మనమే ఎందుకిలా ?

మనమేమో
ఉడిపి హోటల్ లోనే  టీ ,తాగుతాం
అయ్యర్ హోటల్ లో ఆంద్రాపెసరట్టు తింటాం
లేక పోతే ఏ పంజాబీ దాబాకో వెళతాం .

సాయంత్రం పానీపూరీ కానీ ,పావుబాజీకానీ  తింటాం
మన రాజధానిలో  హుర్ద్దూ గానీ,ఆంగ్లంగానీ మాట్లాడతాం
ప్రక్కరాస్ట్రం వాడంటే తగని మక్కువ .
చెన్నై ,బెంగుళ్ళూరు,పూనే లో రియల్ ఎస్టేట్లకు అదారంమనమే.
35 % ఐ.టి మంనదే !.అదిక శాతం ప్రర్యాటక అదాయానికి కారణం మనమే !
వారేమో 
మన తెలుగు  అక్షరం కనపడితే రంగులు పూస్తున్నారు 😦 
ఎందుకిలా ?

7 responses to “మనమే ఎందుకిలా ?

  1. తెలుగు వాళ్ళే తెలుగు తల్లిని తల్లిగా అంగీకరించక….తెలంగాణా తల్లి అని సృష్టించి విభేధాలు తెస్తున్న కాలమిది. ఇక ఆ మరాఠీ వాళ్ళను తప్పుపట్టి ఏమి లాభం?

  2. ఎందుకేమిటి. మెత్తగా వుండే వాడ్ని చూస్తే మొత్తబుద్దవుతుందని సామెత వుంది. మీరు వినలేదా. మన రాష్ట్రంలో దేవుళ్ళు తక్కువయ్యారని మన జనం షిరిడీకి, శబరిమలకు వెళ్ళి వాళ్ళ పర్యాటక రంగాన్ని వృద్ది చేస్తారు. వాళ్ళేమో మన అక్షరాలు కనపడితే చాలు మండిపడతారు. అక్షరాలేమిటి, మన మొహాలకే మసి పూసినా అడిగేవాళ్ళెవ్వరూ లేరని వాళ్ళకి కూడా తెలుసు.

  3. మనవాళ్ళిక్కడ తస్లీమా నస్రీన్ మీద దాడి చేసారే.. అలంటిదే ఇడీనూ! పైకి మాత్రం మత దూషణ, భాషాధిపత్యం. అసలు కారణం మాత్రం – రాజకీయపు టాధిపత్యపు పోరు.
    అదో పోటీ.
    ఓ పూనకం.

  4. మన భాషను, సొంత సంస్కృతిని గౌరవించలేని అధమ స్థితి మన ఆంధ్రులది. విశ్వామిత్రుని శాపం నిజమే కామోసు.

Leave a reply to ramana Cancel reply