పచ్చబొట్టు చెరిగీపోదులే….

ఈ రోజు (శనివారం అధిక జ్యేష్ఠ విదియ) covansys interview కి నన్ను coordinator గా వెళ్ళ మన్నారు మా ప్రదాన కార్యాలయం వారు , సరే తప్పదు కదా అని వెళితే అక్కడ అంతా గందరగోళం గుంపును ఒక గాడిలో పెట్టేవరకి తల ప్రాణం తోకకోచ్చినది అదేదో పార్కుకి వచ్చినట్లు కోంతమంది పెళ్ళాం పిల్లలతో వచ్చారు బహుశా అలుమోగలు ఇద్దరూ వచ్చారేమో .అసలు interview కి వచ్చిన వాళ్ళ కన్నా వారితో తోడుగా వచ్చినవారి సందడి బాగావున్నది ఇంతలో ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి “మీది భద్రాచలం కదా ” అని అడిగాడు నేను అవునని మీ కెలా తెలుసునని విస్మయంగా అడిగాను.అతను చిరునవ్వు తో తన చేతిపైన పచ్చబోట్టును చూపించాడు. అది నా పేరే! ఇక నాకు మాటలు రాలేదు ..ఒక కేక పెట్టి గట్టిగా వాటేసుకున్నాను ఆ క్షణం లో నేను Interviewer తను interviewee అన్న విషయంగుర్తురాలేదేమిటో .. ….

cut చేస్తే,

 1993 శ్రీరామాలయం , రాజవీది భద్రాచలం.

మేము ఇద్దరం (నేను,శివ) చదువుకునేది ఒకే చోట, ఇళ్ళు కూడా ఒకే వీదిలో ,సెలవలు వస్తేచాలు ఆ ఇరువురిదీ ఒకే మాట ,ఒకే ఆట ఎప్పుడూ గోదారి ఒడ్దున ఆడుకోవటం ,గుళ్ళో పెట్టే ప్రసాదాలు తినటం , రోజూ జరిగే వూరేగింపులో పాల్గోనటం .గుళ్ళో కోతులను తరమటం ఒకటేమిటి , మమ్మలిని ఆపేవారెవరు ? అడిగేవారేవరు ??.ఎంతో వుల్లాసంగా గడిపే వాళ్ళం పరీక్షలో మాఇద్దరి కీ first class వచ్చినది ,దానితో పాటే ఒక దుర్వార్త శివ వాళ్ళనాన్న గారికి కోయంబత్తూరు లో ఉద్వోగం వచ్చిందట జాయన్ అవ్వటానికి ఇంకా వారమే గడువు .చాలా బాదవేసినది మా స్నేహం చిరస్తాయిగా గుర్తుండి పోవటానికి ఇద్దరం చేతిమీద పచ్చబొట్టు పోడిపించుకోందామనుకోన్నాం అనుకున్నదే తడవు గా శివ నాపేరు తన చేతిమీద రాయించు కోన్నాడు అదేమిటో వాడి చేతి మీద బాగానే రాసిన మిషను నా దగ్గరకు వచ్చేసరికి మోరాయించినది 😦 , రేపు రమ్మని చెప్పాడు పచ్చబోట్లు వెసేవాడు ఆ రోజు రాత్రి మా నిర్వాకం ఇళ్ళలో తెలుసినది వెదవ వేషాలు వేసావంటే తోలు తీస్తానని మా నాన్న గారు హెచ్చరించారు ,ఆ పచ్చబొట్టు ఎలర్జీవచ్చి మా శివ మూడురోజులు లేవలేదు ఈ లోపల నేను ఇంట్లో జడిసి ఎలాంటి సాహసం చేయలేదు.వాడికి చేయి నయమవగానే శివ నన్ను వెంటబెట్టు కోనీ మరీ ఆ పచ్చబోట్టు వాడు వుండే ప్రదేశానికి వెళ్ళాము , వాడు బిచాణా సర్దుకోని రాజమండ్రి వెళ్ళాడని తెలుసింది నాకు మోఖం చెల్లలేదు . పాపం శివ ! అప్పడి నుండి వాడు నాతో మాట్లాడలేదు నాకు కూడా కోయుంబత్తూరు లో వాళ్ళ చిరునామా తెలియదు .

.. ఇప్పడు శివ కలిసాడు ,హైదరాబాదు లో ఉద్వోగాన్వేషణలో వున్నాడట , తనకి పెళ్ళి కూడా అయిపోయినదట ఇంకా నాపేరు తోవున్న పచ్చబొట్టు ని చూసి ఇదవరకు హైదరాబాదు లో రోజుకు ఒక్కరయినా అడిగేవారట తను ఇప్పుడు తివెండ్రం లో మకాం కాబట్టి ఇప్పుడు వారానికి ఒక్కళ్ళు అడుగుతారట ,తన భార్య చాలాసార్లు Plastic surgery చేయుంచుకోమ్మని ఆడిగిందట . నేను ఎలా ప్రతిసస్పందించాలాలో తెలవలేదు ఇద్దరంకలసి బోజనం చేసాము,

 చివరిగా వీడుకోలు చెపుతూ ఇక పై నన్ను పచ్చబొట్టు వేయించు కోవద్దని ఓట్టు పెట్టీ మరీ వేళ్ళాడు నా శివశంకర్ …………… కిం కర్తవ్యం ?

Advertisements

2 responses to “పచ్చబొట్టు చెరిగీపోదులే….

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s