అక్షరం తలదించుకున్న వేళ

ఆమధ్య హాసం పత్రిక మూత బడినందుకు ఎంతో భాద వేసినది ,ఈ దౌర్బాగ్యం మన దేశము/ పరదేశం లో ఉండటం మన దురదృష్టం నాటి బాదకు అక్షర రUపం రచ్చ్అ బండ లో తెలుగు నాడి గురించి బ్రహ్మానందం గారు రాసినది మీతో పంచుకోవాలని –

కొత్త నెలని గుర్తు చేస్తూ ఆ పత్రిక వచ్చింది. ఎప్పటిలాగే ఏముందా అని ఒక్కసారి పేజీలు తిప్పాను. సాధారణంగా పత్రిక రాగానే ఆసాంతం చదివేస్తాను. రాత్రి పడుక్కోబోయే ముందు చదవుతాను కదా అని ప్రతీ శీర్షికా ఓపిగ్గా చూడలేదు. రాత్రి చదువుదామని పుస్తకం తెరిచి సంపాదకీయం దగ్గరే ఆగిపోయాను. పేజీలు తిప్పానుకానీ, చదవబుద్ధి కాలేదు. అప్రయత్నంగా కళ్ళు చెమ్మ గిల్లాయి. మనసంతా
స్థబ్ధుగా అయిపోయింది. ఆ గదంతా విషాదం ఆవరించింది. గత అయిదేళ్ళుగా అప్రతిహతంగా అమెరికాలో వెలువడే ఒక పత్రిక ఇహ రాదన్న భావనే ఆ స్థితికి కారణం. అయిదేళ్ళ జన్మదిన సంచికే ఆఖరి సంచికగా మారిన ఆ పత్రిక తెలుగు నాడి. జంపాల చౌదరి గారి సంపాదకత్వంలో వస్తున్న ఆ పత్రిక వెనక ఎంతో మంది సాహితీకారులున్నారు. అందరూ కలిసి ఇన్నాళ్ళూ నడిపించారు.
కేవలం సంపాదకీయం చదివితేనే నా కిలా అనిపిస్తే, అది రాసిన వ్యక్తి పరిస్థితి ఊహించగలను. అది సంపాదకీయం కాదు. ఒక వీడ్కోలు. ఒక విషాదం. ఒక అయిష్ట నిష్క్రమణ. అయిదేళ్ళ శ్రమకి అర్థాంతరంగా ముగింపిస్తూ చేతులెత్తేసిన ఆవేదన. నీరు పోసి పెంచీ, పూలు పూస్తున్న మొక్కని స్వహస్తాలతో పెకలిస్తున్న బాధ. అది చదివి మనిషిగా బాధ పడ్డాను. తెలుగు వాడిగా సిగ్గుపడ్డాను. నన్ను చూసి అక్షరం
తలదించుకుంది.కర్ణుడి మరణానికి సవాలక్ష కారణాలుండచ్చు కానీ, ఒక పత్రిక అర్థాంతరంగా ఆగిపోడానికి కారణం మాత్రం ఖచ్చితంగా పెట్టుబడే! అందునా అచ్చు పుస్తకానికి ఊపిరి డబ్బే! అది లేకపోతే ఎంత మంచి సాహిత్యమున్నా వెలుగు చూసే అవకాశముండదు. సభల్లోనూ, వేదికలెక్కీ తెలుగు భాషని బ్రతికించుకోవాలీ, కాపాడుకోవాలీ అంటూ ఊక ఉపన్యాసాలిచ్చే తెలుగు వారు ఎక్కువే! ముఖ్యంగా అమెరికాలాంటి దేశంలో
తెలుగు వారి గురించి కొత్తగా చెప్పనవసరం లేదు. అథమపక్షం ఊరికి రెండో మూడో తెలుగు సంఘాలుంటాయి. సాహిత్యమూ, సంస్కృతీ అంటూ గొంతెత్తి అరుస్తాయి. ఇండియాలో పత్రికల్లో ఫొటోలు వేయించుకుంటాయి. ఆహా, ఓహో అంటూ రాయించుకుంటాయి. అంతవరకే! అమెరికాలో ఒక తెలుగు పత్రిక ఇక్కడి ఇంగ్లీషు పత్రికలకి ధీటుగా ప్రచురింప బడుతోందీ, ఏడాదికి కేవలం 24 డాలర్లు మాత్రమే – పుస్తకం మీ ఇంటికి మెయిల్
చెయ్యబడుతుందని చెప్పినా ఎవరూ ముందుకు రారు. ఎందుకంటే తెలుగు వారికి పుస్తకాలు చదివే అలవాటు తక్కువ. ఉన్న కొద్ది మందీ పక్కవాడు పుస్తకం కొంటే తీరుబడిగా తిరగేస్తారు తప్ప, ఓ డాలరు ఖర్చు పెట్టి కొనరు. ఇదీ తెలుగువారి దౌర్భాగ్యం.
అమెరికాలో సుమారు రెండు లక్షల పై చిలుకు తెలుగు వారున్నారు. ఒక్క సిలికాన్ వేలీ లోనే డెబ్భై వేల మందున్నారు. కనీసం ఇందులో నాలుగో వంతు జనాభా ఈ తెలుగునాడి పుస్తకం కొన్నా, ఈ పత్రిక మూత పడే అవకాశం ఎంతమాత్రమూ రాదు. ఇహ వ్యాపార ప్రకటనలు. కనీసం వందమంది వ్యాపారవేత్తలు తలో చేయీ వేసినా చాలు. కానీ ఎవరూ ముందుకురారు. ఇహ తెలుగు సంఘాలూ అంతే! వేలకు వేలు ఖర్చు పెట్టి సినిమా వాళ్ళని
తెచ్చుకునే దాంట్లో పదోవంతయినా ఇలాంటి పత్రిక నిలపడానికి వెచ్చిస్తే ఈ పరిస్థితి రాదు.
తెలుగు వాళ్ళకి ఆత్మాభిమానం తక్కువ. మనది అన్న భావన లేదు. మన సాహిత్యమన్నఅభిమానం అంతకన్నా లేదు. దేశం మారినా పాత అలవాట్లు పోవు. మనస్తత్వం మారదు. నిజానికి ఏడాదికి 24 డాలర్లు అమెరికాలో ఉండే తెలుగు వారికేమంత ఎక్కువ కాదు. ఇక్కడా ఎక్కువా తక్కువా అనేకంటే మన భాష మీదా, సాహిత్యం మీదా మక్కువ లేదు. ఉన్నా అది ఉచితంగా కావాలి. ఇదీ తెలుగువారి సాహిత్యాభిమానం.
అమెరికా నుండి వెలువడే రీడర్స్ డైజస్ట్ నమూనాలో ఆంధ్రదేశంలో వచ్చే వివిధ పత్రికల్లో వచ్చిన మంచి వ్యాసాలూ, కథలూ ఏర్చి కూర్చి వేయడమూ, తెలుగు డయాస్పోరా కథలూ, వ్యాసాలూ ప్రచురించడమూ ఈ తెలుగునాడి చేస్తోంది. అన్ని వర్గాల పాఠకుల్నీ అలరిస్తూ పాత కొత్త సాహిత్యాల్ని పరిచయం చేస్తోంది. ముఖ్యంగా తెలుగు సినిమా వ్యాసాలు చక్కగా ఉంటాయి. సినిమా సమీక్షలు బావుంటాయి. బాల
సాహిత్యమంటూ రెండు మూడు పేజీలుంటాయి. అన్నిటికన్నా ముఖ్యం పత్రికకి వాడే పేపరు అత్యంత నాణ్యమైనది.
ఇలా ఎంతో వైవిధ్యంగా ఒక తెలుగు పత్రిక ప్రచురింపబడ్డం చూసి ప్రతీ తెలుగువాడూ గర్వ పడాలి. కానీ అలా లేదు. కనీసం వెయ్యి మంది చందాదార్లు కూడా లేరంటూ వాపోయే పరిస్థితొచ్చింది. పత్రిక మూతబడుతోంది. ఒక పుస్తకం అచ్చువేయడంలో చాలా శ్రముంటుంది. అది కాకుండా అచ్చువేయడానికి డబ్బు చాలకపోతే వచ్చే మానసిక శ్రమ మరింత కుంగతీస్తుంది. ఒక పత్రిక నడపడానికి సాహిత్య తపనొక్కటే చాలదు. తడి
కూడా కావాలి. అది లేకే తెలుగునాడి శలవు తీసుకుంటోంది.
అమెరికాలో నివాసముంటున్న తెలుగువారందరికీ ఒక విన్నపం. ఎవరైనా ( అంటే కొంతమంది వ్యక్తులైనా, సంఘాలయినా ) ముందుకొచ్చి ఈ తెలుగు నాడికి ఊపిరి పోయండి. అందులో నా వంతు నేనూ పాలుపంచుకుంటాను.

పదిమందికీ చెప్పండి.
ఒక తెలుగు పత్రిక అర్థాంతర నిష్క్రమణ్ణి ఆపించండి.
తెలుగక్షరం తలెత్తుకునేలా చూడండి.

7 responses to “అక్షరం తలదించుకున్న వేళ

  1. పదికోట్లున్న తెలుగోళ్ళలో కనీసం పదివేల మందికూడా ఈ పత్రిక (కొని)చదవడానికి ఇష్టపడలేదంటే అది మన ఉదాసీనత అనుకోవాలా లేక ఆ పత్రికలో “పనికొచ్చేదేమీ లేదు” అనుకోవాలా?

  2. udaaseenate babu manaki setair vunnavi..gasips vunnavi kaavali gaani manchi vishayaalu vaddu………..

  3. నూట నలభై నాలుగేళ్లుగా వెలువడుతున్న San Fransisco Chronicle లాంటి హేమాహేమీ దినపత్రికలే ఇప్పుడు మూతబడే దిశగా సాగుతున్నాయి. దీనిక్కారణం – పత్రికలు ‘కొనేవాళ్లు’ లేకపోవటమే, ‘చదివేవాళ్లు’ లేకపోవటం కాదు. ఈ డిజిటల్ యుగంలో పాఠకులకి ఎన్నో ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయి – ముఖ్యంగా ఉచితంగా లభించే వెబ్ మ్యాగజైన్స్ (కౌముది, ఈమాట, పొద్దు, etc). వాటిని మరిపింపజేయగలిగే భిన్నత్వం, విశేషం ఏదన్నా ఉందా తెలుగునాడిలో? లేనప్పుడు పాతిక డాలర్లు చందా కట్టి ఓ పత్రిక ఎందుకు కొనాలి? అమెరికాలో తానాపత్రిక, ఇతర తెలుగు/ఆంగ్ల పత్రికలు కనీసం ఒకటైనా సబ్‌స్క్రైబ్ చేసే తెలుగువాళ్లు చాలామంది ఉన్నారు. ఎవరైనా ఉన్న అన్ని పత్రికలూ కొంటూ, చదువుతూ కూర్చోలేరు కదా. వేరే పత్రికని వదిలేసి తమది కొనేలా చేసుకోటం పత్రిక నిర్వాహకుల అవసరం, బాధ్యత. ఓ పత్రిక మూతబడిందంటే ఆ తప్పు పాఠకులది కాదు – నిర్వాహకులది, మారుతున్న కాలానిది.

  4. అమెరిక వెళ్ళాక మన తెలుగువారు, ఏదో ‘తానా’ మెదలగు సంస్థలకు మాత్రమే పరిమితమైపోతారని అనుకున్నను. కాని మీ టపా చదివాక నాకు ఆనందము, దుఃఖము రెండూ కలుగుతున్నది. ఆ పత్రిక ప్రాచుర్యం పొందుటకై నాదొక చిన్న సలహ ” అమెరికలోని అన్ని తెలుగు సమాఖ్యలలో ఈ‌పత్రిక గురుంచి తెలిపి, ఆ సంస్థ సభ్యులందరు ఆ పత్రికయొక్క చందాదారులుగా కచ్చితంగా చేరమని చెప్పడం” ద్వారా కొత మేలు కలుగుతుంది.

  5. Here is my question (DAQ = dumb ass question that is):

    There are rich to very rich telugu people (nannapanEni mOhan for example) in USA and everyone of them gives thousands of dollars to the Indian community for free to schools and what not. Tana itself gives money to backpacks and such – very liberally. Tana itself has its own magazine also. So why these rich people do not subscribe to the naadi? If they do, why do not they just give money to naadi? I will tell you why because they want naadi to be profitable – not non-profitable. They want to milk people and get money from advertisers. And what do I get for advertising in it? I can reach another 1000 telugu people? Would not it be better to advertise in India Abroad or such?

    I agree naadi’s quality of literature and everything is great but I am questioning the greatness of people who run it and those people who pass by without evening trying to pay a subscription. Why not these rich guys pay, say 100 subscriptions to their friends and family? After all it wont cost more than 3K for them and it is nothing. They are ready to give money to Lok Satta and even sponsor a faceless movie actor to USA for bare belly dancing but when it comes to Telugu magazines, they keep their distance. Huh? Why? Just #@!$ why? Any answers?

  6. Pingback: తెలుగునాడి « నా ప్రస్థానం

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s