నువ్వు కులుకుతూ ఇచ్హెదవు ఎవడబ్బసోమ్మని చిదంబరమా !

అయ్యో  మేధావి అనుకోన్నానే !, దూరదృస్టి కలవాడను కోన్నానే !!, భారత అర్దికరంగాని పరిపుస్టం చేయగలవాడను అనుకోన్నానే !!!.
మీ చిదంబర రహస్యం   ఇదేనా ఎడాపేడా వరాలు ఇవ్వటమేనా 😦
60,000 కోట్లరూపాయలు  మాఫీ దీని బదులు ఎ వడ్డీ  తగ్గించ టమో  ఆసోమ్ముని ని మౌలిక వసతుల కల్పనకో కేటాయించచ్హుకాదా .
పేదలు వెనక బడినవారు  ఇలా  ఎంతకాలం   మా మధ్యతరగతి  వీళ్ళని   భరించాలి ? కుల,మత ప్రాతిపదికన  రాయుతీల సంగతి రాయటానికి వీలులేదు ఇప్ప టికే వేలకు వేలు ఇంజనీరింగ్ నిరుద్యోగులు తయారయ్యారు .
నా  మటుకు నాకు మీ  బడ్జెట్ వలన లాభంలేదు
1)ఈ సారి మాపోలాలు  కౌలుకి ఇచ్హాం  ఒకవేళ  వ్యవసాయంచేసినా నేను మీపరిదిలోకి రాను.
2)మీ  వైద్యశాలలో  ప్రమాణాలు ప్రత్యక్షంగా తెలుసిన వాడిని – నేను వెళ్ళలేను
3)మీరు తగ్గించిన టి.వి,ద్విచక్ర వాహనాలు ఎప్పుడో కోనుకోన్నాను
4)నేను  విద్యార్దిని, వృద్దుడిని   కాను,సహకార వెనక బడిని,మైనారిటీ   వర్గాలకు చెందిన వాడిని కాను .
మీ  కంటితుడుపు  అదాయపన్ను  రుచించలేదు ,మీకు  క్రమం  తప్పక  అదాయపుపన్ను చెల్లించటం నా కర్తవ్యం  అది నాబాద్యత కూడా  –

 కాసే  చేట్టుకే రా ళ్ళదెభ్భలంటే ఇదేనేమో .  ఇప్పుడు వీళ్ళ కి నేతులు పూశారు రేపటి వాతలు మళ్ళీ నాలాంటి వాళ్ళకే 😦
 

Advertisements

4 responses to “నువ్వు కులుకుతూ ఇచ్హెదవు ఎవడబ్బసోమ్మని చిదంబరమా !

  1. చిదంబరం గారు ఇచ్చిన మిగతా రాయితీలు ఎలా ఉన్నా, ఆదాయపు పన్నులో కల్పించిన రాయితీ మాత్రం కంటి తుడుపు కాదు. 5 లక్షలు పైబడి టాక్సు వేయగలిగిన ఆదాయం ఉన్నవారంతా. 44000 పైచీలుకు ఆదాచేసుకోగలుగు తారు. మిగతా వారికి కూడా వారు ఇప్పుడు చెల్లించే పన్నులో సగానికి పైగానే తగ్గబోతుంది.

    రైతుల ఋణాల మాఫీ విషయంలో నేనేమి వ్యాఖ్యావించదలుచుకోలేదు. ఆయన కల్పించిన రాయతీలు పూర్తి పరిష్కారం కాదని(ఎన్నికలకోసమని) తెలుసు కాని, ఆ రాయితీ, కొందరి ప్రాణాలనయినా నిలబెడుతుందనుకుంటున్నా.

  2. గురుగారూ, ఓట్లు వేసేది వాళ్ళేనండి, మనం సెలవు పుచ్చుకుని టివి ముందు కూర్చుంటాం తప్ప పోలింగ్ బూత్ కి వెళ్ళం కదా, ఓట్లు వేసే వాళ్ళకోసం రాజకీయ నాయకులు ఇలాంటివి చెయ్యడం మాములే. అదీ కాకుండా ప్రస్తుతం రైతుల పరిస్థితి ఎలా ఉందో మీకు తెలియదనుకుంటా, ఎన్ని వందల మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారో, SEZ ల కోసం ఎన్నెన్ని రాయతీలు ఇస్తున్నారు, IT కంపెనీలకి రాయతీలు ఇస్తున్నారు, వాటి గురించి ఏమీ మాట్లాడలేదేం?

  3. కాశ్యప్ గారూ,
    కరెక్ట్‍గా చెప్పారు. కాసే చెట్టుకే రాళ్ళ దెబ్బలు. మధ్య తరగతి వాళ్ళ పాట్లు వీళ్ళకి పట్టవు. ఇంటి అద్దె, నిత్యవసరాలన్నీ ఈ రెండేళ్ళలో రెండింతలయ్యాయి, కానీ జీతం రెండింతలవ్వలేదే. మధ్య తరగతి మానవులు ఎలా బతకాలో ఏంటో!!!!!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s