ఓ ..పాలబుగ్గల జీతగాడా !

పాలబుగ్గల జీతగాడా
పసులుగాసె మోనగాడా
పాలుమరచి ఎన్నాళ్ళయిందో
ఓ ..పాలబుగ్గల జీతగాడా
కోలువు కుదిరి ఎన్నాళ్ళయిందో !

చాలిచాలని చింపులంగి
చల్లగాలికి సకమకాలి
గోనె సంచి కొప్పునీపెట్టావా
ఓ ..పాలబుగ్గల జీతగాడా
దానిచిల్లులెన్నో లెక్కబెట్టావా  !
 
తోలు జగ్గల కాలిజోడు
తప్పటడుగుల నడకతీరు
బాటలో పనిలేకుండయిందా
ఓ ..పాలబుగ్గల జీతగాడా
చేతి కర్రె తోడై నిలిచిందా   !

మాయ దారి ఆవు దూడలు
మాటి మాటికి ఎనుకు దునికి
పంట చేను పాడు చేశాయా
ఓ ..పాలబుగ్గల జీతగాడా
పాలికాపు నిన్నే కోట్టాడా !

(ఇది చిన్నప్పుడు రేడియోలో వినేవాడిని ఇక ఎన్ని చరణాలు వున్నాయో గుర్తులేదు , రాసినది ఏవరో  కూడా తెలియదు కాని శ్రవ్యంగా పాడితే చాలా ప్రభావితముగా వుంటుంది …ఎప్పుడోవిన్న పాట తప్పులు వుంటె ఎత్తి చూపండి సరి చేసుకోంటాను)   
   

Advertisements

2 responses to “ఓ ..పాలబుగ్గల జీతగాడా !

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s