తెలుగు బ్లాగుల దినోత్సవం -ఆహ్వానం!

తెలుగు భాష మన సంస్కృతికి ప్రతిరూపం! మన జీవన సౌందర్యం! తేనె కన్నా తీయనిది తెలుగు! తల్లి తర్వాత తల్లి లాంటిది మన మాతృభాష! మన భావాలకు, అనుభూతులకు భావోద్వేగాలకు వాహిక తెలుగు భాష! శబ్ద సౌందర్యం, అక్షర సౌష్టవం తెలుగు ప్రత్యేకత! ఇంత చక్కని మన మాతృభాషను కాపాడుకోవడం,సజీవంగా ఉంచుకోవడం, నిత్య నూతనంగా ఉంచుకోవడం మలచుకోవడం బిడ్డలుగా మన కర్తవ్యం! అంతర్జాలంలో తెలుగు భాషా వ్యాప్తి కోసం కృషి చేస్తున్న స్వచ్ఛంద సంస్థ e-తెలుగు.

తెలుగు భాషకు ఆధునిక హోదా తెచ్చే పక్రియలో భాగంగా అంతర్జాలంలో తెలుగు బ్లాగులను ప్రోత్సహించటానికి ప్రతీ సంవత్సరం డిసెంబరు రెండో ఆదివారం తెలుగు బ్లాగు దినోత్సవంగా జరుపున్నాము , అంతర్జాలంలో మనకంటూ ఒక అందమైన ఇల్లు కట్టుకుని Blog URL , మన భావవ్యక్తీకరణకు వేదికచేసి పదిమందితో పంచుకునేదే బ్లాగు ,అంతర్జాలంలో మనకంటూ ఒక అందమైన ఇల్లు కట్టుకుని Blog URL , మన భావవ్యక్తీకరణకు వేదికచేసి పదిమందితో పంచుకునేదే బ్లాగు, నేడు ఏడువేలకు పైన తెలుగు బ్లాగులు అంతర్జాలంలో తెలుగు వెలిగిస్తున్నాయి , వివరాలకు తెలుగు బ్లాగుల గుంపు http://groups.google.com/group/telugublog వివిధ తెలుగు బ్లాగులకు http://www.koodali.com, http://maalika.org/ మరియు తెలుగు లో బ్లాగు రాయటానికి http://nerpu.com/ ను సాంకేతిక సహా.యమునకు http://etelugu.org/ చూడండి.

ఈ నెల రెండవ ఆదివారం అనగా (డిసెంబర్ 11న) తెలుగు బ్లాగుల దినోత్సవం సందర్భంగా తెలుగు బ్లాగర్ల సమావేశం మరియు తేనీటి విందుని e-తెలుగు ఏర్పాటు చేసింది. తెలుగు బ్లాగర్లందరూ దీనిలో పాల్గొని విజయవంతం చేయమని ప్రార్థన. వచ్చే ఏడాదికి తెలుగు బ్లాగులు “లక్ష బ్లాగులూ కోటి సందర్శకులు”గా ఎదగాలని ఆశిస్తూ… తెలుగు బ్లాగరులందరికీ ఇదే మా ఆహ్వానం!
సమయం:
ఆదివారం, డిసెంబర్ 11, 2011 మధ్యాహ్నం 3 గంటలకు
వేదిక:
హనీపాట్ ఐటీ కన్సెల్టింగ్ ప్రాంగణం,
6-2-46, అడ్వొకేట్స్ కాలనీ, ,ఏసీ గార్డ్స్, లకడీ-కా-పూల్,,హైదరాబాద్ – 500 004. (పటం) సంప్రదింపులు: 93965 33666
ఇప్పటివరకూ బ్లాగ్ముఖంగా మాత్రమే పరిచయమున్న మిత్రులను కలిసే సదవకాశమిది. మీకున్న సాంకేతిక సమస్యలను నలుగురితో చర్చించి వాటికి పరిష్కారమూ పొందవచ్చు. పాల్గొన్నవారందరికీ ఈ సమావేశం నూతనోత్సాహాలను కలగజేస్తుందని ఆశిస్తున్నాం. తెలుగు బ్లాగుల వాడకాన్ని ప్రోత్సహించాల్సిందిగా అభ్యర్థిస్తున్నాము

Advertisements

4 responses to “తెలుగు బ్లాగుల దినోత్సవం -ఆహ్వానం!

  1. నాకు రావాలని ఉంది కానీ అనారోగ్య కారణాలవల్ల రాలేకపోతున్నాను… అందరికీ నా శుభాకాంక్షలు
    -శ్రీనివాస్ ( బ్లాగిల్లు డాట్ కాం )

  2. రేపటి నుండి , అంటే 11.12.2011 నుండి దాదాపు పది రోజులు ఊళ్ళో ఉండడం లేదు. రేపు విశాఖకి బయలు దేరుతున్నాము. సభలకి రాలేక పోతున్నందుకు బాధగా ఉంది.
    సోదర బ్లాగు మిత్రులందరికీ నా అభినందనలు. మరియు శుభాకాంక్షలు.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s