ఆ౦ధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు

మా తెలుగు తల్లికి మల్లె పూ దండ
మా కన్న తల్లికి మంగళారతులు

కడుపులొ బంగారు కనుచూపులొ కరుణ
చిరునవ్వులొ శిరులు దొరలించు మా తల్లి

గలగలా గోదారి కదలి పోతుంటేను
బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను

బంగారు పంటలే పండుతాయి
మురిపాల ముత్యాలు దొరలుతాయి.

అమరావతీ నగర అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు

తిక్కయ్య కలములో తియ్యందనాలు
నిత్యమై, నిఖిలమై నిలచి ఉండేదాక

రుద్రమ్మ భుజ శక్తి, మల్లమ్మ పతి భక్తి
తిమ్మరుసు ధీయుక్తి, కృష్ణరాయని కీర్తి

మా చెవులు రింగుమని మారుమ్రోగే దాక
నీ ఆటలే ఆడతాం, నీ పాటలే పాడతాం
జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి

 

తెలుగు తల్లి

తెలుగు తల్లి

ఆ౦ధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు

Advertisements

4 responses to “ఆ౦ధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు

 1. త్యాగరాజ కీర్తనై , అన్నమయ్య పదమై , అపురూపమై , స్వరపూపమై , జనజాగృత గీతమై , సృజనాత్మక జావలియై తెలుగు భాష సత్యమై , నిత్యమై రావలిస్తూనే వుంది. కధగా , కావ్యంగా, కవితగా , నాటకంగా , హరికధగా , బుర్రకధగా , అవధానంగా , పద్యహారంగా , గద్య సమహారంగ ప్రపంచ నలుదిశలా ప్రతిధ్వనించే “నా తెలుగు … అమృత జలపాతం . వసంత పరిమళం..వెన్నెల విహారం… ఆచంద్రతార్కారం !

 2. TELANGANA VADULU EEROGUNU BLOCK DAY GA JARUPUTUNNARU. POTTI SRIRAMUL TYAGAM VUTTIDENA? AA ROJU ANDHRA PRADESH AVATARINCHIND KABATTE EE ROJU TELANGAN DEMAND CHEYA GALUGUTUNNARANE VISHAYAM MARACHI POTHE YELAGA ? OKA NAYAKUDAITHE ANDHRA PRADESH PATANNI KAALCHI VESINDU. ANDULO TELANGANA KUDA UNNADANI.. ADI KUDA KALI POINDANI GAMANINCHAKUNTE ETLA ?
  EEDANTA MANA KHARMA KAKUNTE INKENTI ?

 3. andrarastra avatharana antye yenti? nov 1 roju andra rastra avatharana jariginda? miku vunna gnanam yento artham kavatledu potti sri ramulu ki andrapradesh avatharanaki sambandam yent? potti sri ramulu madarasu nunchi andra nu vidathisthe adi jarigina yadathiki nov 1 telangana andra kalipi andraprades ani yerparcharu but meru enkaa andra rastra avatharana ani antam valasa vada ahmakarama? leka agnanama? potti sri ramulu andra rastram sadinchi amarudayaadu tharvatha yadathiki andra pradesh yerpoadini charitra ni telusukokunda leda vakri karinchi telangana vadanni kincha parusthunnaru mummatiki edi chikati roje telangana rastra avasyakatha yento andra rastra avatharana ani meru rayadam chusthe telusthundi andraprades vundaga andrarastram ani sambodinchadam valasa vada duhamkarame

 4. మదన్ మోహన్ గారు,

  నిజమేనండి. ఇదంతా మన ఖర్మే. లేకపోతే సదురు తెలంగాణా వాదులే సవతి పోరుకు మల్లే .. తప్పు తప్పు.. తలలో పేనుకు మల్లే పెద్ద తలకాయ నొప్పిగా వ్యవహరిస్తున్నారు.

  అంజిరెడ్డిగారు,

  ముందు తమరు తెలుగు నేర్చుకుని, మీ భావనను తెలుగులో వ్యక్తపరచండి. ఆ తరువాత మీ భావం అర్దం అవుతుంది. అప్పటిదాకా మీ కేకలు మాకు వినపడవు

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s