స్వతంత్ర భారతం అరవై ఎళ్ళు నిండిన వేళ తోటి భారతీయులందరికీ శుభాకాంక్షలు

                              ఏ దేసమేగిన, ఎందుకాలిడిన

యే పీఠ మెక్కినా, యెవ్వరెదురైన
పొగడరా, నీ తల్లి భూమి భారతిని
నిలుపరా, నీ జాతి నిండు గర్వమ్ము
లేదురా ఇటువంటి భూదేవి యెందు
లేరురా మనవంటి పౌరు లింకెందు-

యే పూర్వపుణ్యమో, యే
యోగబలమొ,
జనీంచినాడ వీస్వర్గలోకమున
యే మంచిపూవులన్
బ్రేమించినావొ
నిను మోచె, నీ తల్లి
కనకగర్భమున
సూర్యుని వెలుతురు
సోకునందాక
ఓడలజెండాలు ఆడునందాక
నరుడు ప్రాణాలతో నడచునందాక
అందాక గల ఈ యనంతభూతలిని
మనభూమి వంటి కమ్మని
భూమిలేదు-

తమ తపస్సులు ౠషుల్
ధారబోయంగ
చండవీర్యము
శూరచంద్రులర్పింప,
రాగదుగ్ధము భక్తరాజు లీయంగ
భావసూత్రము కవిభంధవు లల్ల,
దిక్కుల కెగదన్ను తేజంబు వెలుగ
జగముల నూగించు మగతనంబెగయ,
రాలు పూవులు సేయు రాగాలు
సాగ సౌందర్య మెగబోయు సాహిత్య
మొప్ప-

వెలిగిన దీ దివ్య విశ్వంబు పుత్ర
దీపించె నీ పుణ్యదేశంబు పుత్ర;
అవమాన మేలరా, అనుమాన మేల
భరతపుత్రుడ నంచు భక్తితో బలుక-

Advertisements

2 responses to “స్వతంత్ర భారతం అరవై ఎళ్ళు నిండిన వేళ తోటి భారతీయులందరికీ శుభాకాంక్షలు

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s