తెలుగు తాంత్రిక సంఘాలు

“సమాచార సాంకేతికతకు సంబంధించిన ప్రాజెక్టులు తమిళంలో చేస్తే… అది జనబాహుళ్యానికి సులభంగా అర్థమయ్యే రీతిలో ఉంటుందని… అందులో విషయాలు సుబోధకంగా నలుగురికి ఉపయోగపడతాయని ఇవి ఒకవిధమైన ప్రత్యేకతతో అలరారుతూ మార్కెట్‌ పరంగా మంచి గిరాకీ సాధిస్తాయట . అంతేకాక తమిళంలో సాఫ్ట్‌వేర్‌ను రూపొందించే విద్యార్థులకు లక్ష రూపాయల నగదు బహుమతి కూడా రాష్ట్ర తమిళ భాషాభివృద్ధి శాఖ ఇస్తుందట.
కన్నడం లోకూడా చెప్పుగోదగ్గ ప్రయత్నాలు జరుగుతున్నాయి వీటికి అయా రాష్ట్రంలో సాంకేతిక సంఘాల కృషి వుంది.
మన భాషకు   ఇలాంటి సదుపాయముంటే ఎంత బాగుండు 😦

అయినా మన కు ఇలాంటివి సరిపడవేమో,  మనలాంటి కత్తులు ఒక్క ఒరలో అస్సలు ఇమడం

నాకు తెలిసి 1997 నుండి కూడా తెలుగులో ఇలాంటివి జరుగు తున్నాయి ఒక యాహూ గుంపు లో కోంత మందిలో ఒక చిన్న సమూహంగా ఎర్పడి మాకు తోచినంత అబ్దివృద్ది చేసాము కోంత కాలానికి మన జ్యాడ్యాలు అయిన ఇగోలు రాజకీయాలు బయలు దేరి గ్రూపు అచేతనావస్తకు వెళ్ళిపోయింది తరువాత కోంతమంది కలసి మరి కోన్ని ఉపరణాలు తయారు చేసారు కానీ మనకు వున్నంత సాంకేతిక నిపుణుల లబ్యతకు మనం అద్బుతాలు చేయవచ్హు కానీ అదేమిటో గాని మన తెలుగు నెట్జ్ జనులు ఎందుకనో సమూహాలుగా కలసి పనిచేయటానికి ముందుకు రారు . అమ్మా పెట్టదు అడుక్కోతిన్నివ్వదు అన్న చందంగా మన లో చాలా మందికి ఒక స్థాయి దాటిన తరువాత ఈ జ్యాడ్యం పెరుగు తుంది.
మనమేమో ఎప్పుడూ నువ్వు గోప్పా అంటే నువ్వెంత అనుకోంటూ ఇలా వుండి పోతున్నాము. తెలుగులో టెక్నాలజీ కు చెందిన అనేక అంతర్జాల సమూహాలు ఇప్పుడు అచేతన ఆవస్తలో ఉండటానికి కారణాలు ఇలాంటివే .మన సంఘీభావం అంతా రాజకీయాలు, సినిమాలు పరిమైపోతుందెందుకనో ..:(

2 responses to “తెలుగు తాంత్రిక సంఘాలు

 1. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడి అరవై సంవత్సరాలు కావస్తున్నా అధికార భాషను అమలు చేయని రాష్ట్రం ఏదైనా వుందంటే అది ఆంద్ర ప్రదేశ్ ఒక్కటే !
  మన నేతలకు ….అసెంబ్లీ లో ఒకర్నొకరు తిట్టు కోడానికి తెలుగును ఉపయోగించు కోవడమే తెలుసు తప్ప తెలుగు ను అన్నిరంగాలలో అధికార భాషగా అమలు చేయడం తెలియదు.
  ఇంగ్లీషు వాడు వచ్చి మనలను ఇంగ్లీషులో పాలించాడు. తురకవాడోచ్చి మనలను ఉర్దూలో పాలించాడు. పాలకులను బట్టి మనం చచ్చినట్టు ఇంగ్లీషు నేర్చుకున్నాం… ఉర్దూను నేర్చుకున్నాం .
  కాని తెలుగు వాడు తెలుగు వాళ్ళని తెలుగులో పాలించ లేక పోవడం నిజంగా మన దౌర్భాగ్యం.
  అందుకే తెలుగు వెలవెల బోతోంది. హిందీ తరువాత దేశం లోనే రెండవ అత్యధిక సంఖాకులు మాట్లాడే తెలుగుకు సరైన గుర్తింపే లేకుండా పోతోంది.
  కొందరు ఔత్సాహికుల కృషి వల్లనే ఇవాళ ఇంటర్ నెట్ లో , గూగుల్ వికీ పీడియాలో తెలుగు వెలుగులు కనిపిస్తున్నాయి.
  అందరం కలసి ప్రభుత్వం మీద ఒత్తిడి తేవలసిన అవసరం వుంది.
  తమిళనాడు ను చూసి మన నేతలు సిగ్గు పడేట్టు చేయాలి. అప్పుడే ఆశించిన మార్పు వస్తుంది

 2. మన తెలుగోళ్ళకున్న తెగులే అది. కొట్టుకోవడంకోసం వెచ్చించే సమయంలో నూరోవంతుకూడా కలిసి పనిచెయ్యడానికి కేటాయించరు. We find more reasons to fight than work together. కులం,భావజాలం,డబ్బు, ఇగో ఎన్నోకారణాలుంటాయిగానీ, ఆశయం,ఆదర్శం,లక్ష్యం లాంటి ఏకీకృతం చేసేవి కనపడవు.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s