ఇవి వార్తలా !

చిన్నపిల్ల ల పై అత్యాచారాలు,ముసలి వాడిను బూటు కాలితో నిర్దాక్షణం గా తన్నే పోలీసు ,సున్నితమయి న భావాలను రెచ్చకోట్టే విదముగా కదానికలు విచక్షణ కోల్పోయి మాట్లాడే వాళ్ళ మీద స్పెషల్ ఫోకస్,విది వంచితులను వినోదం గా చూపే రిపోర్టులు,కాలిన కుళ్ళిన గాయపడిన,తెగిపడిన శరీరావయవాలను  జుగుస్పాకరంగా చూపటంలో ఔనత్యం ఏమిటో వీరికే తెలియాలి , ఒక్క దూరదర్శన్ తప్పితే మిగిలిన న్యూస్ చానల్ అందరిదీ ఒకటే బాట !,ఇక దూరదర్శన్ విషయాంకి వస్తే   ఖర్మ కాలి ఇది రోజు రోజుకూ వెనుకకు పోతోంది కళాకారులు తన నటను ,ప్రదర్శనను చిరకాలం చూడాలంటె మన సప్తగిరి లో ఒక ప్రదర్శన ఇవ్వాలి , ఈ DD కళాకారులు నిఝంగా చిరంజీవులు. Telugu News Channels చూస్తుంటే  కడుపులో దెవేసినట్లు అవుతోంది .ఒక భక్తి పేజీ,ఒక చిన్నపిల్ల పేజీ వేసి మిగిలిన  పేజీ లన్నీ రక్తి తో నింపే స్వాతి  పత్రిక లాగ వీటి లోకూడ మంచి కార్యక్రమాలు వున్నాయి.   నా చుట్టూ  కూడ ఇలాంటి విపరీత మార్పు లు వస్తా(వచ్చా)యేమో అని భయమేస్తోది,ఇప్పటికే అపరిచితులు కు లిప్ట్ ఇవ్వాలంటె ఒక రక మయిన భయమమేస్తోది,ఇదవరకులా చిన్నపిల్లలితో చనువుగా ఉండలేక పోతున్నా 😦 .సమాజం మీద అసయ్యం ,మానవ సంబందాల మీద జుగుప్స కలుగుతోంది ,ఎప్పుడో ఓకసారి టివీ చూశే నాకే ఇలా అనిపిస్తుoటే ,రోజూ చూసే వారికి ఎలావుంటుందో, బహుశా వారి కి ఇవి అలవాటై వుండవచ్చు :-మనిషికి సాటి వారి మీద తన చుట్టూ సమజంమీద నమ్మకం ,ప్రేమ బాద్యతను  పెంచవలసిన వీరే ఇలా  అయిపోతే ఇంకెవరు ఉద్దరిస్తారు  ?

దీనిని ఎలా ముగించాలో తెలియక రాయుటకు మాటలు లేక పోవుట చే ఇంతటితో ముగిస్తునాను .                  

Advertisements

9 responses to “ఇవి వార్తలా !

 1. హు… ఏం చేస్తాం డైనమిక్ జర్నలిజం అని చెప్పి అవాకులు చెవాకులు చూపించడం, దడుచుకునే సన్నివేశాలు చూపించడం సాధారణం అయిపోయింది.

 2. మీరు ఏ ప్రమంచంలో, ఏ దేశంలొ, ఏలా జీవిస్తున్నారో మాకు అర్ధం అయ్యింది. మీలాంటి జవసత్వాలుడిగిన ముసలి వారు, విలువలన్ని పోతున్నవని కార్చేవి మొసలి కన్నీరే. ఏం మీరొజుల్లొ ఆడదాని జాకేట్టు మొచేతులదాక వుండేది కాదు. చీరకట్టుకుంటే పొట్ట కనపడేదా? మీ కుటుంబ సభ్యులు బొట్టు పెట్టుకుంటున్నారా ప్రతి రోజు? పరికిణిలూ, చీరలు కట్టుకుంటున్నరా? ఇంట్లొనే ఉంటున్నారా? ఆఫిసులకి వెల్లడంలేదా?

  బ్లడ్ బాంక్ ముఖం చూసారా? రోడ్డు మీద పుంపులొ నీళ్ళు వ్రుధాగా పోతుంటే స్కూటర్ ఆపి దాన్ని కట్టేసారా ఏప్పుడైనా?

  పిల్లలికి పండగలకి పబ్బాలకి గన్నులు కొనలేదా? బాంబులమోతతొ హొరేత్తించలేదా?

  జ్యొతీలక్ష్మి, జయమాలిని సినిమాలు చొంగకార్చుకుంటు చూడలేదా? దిండుకింద దాచుకుని మధు పుస్తకాలు, మదనలు చదవలేదా?

  మీతరం గొప్పదీను, మాతరం చెడిపొయిందా? అవ్వ! అంత మాట ఏలగనగలిగా”రు”, అన్న మర్యాద ఇంకా మాలొ ఉంది.

  మీ ఏడుపు ఎదొ మీరు ఏడ్చుకొండి. మాదారికి రావొద్దు.

  మీకు టైము ఉంది. మాకు లేదు. ఉన్నంతలొ బతికేస్తాము. స్పీడ్ మాన్, స్పీడ్.

  బెంగాలు కరువురొజుల్లొ ఏక్కడున్నరు మీరు? అఫ్రికాలొ వాల్లు చచ్హిపోతున్నరు? కుళ్ళినశవాన్ని పీక్కుని తింటున్నరు? ఇక్కడ కూర్చుని కబుర్లు చెప్పడం కాదు. అక్కడిదాక ఏందుకు? మొన్న ఓచ్హిన సునామిలొ ఏం చేసారు మీరు?

  వార్తలు అందితేనే సమయానికి సహాయం అందగలుతున్నది. మీరేగా మమ్మల్ని ఇలాగా కాన్వెంట్ స్కూల్స్లో చేర్చింది. ఇంగ్లిష్ నేర్పింది. కడుపులొ తేముల్తున్నదా, వాంతులు అవుతున్నవా? కట్టై. టీవిలు సినిమాలు చూడొద్దు. మానేయ్యండి. మీరేగా అన్నది, వూస్తె మనమీదే పడుతుంది అని.
  మీ తరానికి ఒక విలువ. మాతరానికి ఒక విలువ. సబబేనా అది? మీ తాతగారిహయములొ విలువలకి మీరు విలువనిచ్హారా అన్నది గుండేలమీద చేతులేసుకుని నిజాయితిగాజవాబిచ్హుకొండి?

 3. మార్పు సహజం! అది అందరికి, అన్న్నిటికి వర్తిస్తుంది!

 4. ఈ జాబులో ఉదహరించిన టీవీ కార్యక్రమాలు చూస్తే గత కాలపు వాళ్ళైనా, ఈ కాలపు వాళ్ళైనా , రాబోయే కాలపు వాళ్ళకైనా ఇలాంటి భావనే కలగడం సహజం. ఏ కాలపు వాళ్ళైనా మనుషులు మనుషులే గదా!

  ఇకపోతే నెటిజెన్ గారూ, ఈ బ్లాగరి నాకు తెలుసు. మీరిద్దరూ బహుశా ఒకే తరానికి చెందిన వారే అయ్యుండాలి, మీరు మరీ పిల్లకాయ అయితే తప్ప. అయినా మంచి చెడుల నిర్వచనాలు తరానికీ తరానికీ మారొచ్చేమో గానీ, జుగుప్స కలిగించే ఇలాంటి విషయాల్లో ఆ తేడా ఉండదనుకుంటా.

 5. ప్రియమయిన నెట్ జన్ గారు,
  నావయసు 27 సంవత్సరాలు :(, మీరు నా జాబును సరిగాచదివినెట్లు లేరు,మీరు వెలువరిచిన అబిప్రాయాలు (నా జాబుకి అప్రస్తుతమయిను) గౌరవించదగినవి, నిఝం ” వార్తలు అందితేనే సమయానికి సహాయం అందగలుతున్నది అందితేనే సమయానికి సహాయం అందగలుతున్నది” కాని వచ్చిన చిక్కల్లా ఆ అందించే విదానము తోనే శనివారము రాత్రి వార్తలు చూసేవుంటారు ఆ త్రాస్టుడి స్వఅలైంగసంపర్కం గురించి అంతగా విడమరిచి చెప్పడం ఎంతవరకు భావ్యమో మీరే చెప్పాలి ,ఇంకో మాట మీలాంటి సామాజిక స్పుహకలిగిన వారు మా MAD గుంపునకు చాలా అవసరం,మీరు ఒక మా వెబ్ ను దర్సించ వలసినది గామనవి http://www.tomakeadifference.net/Contact.html
  my Name is krupal kasyap,

 6. దాదాపు దశాబ్దం క్రిందట అనుకుంటాను, తెలుగు సాహిత్యాన్ని, స్త్రీల చేతులనుండి, తప్పించి దవడ కండరంబిగించి చివరాఖరు దాక చదివిస్తూ,వ్రాసేవాళ్ళకు కూడా గ్లామర్ ఉంటుందని చెప్పిన ‘ప్లే రైటర్” ఇన్సేస్ట్ (అంతకంటే నేను ఎక్కువ వ్రాయలేను, వ్రాయకపొవడానికి కారణం ఒక్కటే, కల్మశంలేని, కలూషితంకాని, అలాంటి దుర్వాసని ఒకటిఉందని తేలియని బుర్రలని నేను పాడుచేయ్యలేను. అంధ్రప్రభలో రాస్తు, “అది మలము అని దానికి దూరముగా ఉండ కూడదు, దాన్ని దగ్గిరకెళ్ళి చూడాలి” అని అన్నాడు. రచయిత అడ్రెస్స్ ఇస్తే తుపాకి తీసుకెల్లి కాల్చి చంపేస్తానని ఒక పాఠకుడు ఉత్తరంకూడా రాస్తే సదరు పత్రికవారు దానిని కూడా ప్రచురించారు.

  ఎండిపొయిన …..ముడ్డీలాంటి, కుళ్ళిపొయిన ఈ సంఘాన్ని, నిద్రలేపాలంటే, మాములు మాటలు చాలవు, కొరడా దెబ్బలు పనికిరావు. తుపాకుల తూటాలే పదాలై రక్తం కక్కాలి, అన్న విరసం వారి మాటలు గుర్తుకొచ్హాయెమొ, సదరు చానల్ వారికి.

  డీ సెన్సిటైజ్ ఐపొయిన ఈ సంఘాన్ని వార్త వార్తాలాగాకుండా అలా సెన్సేనలైజ్ చెస్తేనా ‘ఒహొ ఇలా కూడా రసానుభూతి పొందవచ్హు” అని కొత్త ఆలొచనతరంగిణి పుడుతుంది. మనబొంట్లు దానిని గురించి చర్చింకుంటాము. పబ్లిసిటీ పెరుగుతుందికదా అని అనుకుంటున్నారెమో?

  అవును ఇదివరకు నాలుగోడలమధ్య చీకట్లొ వ్యవహారం, పందిరిమంచం పడకగది, బాతురూంకే పరిమితమయ్యింది. మరి ఈరొజు బొడ్డుకనపడకబొతే, కుటుంబసభ్యులందరు సినిమాని ఎంజాయ్ చెయ్యలెకపోతున్నారు. కల్లెక్తన్స్ చూస్తె తెలియటంలెదు?

  కాలము మారింది. సంఘము మారింది. ప్రసారమధ్యామల ప్రాముఖ్యత పెరిగింది. కాని ప్రింట్ మెడియలొలాగా ‘రెసిదెంట్ ఏడిటర్” కాని ఒక “అంబుడ్స్మన్” కాని ఉంటె బాగుంటుంది మనకి, వాళ్ళకి అది నప్పకపొవచ్హు.

  *ఈ బ్లాగులలొనే “జాతీయవాది” భావవ్యక్తికరణను నిరసిస్తున్నది చూస్తూనేఉన్నాను. అందుకనె ఇన్సెస్ట్ అన్న పదం వాడి అంతటితొ అపేసాను. ఇంతకంటె సేన్సేసన్ ప్రాముఖ్యత దీనికి ఇంక అఖర్లేదు అనుకుంటాను.

  మాడ్ ని తప్పకుందా విజిట్ చేస్తాను, కాని నేను “మాడ్” అవ్వనని మీరు మాట ఇవ్వాలి.

 7. “ఇదవరకులా చిన్నపిల్లలితో చనువుగా ఉండలేక పోతున్నా” – ఇది నన్నూ బాధించే విషయమే. వార్తలను సంచలనాత్మకం చేయాలనే మీడియావారి లోభమే దీనికి కారణమా? పిల్లలపై జరిగే నేరాలగురించి జనంలో అవగాహన కలిగించడానికీ జాగరూకులను చేయడానికీ ఈ వార్తలు ప్రయోజకరం కావడం మంచిదే. నేర ప్రవృత్తి లేని మామూలు మానవుడు కూడా పిల్లలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి – ఆ ప్రయోజనంతో పాటుగా వచ్చే ఇబ్బంది. కానీ నేరాలు ఆగుతున్నాయా , కనీసం తగ్గుతున్నాయా, లేక నేరగాళ్లకు మరింతగా కిక్కునిస్తున్నాయా? ఏమో మరి.

 8. మీడియా వారి బాధ్యతలు చాలా ఉన్నాయి.
  వారు అవి తెలుసుకోవాలి.
  వింటున్నందుకు మనం ఇది తెలుసుకోవాలి,

  “వినదగు నెవ్వరు చెప్పిన
  విననంతనె వేగపడక వివరింపదగున్
  గని కల్ల నిజము తెలిసిన
  మనుజుడెపో నీతిపరుడు మహిలో సుమతీ!”

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s