తెలుగు వెబ్‌సైట్ల నిర్మాణంలో సాంకేతికాంశాల గురించి వెబ్ డెవలపర్లకు అవగాహనా సదస్సు

 అంతర్జాలంలో తెలుగు భాషా వ్యాప్తి కోసం కృషి చేస్తున్న స్వచ్ఛంద సంస్థ e-తెలుగు   వెబ్ డెవలపర్స్ కొరకు ఒక సదస్సు ను ఈ ఆదివారము, ఏప్రిల్ 15 న హైదరాబాద్ లో నిర్వహించనుంది. ఈ సదస్సు పూర్తిగా ఉచితం. , దయచేసి మీ ఆగమనాన్ని శనివారము సాయంత్రం ఎనిమిది గంటలకు ముందు గానే  9396533666  ku  మీపేరు , ఈమెయిలు ను  SMS చేసి ద్రువపరచ గలరు ,  వీలయితే ఈ ఆహ్వాన పత్రమును మీకు తెలిసిన అంతర్జాల సాంకేతిక నిపుణులతో పంచుకొనగలరు ,    . ఈ వర్క్ షాపులో ఈ అంశాలను చర్చిస్తాము .
ఇన్‌లైన్ చిత్రం 1 
 
కంప్యూటర్ నిర్వాహక వ్యవస్థలలోనూ, ఇతరత్రా ఉపకరణాలలోనూ యూనికోడ్ ప్రమాణానికి తోడ్పాటు (ప్రత్యేకించి తెలుగు వంటి సంక్లిష్ట లిపులకు సాంకేతిక తోడ్పాటు, ఫాంట్ల అందుబాటు) పెరగటంతో ఇప్పుడు జాలంలో తెలుగు సమాచారం అనేక రూపాల్లో వెల్లివిరుస్తూంది. సమాచార సాంకేతిక ఫలాలు అన్ని వర్గాలకీ అందాలంటే ఇంకా అనేక రంగాల గురించిన సమాచారం జాలంలో అందుబాటు లోనికి రావాలి.
 
తెలుగులో వెబ్ సైట్లు తయారు చేసే వారికి కంప్యుటర్లు మరియు జాలంలో తెలుగు గురించిన సాంకేతిక అవగాహనను కల్పిస్తే, వారు తెలుగు సమాచారాన్ని అందించే వైవిధ్యమైన జాలగూళ్ళను వెలుగు లోనికి తీసుకువస్తారు. వారికి కావాల్సిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడానికే ఈ అవగాహనా సదస్సు!
 
సమయం
ఆదివారం, ఏప్రిల్ 15, 2012 — ఉదయం 10 గంటల నుండి
మధ్యాహ్నం 12 గంటల వరకు
 
వేదిక
హనీపాట్ ఐటీ కన్సల్టింగ్ ప్రై. లి.
6-2-46, అడ్వొకేట్స్ కాలనీ,
ఏసీ గార్డ్స్, లకడీ-కా-పూల్,
హైదరాబాద్ – 500 004.
(గూగుల్ పటం)
 
సంప్రదింపులు:
93965 33666, support @ etelugu [dot] org 
 
దయచేసి ఈ ఆహ్వాన పత్రమును మీకు తెలిసిన అంతర్జాల సాంకేతిక నిపుణులతో పంచుకొనగలరు ,  మీకున్న సాంకేతిక సమస్యలను నలుగురితో చర్చించి వాటికి పరిష్కారమూ పొందవచ్చు. పాల్గొన్నవారందరికీ ఈ సమావేశం నూతనోత్సాహాలను కలగజేస్తుందని ఆశిస్తున్నాం. తెలుగు భాషకు ఆధునిక హోదా తెచ్చే దిశలో మీ సహకారము మాకు చాలా విలువైనది , తెలుగు   వెబ్‌సైట్ల  , బ్లాగుల  వాడకాన్ని , కంప్యూటర్ , అంతర్జాలం లో తెలుగు  ప్రోత్సహించాల్సిందిగా అభ్యర్థిస్తున్నాము.
 
Advertisements

2 responses to “తెలుగు వెబ్‌సైట్ల నిర్మాణంలో సాంకేతికాంశాల గురించి వెబ్ డెవలపర్లకు అవగాహనా సదస్సు

  1. “తెలుగు భాషకు ఆధునిక హోదా తెచ్చే దిశలో మీ సహకారము మాకు చాలా విలువైనది , తెలుగు వెబ్‌సైట్ల , బ్లాగుల వాడకాన్ని , కంప్యూటర్ , అంతర్జాలం లో తెలుగు ప్రోత్సహించాల్సిందిగా అభ్యర్థిస్తున్నాము.”

    మీ ప్రయత్నం అద్భుతంగా ఉంది. మా సంపూర్ణ మద్దతు మీకు ఉంది. సదస్సు విజయవంతం కావాలని కోరుకుంటున్నాం.

    సదస్సు ముగిశాక వివరాలను ఇదే బ్లాగ్ లో పోస్ట్ చేయగలిగితే హైద్రాబాద్ లొ లేనివారికి ఉపయోగంగా ఉండగలదు. మీకు వీలుంటేనే సుమా.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s