విషాద వార్త

లెనిన్  , ఆదిలక్ష్మిగారు ల వార్త చదివిన తరువాత  ఎందుకో తెలవదు విపరీతం అయిన బాద వేసినది , నేను ఎప్పుడూ ఆదిలక్ష్మి గార్ని చూసింది లేదు మాట్లాడినది లేదు    ఇలాంటివి జరిగినప్పుడు అనిపిస్తుంది ఒక మనిషి రాతలకు ఇంత శక్తి వున్నదా ఈ ఏడు సంవత్సరాలలో ఎన్నో తెలుగు బ్లాగులని చూసా ఎవరు ఏమి రాసినా పెద్దగా పట్టించు కోలేదు కాని ఎందుకో తెలవదు పొద్దున్న నుండి ఏదో అసహనం గా వున్నది , వాళ్ళ అమ్మాయి చనిపోయిన రోజు ఆ బ్లాగు చదువు తుంటే కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి నా  అంతర్జాల జీవితంలో ఎప్పడు ఇలా బాద పడినది లేదు మా టిమాడ్ గుంపులో కూడా చాలా విషాద వార్తకు కూడా నన్ను ఇంతగా బాద పెట్టలేదు లెనిన్  , ఆదిలక్ష్మిగారు  తమ ప్రియమైన కూతురు తనువు చాలించడంతో తట్టుకోలేకపోయి ఇలా జీవితాన్ని ముగించాలను కోవడం చాలా బాధాకరం . చందమామ రాజు గారికి చెప్పినట్లు అందరు కలసి అమ్మ ఒడిని ఖాళి చేసారు

వీరి విషయంలో ఏరకంగానూ సహాయపడలేక పోయినందుకు నాకు చాలా  బాధగా ఉంది.

Advertisements

3 responses to “విషాద వార్త

 1. నిన్న సాయంత్రం -శుక్రవారం- కూడా లెనిన్ బాబుగారితో చందమామ ఆఫీసునుంచి ఫోన్ చేసి మాట్లాడాను. ఆదిలక్ష్మిగారు గతంలో పంపిన కథ “తీపికి చేదు చెల్లుకు చెల్లు”ను ఈ సెప్టెంబర్‌ నెలలోనే చందమామ ప్రచురించిందని, మీ కొత్త చిరునామా పంపితే చందమామ కాపీ, రెమ్యునరేషన్ పంపుతామని ఆయనతో మాట్లాడితే శనివారం తప్పుకుండా చిరునామా పంపుతానని చెప్పారు. తీరా శనివారమే ఘోరం జరిగిపోయింది. లెనిన్‌గారు ఉన్నారు కాబట్టే ఆమె గత నెలన్నర రోజులగా బతికి ఉన్నారు. వ్యవస్థపై తనదైన పోరాటంలో వాళ్లిద్దరూ తన చిట్టితల్లి గీతాప్రియదర్శినిని తమ జీవిత సర్వస్వంగా ప్రేమించారు. పదిహేనేళ్లకు పైగా వారు పడుతూ వస్తున్న తీవ్ర ఆర్థిక, మానసిక బాధలకు కన్నకూతురిపై ప్రేమ రూపంలో వారికి స్వాంతన దొరికిందనుకుంటాను. భారతీయ సాంప్రదాయిక విశ్వాసాలపై ఎనలేని ప్రేమ గల ఆమెకు తన కన్న కూతురు చితాభస్మాన్ని గంగానదికి తీసుకెళ్లి కలపాలని ఉండేది. స్థలం మారితే అన్నా కాస్త తెప్పరిల్లుతుందేమో అనిపించి, ఈ విషయం లెనిన్ బాబుగారు వారం రోజుల క్రితం చెబితే తప్పకుండా తీసుకెళ్లమని చెప్పాను. చివరకు ఆ కోరికకూడా తీరనట్లుంది. ఎన్నడూ లేనిది శుక్రవారం మాట్లాడినప్పుడు ఆయన గొంతు చాలా డల్‌గా వినిపించింది. ఇప్పుడనిపిస్తోంది. ఆయన అప్పుటికే ఇక జీవితం వద్దు అని నిర్ణయానికి వచ్చారేమో. వారు కన్నకూతురు తమనుంచి దూరమయినందుకు కూడా పెద్దగా బాధపడలేదనుకుంటాను. కాని నరకబాధలు పెట్టిన ఆ కోచింగ్ సెంటర్‌ నిర్వాహకుడిని చివరిసారిగా కలిసి ఒకే కోరిక కోరారట. ఏమంటే ఆ సెంటర్లో పాపను ఒక పనామె చాలా బాగా చూసుకుందట. రోజూ ప్రియదర్సిని ఆ పనామె ఆదరణ గురించి ఇంట్లో చెప్పేదట. బతికి ఉండగా తమ పాపను స్కూల్లో అందబాగా చూసుకున్న ఆ పనావిడకు కృతజ్ఞతలు చెబుతామనే ఉద్దేశంతో ఆమెను చూపించమని నిర్వాహకుడిని అడిగితే ఆమె క్లాసుల వద్దకు పనిమీద వెళ్లిందని, కలపడం కుదరదని చెప్పాడట ఆ రాక్షసుడు. తమ పాప మరణానికి కారణమంటూ కోచింగ్ సెంటర్ మీద కేసు పెట్టాలని ఎంతో మంది సలహా ఇచ్చినా మనిషే పోయాక ఇక కేసు ఎందుకు అనే నిర్వేదంలో ఆ పనికి పూనుకోలేదు వీళ్లు. అలాంటిది ఆ నిర్వాహక రాక్షసులు ఆ పనామెను చివరిసారిగా కలుసుకునేందుకు కూడా తమకు అవకాశం ఇవ్వకపోవడం చూసిన క్షణంలోనే వారి గుండె బద్దలయిపోయింది. లోకం ఎందుకింత అన్యాయంగా మారిపోయిందనే వేదన… కూతురు ప్రాణాలు పోవడానికి కారకులైనవారిని కూడా క్షమించిన తమ పట్ల ఇంత నిర్దయగా వారు ఎలా వ్యవహరించారన్న ఆక్రోశం.. వారి బాధను మరింత రెట్టింపు చేసి ఉన్నట్లుంది.

  జూలై 15న చందమామలు బ్లాగులో ప్రియదర్శిని ఆత్మహత్య గురించి ప్రచురించిన కథనాన్ని వాళ్లు చాలా లేటుగా చూశారట. నా అభ్యర్థనను మన్నించి కొంతమంది అజ్ఞాతంగా పంపిన సహాయానికి లెనిన్ బాబు గారు కృతజ్ఞతలు చెప్పారు. సానుభూతి కంటే, తమను మరింతగా పట్టించుకుని ఉంటే, ఇంటివద్దకు ఎవరైనా వచ్చి కలిసి ఉంటే, ఆమెకు స్వాంతన చెప్పి ఉంటే చాలా బావుండేదని ఆయన బాధ వ్యక్తం చేశారు.

  ఒక మాటమాత్రం నిజం. వాళ్లు మహానగరంలో ఉండి కూడా భయంకరమైన ఒంటరితనం బారిన పడే ఈ ఘోరానికి పాల్పడ్డారనిపిస్తోంది. పిల్లలకోసం పెట్టిన స్కూలు కూడా నిలిపేశారు. బంధువుల ఒత్తిడి మేరకు వారికి దగ్గరగా ఉన్న అద్దె ఇంటికి మారారు. రెండు నెలలపాటు ఏ పనీ లేకుండా, పైగా అపరిమిత బాధలో ఉన్న ఈ తల్లిదండ్రులు ఇరవై ఏళ్లుగా తాము చేస్తున్న జీవన పోరాటం ఇక చాలని అలసి పోయారనుకుంటాను.

 2. We are a cursed race. Education and Health… where lies the the essence of values in a civilization and culture have degenerated to the deplorable levels. Unless youth makes a conscious effort to reverse the trend… we will be condemned to read such stories and helplessly hope against hope such things shall nor recur. I hope the inadvertent tears that rolled down reading the news and the blog would give the family enough strength to bear with this misfortune than the hollow words of my sympathy.
  best regards
  Murty

 3. ఆడపిల్లల్ని పురిట్లోనే నలిపేస్తున్న ఈ రోజుల్లో కన్న కూతురు ఎడబాటును తట్టుకోలేక తనువు చాలించారా ఈ తల్లిదండ్రులు?
  చాలా విషాదకర వార్త.
  తాముండి మరింతమంది ఆడపిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దగలిగతే వీరి దుఃఖం కొంత తీరి ఉండేదేమో?!
  కాని ఇంత తీవ్రమైన నిర్ణయం తీసుకున్న ఈ తల్లిదండ్రుల ప్రేమకు కొలబద్ద ఉన్నదో లేదో?!
  నేనింకా ఈ ఘోరాన్ని అర్ధం చేసుకోలేకుండా ఉన్నాను.

  ఈ తల్లిదండ్రుల బాధ, వేదన బహుశా చాలాకాలం మనల్ని వెంటాడుతుంది.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s