాదర్శినిగా, కొందరికి ఏదో ఒక విషయమై ప్రమాణంగా పరిగణించబడుతుంది  ఇలా చెప్పుకుంటూ పొతే అన్ని రకాలుగా వికీ ని మనం వాడుకోవచ్చు  వికీపీడియా మరియు అనుబంధ కార్యక్రమాలను ఆంగ్ల మాధ్యమం వారు విరివిగా వాడుకుంటారు.

 మీరూ వికీపీడియాలో చేరండి. మీ స్నేహితులనూ చేర్పించండి. చరిత్ర సంస్కృతి, ప్రముఖ వ్యక్తులు, సినిమా, భాష, నగరాలు, ఆహారం, పురాణాలు, పద్యాలు, సంగీతం, పట్టణాలు, గ్రామాలు, రచయితలు, కంప్యూటర్లు, సైన్సు, రాజ్యాంగ వ్యవస్థ, నదులు..ఇలా ఎన్నో విషయాలపై భావితరాల వారికి ఒక ఉచిత విజ్ఞాన సర్వస్వాన్ని అందించడంలో చేయి కలపండి. వికీపీడియాలోని సమాచారాన్ని వ్యక్తిగత ప్రయోజనాలకు , వ్యాపార ప్రయోజనాలకు ఉచితంగా ఉపయోగించుకోవచ్చు , ప్రాధమికంగా ఆ సమాచార  పాఠ్యం , చిత్రములు  క్రియేటివ్ కామన్స్ అట్రిబ్యూషన్/షేర్-అలైక్ లైసెన్సు క్రింద లభ్యం; అదనపు షరతులు వర్తించవచ్చు.

 

 

ముఖ్యమైన తెలుగు వికీపీడియా సోదర ప్రాజెక్టులు:

 

విక్షనరిః  నిఘంటువు – http://te.wiktionary.org  : విక్షనరీ ఎవరైనా పాల్గొనదగిన ఒక స్వేచ్ఛా బహు భాషా పదకోశం  ఇందులో మనమంతా సంకల్పిస్తే సంవత్సరం లో మన అన్ని మాండలిక మరియు మౌఖిక పదాలను వాటి అర్థ-స్వరూప-ఉదాహరణ సహితంగా చేర్చి ఉపయోగించుకోవచ్చు .

వికికోట్ – http://te.wikiquote.org/ : వికీవ్యాఖ్య ఒక ఉచిత ఆన్లైను వ్యాఖ్యల భాండాగారము. ఇందులో అన్ని భాషల ప్రముఖులు చేసిన వ్యాఖ్యలు, వాటి అనువాదాలు కూడా లభిస్తాయి .

వికిబూక్స్ –  http://te.wikibooks.org/ :  ఇది స్వేచ్ఛానకలుహక్కులతో సమిష్టిగా తయారు చేయగల పుస్తకాల జాల స్థలి  పుస్తకాల నెలవు — మనకు ఉచితంగా అందుబాటులో ఉన్న పుస్తకాలను ఇక్కడ చేర్చవచ్చు  .

వికిసోర్స్ః http://te.wikisource.org/ ఎవరైనా అభివృద్ధిపరచగల స్వేచ్ఛా విజ్ఞాన మూలములు  మూలరూపాల సమాహారం — మనం నిత్యం చదువుకునే ఏ స్మృతి-శృతి సంహిత అయినా, మన శతకకారులు రచించిన శతకములు, వేద-వేదాంగాలు, పురాణ-ఇతిహాసాలు ఇక్కడ వాటి మూల రూపంలో పొందుపరుచవచ్చు. 

వికిస్పిషీస్ః జీవరాశుల సమాచారం — మన జీవ శాస్త్రం అన్ని రకాల జీవ-వృక్ష-జంతువులను ఒక ప్రణాళికననుసరించి క్రమబద్ధీకరించి విభజించింది. ఆయా జీవాల విభజన సమాచారం ఇక్కడ అందుబాటులో ఉంటుంది.

వికీన్యూస్ః సమాచార స్రవంతి — వార్తలు వాటి విశ్లేషణలు.

వికివర్సిటీః అభ్యాస సామగ్రి — వివిధరకాల విషయాలపై అధ్యయనం, ఆలోడనం చెయ్యాలనుకునే వారికి సహాయకారి.

వికీమీడియా కామన్స్ః ఉచితంగా అందుబాటులో ఉండే చిత్రాల మరియు చలనచిత్రాల సంకలనం — ఇక్కడ మీరు అందరితో పంచుకునే విధంగా ఎటువంటి కాపీరైటులేని క్రియేటివ్ కామన్స్ మరియు ఇతర సంబంధిత లైసెన్స్ లలో అనేక చిత్రాలు(ఫోటోలు) పెట్టుకోవచ్చు.   

మీడియావికిః వికి లాంటి గూడును మీరూ చేస్కోవాలంటే ఇది ఒక అచ్చులా వాడుకోవచ్చు ఉదాహరణకు మనం విక్షనరీని మన భాషా పదాలకు, ప్రస్తుత వ్యావహారిక పదాలకు, ప్రాచీనాంధ్ర పదాలకు, ప్రాంతీయ మాండలికాలకు ఒక నిఘంటువుగా మలచుకోవచ్చు.

 

వికీపీడియాలో ఖాతా తెరుచుట

 

వికీపీడియా వాడుకరిగా  నమోదు చేసుకొన్నవారు వికీపీడియాలో క్రొత్త వ్వాసాలు వ్రాయవచ్చు. బొమ్మలను ఎక్కించ వచ్చు, వ్యాసాలకు కొత్త పేర్లను సూచించ వచ్చు. ముఖ్యమైన విషయమేమంటే మీరు చేసిన మార్పులు, చేర్పులు మీపేరున నమోదు అయి వుంటాయి. వికీపీడియాలో మీకొక గుర్తింపు వుంటుంది. దీనివలన మీలాంటి ఇతర వికీపీడియన్ల తో సత్సంబందాలు కలిగి వుండవచ్చు. వికీపీడియాకు అలవాటు పడిన తర్వాత ఇతర వికీపీడియన్ల తో చర్చలు జరప వచ్చు వారి సందేహాలను నివృత్తి చేయవచ్చు.

వికీ పీడియాలో పేరు నమోదు చేసుకోకుండా కూడ మార్పులు చేర్పులు చేయవచ్చు. కాని ఆ మార్పులు చేర్పులు మీ పేరున కాకుండా అంతర్జాల .ఐ.పి. చిరునామ మీద చేరగలవు. అటువంటి మార్పులను వికీపీడియా తొలగించే అవకాశముంటుంది; ముఖ్యంగా నిబందనలకు విరుద్దంగా వున్న వాటిని. ఉదాహరణకు…. ఒక పాఠశాల విద్యార్ది తన పాఠశాల గురించి వ్యతిరేకత కలిగి యుండి చెడుగా వ్రాసి పాఠశాల గౌరవానికి భంగకరంగా వుంటె…. అలాంటివాటిని తొలిగిస్తారు.

అకౌంటు (పేరు నామోదు చేసుకోవడం) సృష్టించు కోవడానికి వికీపీడియా  http://te.wikisource.org  మెదటి పుట పైన కుడివైపు వున్న అకౌంటు సృష్టించు అను దానిపై నొక్కి మీపేరు వ్రాసి మీకొరకు ఒక పాస్ వర్డ్ ఎంచుకొండి. తరువాత సృష్టించు create account అను దానిపై నొక్కాలి. అంతే మీరు మీ పేరున అకౌంటు సృష్టించి నట్లే. మీ పేరు వికీపీడియాలో నమోదైపోయింది.

వికిపీడియాలో అకౌంటు సృష్టించటం సులభం మరియు మీరు దానికొరకు వ్యక్తిగత సమాచారము ఇవ్వవలసిన అవసరం లేదు.

వికీపీడియా మొదటి పేజీలో స్వాగత పట్టీ  ఉంటుంది , దీనిలో పరిచయం • అన్వేషణ • కూర్చడం • ప్రశ్నలు • సహాయము • తెలుగు టైపుచేయుట • ఖాతా వలన లాభాలు •లాగిన్ పేజీ • ఎలా తోడ్పడవచ్చు? • విహరణ • విశేష వ్యాసాలు  • ప్రయోగశాల • సహాయ కేంద్రం వంటి వివరాలు ఉంటాయి .

                                                                                       Image                                                                      

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s